అన్వాంటెడ్ లవ్ – 1
ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం… ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..
గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్… మరో లోకంలోకి లాగుతుంటే….
స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్ రెడ్డి లకు హ్యాపీ అన్నివర్సరీ అంటూ ఒక్కో కపుల్ వచ్చి విష్ చేస్తున్నారు
హాల్ లో లేడీస్ అందరూ డిజైనర్ కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ తో లౌడ్ లాటర్ తో.. గ్లామరస్ స్మైల్స్ తో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే జెంట్స్ అందరూ స్నాక్స్ అండ్ డ్రింక్ తో ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకుంటుండగా … సడెన్గా హాల్ ఎంట్రన్స్ వద్ద ఒక రోల్స్ రాయస్ ఫాంతోమ్ ఆగుతుంది.
కార్ డోర్ ఓపెన్ అవగానే బ్లాక్ ఆర్మనీ సూట్ లో చేతికి సిల్వర్ వాచ్ షార్ప్ జా లైన్ మీద ఫెయింట్ షాడో…
అతని అడుగులు రెడ్ కార్పెట్ మీద పడుతున్న ప్రతి సారి, చుట్టూ ఉన్నవాళ్ల చూపులు అతన్ని తాకుతూ గాలి లో కలుస్తున్నాయి.
ఇండియాస్ యంగెస్ట్ బిలియనీర్.. అతని అయిస్ లో ఓ కోల్డ్ ఆరోగన్స్.. లిప్స్ మీద ఒక కాల్క్యూలేటింగ్ స్మైల్ … జెట్ బ్లాక్ నేచురల్ షైన్ లో ఫ్రంట్ స్లైట్ వేవ్ హెయిర్ తో
వైన్ గ్లాస్ తీసుకుంటూ హాల్ లోకి అడుగు పెట్టిన అతన్ని చూస్తూ అక్కడున్న అమ్మాయ్ ల మనసు చెదిరి పోతుంటే అతడు మాత్రం సింప్లి స్మైల్ మెయింటైన్ చేస్తూ డాడ్ ఇవేనా మీరు అడిగిన బాక్స్ అంటూ అతడి తండ్రి చేతిలో పెట్టాడు…
అది ఓపెన్ చేసి చూసిన రఘు గారు యస్ ప్రిశియస్లి థిస్ అని అందులో ఉన్న దాన్ని తడిమి చూస్తూ చిన్నగా నవ్వారు ఆయన..
తండ్రి నవ్వుకి చిన్న స్మైల్ ఇచ్చి పార్టీ ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు అతను..
రఘు గారు స్టేజ్ పైకి వెళ్లి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్ బ్లాక్ బీడ్స్ తన సతీమణి మెడలో వేసి సంతోషిస్తే ఆవిడ ఆ బీడ్స్ పై ఉన్న ఇద్దరి పేర్లని చూసుకొని సంతోషంతో మురిసి పోయారు…
వైన్ గ్లాస్ సిప్ చేస్తూ పార్టీ లో ఉన్న మెంబెర్స్ అందరిని తేరిపారా ఓ లుక్ వేశాడు అతడు..
అతడికి 10 మీటర్స్ డిస్టెన్స్ లో టమాటో రెడ్ కలర్ ఫుల్ లెన్త్ ఫ్రొక్ పఫ్ఫి స్లీవ్స్ తో ఓ చేతికి మాత్రమే చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ తో ఉన్న బ్యూటిఫుల్ బ్రాస్లెట్ వేర్ చేసి సాఫ్ట్ అండ్ లైట్ కర్లీ వేవ్స్ తో వన్ సైడ్ హెయిర్ పిన్ పెట్టి చెవులకి డైమండ్ ఇయర్రింగ్స్ తో కాలు మీద కాలు వేసుకొని ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నట్టుగా నుదురు రుద్ధుకుంటున్న ఆ అమ్మాయ్ ఆ ఫేస్ ఎక్సప్రెషన్స్ ని గుర్తించిన అతను ఆమె వైపు అడుగులు వేశాడు…
మధ్యలో ఓ అమ్మాయ్ వచ్చి అతన్ని వాటెండ్లి హాగ్ చేసుకొని చీక్ కిస్ ఇస్తూ ఐ లవ్ యూ బేబీ అంది..
వాట్!! లవ్ హా.. అని ఫేస్ వికారంగా పెట్టి ఐ డోంట్ వాంట్ లవ్.. అని ఆమెని పక్కకి తోసి రెడ్ ఫ్రొక్ అమ్మాయ్ దగ్గరికి వెళ్తాడు…
తన ముందుకు వచ్చిన అతడిని చూస్తూ లేచి నిల్చున్న ఆమె అతడి కళ్ళ లోకే చూస్తుంది…
ఏంటా చూపు అని అతడు విసురుగా అడిగేసరికి సమాధానం ఇవ్వకుండా తల తిప్పేసుకుంది ఆ అమ్మాయ్..
ఈ డ్రెస్ ఏంటి?? దాని కలర్ ఏంటి?? అని పళ్ళు నూరుతూ అడుగుతున్న అతన్ని చూస్తూ… కళ్ళు కనిపించట్లేదా కళ్ళకి చత్వరం వచ్చిందా అంది పొగరుగా..
ఐ హేట్ రెడ్ అని తెలిసి కూడా ఎలా వేసుకున్నవే అని మీద మీదకి వస్తుంటే… అతడ్ని ఓ అడుగు దూరం లోనే ఆపి ఐ లవ్ రెడ్ అందుకే వేసుకున్న చెల్ హట్ అని అతడ్ని పక్కకి నెట్టిన పెద్ద యూస్ ఏమ్ ఉండదు కాబట్టి ఇంటెలిజెంట్ గా థింక్ చేసి తనే పక్కకి తప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయ్..
ఈ పొగరే వద్దు అనేది అని అతడు అరుస్తుంటే హూ అని మూతి తిప్పేసి కేర్ లెస్ గా ఓ లుక్ ఇచ్చి అన్నివర్సరీ కపుల్ దగ్గరి వరకు వెళ్తుంది..
అక్కడ మీడియా కవర్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లకుండా మమ్మీ!! అని రాజేశ్వరి గారి చేతిని పట్టుకొని ఎవరు లేని ప్లేస్ కి లాక్కొచి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంది..
@ సరే అని కూతురితో వచ్చేస్తారా???
@ ఇంకా ఉంది
@ హాయ్! మై డియర్ క్రేజీ సోల్స్ 💙 స్టోరీ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్… 🫶
Swipe left/right or tap the sides to turn pages