New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలలో చేసిన సాహసం – 1

కలలో చేసిన సాహసం – 1

అందరికి నమస్కారం ఇది కథ వర్ణిక లో నా మొదటి రచన. ముఖ్యంగా కథ వర్ణిక MD గారు నాకు కథ వర్ణిక గురించి ఎటువంటి సందేహం ఉన్న ఏ మాత్రం విసుగు లేకుండా మాకు ఓపిక గా చెప్పినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.ఈ రచన పూర్తిగా రచయిత్రి యొక్క ఊహ మాత్రమే నిజజీవిత ఆధారాలు లేవని తెలియచేస్తూ ఆలస్యం లేకుండా మన రచనలోకి వెళ్ళిపోదాం. 

 

“నా చుట్టూ చీకటి ఎటూ చూసిన అవే చెట్లు దాదాపు ఒక 30 అడుగుల దూరంలో ఒక 9 అడుగుల వ్యక్తి నన్ను చూసి పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నాడు. నువ్వు ఎవరు అని ప్రశ్నించడానికి కూడా నా గొంతు నుండి మాట బయటకు ఏ మాత్రం రావటం లేదు. ఇక నెమ్మదిగా అతని వైపు అడుగులు వేశాను. అప్పుడే నా కుడి భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించడంతో ఒక సారిగా వెనక్కు తిరిగి చూసాను, నేను ఎవరి దగ్గరకు వెళ్ళాలి అనుకున్నానో అదే వ్యక్తి నా నా ముందర నిలుచుని,” సాహసం చేయడానికి సిద్ధం గా ఉన్నావా అని అంటూ అతని జోభే నుండే ఏదో బయటకి తీయడం కంటే ముందు నా షూ లో దాచిన కాన్సిల్డ్ knife నీ బయటకు తీసి అతని పొట్ట లోకి పొడిచాను.

 

                                  అతను నొప్పితో బాధ పడుతూ “నేను నీకు మంచి చేద్దాము అనుకుంటే ఎలా చేస్తావా” అంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు నేను అనవసరంగా ఆవేశ పడ్డానా.

అని అనుకుంటూనే భయట నుండి ఎవరో గట్టిగా తలపు తడుతున్నారు. ఆ శబ్దానికి ఒక్క సారిగా ఉలిక్కిపడి లేచాను. ఇక ఎవరూ అని లేచి తలపు తీసి చూస్తే మా అమ్మ చేతిలో కాఫీ పట్టుకుని నిలబడింది,”లేచావా తలుపు ఎక్కడ పగల కొట్టాల్సి వస్తుందేమో అనుకున్న”. అని నా చేతికి కాఫీ కప్ ఇచ్చి పనిమనిషి రాలేదు అవుతల నాకు చాలా పనులు ఉన్నాయి nuv రెడీ అయ్యి కిందకు రా టిఫిన్ పెడతా అని మెట్లు దిగి వెళ్ళి పోయింది. సరే అని నేను డోర్ వెస్కొని బాల్కనీ లో ఉన్న ఉయ్యాల లో కూర్చుని అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ సన్రైజ్ నీ ఎంజాయి చేస్తున్నా. కానీ నా కాలి దగ్గర ఏదో మంట గా ఉండడం తో నా చెయ్యి తో రుద్దాను చూస్తే కొంచెం పెద్ద గాయం లానే ఉంది. నాకు ఒక నిమిషం పాటు ఏమి అర్ధం కాలేదు కత్తి కత్తి… రక్తం రక్తం… అడవి చీకటి… అని తలపట్టుకుని ఆలోచిస్తూ ఒక్క సారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయా.

 

ఇక కాసేపటికి స్పృహ లోకి వచ్చిన తరువాత నా చుట్టూ అమ్మ నాన్న అన్నయ్య నా వైపు చాలా కంగారు గా చూస్తున్నారు. 

నేను మా అమ్మ వైపు చూసి, “ఏమైంది అమ్మ ఎందుకు అందరూ నన్ను చుట్టూ మోటారు అని అడిగాను”. అప్పుడు నా ప్రశ్నకు సమాధానం మా అమ్మ నుండే కాకుండా నా పక్కన వైట్ షర్ట్ వేసుకున్న డా||సంతోష్ అల్సొ మై బెస్ట్స్ట్రె ఫ్రెండ్ ఏమి లేదు స్వప్న స్ట్రెస్ ఎక్కువ కావడం తో కళ్ళు తిరిగి కింద పడిపోయావు ఎంత సేపు అయినా నువ్వు కిందకు రాక పోవడం తో డోర్ ఓపెన్ చేసుకునే నీ కోసం వెతికితే బాల్కనీ లో కాఫీ కప్ పడేసి కింద పడిపోయి ఉన్నావు ఇంకా నాకు కాల్ చేసే చాలా కంగారు పెట్టేశారు అంత,సరే హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ?”అని అడిగాడు. “బానే ఉన్నా లేరా ముందు వాళ్లని టెన్షన్ పడదు అని చెప్పు”అని సమాధానం ఇచ్చా.

“ఆంటీ అంకుల్ అండ్ నికిల్ షి ఇస్ ఫైన్ నౌ మీరు భయపడకండి”అని వాళ్లని కొంచెం రిలాక్స్ చేశాడు. తరువాత మా అన్నయ్య ఈరోజు లీవ్ తీసుకో చిన్ను చాలా నీరసం గా ఉన్నావు అని నా తల ఎగురుతూ నన్ను చూసే కళ్ళలో కొంచెం నీళ్లు పెట్టుకుని కిందకు వెళ్లిపోయాడు.

 

“స్వప్న ఇంతకు కాలికి ఆ దెబ్బ ఎలా తగిలింది?” అని అడిగింది అమ్మ. ఇక ఏం చెప్పాలో తెలియక బైక్ మీద నుండే పడిపోయా అమ్మ అని చెప్పా. ఇక అదే వినగానే నన్ను క్లాస్ పీకుదాం అని ఎలా నోటి నుండి అలా మాట రాకముందే మా నాన్న, రాజేశ్వరి పాపా కాసేపు రెస్ట్ తీసుకొని మనం కిందకు వెళ్ళిపోదాం పద, నికిల్ నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుందే తనకి కొన్ని మెడిసిన్స్ ఇవ్వు “అని నా నుదుటిపై ముద్దు పెట్ట అమ్మని తీసుకెళ్ళి పోయారు.ఇక నేను నికిల్ తో ఈరోజు వచ్చిన కల గురించి స్పష్టంగా వివరించ…