అనుకోని కథ – 1
ఈ కథ ఒక ఇంట్లో ,ఒక ఏరియాలో, ప్రాంతంలో ఒక దేశంలో జరిగిన కథ కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కథ
ఒక సిటీలో ఒక అమ్మాయి ఉంటుంది తన పేరు అను తాను డైలీ ఫోన్ కి అడ్డిట్ అయి ఉంటుంది ఒక రోజు ఆ అమ్మాయి what’s app కి తెలియని నంబర్ నుంచి ఆ అమ్మాయి ఫొటోస్ మార్ఫింగ్ చేసి తన what’s app కి వస్తాయి. ఆ ఫోటోలు చూసిన అను చాలా భయపడిపోతుంది, కంగారుపడుతుంది అసలు ఎవరు తన ఫొటోస్ ఇలా బ్యాడ్ గా క్రియేట్ చేశారు అని తను చాలా భయపడుతుంది ఆ తరువాత మార్ఫింగ్ చేసిన ఫోటోలు వచ్చిన నంబర్ కి కాల్ చేస్తుంది అను ఆ కాల్ కనెక్ట్ కాదు. కొంతసేపు తరువాత ఫోటోలు మార్ఫింగ్ చేసిన నంబర్ నుంచి అనుకు మెసేజెస్ వస్తాయి అనును చాలా రకాలు గా బెదిరిస్తూ మెసేజులు చేస్తాడు ఒక్కడు అలా కొంతసేపు తరువాత వాడి ఫ్రెండ్స్ కూడా అను నంబర్ కి మెసేజులు చేసి చాలా అసభ్య పదజాలంతో మెసేజెస్ చేస్తారు.
ఆ తరువాత తన ఫోటోలు మార్ఫింగ్ చేసిన వాడు అనుకి మెసేజ్ చేసి తన దగ్గరకి రావాలి అని లేకపోతే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని చెప్పుతాడు. ఇంకా అను చాలా బాగా భయపడి ఎవరు ఒకడు తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఫోటోలు సేకరించి తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అన్నాడు అని తన ఫ్యామిలీకి ఈ విషయం తెలిస్తే ఏమి అయిపోతరేమో అని చాలా బాధతో తనకు ఏమీ చేయలో తెలియక చివరిగా చనిపోవడానికి సిద్ధంగా ఉండగా తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది అనుని వివాహం చేసుకోబోతున్న “అమర్” తనకి జరిగిన విషయం అంతా చెప్పుతుంది అను.
ఆ తరువాత అమర్ నీవు ఏమి భయపడవద్దు అని అమర్ అను కి ఒక ఉపాయం చెప్పుతాడు. ఆ మరుసటి రోజు ఫోటోలు మార్ఫింగ్ చేసిన వాడు అనుని రమ్మని పిలిచిన ప్రదేశానికి వెళ్ళుతుంది. కొంతసేపు తరువాత అక్కడకి ఫోటోస్ మార్ఫింగ్ చేసిన వాడు అక్కడికి వస్తాడు. వాడు వచ్చి తరువాత అనుకి ఎదురుగా నించోని ఉంటాడు
అప్పుడు వాడికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ కాల్ చేసింది వాడి నాన్న మీ వదినని ఎవడో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని మీ అన్నయ్య చాలా బాగా బాధ పడుతున్నాడు అని చెప్పినప్పుడు వాడు త్వరగా వాడి ఇంటికి వెళ్లాతాడు.
ఆ తరువాత వాడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్యని ఎవడు అన్నయ్య అమ్మ లాంటి నా వదినని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని వాడు అడిగినపుడు వాళ్ళ అన్నయ్య చాలా బాధపడుతు తన ఫోన్ లో ఒక వీడియో చూపిస్తాడు
అందులో ఒకడు ఫేస్ కి మాస్క్ పెట్టుకొని మాస్క్ తీస్తున్న వీడియో ఉంటుంది అది ఎవరో కాదు అనుని బ్లాక్ మెయిల్ చేసిన వీడే ఆ వీడియోలో ఉంటాడు. అప్పుడు వాడు అది చూసి షాక్ అవుతాడు అసలు అను నీ బ్లాక్ మెయిల్ చేస్తున్న వీడియో వాళ్ళ అన్నయ్య కి ఫోన్ కి ఎలా వచ్చింది అంటే
అనుని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఈ బ్లాక్ మెయిల్ గాడి అన్నయ్య “అమర్” . అను అమర్ కి జరిగిన విషయం చెప్పిన తరువాత అమర్ తనకి ఒక ఉపాయం చెప్పుతాడు కదా అది ఏమిటి అంటే అమర్ అను కి తన బర్త్ డేకి ఒక కెమెరా వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు అందులో వాడి దగ్గరకి వెళ్ళినపుడు వాడి ఫేస్ నీ రికార్డ్ చెయ్ తరువాత నేను చూసుకుంటాను అని చెప్పుతాడు
అప్పుడు అను బ్లాక్ మెయిల్ గాడు ముఖానికి పెట్టుకున్న మాస్క్ తీసినప్పుడు అమర్ వాడి ఫేస్ చూసి చాలా బాధ పడుతు నా తమ్ముడా ఇలా చేసింది అని వాడికి బుద్ది చెప్పాలి అని అమర్ వాళ్ళ నాన్నతో వల్ల అన్నయ్య వైఫ్ నీ ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని కాల్ చేయిస్తాడు. అమర్ అనుని వివాహం చేసుకోబోతన్నట్లు వాడి తమ్ముడికి తెలీదు అమర్ తమ్ముడు బ్లాక్ మెయిల్ గాడు అని అనుకి తెలీదు ఆ తరువాత వాడు చేసిన పనికి నీలాంటి వాడికి నేను అన్నయ్య గా పుట్టడం నాకు చాలా బాధగా ఉంది
అమ్మ లాంటి ఎంతో మంది మహిళలు ఇలాంటి ఫొటోస్ మర్ఫింగ్ కి గురిఅయి తమ ఫ్యామిలీ కి సమాజానికి ఏమి చెప్పుకోలేక ప్రతిరోజు సగటున ఒక్కొక అమ్మాయి చనిపోతున్నారు అని కాని ఈ రోజు నేను అలా జరగనివను అని చెప్పి వాడిని పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాడు అమర్.
Swipe left/right or tap the sides to turn pages