గర్ల్ ఫ్రెండ్ – 1
వాన మెల్లగా పడుతోంది… ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయి…సాయంత్రం సమయం అయినా కూడా వాతావరణం చీకటి పడ్డట్టే అనిపిస్తుంది….
విండో గాజు మీద జారిపడుతున్న చినుకులని కుర్చీలో కాళ్లు మడుచుకుని చూస్తూ కూర్చుంది వీక్షిత …
తన చేతిలో ఫోన్ ఉంది…కానీ… ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు…ఎందుకంటే…మాట్లాడటానికి చాలా మంది ఉన్నా…అర్థం చేసుకునే వాళ్లు ఒక్కరు కూడా లేరు…
అలానే ఆలోచిస్తుంటే మైండ్ హీటేక్కి పిచ్చి లేస్తుంది అనుకోని టైమ్ పాస్ కోసం…ఒక ర్యాండమ్ చాట్ యాప్ ఓపెన్ చేసింది…
ఎవరో కొత్తగా మెసేజ్ చేశారు…
Hey… bored aa?అని ఉంది ఇన్బాక్స్ చాట్ లో..
వీక్షిత ఆ మెసేజ్ ని కాసేపు చూసింది…ఇగ్నోర్ చేయాలనుకుంది…కానీ…ఎందుకో రిప్లై ఇచ్చింది…
Yeah… a little…అని రిప్లై సెండ్ చేసింది…
Same here… btw నేను సాహితి…అన్నది తనని తాను పరిచయం చేసుకోవడానికి తొలి మెట్టు ఎక్కుతూ…
ఆ పేరు చూసిన వెంటనే…వీక్షిత కళ్ళలో చిన్న ఆశ్చర్యం
గర్ల్ ఆ …? అని అడిగింది…
ఎస్ ప్రాబ్లెమ్ ఆ ?అన్న రిప్లై వచ్చింది..
వీక్షిత చిన్నగా నవ్వుకుంది…
నో … actually better…I’m వీక్షిత అని రిప్లై ఇచ్చింది…
ఆ చిన్న చాట్…అలా మొదలైంది…
అప్పుడే పవర్ పోయింది..
ఓహ్ పవర్ కట్ అయింది అంటూ నిరాశ గా మళ్ళీ రిప్లై ఇచ్చింది వీక్షిత…
కొన్ని సెకన్లకు…
ఓహ్ … డార్క్ లో భయం వేస్తుందా ? అని సాహితి మెసేజ్ చేసింది…
వీక్షిత విండో బయట చీకటి వైపు చూసింది…మెరుపు ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చింది…
ఆ వెలుతురులో కాసేపు గది మొత్తం ప్రకాశించింది…
తర్వాత మళ్లీ చీకటి అలుముకుంది…
భయం కాదు … అలవాటు అయిపొయింది …అని రిప్లై ఇచ్చింది…
సాహితి వెంటనే టైప్ చేసింది…
అలవాటు అయిపోయిన … ఒంటరిగా ఫీల్ అవ్వడం అంత ఈజీ కాదు …అని మెసేజ్ సెండ్ చేసింది…
ఆ లైన్ చదివిన వెంటనే…వీక్షిత కాసేపు ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ ఉండిపోయింది…
ఎందుకంటే…ఆ మాట…ఆమె మనసులోని నిజం…
గదిలో చిమ్మ చీకటి…బయట వాన శబ్దం…చేతిలో ఫోన్ వెలుతురు…ఇవి మూడూ కలిసి…ఆ క్షణాన్ని ఇంకాస్త లోతుగా మార్చేశాయి…
టైమ్ చూసింది…. అప్పటికే 8 గంటలు అవుతుంది….
వీక్షిత మెల్లగా టైప్ చేసింది…
నువ్వు ఇలా మాట్లాడుతుంటే … నాకు కొంచం బెటర్ అనిపిస్తుంది …అని..
కొన్ని సెకన్లు…టైపింగ్ … అని కనిపించింది…మళ్లీ ఆగిపోయింది…మళ్లీ… టైపింగ్…అని పడింది…
ఇంత గా ఏం టైప్ చేస్తుంది అని అనుకుంది వీక్షిత మనసులో…
మే బి … మన ఇద్దరం సేమ్ గా ఫీల్ అవుతున్నాం అనుకుంట అని రిప్లై ఇచ్చింది సాహితి…
ఆ ఒక్క లైన్…వీక్షిత గుండెలో ఒక సైలెంట్ కంఫర్ట్ నింపింది…
అప్పటికే ఫోన్ బ్యాటరీ లో…5% మాత్రమే మిగిలింది…
షిట్ … అని మెల్లగా అనుకుంది మనసులో…
ఫోన్ ఛార్జ్ లేదు … ఆఫ్ అయిపోతుంది … అని మెసేజ్ పెట్టింది…
సాహితి వెంటనే…
ఒకే … గుడ్నైట్ వీక్షిత … మార్నింగ్ మెసేజ్ చేస్తాను పవర్ రాగానే మొబైల్ ఛార్జ్ పెట్టు అంది సాహితీ…
ఆ టేక్ కేర్ అన్న మాటలో లో ఏదో ఉంది…అది నార్మల్ వర్డ్ కాదు…ఏదో దగ్గరితనం…అనిపించింది వీక్షిత కి…
వీక్షిత ఫోన్ స్క్రీన్ ని కాసేపు చూస్తూ…చిన్నగా నవ్వుకుంది…
ఓకే…గుడ్ నైట్ …అండ్ థాంక్యూ అని రిప్లై ఇచ్చింది…
కొన్ని సెకన్లలోనే…ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది…
ప్చ్…అని చిన్నగా నిట్టూర్చింది వీక్షిత …
ఫోన్ పక్కన పెట్టేసి…విండో బయటకి చూసింది…వాన ఇంకా అలాగే పడుతూనే ఉంది…గాలి కాస్త బలంగా వీచి… చినుకులు గాజు మీద బలంగా తాకుతున్నాయి…
కిటికీ విండోస్ గట్టిగా క్లోస్ చేసి పక్కన ఉన్న బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకుంది….
నిద్ర రాలేదు కానీ మనసులో మాత్రం…సాహితీ చాట్ లో ఒక్కో లైన్ మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది…
ఇంత దగ్గరగా… ఎవరూ ఇలా మాట్లాడలేదు…అనుకుంది తనలోతానే…
ఆ రాత్రి…ఎప్పటిలాగే ఒంటరిగా కాదు…తనకి ఎవరో తోడుగా ఉన్నట్టు…ఎవరో తన మనసు ని అర్థం చేసుకున్నట్టు…అనిపించింది…ఆ ఫీలింగ్‌తోనే ఏమి తినకుండా ఫోన్ ఛార్జ్ పెట్టి ఎప్పుడు పవర్ వచ్చిన బ్యాటరీ ఫుల్ అవుతుంది అనుకోని నిద్రపోయింది…
నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యరశ్మి కర్టెన్ లోంచి బెడ్ పడుకున్న వీక్షిత మొహం మీద పడింది….
వీక్షిత మెల్లగా కళ్ళు తెరిచింది…వెంటనే నైట్ సాహితీ తో చాట్ చేసిన విషయం గుర్తు వచ్చింది…
తన చేతిని ఫోన్ వైపు చాపింది…ఫోన్ ఆన్ చేసింది…
ఛార్జ్ ఫుల్ లోడింగ్ అయి…ఉంది…
స్క్రీన్ ఆన్ అవ్వగానే తను నైట్ చాట్ చేసిన యాప్ ఓపెన్ చేసింది…
అప్పటికే ఒక కొత్త మెసేజ్…వచ్చింది సాహితీ నుండి…
సాహితి 6:12 కి మార్నింగ్ విష్ చేసింది…
వీక్షిత టైమ్ చూసింది 7:05అవుతుంది..
వీక్షిత గుండె ఒక్కసారిగా స్పీడ్ గా కొట్టుకుంది…
ఎంత తొందరగా నిద్ర లేచిందో అని చిన్నగా నవ్వుకుని
మెసేజ్ ఓపెన్ చేసింది…
Good morning… నువ్వు లేచావా లేదా ఇంకా నిద్రపోతున్నావా అని డౌట్ వొచింది …అని ఉంది…
ఆ ఒక్క మెసేజ్ చూసి…వీక్షిత ముఖంలో తెలియని సంతోషం వచ్చింది…
చిన్నగా టైప్ చేసింది…జస్ట్ లేచాను …అని కొంచెం ఆగి…
గుడ్ మార్నింగ్ …అని రిప్లై ఇచ్చింది..
కొన్ని సెకన్లలోనే…నైస్ … ఫస్ట్ msg నాకే ఇచ్చావ్ అని సాహితీ రిప్లై ఇవ్వగానే వీక్షిత కాసేపు స్క్రీన్ వైపు చూస్తూ…
మళ్లీ నవ్వుకుంది…
అది కోయిన్సిడెన్స్ …అని మళ్ళీ రిప్లై సెండ్ చేసింది…
హ్మ్మ్ … సరే … బట్ నాకు నచ్చింది నువ్వు ఫ్రెష్ ఐయ్యి టిఫిన్ చేయి ఓకే నా అనగానే…
ఓకే… బై మళ్ళీ చేస్తా అని వెంటనే వీక్షిత తన నెంబర్ సెండ్ చేసింది…
దీనికి వాట్సప్ లో హాయ్ పెట్టు ఇక నుండి వాట్సప్ లో చాట్ చేద్దాం అనగానే…
ఓకే డన్ అని రిప్లై ఇచ్చింది సాహితి…
ఆ చిన్న చాట్…ఆ ఉదయాన్ని ఇంకాస్త ప్రత్యేకంగా మార్చేసింది…వీక్షిత కి..
అప్పుడు వీక్షిత కి ఒక్క విషయం క్లియర్ అయ్యింది…
ఇది జస్ట్ టైమ్ పాస్ కాదు ఏదో మొదలవుతోంది… అనిపించింది..
వీక్షిత హ్యాపీగా బెడ్ పై నుండి లేచి…ఫ్రెష్ అయ్యి… కాలేజీకి వెళ్లడానికి రెడీ అయింది…
తన బ్యాగ్ తీసుకుని…బెడ్ రూమ్ బయటకి వచ్చింది…
హాల్‌లోకి అడుగు పెట్టగానే…పక్కనే సోఫాలో కూర్చుని ఉన్న తన తల్లి హేమ ని చూసి…ఒక్కసారిగా వీక్షిత అడుగులు స్లో అయ్యాయి…
ఎందుకో…తల్లిని చూస్తే కాస్త భయం…టెన్షన్… ఏం అడుగుతుందో…ఏం గమనిస్తుందో… అన్న కంగారు పుట్టింది మనసులో … అడుగులో అడుగు వేసుకుంటూ…తల్లి దృష్టిలో పడకుండా వెళ్లిపోవాలని ట్రై చేసింది…
వీక్ష…అని ఒక్కసారిగా పిలిచింది హేమ…
వీక్షిత గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది…మెల్లగా తిరిగి తల్లి మొహం చూసింది…
ఏంమైంది అమ్మ… అని నార్మల్ గా మాట్లాడాలని ట్రై చేసింది కానీ తనకే తెలియకుండా గొంతు కాస్త వణికింది…
ఇంత త్వరగా రెడీ అయిపోయావ్…?ఎక్కడికి వెళ్తున్నావ్…ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా…?అని కాస్త గమనిస్తూ అడిగింది…
వీక్షిత కి ఏం చెప్పాలో అర్థం కాలేదు భయం తో …
అలా ఏమీ లేదు అమ్మ…లేట్ అవుతుందేమో అని తొందరగా లేచి రెడీ ఐపోయాను అని చిన్నగా తడబడుతూ చెప్పింది…
హేమ కళ్లతోనే వీక్షిత ని గమనిస్తోంది…
హ్మ్మ్…ఓకే అని చిన్నగా అనింది…
వీక్షిత కి మాత్రం ఇంకా టెన్షన్ తగ్గలేదు…బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్లు…అని తల్లి మళ్లీ అనగానే…
వీక్షిత ఒక క్షణం ఆగింది…ఇప్పుడే తింటే లేట్ అయిపోతుంది అమ్మ… కాలేజీలో తింటాను…అని తప్పించుకోవాలని చూసింది…
హేమ కోపం గా చూసింది…
వీక్ష… నేను అడిగింది ఇప్పుడు తిను అని… కాలేజీలో తింటావా అని కాదు అని కాస్త గట్టిగా అనడంతో…
వీక్షిత గుండెలో మళ్లీ టెన్షన్ పెరిగింది…సరే అమ్మ…అని నిస్సహాయంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది…
హేమ కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ తీసుకుని వచ్చింది…
ఇడ్లీ పెట్టి ముందుంచింది…చాలా రోజుల నుండి చూస్తున్నా… నువ్వు ఏదో డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అని సడన్‌గా అడిగింది…
ఆ మాట విన్న వెంటనే వీక్షిత చేతిలో ఉన్న స్పూన్ కాస్త ఆగిపోయింది…
ఏమి లేదమ్మ…అని నవ్వుతో కవర్ చేయడానికి ట్రై చేసింది…
హేమ వీక్షిత కళ్లలోకి చూసింది…
రాత్రి లేట్ లేట్ గా పడుకుంటున్నావ్… మొబైల్ ఎక్కువ యూస్ చేస్తున్నావ్ విషయం ఏంటి వీక్ష…?అంది…
వీక్షిత గుండె స్పీడ్ గా కొట్టుకుంది…సాహితి గుర్తొచ్చింది…
కానీ… చెప్పాలా…? చెప్పకూడదా…? అన్న కన్‌ఫ్యూజన్…
కొన్ని రోజుల నుండి రాండమ్ యాప్ లో ఎవరైనా మంచి గర్ల్ ఫ్రెండ్ తన తో ఫ్రెండ్ షిప్ చేయడానికి దొరుకుతుందేమో అని చూస్తుంది కానీ ఒక్కరు కూడా తన మనసు కి దగ్గర గా అనిపించలేదు…
కానీ నైట్ సాహితీ తో చాట్ చేసాక మనసు ప్రశాంతంగా మారింది…తానే తనకి మంచి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది అని అనిపించింది..
ఎటో చూస్తూ ఆలోచిస్తున్న వీక్షిత ని చూస్తూ…
వీక్ష ఏం ఆలోచిస్తున్నావు…. చెప్పు అన్నది హేమ…
వీక్ష ఉలిక్కి పడి ఫ్రెండ్స్ అమ్మ… జస్ట్ ఫ్రెండ్స్… అని చిన్నగా చెప్పింది…
హేమ ముఖం మీద అనుమానం ఇంకా తగ్గలేదు…
ఫ్రెండ్స్ అంటే… అమ్మాయిలా…? లేక అబ్బాయిలా…?అని అడిగింది…
ఆ ప్రశ్నకి వీక్షిత ఒక్కసారిగా షాక్ అయింది…చేతులు చెమట పట్టాయి…గొంతు ఎండిపోయింది…
అమ్మాయే…అని చాలా కష్టంగా చెప్పింది…హేమ కాసేపు సైలెంట్‌గా చూసింది…
పేరు…? అని మళ్లీ అడిగింది…వీక్షిత మనసులో మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది…
సాహితి పేరు చెప్పగానే ఇంకేమైనా అడిగితే…?ఎలా హ్యాండిల్ చేయాలి…?నిన్న నే పరిచయం అయింది తన గురించి ఇంకా డీటెయిల్స్ అడుగుదాం అనుకుంటే నైట్ ఫోన్ ఆఫ్ అయింది అనుకోని….
సాహితి…అని మెల్లగా చెప్పింది…హేమ కాస్త రిలాక్స్ అయింది…
ఓహ్… గర్ల్ ఫ్రెండ్ అయితే పర్లేదు… కానీ ఒక విషయం గుర్తుంచుకో… ఎవరైనా కొత్తగా లైఫ్‌లోకి వస్తే… వాళ్లతో ఎక్కువగా ఇమోషనల్‌గా కనెక్ట్ అవ్వకూడదు…అని చెప్పగానే…
ఆ మాట వీక్షిత హార్ట్‌ని తాకింది…ఎందుకంటే…తను ఇప్పటికే ఆ కనెక్షన్ ఫీల్ అవుతోంది…
ఇంకా ఉంది…
Swipe left/right or tap the sides to turn pages