పదమూడవ భాగం నాధ్ నవ్వుతూ నా వైపు చూస్తూ అలిగావా సరే నేను బుజ్జగిస్తాను కానీ లే పోదాం అన్నాడు నేను మళ్లీ మనసులో బుజ్జగిస్తాడా నన్ను ఇతను బెదిరించుకుంటే చాలు అని అనుకున్నాను నాధ్ వెంటనే బెదిరిస్తేనే కరెక్టేమో బుజ్జగిస్తానంటే నమ్మటం లేదు కదా నువ్వు అన్నాడు పక్కనే ఉన్న కళ నన్ను నాధ్ నీ విచిత్రంగా చూస్తూ అన్నయ్య తను ఏమి మాట్లాడటం లేదు కదా మరి మీరేమో తనకే ఆన్సర్ ఇస్తున్నారు అంది నాధ్ నవ్వుతూ ఏ…