ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 2
నీకు పెళ్లి అయిన కూతురు ఉన్నా పరవాలేదు… యువర్ మై ఫస్ట్ లవ్… అది ఎప్పటికీ మర్చిపోలేము కదా??
ఆ మాట వినగానే “అగస్త్య” గుర్తుకు వచ్చాడు… ప్రాప్తికి “అంకుల్ తో మాట్లాడతా ఉండు నీకు పెళ్లి చేయమని అంటుంది ప్రాప్తి…
వద్దు తల్లి ఆల్రెడీ… ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి రాలేదని డాడ్ చాలా కోపంగా ఉన్నాడు
ఈ ప్రాజెక్టు అన్న సక్సెస్ అయితే లాభాలు లేకున్నా కనీసం కంపెనీ నిలబడేలా చూసుకోవాలి…
ఇప్పుడు నా ఫుల్ ఫోకస్ ప్రాజెక్టు మీదే ఉంది ప్రాప్తి… కాబట్టి నా గురించి నువ్వు ఆలోచించకు అన్నాడు సీరియస్ గా
అప్పటివరకు మాట్లాడుతున్నది ప్రాజెక్టు కోసం అనుకొని సీరియస్ఉన్న ప్రాప్తి కి కోపం వచ్చేసి కాల్ కట్ చేసింది
నవ్వుకుంటూ లోకేషన్ షేర్ చేశాడు నిఖిల్ ప్రాప్తి కి..
హోటల్లోనా…?? మీటింగ్… ఎలాగో ప్రాజెక్టు ఓకే అయింది కాబట్టి పెద్ద టెన్షన్ ఏముండదు!! అనుకుంటూ ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది ప్రాప్తి
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
అగస్త్య ఇవాళ ఆఫ్టర్నూన్ మనకు మీటింగ్ ఉంది ఎన్ ఎన్ …కంపెనీ సీఈఓ తో
యు నో….ఈ ప్రాజెక్ట్ వాళ్లతోనే కలిసి పనిచేస్తున్నాము
తెలుసు బే… నీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి నా కంపెనీలో వాడుకుంటున్నవ్
తప్పదు కదరా నువ్వు కూడా నా ఫ్రెండ్ వి నేను అందరిని సమానం చూస్తాను అన్నాడు సుధీర్…
నీయబ్బ ఈ ఫిలిం డైలాగ్ తక్కువ లేదు… చూడు ఎంత నీ ఫ్రెండ్ అయినా వర్క్.& టైమింగ్ కి వాల్యూ ఇవ్వాలి
అది నాకు నాకు నచ్చితేనే వాళ్లతో ప్రాజెక్టు వర్క్ అవుట్ అవుతుంది లేదంటే?? నేను క్యాన్సల్ చేసుకుంటాను
చి… చి… స్నేహితులకి.. స్నేహానికి… విలువ లేకుండాపోతుంది అన్నాడు సుధీర్… అగస్త్య మాట విని
నాకు తెలుసు రా నువ్వు మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావని అందుకే ముందుగా చెప్తున్న నాకు
ఆ కంపెనీ హెడ్ తో పాటు కంప్లీట్ టీం నచ్చాలి వాళ్ళ కెపాసిటీ అని తెలియాలి..
ముందు చేసిన ప్రాజెక్టుల లిస్టు తీసుకుని రమ్మను అని అంటూ కాల్ కట్ చేశాడు అగస్త్య…
వీడితో పనిచేసే బదులు పురావస్తు శాఖలో పనిచేసిన నాలుగు లంకబిందెలు దొరికేవి….
టార్చర్ చేస్తున్నాడు తప్పేలా లేదు అనుకుంటూ తన ప్రెండ్ కి కాల్ చేస్తాడు సుధీర్…
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
న్యూ ప్రాజెక్ట్ మీటింగ్నీ…. లంచ్ టైం కి హోటల్లో అరేంజ్ చేశాడు సుధీర్
ఎక్సాక్ట్లీ టైం కి వచ్చేసారు దాదాపుగా అందరూ… అగస్త్య కి అందర్నీ ఇంటర్వ్యూస్ చేశాడు సుధీర్…
సో మీ కంపెనీకి ఇదివరకు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాజెక్ట్స్ కంటే ఇదే పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట అడిగాడు అగస్త్య
ఎస్ సర్…పెద్ద ప్రాజెక్ట్ ఇది R V కంపెనీతో వర్క్ చేయడం మాకు చాలెంజ్ మీతో మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది
కానీ ఇంకా ఇది ఫైనల్ కాలేదని నాకు తెలుసు… ప్రాజెక్టు హెడ్ కూడా మీ ఒపీనియన్ తర్వాతే ఒకే చేస్తామన్నారు
కాబట్టి ఇదివరకు మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ మీకు ఏవి చూపిస్తాను…
మీరు సాటిస్ఫై అయితేనే ఓకే చేయండి రిక్వెస్ట్ గా అన్నాడు…. సుధీర్ ఫ్రెండ్
ఓకే మిస్టర్ భరద్వాజ్ అంటూ సుధీర్ ని పిలిచి అగస్త్య ఏదో మాట్లాడి…
అక్కడే ఉన్న ప్రాజెక్టు హెడ్ తో కూడా మాట్లాడారు ఒక పది నిమిషాల తర్వాత…
సో మిస్టర్ భరద్వాజ్ ఇక లేట్ ఏంలేదు కదా?? అడిగాడు అగస్త్య
సారీ…సర్… మా మేనేజర్ ఇంకొకరు రాలేదు తనకోసమే ఎదురు చూస్తున్నాను ప్లీజ్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ అన్నాడు
ఓకే జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటూ తన…. ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు అగస్త్య
వెంటనే అతను పైకి లేచి అటు ఇటు తిరుగుతూ ఎంట్రెన్స్ వైపు చూస్తూ ఫోన్ ట్రై చేస్తున్నాడు కానీ నో రెస్పాన్స్…
కరెక్ట్ గా 5 నిమిషాల తర్వాత… ఫోన్ నుంచి తలెత్తి హోటల్ విండో నుంచి బయటికి చూశాడు అగస్త్య
ఎదురుగా లెక్ కనపడుతుంది దాని చుట్టూ చక్కటి గ్రీనరీ… తాము 11 ఫ్లోర్ లో ఉండడం వల్ల చక్కటి వ్యూ కనిపిస్తుంటే
ఈరోజు చాలా అందంగాఅనిపిస్తుంది ఎందుకొ??అనుకున్నాడు అగస్త్య మనసులో.
సారీ ఐయామ్ లేట్.. ట్రాఫిక్ జామ్ అయింది అంటూ వినపడగానే అటు చూసి షాక్ అయ్యాడు అగస్త్య
ఎదురుగా… ప్రాప్తి కనిపించేసరికి తనకు తెలియకుండానే లేచి నిల్చున్నాడు అగస్త్య
తన ముందు అందరూ లేవాల్సిందే…
అలాంటి అగస్త్య లేచాడు ఏంటి?? అని విచిత్రంగా చూసాడు సుదీర్… ఆమె వంక
ఏంటిది? ఇక్కడికి తీసుకొచ్చావు?? అని అడుగుతుంది.. ప్రాప్తి సుధీర్ ఫ్రెండ్ అయినా నిఖిల్ తో
అగస్త్య ను అక్కడ అలా….చూడగానే అయోమయంగా అనిపించింది తనకు
ఇక్కడే కదా?? మన మీటింగ్ మిస్టర్ అగస్త్యతో… ఆర్ వి కంపెనీ సీఈవో అంటాడు నిఖిల్ భరద్వాజ్…
సో….ఇతని కంపెనీతోనా….?? మేము ప్రాజెక్టు షేర్ చేసుకునేది?? అయిపోయాను పో… అనుకుంటుంది మనసులో ప్రాప్తి
అగస్త్యని అసలు పట్టించుకోదు… అక్కడే మన హీరో గారి ఈగో హర్ట్ అవుతుంది “కనీసం ఫేస్ లో గిల్టీనెస్ కూడా లేదు” అనుకుంటూ
మీ మేనేజర్ గారు వచ్చారా?? సీరియస్గా అడుగుతాడు నిఖిల్ ని
వచ్చింది సార్ అంటూ ప్రాప్తి నీ ఇంటర్వ్యూస్ చేస్తాడు అందరికీ…
సుధీర్ కి అర్థమైంది ఈ అమ్మాయేనా?? ప్రాప్తి నిజంగా చాలా అందంగా ఉంది…
ఈ అమ్మాయి మా వాడ్ని అర్థంచేసుకుంటే ఇంకా బాగుండేది అనుకుంటూ అగస్త్య ని గమనించసాగాడు సుధీర్…
ప్రాజెక్ట్ ఏవితోపాటు ఈ ప్రాజెక్టు కి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఫ్రెష్ గా మల్లి కావాలి
అన్నిటికీ సాటిస్ఫై నన్ను చేస్తేనే… ఈ ప్రాజెక్టులో మీకు షేరింగ్ అంటూ తేల్చేశాడు అగస్త్య…
ఓ గాడ్…. ఇలా అంటున్నాడు ఏంటి ??అంటూ భయపడుతూ ప్రాప్తి తో మాట్లాడుతాడు నిఖిల్
సరే ముందు ఏవి చూపించండి…. ప్రజెంటేషన్ కి టైం కావాలని చెప్పు!! అంటుంది కంగారు పడుతున్న నిఖిల్ తో…. ప్రాప్తి
నో మిస్… సారీ మిస్సెస్… ఏమని పిలవాలి?? అని అడిగాడు అగస్త్య
వాళ్ళ మాటలు జస్ట్ లిప్ మూమెంట్ తో వాళ్ళ మాటలు అర్థం చేసుకుని
అసలు మారలేదు అనుకుంటూ ప్రాప్తి.. “ప్రాప్తి సల్మాన్” అనగానే ఒళ్ళు మండిపోయింది… అగస్త్యకి
ముస్లిం అనమాట కులాంతర వివాహం అందరికీ ఆదర్శం!! నాలాంటివాళ్లకు నీ పరిచయమే పెద్ద శాపం… అనుకుంటూ…
జస్ట్ 15 మినిట్స్ టైం నేను ఏవి చూసేంత టైం మాత్రమే ఇవ్వగలను!!
అంతలోపు ప్రజెంటేషన్ ఇస్తే ఓకే లేదంటే నేను బిజీ అయిపోతాను
సిక్స్ మంత్స్ వరకు నా అపాయింట్మెంట్ కూడా మీకు దొరకదు తెలుసు కదా?? సుధీర్ అన్నాడు సీరియస్గా సుదీర్ చూస్తూ…
కడుపులో నా పైన కోపం నింపుకొని ఉన్నాడు అది నిఖిల్ కంపెనీ పై చూపిస్తున్నాడు…అసలు నేను రావాల్సింది కాదు పాపం నిఖిల్ అనుకుంటుంది ప్రాప్తి
మరి పది పదిహేను నిమిషాల్లో ప్రజెంటేషన్ ఎలాగే…. దీనంగా అడిగాడు నిఖిల్
నేను నెత్తి నోరుకొట్టుకొని కూడా ఈ టైంలో ప్రజెంటేషన్ తయారుచేసిన మిస్టర్ అగస్త్య మన ప్రజెంటేషన్ నికి సాటిస్ఫై అవ్వడు
కాబట్టి ఈ ప్రాజెక్టు నీకు రానట్టే కాబట్టి ఏవి చూపించి బయలుదేరుదాం అంటుంది ప్రాప్తి
అలా అనాకే లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు మా డాడీ
ఈ ప్రాజెక్టుతో పాటు నా పెళ్లి కూడా ముడేసాడు…
ఈ ప్రాజెక్టు రాకపోతే మమ్మీ డాడీ కి నచ్చిన అమ్మాయి తో పెళ్లి చేస్తారు
ఇప్పటిదాకా సరిగ్గా ప్రేమలో కూడా పడలేదు ప్లీజ్….
ఈ ప్రాజెక్టు వస్తే బిజినెస్ లోను కంటిన్యూ అవుతాను… పెళ్లికి కూడా బ్రేక్ అవుతుంది
లేదంటే నాకంటూ బిజినెస్ ఉండదు లైఫ్ కూడా ఉండదు అర్థం చేసుకోవే… ప్లీజ్…ప్లీజ్…ప్లీజ్….ప్రాప్తి.
నాకు హెల్ప్ చెయ్ ఎలాగైనా ప్రజెంటేషన్ రెడీ చేయవానా?? నువ్వే లాస్ట్ హోప్ అంటూ చేయి పట్టుకొని బతిమాలుకున్నాడు.
అలా చూడగానే ఇంకా మండిపోయాడు అగస్త్య కోపం కళ్ళల్లో కనపడింది కానీ ప్రాప్తి చూడలేకపోయింది తనకోపం ఆమెకు తెలుసు…
చాలా తక్కువ టైం ఉంది కదా?? చాలా కష్టం రా.. నిఖిల్ అంటుంది
ప్లీజ్ రా…. నాకోసం ఎలాగైనా నీలో క్రియేటివిటీ బాగా ఉంది టైం తక్కువ అని ఉన్న టైం ని వేస్ట్ చేయకు ప్లీజ్… ఇంకేసేపైతే ఏడ్చేలా ఉన్నాడు బతిమాలుతూ.
ఆల్ రైట్ అంటూ చుట్టూ చూసింది ప్రాప్తి
అలా చూడకే ప్రజెంటేషన్
నేనేమైనా ప్యాకెట్ లో పెట్టుకుని వచ్చానా….??ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది
అంటూపెన్ డ్రైవ్ నిఖిల్ చేతిలో పెట్టి ఒక టేబుల్ దగ్గరికి వెళ్తుంది అలోన్ గా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడానికి…
దాదాపు నాలుగు ప్రాజెక్టులలో 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి మరొకటి రన్ అవుతుంది సార్ అంటూ
పెన్ డ్రైవ్ లాప్టాప్ కి కనెక్ట్ చేసి ఏవి చూపించాడు కార్తికేయ అండ్ ప్రాజెక్టు హెడ్కి నిఖిల్
చాలా బాగా వచ్చాయి దాదాపుగా పది నిమిషాలు గడిచిపోయాయి…. ఇంకో ఫైవ్ మినిట్స్ అంటూ టైం చెప్తాడు అగస్త్య వాచ్ చూసుకుంటూ
వస్తుంది సార్ అంటూ కూర్చుంటాడు టెన్షన్ గా నిఖిల్ మీరు మ్యారీడా??అడిగాడు అగస్త్య
జనరల్ గా ఎవరిని అలా అడగడు అగస్త్య ప్రాప్తిపై కోపం నిఖిల్ పై చూపిస్తాడేమో?? అని టెన్షన్ గా వింటున్నాడు సుధీర్ వాళ్ళ మాటలను…
నో….సర్… నవ్వుతూ అన్నాడు నిఖిల్ అప్పుడే ప్రాప్తి వచ్చి ప్రజెంటేషన్ రెడీ అయింది
జస్ట్ 3 మినిట్స్ లొ కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాజెక్టు పైన హోప్స్ పెట్టుకోకు
అంటూ అక్కడ ఏర్పాటు చేసిన… వాల్ పై స్కెచ్ తో వేస్తూ తన ప్రజెంటేషన్ ఇచ్చింది ప్రాప్తి…
ప్రజెంటేషన్ తను చెప్పడం కంప్లీట్ చేసి వెనక్కి తిరిగి చూసింది రియాక్షన్ కోసం
అగస్త్య సీరియస్ గా చూస్తున్నాడు అలాగే అతనితోపాటు అందరూ
ఐ యాం ఫెయిల్యూర్… అనుకుంటూ ఉండగా గట్టిగా చప్పట్లు వినిపించాయి ఒక వ్యక్తి నుంచి…
€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€
Swipe left/right or tap the sides to turn pages