అది ఒక ఆదివారం ఉదయం. జ్వాల గదిలో మంచంపై నీరసంగా కూర్చుని ఉంది. గత కొన్ని నెలలుగా ఆమె శరీరంలోకి వెళ్లిన కెమికల్స్ వల్ల ఆమె మరింత బలహీనపడింది. శక్తి ఎంతో నిశ్చయంతో జ్వాల బట్టలు, పాస్‌పోర్టులు, మరియు కీలకమైన డాక్యుమెంట్లను సూట్‌కేస్‌లో సర్దుతున్నాడు.
జ్వాల కళ్లల్లో నీళ్లతో, “శక్తి.. నిజంగానే మనం ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతున్నామా? అత్తయ్య వాళ్లు తప్పు చేశారేమో, కానీ వాళ్ళు మనల్ని క్షమించమని అడిగితే ఒక అవకాశం ఇవ్వలేమా?” అని అడిగింది. జ్వాల అమాయకత్వాన్ని చూసి శక్తి మనసు ద్రవించింది. కానీ, ఆమె రిపోర్టులు గుర్తొచ్చి అతని ముఖం కఠినంగా మారింది.