ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 3
ఐ యాం ఫెయిల్యూర్… అనుకుంటూ ఉండగా గట్టిగా చప్పట్లు వినిపించాయి ఒక వ్యక్తి నుంచి…
అతను ప్రాజెక్ట్ హెడ్ నుంచి నిజంగా సూపర్…
ఏమంటారు?? మిస్టరీ అగస్త్య అంటూ ఇంగ్లీష్ లో..
సైలెంట్ గా అతని చూశాడు అగస్త్య “ఐ యాం సాటిస్ఫై… లాస్ట్ డిసిషన్.. య్యూస్ అన్నాడు ప్రాజెక్టు హెడ్…
కొన్ని సెకండ్ల తర్వాత ప్రాజెక్టుకి ఒకే చేశాడు అగస్త్య..అతని మాట విని మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు….
అమ్మయ్య మొత్తానికి ప్రాజెక్ట్ నిఖిల్ కి వచ్చింది అంటూ హ్యాపీగా ఫీల్ అయింది ప్రాప్తి..
కానీ పెనంనుంచి పోయిలో పడుతున్నట్టుగా అప్పుడు తెలియదు తనకి… పాపం ప్రాప్తి.
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
వస్తున్నాడు అడగండి అంటుంది విజయ రఘురాం నీ… నేను అడుగుతా నువ్వు కంగారు పడకు అంటూ
ఏమి నాన్న కొత్త ప్రాజెక్టు ఈరోజేనా…??స్టార్ట్
అయ్యేది అడుగుతాడు మెట్లపై నుంచి వస్తున్న అగస్త్య ని చూసి..
నేను అడగమంది పెళ్లి గురించి ప్రాజెక్టు గురించి కాదు కోపంగా విసురుతుంది విజయ
నేను ఇలాగే స్టార్ట్ చేస్తాను నువ్వు అడుగు కావాలంటే అంటాడు
వాడు మాట మానేసి చాలారోజులు అయింది తెలియదా?? మీకు…
నాకడుపున పుట్టినవాడికే… అంత ఉంటే వాడినే కన్నతల్లిని నాకెంత ఉండాలి అంటూ టిఫిన్ వడ్డిస్తుంది…
ఎస్… డాడ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది మీరు వస్తారా?? ఆఫీస్ కి అని అడుగుతాడు అగస్త్య…
లేదు నాన్న నాకు వేరే మీటింగ్ ఉంది ప్రోగ్రెస్ చూడటానికి వస్తానులే ఈ వీక్ లో….
కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నావంట… వర్కౌట్ అవుతుందా…??
డెఫినెట్ గా అవుతుంది అందుకే కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను… వీటిపై మీ సిగ్నేచర్ కావాలి అంటూ ఫైల్ ఇచ్చాడు
అవి చదివి సిగ్నేచర్ పెట్టాడు రఘురాం… ఈ లోపు మెయిడ్ వచ్చి టిఫిన్ సర్వ్ చేసింది అగస్త్య కి…
పెళ్లి గురించి ఏం ఆలోచించావు??అడిగాడు సూటిగా రఘురాం…
ఇదివరకు చెప్పిందే డాడ్ మళ్ళీ ఫ్రెష్ గా ఏమి ఆలోచించలేదు అన్నాడు అమాయకంగా అగస్త్య..
నేను జోక్ చేయట్లేదు నాన్న… అన్నాడు
చూడండి డాడ్ నేను కూడా నవ్వట్లేదు అన్నాడు ఫేస్ చూపించి….
మీరు నవ్వట్లేదు కానీ ఇన్ డైరెక్టుగా నన్ను ఏడిపిస్తున్నారు బ్రో…
ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకంటే పెద్దవాడిని ఉంటే నలుగురు పిల్లలు పుట్టేసేవాళ్ళు…
మీవల్ల నాకు నా పెళ్ళికి బ్రేక్ పడుతుంది వాపోయాడు అప్పుడే లోపలికి వచ్చిన అశ్విన్…
నువ్వు చేసుకోరా?? నిన్ను వద్దన్నానా?? అన్నాడు టిఫిన్ చేస్తూ … అగస్త్య
ఇంట్లో పెద్దోళ్ళు చేసుకోకుండా చిన్నోడు చేసుకుంటే నవ్విపోతారు అరుస్తుంది విజయ….
ఎవరో?? నవ్వుతారు అని మరెవరో?? ఏడుస్తారని ఎవరికోసమో??
అడ్జస్ట్ అయి పెళ్లి చేసుకుంటే లైఫ్ టైం అడ్జస్ట్ అవ్వాల్సివస్తుంది…. డాడీ…
ఎ విషయమైనా అడ్జస్ట్ అవ్వచ్చు కానీ పెళ్లి విషయంలో కాకూడదు…
నాకు లేట్ అవుతుంది వెళ్తున్న అంటూ సీరియస్ గా పైకి లేచాడు అగస్త్య
నాన్న ఆ టాపిక్ ఎప్పుడు ఉండేదే నువ్వు టిఫిన్ చెయ్ అంటాడు రఘురాం
కడుపు నిండిపోయింది ఆఫీసులో చేస్తాను ఇది డైజెస్ట్ అయితే అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు అగస్త్య…
ఏంటండీ?? వీడు ఇలా తయారయ్యాడు అంటుంది విజయ నాలుగు రోజులు వాన్ని వదిలేయమని చెప్పానుగా
మీరు నాలుగు రోజులు అన్నారని దాదాపుగా ఏడేళ్ళ నుంచి వదిలేస్తూనే ఉన్నాను కదా…??
ఇక నావల్లకాదు నా ఫ్రెండ్ రెడీగా ఉంది వీడిని ఓకే కూడా చేసింది ఇకను మనదే ఆలస్యం అనగానే
మమ్మీ అన్నయ్య మరీ అంత పెద్దదైపోలేదు మరి నీ ఏజ్ వాళ్ళని తెచ్చిచేయడానికి అంటాడు అశ్విన్..
నువ్వు నోరు మూసుకో నేననేది నా స్నేహితురాలు కూతురి గురించి… ఇదివరకే చెప్పాను గుర్తుందా?? మీకు అంటుంది కోపంగారఘురాం వంక చూసి
ఆ…… గుర్తుంది ఆ పూనే సంబంధం కదా?? అన్నాడు భయపడుతూ
ఆ….. ఆ సంబంధమే అమ్మాయి పేరు అలక్షణ లక్షణమైన పిల్లా…. పిలిపిస్తాను రెండు రోజుల్లో ఎలా చేసుకొడో?? చూస్తా?? అంటుంది.
మామ్ “అలక్షణ” అంటే లక్షణాలు లేనిది కదా?? మీనింగ్ లక్షణమైన పిల్ల అన్నావ్ డౌట్ వ్యక్తం చేశాడు అశ్విన్.
చూడు అషు…. నాకు అనవసరంగా బీపీ రెస్ చేయకు కామ్ గా టిఫిన్ చేసి వెళ్ళు ఆఫీస్ కి…. కోపంగా వార్నింగ్ ఇస్తుంది విజయ
వద్దు రా నాన్న …అంటూ దండం పెడతాడు రఘురాం….నవ్వుతాడు అశ్విన్ ఇద్దరు టిఫిన్ చేసి బయలుదేరుతారు
రఘురాం విజయ దంపతులకు ఇద్దరూ కొడుకులు అగస్త్య ఆశ్విన్ …. అగస్త్య పుట్టాక బిజినెస్ లో బాగా కలిసి వచ్చింది
అందుకే రఘురాం కి పెద్ద కొడుకు అంటే ప్రాణం… చిన్న కొడుకు ఈమధ్య స్టడీ కంప్లీట్ చేసుకుని వచ్చి…
తండ్రితో పాటు చిన్నగా బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చాడు…. అగస్త్య మాత్రం దాదాపు ఆరు సంవత్సరాల నుంచి
బిజినెస్నీ ఒంటి చేత్తో ఆడిస్తూ… మన కంట్రీలో బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డ్స్ అని తన అకౌంట్లో వేసుకున్నాడు
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
ఏంటిది??ప్రాజెక్టు షేరింగ్ ఓకే కానీ వాళ్ళ ఆఫీస్ లోనే వర్క్ చేయడం ఏంటి?? నాకు నచ్చలేదు అంటుంది ప్రాప్తి నిఖిల్ తో
తప్పదు ప్రాప్తి మనప్రాప్తం అంతే…ఉంది అన్నాడు నిఖిల్ సినిమా డైలాగులా…
అసలు నిన్ను నమ్మి తప్పు చేశాను నేను…. కోపంగా అంది ప్రాప్తి.
ప్లీజ్ ప్రాప్తి….మనం అనుకున్నది జరగాలంటే వాళ్ళు చెప్పినట్టే వినాలి జస్ట్ మూడు నెలలే.. వర్క్… అది కూడా ఆఫీసే….కదా?? అన్నాడు
మన ఆఫీస్ కాదు కదా??
మరేంచేస్తాం వేరే ఆప్షన్ లేదు కదా ??అన్నాడు టేబుల్ పై కాళ్లు ఆడిస్తుంది
అసలు మీనాన్న నిన్ను ఎందుకు నమ్మడో?? నాకు ఇప్పుడు అర్థంఅవుతుంది ప్రాప్తి
నా మనోభావాలు దెబ్బతింటున్నాయి..ప్రాప్తి…. అన్నాడు నిఖిల్
ఆ… తొక్కలే అంటూ ఫైల్స్ అన్ని పట్టుకుని పద మీటింగ్ రూమ్ కి అంటుంది
ఒ అదొకటి ఉంది కదూ?? సరే పద…అంటూ అనుసరించాడు
అక్కడ అందరికీ చెప్పి నెక్స్ట్ R V కంపెనీకి బయలుదేరారు అదే రోజు ప్రాజెక్టు స్టార్ట్ కాబట్టి…
అగస్త్య తమ టీం రెడీగా ఉండడంతోఎన్ ఎన్ కంపెనీ వాళ్ళు రాగానే చెప్పమని
తన క్యాబిన్లో కూర్చుంటాడు సుదీర్ తో అప్పటికి హాఫ్ ఆన్ అవర్ లేట్ అయింది వాళ్ళురావడానికి…
ప్రాప్తి నిఖిల్ ఆఫీస్ లోకి అడుగుపెట్టారు లోపలికి వెళ్తూనే అందర్నీ విష్ చేస్తూ అగస్త్య వెయిటింగ్ లో ఉండడంతో తన చాంబర్ కి వెళ్ళారూ
అప్పటివరకు సుదీర్ తో మాట్లాడుతున్న అగస్త్య ప్రాప్తిని చూస్తూ ఉండిపోయాడు
వైట్ కలర్ టాప్ బ్లూ జీన్స్ మెడలో ఐడి కార్డ్ హై పోనీ చెవులకు పల్స్వి చిన్న ఇయర్ రింగ్స్
ఒక చేతికి వాచ్ మరో చేతికి సన్నని బ్రేస్లెట్ చేతిలో ప్రాజెక్టు తాలూకా కొన్ని ఫైల్స్ పట్టుకొని మోడ్రన్ గా కనిపించింది
ఒకప్పుడు సిల్వర్ సూట్ చుడిదార్ లంగా వోని కళ్ళల్లో భయంతో హోమ్లీగా కనపడేదిఅమ్మాయి…
ఈరోజు చాలా కాన్ఫిడెంట్ గా ఫాష్ గా కనిపిస్తుంది అసలు ఇప్పటి ప్రాప్తికి ఒకప్పటి ప్రాప్తికి పొంతననేలేదు..
కాసేపు తనని చూసి ఏంటి??లేటు ??చాలా గంభీరంగా అడిగాడు అన్నాడు..అగస్త్య
సారీ….మిస్టర్ అగస్త్య అన్నాడు నిఖిల్..
ఓకె ఈ ప్రాజెక్టు మొత్తం ఎవరి అబ్జర్వేషన్లో జరుగుతుంది?? అని అడిగాడు… అగస్త్య
అంటే నేను ఢిల్లీ ఇచ్చి వెళ్తుంటాను కదా?? మొత్తం ప్రాప్తినే చూసుకుంటుంది అన్నాడు నిఖిల్
ఓకే పదండి మరి ఇంకా లేట్ ఎందుకు?అంటూ మరో మాటలు చాన్స్ ఇవ్వకుండా ముందుకు వెళ్లాడు అగస్త్య…. తనని అనుసరించారు ముగ్గురు..
వర్క్ జరుగుతున్న హాల్లోకి వెళ్ళగానే స్టాఫ్ అందరు అలర్ట్ అయ్యారు వెంటనే “ప్రాప్తిని ఎందుకు?? లేట్ అయ్యారు అని అడిగాడు
షాక్ అయిపోయింది ప్రాప్తి అగస్త్యని చూస్తూ “ట్రాఫిక్ జామ్….. సార్…అంది.
మీ స్టాప్ అందరూ వచ్చాక మీరు.. లేటుగా రావడం అనేది ఒక బాధ్యత లేని
మేనేజర్గా అనుకుంటున్నాను దీనికి నీ ఎక్స్ప్లనేషన్ ఏంటి ??అని అడిగాడు అగస్త్య…
షాక్ అయిపోయింది తన స్టాప్ ముందు పరువు తీసేస్తున్నాడు ఎన్నోసార్లు తను కూడా ఇలాగే అడిగింది స్టాప్ ని
సర్ ట్రాఫిక్ లో లేటు పైగా మా సీఈఓ కూడా…. మాట పూర్తిగా కాకముందే…
కాకమ్మ కబుర్లు చెప్పకండి నా దగ్గర ఇకపైన మీరే కాదు మీ స్టాప్ లో ఎవరూ?? లేటొచ్చినా…. బాధ్యత మీదే…
వచ్చాకే కాదు వెళ్లే ముందు కూడా నా పర్మిషన్ తీసుకుని వెళ్లాలి మీ టీంతో పాటు మీరు కూడా…
నేను వర్క్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను డు యు అండర్స్టాండ్!! అన్నాడు అగస్త్య…
షాక్ తో మైండ్ బ్లాక్ అయిన ప్రాప్తి “ఒకే….సార్ అనగలిగింది….
నిఖిల్ మాత్రం వీలైనంత త్వరగా ఢిల్లీకి చెక్కెయ్యాలి అనుకున్నాడు ప్రాప్తిని చూస్తూ భయపడి….
ఇక అగస్త్య తన ఛాంబర్ కి వెళ్ళిపోయాడు సుదీర్ తో “ఎందుకురా?? అంత కక్ష అమ్మాయి పైన అన్నాడు
నేను జస్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు… సీరియస్గా అగస్త్య
నిజంగా నువ్వు చెప్పింది నిజంఅయి ఉంటే బాగుండేది అన్నాడు జ్యూస్ గ్లాస్ లో పోసి అగస్త్య కి ఇస్తూ….
మీకు అలాగే అనిపిస్తుంది అని మీకేం తెలుసు నా గుండె ఎన్నిముక్కలు అయ్యిందో??తన వల్ల!!
ఇప్పుడు ఒక్కో ముక్కని ఏరుకోవాలి కదా…. ఈ మూడు నెలల్లో నరకం అంటే ఏంటో??చూపిస్తాను… ప్రాప్తి…
అయినా నా ఏడేళ్ల బాధ తగ్గుతుందా?? లేదు కదా?? అది ఎప్పటికీ తగ్గదు కానీ… కనీసం నిన్ను బాధ పెట్టాను
అన్న తృప్తి అయినా మిగులుతుంది నాకు కసిగా మనసులో…అనుకున్నాడు దూరం నుంచి ప్రాప్తిని చూస్తూ……
ఇక వర్క్ స్టార్ట్ అయింది నిఖిల్ వెళ్ళిపోయాడు ప్రాప్తితో మాట్లాడకుండానే….
15ఫ్లోర్ అగస్త్య ఆఫీస్ ముందు భాగం కేటాయించాడు తన చాంబర్ నుంచి…
పూర్తిగా కనిపించేలా సెట్ చేసుకున్నాడు… ముఖ్యంగా ప్రాప్తి సీట్…. తను ఏం చేస్తున్నా చూడడానికి….
ఈ నిఖిల్ గాని పెళ్లి నాచావుకు వచ్చింది ఈ మూడు నెలలు చాలు అగస్త్య నాప్రాణాలు తీయడానికి… అనుకుంటూ పనిలో పడింది ప్రాప్తి.
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
Swipe left/right or tap the sides to turn pages