New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 2

అన్వాంటెడ్ లవ్ – 2

ఈ పొగరే వద్దు అనేది అని అతడు అరుస్తుంటే హూ అని మూతి తిప్పేసి కేర్ లెస్ గా ఓ లుక్ ఇచ్చి అన్నివర్సరీ కపుల్ దగ్గరి వరకు వెళ్తుంది..

 

 

అక్కడ మీడియా కవర్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లకుండా మమ్మీ!! అని రాజేశ్వరి గారి చేతిని పట్టుకొని ఎవరు లేని ప్లేస్ కి లాక్కొచి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంది..

 

 

ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా??? అక్కడ ఓ పక్క వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో నేను బిజీ గా ఉంటే వెళ్ళిపోదాం అని లాక్కొస్తావేంటి అని గయ్యిమన్నారు రాజేశ్వరి గారు

 

 

నువ్వు ఇక్కడ లేకపోయినా వచ్చే వాళ్ళు వస్తారు వెళ్లే వాళ్ళు వెళ్తారు.. వాళ్ళేదో నీ పర్మిషన్ కోసం చూసినట్టు ఎందుకు ఈ బోడి బిల్డప్ అని ఉక్రోషంగా అంది ఆ అమ్మాయ్…

 

 

స్వర్ణ అంటూ కొట్టడానికి చెయ్యిత్తిన రాజేశ్వరి గారి చేతిని గాలి లోనే ఆపేసి ఇంత మందిలో ఎలా బిహేవ్ చేయాలో నీకు నీ కూతురికి తెలియదా అన్నాడు చిన్నగా పలికిన కఠినంగా వచ్చిన అతనికి స్వరానికి రాజేశ్వరి గారు చిన్నగా జంకి వెనక్కి తగ్గితే…

 

 

మమ్మీ నువ్వు ఇతనికి భయపడటం ఏంటి… నేను నీ కూతురిని కొట్టాలి అనిపిస్తే ఎక్కడున్నా కొట్టె అధికారం హక్కు నీకు ఉన్నాయ్ అని అంతే కోపంగా చెప్తుంది స్వర్ణాక్షి…

 

 

ఏయ్ మాటలు తిన్నగా రానివ్వు లక్షలు ఖర్చు పెట్టి పార్టీ చేసేది నీ అడ్డమైన వాగుడుతో స్పాయిల్ చేయడానికి కాదు అన్నాడు అతడు వేలు చూపిస్తూ..

 

 

ఏంటి!! నువ్వు వేలు చూపించి బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నావా అని అతడికి ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా సమాధానం ఇస్తున్న ఆమెని చూస్తుంటే అతడిలో ఆవేశం అంతకంతకు పెరిగిపోతుంది… 

 

 

రాజేశ్వరి గారి వైపు చూసి నువ్వెళ్ళి అక్కడ చూడు  అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చెప్పగానే క్షమించు బాబు అదేదో తెలియక వాగింది దాని మాటలు పట్టించుకోకు అన్నారు రాజేశ్వరి గారు…

 

 

అమ్మ!! నువ్వు ఇతనికి క్షమాపణలు చెప్పడం ఏంటి అంటున్న స్వర్ణ నడుము అతడి చేతిల్లో బలి అవుతుంటే వెళ్ళు అని ఆవిడ వైపు చూసి గర్జించినట్టే అతడు అనేసరికి పరుగు పరుగున అక్కడి నుండి వెళ్లిపోయారు రాజేశ్వరి గారు..

 

 

ఇంద్ర వదులు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న వాటిని కంటి గడప దాటి బయట పడనివ్వకుండా కళ్ళల్లోనే ఆపుతూ తన బాధని పంటి కింద నొక్కి పెడుతుంది స్వర్ణాక్షి 

 

 

స్వర్ణ అతని ముందు తగ్గకూడదు అని తన నొప్పిని  ఎంత కంట్రోల్ చేస్తుందో అంతకు మించి కావాలనే పెయిన్ ఇస్తున్నాడు ఇంద్రజీత్

 

 

స్వర్ణాక్షి కళ్ళు మాత్రమే కాదు మొహం మొత్తం తన డ్రెస్ కలర్ లోకి మారి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతుంటే ఇప్పుడు బాగున్నావే అంటూ వదిలేసాడు ఇంద్రజీత్…

 

 

ఆమె కన్నీళ్ళకే మాటలు వచ్చి ఉంటే ఇంత హృదయం లేని మనిషివా నువ్వు అని ప్రశ్నించేవేమో… 

 

 

ఎర్రబడ్డ కళ్ళతో సైతం నిప్పులు కురిపించేలా చూస్తున్న స్వర్ణ దగ్గరగా ఓ అడుగు వేసి ఏమ్ చూసుకునే నీకు ఈ పొగరు… నీ కళ్ళల్లో మచ్చుకి కూడా బాధ తాలూకా ఆనవాలే కనిపించట్లేదు అన్నాడు ఇంద్ర…

 

 

హహ బాధ పడాలా ఎందుకు??? అని విరక్తిగా ఓ నవ్వు నవ్వి మా నాన్న లేకపోయినా ఆయన ఇచ్చిన ధైర్యం ఇంకా నాతోనే ఉంది అంది స్వర్ణ..

 

 

పోయిన వాడిని చూసుకొనా నా దగ్గర బలుపు చుపిస్తున్నావ్…

 

 

మా నాన్న నా పక్కన లేకపోవచ్చు కానీ ఆయన ఎప్పటికి నాతోనే ఉంటారు  నా నవ్వులో ఆయన సజీవంగా ఉంటారు అని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్న పెదాలపై మాత్రం స్వచ్ఛమైన నవ్వు వెళ్లి విరిసింది…

 

 

స్వర్ణ నవ్వు చూస్తుంటే ఇంద్ర కి అరికాలు మంట నడి నెత్తికి ఎక్కుతుంటే  నిన్ను అంటూ ఏదో అనబోతున్న అతడిని హేయ్ డార్లింగ్ ఇక్కడున్నావా అంటూ ఇందాక హాగ్ చేసుకున్న అమ్మాయ్ వచ్చి ఇంద్ర మెడలో దండలా తన చేతులు వేయడానికి ఓ చేతిని వేయగానే… హేయ్ స్టాప్ అన్నాడు

 

 

వాట్ హప్పెండ్ డార్లింగ్ అని మత్తుగా అడుగుతున్న ఆమె వాయిస్ కి స్వర్ణ కి అసహ్యంగా అనిపించి ఛీ అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే స్వర్ణ చేతిని పట్టి ఆపేసిన ఇంద్ర…

 

 

ఏంటే ఛీ అంటున్నావ్ అని ఆ అమ్మాయ్ ని హాగ్ చేసుకొని స్వర్ణ ముందే తన లిప్స్ లాక్ చేస్తే ఆ దరిద్రాన్ని చూడలేక వదులు నన్ను అంటూ ఎంత విడిపించుకున్న వదలడు

 

 

2 మినిట్స్ కి ఆ అమ్మాయ్ లిప్స్ వదిలి ఆమె చెవిలో ఏదో చెప్పగానే ఆ అమ్మాయ్ సిగ్గు పడుతుంటే ఈ దరిద్రాన్ని చూడాల్సిన కర్మ నాకేంటి నన్ను వదులు అని ఎంత గింజుకున్న వదలడు…

 

 

ఆ అమ్మాయ్ వెళ్ళిపోయాక ఏంటే ఆ అమ్మాయ్ అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా అని అడిగాడు ఇంద్ర…

 

 

@ ఇంకా ఉంది 

 

 

@ హాయ్! మై డియర్ క్రేజీ సోల్స్ 💙 స్టోరీ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్… 🫶