New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 1

ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 1

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)

పీవీ నరసింహారావు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
శంషాబాద్ 12:30 ఆఫ్టర్నూన్:

సన….అగు… ఏ…సన… ఆగు మా…. అని పిలిచిన వినిపించుకోకుండా మూడేళ్ల చిన్నారి

తన వెనక వస్తున్న వాళ్లకి దొరకకుండా ఉత్సాహంగా ముందుకు పరిగెడుతూ తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కాళ్ళను చుట్టేసింది…..

ఏయ్…. ఎవరు నువ్వు?? అంటూ ఫోన్ మాట్లాడడం ఆపి పాపని చూశాడు ఆశ్చర్యంగా

నవ్వుతూ తల పైకి ఎత్తి చూసింది పాప అచ్చు బార్బీ బొమ్మలా ఉంది తెల్లటి చర్మం

అందమైన కళ్ళు ఉంగరాల జుట్టు వెంట్రుకలు.. నవ్వితే సొట్టపడే చెంపలతో చెప్పలేని అందం

ఎవరు డియర్ నువ్వు?? అంటూ చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాడు… అగస్త్య…

అప్పుడు వెనకవినిపిస్తుంది సన సన ఎక్కడున్నావు? చిన్న పాపని చూశారా?? అని వాయిస్ అది వినగానే

బాగా పరిచయం ఉన్న వాయిస్ తనకు తెలియకుండానే చట్టుక్కుని తిరిగాడు…అగస్త్య

అలా అడుగుతూ తన లెఫ్ట్ సైడ్ చూసి ఒక్క క్షణం ఆగిపోయింది ప్రాప్తి

ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నమ్మలేని క్షణాలు కొన్ని గడిచిపోయాయి ఇద్దరి మధ్య ఒకరికొకరు తెలియకుండానే దగ్గరగా అడుగులు వేశారు….

మామీ….అని పాప ప్రాప్తిని పిలిచింది అప్పుడు అనుకున్నాడు అగస్త్య…  ఆమె….దగ్గరగా వచ్చాక “తాము ఎప్పుడో….. దూరం అయ్యామని …”

కానీ ఇంకా షాక్ నుంచి బయటపడని ప్రాప్తి పాప పిలుపుతో లోకంలోకి వచ్చి రెండుచేతులు చాస్తుంది.

ఈ లోపు పాప పూర్తిగా బెండ్ అయ్యి ప్రాప్తి మీదికి వచ్చేసింది… ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి

నేల చూపులుచూస్తూ ఇద్దరు ఒకరికి ఒకరు ఒకేసారి “సారీ” చెప్పుకున్నారు…

ఆ సారీ ఎవరికి ఎవరు చెప్తున్నారో….?? ఎందుకు?? చెప్తున్నారో?? అర్థంకాలేదు..

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€

ఆఫీస్ లో కూర్చున్నాడు కానీ వర్క్ పైన ధ్యాస కుదరట్లేదు అగస్త్య కి…

ఎంతసేపు ప్రాప్తినే….తన కళ్ళల్లో కనిపిస్తుంది… ఎంతైనా ఫస్ట్ లవ్ కదా??

ఎలా మర్చిపోగలను?? అనుకుంటూ చైర్కి వెనక్కి వాళి కళ్ళు మూసుకున్నాడు

వాట్ హప్పెన్ అగస్త్య అన్నాడు లోపలికి వచ్చింది సుదీర్…. కళ్ళు తెరిచి నథింగ్ యార్ అన్నాడు..

మరి ఎప్పుడు రాక్షసుడులా పని మీదపడే నువ్వు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నావ్??

ఏంలేదు తను మల్లి కనిపించింది సెవెన్ ఇయర్స్ తరువాత…

ఒ….. ఎక్కడ?? ఎప్పుడు?? ఎలా ఉంది… ??

ఎయిర్ పోర్ట్లో లో ఇందాక నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు “అలానే ఉంది అందంగా……”అనుకున్నాడు మనసులో

నాకు ఎందుకు చెప్పలేదు కలిసేవాడిని కదా??

ఇలా ఎక్స్ట్రాలు చేస్తావనే…. చెప్పలేదు

వాట్ ఇందులో ఎక్స్ట్రా ఏముంది..??ఒకసారి తనని కలిసి తను ఎందుకు?అలా చేసిందో?? కనుక్కోవద్దా ??

నో… కనుక్కోవద్దు!! అని కాస్త గట్టిగా అని ఒక ప్రాజెక్టు తీసుకురారా….. బాబు అంటే…రెండు కంపెనీలకు టైయప్ చేసి తీసుకొచ్చావు…

కనీసం ఓకే చేసే ముందు నాకు కాల్ కూడా చేయలేదు నువ్వు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తిడతాడు అగస్త్య

ఏం చేయమంటావ్?? ఎట్టి పరిస్థితిలో ప్రాజెక్టు వదలకు అన్నావు కదా?? వాళ్లేమో రెండు కంపెనీలు నచ్చాయి

ఇద్దరికీ ఇస్తాం అంటున్నారు పైగా పక్క కంపెనీ వాడు నా ప్రెండ్ వాడు కూడా రిక్వెస్ట్ చేసేసరికి దాంతో ఓకే చేశాను

అయితే అది ఢిల్లీకి వెళ్తూ వస్తూ ఉండాలా….??కంప్లీట్ అయ్యేవరకు

అవసరంలేదు వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మేనేజర్ చూసుకుంటారు అంట…

ఆల్మోస్ట్ వర్క్ మొత్తం ఇక్కడే జరుగుతుంది హైదరాబాదులో

సంతోషించాంలే కానీ మేనేజర్ కి కాల్ చెయ్ రేపు మీటింగ్ గురించి

రేపు ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అదికూడా ఇన్ఫామ్ వాళ్ళకి అన్నాడు అగస్త్య

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€

హాస్పిటల్ వార్డులోకి వచ్చింది ప్రాప్తి… సునీత చూడగానే లేచి నిలబడింది

ఎలా ఉన్నారు అంటూబెడ్ పై ఉన్న పేషెంట్ ని చూస్తుంది ప్రాప్తి

పర్లేదు మేడం బానే ఉన్నారు కూర్చోండి అంటూ సీడ్ చూపిస్తుంది తెచ్చిన ఫ్రూట్స్& జ్యూస్ సునీతకు ఇచ్చి కూర్చుంది ప్రాప్తి

పాప ఎలా ఉంది మేడం బానేఉంది బాగా అల్లరి చేస్తుంది అని నవ్వుతుంది ప్రాప్తి

మెల్లిగా మేలుకున్న రూప తిరిగి చూసి మౌనంగా కళ్ళలోంచి నీరు కరేస్తుంది…

ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నారు అంతా బానే ఉంది కొద్దిరోజులు ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రాప్తి…

సునీత రూపను కూర్చోబెట్టి జ్యూస్ ఇస్తుంది మౌనంగా తాగుతూ పపా అని సైగ చేస్తుంది

బావుంది అంటూ తన ఫోన్లో తనుచేసే అల్లరి పనులు మాట్లాడే మాటలు చూపిస్తుంది రూప నవ్వుతుంది వాటిని చూసి…

ఇక వెళ్తాను ఆఫీస్ నుంచివచ్చాను మళ్లీ రేపు వచ్చి డాక్టర్ తో మాట్లాడుతాను అని జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటికి వెళుతుంది ప్రాప్తి

వెనకే వచ్చిన సునీత మేడ ఈ మంత్ లో టు డేస్ లీవ్ కావాలి అంటుంది

ఎందుకు సునీత నీకు తెలుసు కదా?? నా ప్రాబ్లం ఇంట్లోపాపని ఆఫీస్ వర్క్ ని ఇంకా ఈవిడని చూసుకోలేను నేను

పాపకి కూడా ఆయానీ పెట్టాను భరించలేని ఖర్చులు కాని తప్పట్లేదు నాకు అర్థం చేసుకో

ఆమెకి కీమోథెరపీ కంప్లీట్ అయ్యేవరకు… నువ్వే చూసుకోవాలి… అంది ప్రాప్తి…

ఐ నో మేడం బట్ గురించి మీ మమ్మీ కాల్ చేసింది అర్జెంటుగా వెళ్లాలి జస్ట్ టు డేస్…

అదంతా నాకు తెలియదు సునీత నువ్వు వెళ్ళేది ఉంటే ఎవరినైనా అరేంజ్ చెయ్..

దానికి కూడా మనీ పే చేయమంటే చేస్తాను కానీ అక్కడ ఇక్కడ మేనేజ్ చేయలేను నేను…

ఓకే మేడం నేను ఆలోచిస్తాను ఒకవేళ కుదిరితే ఎవరినైన ఉంచేసి వెళ్తాను జస్ట్ 2 డేసే అంటుంది

సరే వెళ్లే ముందు ఇంఫార్మ్ చెయ్ నువ్వు ఉంచే వ్యక్తి కూడా ఆవిడని బాగా చూసుకోవాలి కదా….??

అలాగే మేడం నాకు తెలిసిన ఒక ఆయా ఉంది నేను చూస్తాను మీకు ఇన్ఫోమ్ చేస్తాను

ఓకే అయితే ఇక ఉంటాను అంటూ బయటికి దారితీసింది ప్రాప్తి.

కార్ డ్రైవింగ్ చేస్తుంది కానీ తన ఆలోచనలు గతంలోకికి వెళ్ళాయి గంభీరమైన రూపం అంతే గంభీరమైన స్వరము

ఒసే…. ప్రాప్తి ఎక్కడ చచ్చావే??? నా కూతురికి యూనిఫామ్ ఎందుకు?? ఉతకలేదు అంటూ చెంప చెల్లుమనిపించి తిట్ల దండకం అందుకునేది పిన్ని

కానీ ఇవాళ ఎముకల గూడులాగా ఒక బెడ్ పై అసహ్యతతో పడుకునే ఉంది ఆమె ఈమె ఒక్కరేనా అనిపించింది…

జీవితం ఎప్పుడు?? ఎలా ఉంటుందో??తెలియదు!! అనడానికి నా జీవితమే కాదు!! మా పిన్ని జీవితం కూడా ఒక ఉదాహరణే… అనుకుంది మనసులో….

చచ్చిన తల్లి మొదలుపెడితే… బతికున్న తనతండ్రి నుంచి తనవరకు రోజంతా  తిట్లతో నింపేసేది పిన్ని…

ఎంత చెప్పినా?? అర్థం చేసుకునేది కాదు!! అక్కడికి భయపడి ఇంట్లో పని అంతా తనే చేసేది…

ఒకసారి తన పరిస్థితి అర్థంచేసుకున్న ఒక్క టీచర్ ఒక్కటే చెప్పింది నువ్వు ఇంట్లో ఎంత పనైనా చెయ్

కానీ నీ చదువుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక ఇలాంటి వాళ్ళు

వందమందిని లైఫ్ లోకి వచ్చిన నిన్ను ఏమీ చేయలేరు కనీసం నిన్ను తాగలేదు అంత ఎత్తులో ఉండాలి నువ్వు అంటూ…

ఆ మాటలు నా పై చాలా ప్రభావం చూపయి కడుపునిండా తిండి..కంటి నిండానిద్ర లేకున్నా

చదువులో మాత్రం నెంబర్ వన్ స్టూడెంట్ గా నిలబడింది ప్రాప్తి…

అబ్బా ఒంటిమీద సరైన బట్టలు ఉండవు క్యారేజ్లో బసిపోయిన తిండి…అయినా దీని

మార్కుల షిట్ పై మాత్రం 100 మార్కులుతో నిండిపోతుంది ఏంటి?? అని తన ఫ్రెండ్స్ అసూయ పడేలా చదివింది…

అబ్బాయిలు కూడా తనతో మాట్లాడటానికి ముందుకొచేవాళ్ళు కాదు అందరితో ఎలా ఉన్నా

తనతో రెస్పెక్ట్ గా బిహేవ్ వాళ్ళు… ఈ విషయంలో తనకి ఎంతో గర్వంగా అనిపించేది.. నవ్వుతూ అనుకుంది ప్రాప్తి.

అగస్త్య గుర్తుకొచ్చాడు… అసలు మారలేదు ఇంకా అందంగా తయారయ్యాడు..

పెళ్లయిందో? లేదో! అడగలేకపోయాను !! ఏమని అడగను…??అడిగే అర్హత నాకు లేదు కదా…??

ఒక్కటి మాత్రం నిజం….జీవితంలో ఏతప్పు చేయని నేను.. నిన్ను నమ్మించి మోసంచేశాను అందుకే తగిన శిక్ష అనుభవిస్తున్నాను..

వచ్చే జన్మ ఉంటే “అది ఉందో లేదో నాకు తెలియదు” కానీ నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి అప్పుడు వస్తే!మాత్రం మిస్ చేసుకోను…

నీలాంటి వ్యక్తి ప్రేమపొందడం…నీకు భార్య అవ్వటం ఎన్నో జన్మల పుణ్యఫలం బహుశా అదృష్టం నాకు లేకపోయింది అగస్త్య….

అందుకే నీచేత్తో తాళిపడే కొన్ని గడియలా… దూరంలోనే……..నేను నీకు దూరం అయ్యాను ఎంత దురదృష్టవంతురాలిని కదా??

నాపైన…నీ ప్రేమ స్వచ్ఛమైనది… నీకై నువ్వు లైఫ్ లో ఎప్పుడైనా ఈ కారణం చేత అయిన నన్ను క్షమిస్తావేమో??

కానీ నీ విషయంలో నేను చేసిన తప్పుకి నన్న నేను మాత్రం ఎప్పటికీ క్షమించుకోలేను…

ఇలా ఆలోచిస్తూ తన ఫ్లాట్ కి చేరింది ప్రాప్తి…. మామి……అంటూ బార్బీ డాల్ రెండు చేతులతో ఎదురు వచ్చింది….

సనని చేతిలోకి తీసుకొని సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన వస్తువులు… మున్నికి ఇచ్చి…

సనని ముద్దులు పెట్టుకుంటూ బెడ్ రూమ్ లోకి నడిచింది ప్రాప్తి.

€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€€

స్టార్ట్ అయ్యవా?? ప్రాప్తి అంటూ కాల్ చేశాడు.. నిఖిల్

ఎస్…. లొకేషన్ సెండ్ చెయ్ అంటుంది

లొకేషన్ నీకు తెలుసు జస్ట్ నా బెడ్రూమే తెలియదు నీకు…..

ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయి ఫ్రెండ్ అని కూడా చూడను..

రాళ్ల కొడితే చూస్తూ ఊరుకుంటానా??

ఏం చేస్తావురా…??

వెంటనే వెళ్లి  కట్టించుకుంటా అసలే హ్యాండ్సం ఫెల్లోని పళ్ళు లేకపోతే ఎలా…??

మాట్లాడడం అయిపోతే లొకేషన్ షేర్ చెయ్ టైం వేస్ట్ చేయకు ఆల్రెడీ నేను లేట్ అయ్యాను…

ఓకె… మిస్ యు సో మచ్

రేయ్ నాకు కూతురు ఉంది రా….

నీకు పెళ్లి అయిన…. కూతురు ఉన్నా పరవాలేదు… యువర్ మై ఫస్ట్ లవ్… అది ఎప్పటికీ మర్చిపోలేము కదా??

ఆ మాట వినగానే “అగస్త్య” గుర్తుకు వచ్చాడు… ప్రాప్తికి “అంకుల్ తో మాట్లాడతా ఉండు నీకు పెళ్లి చేయమని అంటుంది ప్రాప్తి…

##########################

మీ విలువైన కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను స్టోరీ ఎక్కడైనా చదివినట్టు అనిపిస్తే వెంటనే చెప్పండి ఆపేస్తాను ప్లీజ్ కామెంట్స్…& సబ్స్క్రయిబ్
                                              మీ మైత్రి