New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరి చేరవా ప్రేమ – 1

దరి చేరవా ప్రేమ – 1

 

          దరి చేరవా  ప్రేమ 1

అర్థ రాత్రి 1:am సుమారుగా

ఇంద్ర భవనం లాంటి ఇల్లు అంత రాత్రి వేళలో కూడా చుట్టూ లైట్స్ వెలుగుతో మిరుమిట్లు గొలుపుతూ ఉంది

ఆ ఇంటి కాంపౌండ్ లోకి రయ్ … రయ్ మంటూ దూసుకు వచ్చింది ఓ కార్ ..

కార్ లో నుండి  ఉన్న వ్యక్తి దిగి తులూతూ ఒక
చేతిలో వైన్ బాటిల్ మరో చేతితో సిగార్ కాలుస్తూ , అంతా మత్తులో కూడా అతన్ని కళ్ళలో ఏదో బాధ , కోపం కలగలిపి చింత నిప్పులా మండుతూ ఉన్నాయి అతన్ని ఆ పరి
స్థితి లో చూసిన ఎవరైనా సరే అతన్ని కళ్ళల్లో
కనిపిస్తున్న కోపాన్ని చూసి గుండె ఆగిపోతుంది
అనేలా  ఉన్నాయి  అతన్ని  కళ్ళు..

అలా తూలుతూ మత్తు మైకంలో తేలుతూ డోర్ నాక్ చేస్తాడు … అయిన కానీ ఎవరు ఓపెన్ చేయకపోవడంతో కోపంతో  అతి కష్టం మీద తన షర్ట్ లో నుండి వేరే కీ తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళుతూనే కోపం చల్లారక ఎవరి మీద చూపించాలో తెలియని ఫ్రస్టేషన్ లో హాల్లో ఉన్న వస్తువులన్నీ బలి అయ్యాయి ..

ఆ సౌండ్ కి పడుకున్నవారు కాస్త హాల్లో అటెండ్ అయ్యారు ..

ఇంట్లో ఇంత మంది ఉన్నారు ఎక్కడ చచ్చారు అందరూ ఒకరు కూడా డోర్ ఓపెన్ చేయనంత స్లీప్ లో ఉన్నారా ..? అసలు ఏంటి ఇది అంతా ..? బెగ్గర్ లాగ నన్నే వెయిట్ చేయిస్తారా ..? హౌ డేర్ అంటూ ఒక సర్వెంట్ వంక కోపంగా చూస్తూ ఏయ్..? నీకు తెలుసు కదా నేను రోజు ఈ టైమ్ కే వస్తాను అని తెలిసి కూడా డోర్ దగ్గర కాపలా ఉండకుండా గుర్రు పెట్టీ పడుకున్నావా ..?

కోపంతో తూలుతునే …

అతను కొట్టిన ఫోర్స్ కి పెదవి చిట్లి రక్తం కారుతుంటే భయం భయంగా బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు  ఆ సర్వెంట్ ఆ వ్యక్తిని …

అతన్ని మళ్ళీ కొట్టబోతే

” చిన్న ” అనే గంభీరమైన గొంతు విని  చెయ్యిని గాలిలోనే అపేసి కోపంగా అతన్ని వంక చూస్తాడు ..

ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం ..? నీ దగ్గర పనిచేసే వారు అని నువ్వు ఏమి చేసిన అడ్డు అదుపు ఉండదు అనుకున్నావా ..? లేదా మేము చచ్చాం అనుకుని అంతా నీ ఇష్ట రాజ్యం అనుకుంటున్నావా ..? నువ్వు మూర్ఖుడి వి అనుకున్నా కానీ నీకు ప్రేమ , జాలి కూడా లేవ్వని మరోసారి రుజువు చేసుకున్నావు అంటూ తాండవం చేసే రుద్రుడి లా ఉన్న  భస్మం చేసేలా ఉన్న అతన్ని చూపుల తీక్షణతకి అతని అడుగు వెన్నక్కి పడింది ..

అతను నన్ను మీరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నరా ..? నన్ను అర్థం చేసుకుంది మీరు ఇంతేనా ..?అని తడి చేరిన అతన్ని కళ్ళు తనని ప్రశ్నించున్నట్టు ఉన్న ఆ భావం అర్థం అయిన కాన్నట్టు ..

చిన్న ఇంకా గొడవ ఏమి చెయ్యకుండా నీ రూమ్ కి వేళ్ళూ … కోపంగా పలికింది అతన్ని స్వరం ..

శారద చిన్నాని జాగర్తగా పైకి తీసుకుని వేళ్ళు అని ఆయన భార్య శారద కి చెప్పి ఆయన రూంలోకి వెళ్ళి ఎదురుగా గోడకు వేళ్ళాడుతున్న కొడుకు ,కోడలి ఫొటోస్ చూస్తూ ..

మీతో పాటే వాడి సంతోషాన్ని , అనందలన్ని తీసుకు పోయారు కదా రా ..! అని బాధపడుతూ ఉంటే ..

అప్పుడే చిన్నాని పడుకోబెట్టదానికి వెళ్ళిన శారద గారు  మనవడి భోజనం  కోసమని వచ్చి భర్త మనఃస్తితి అర్థం అయి ఆయన్ని ఒదారుస్తూ …

బాధ పడకండి ..!

బాధ పడకుండా ఎలా ఉండగలను శారద ..! కళ్ళ ముందే కొడుకు కోడలు శవాలుగా మారిన
తట్టుకున్న ఈ గుండె ఇప్పుడు వాడిని ఆ పరిస్తితిలో చూడలేక ఎక్కడ ఆగిపోతుంది అనే భయంగా ఉంది … నేను ఉండను అనే భయం కాదు  నా తర్వాత వాడిని చూసుకునేది ఎవరు అని ..? వాడు ఈ రోజున
ఇలా అన్న ఆగాడు అంటే వాడికి నా మిద ఉన్న మాత్రమే .. కానీ నేను నా చిన్ననీ నా బంగారాన్ని నీకు ప్రేమ లేదు అన్నాను .. ఒకప్పడు  ప్రేమ ,ఆనందం తప్ప వాడి కళ్ళల్లో కోపం ఉండేది కాదు కానీ కోపం ,బాధ  తప్ప ఆ కళ్ళలో  ఇప్పుడు … ఆ ప్రేమ వల్లే వాడు ఇలా అయ్యాడు అని తెలిసి కూడా … వాడిని నా మాటలతో మరింత బాధ పెడుతున్న నాకు వాడిని అలా చూస్తుంటే ఇంకా ఎందుకు నా యి బ్రతుకు అనిపిస్తుంది శారద ..!  అని సింహంలా గంభీరంగా అందరినీ చూపులతోనే శాసించే భర్త అలా బాధ పడుతుంటే ..

శారద గారి గుండె బాధతో మరింత కృంగిపోయింది ..

లేని వారి కోసం మీరు వేదన పడి చిన్నాని నన్ను మళ్ళీ మీరు అనాధలను చెయ్యకండి ..
మిమ్మలిని కూడా దూరం చేసుకుని బ్రతికలను అను ఎలా అనుకుంటున్నారు అండి ..! ఇంకెప్పుడు అలాంటి మాటలు పొరపాటున కూడా అనకండి చీర కొంగుతో కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ అంటారు ..

సరే ..! వెళ్ళి చిన్నాకి ఏమైనా పెట్టు అని భార్యను పంపి … మళ్ళీ కొడుకు , కోడలు మరణాన్ని తలుచుకుని బాధ పడుతూ ఉంటారు ..

శారద గారు మనవడికి చిన్నపిల్లాడిలా మారం చేస్తుంటే తినడానికి భోజనం తినిపించి తన ఒడిలో పడుకోబెట్టుకుంటారు  ..

కానీ చిన్న మాత్రం నాన్నమ్మ జో కొడుతూ ఉంటే మెల్లిగా నిద్రలో కి జారుకున్నాడు ..

శారద గారు మనవడు నిద్ర పోయాడు అని రూడీ చేసుకుని మెల్లిగా తనని పడుకోబెట్టి రూంకి వెళ్తారు ..

శబ్దాలకు చిన్నా మత్తుగా నిద్ర లేస్తూనే ఇంట్లో ఏదో హడావిడిగా ఉందని అనుకుంటూ కిందకి వచ్చి అక్కడ జరుగుతున్న తతంగం అంతా చూస్తూ కోపంగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా చేస్తూ పిచ్చిపట్టిన వాడిలా బిహేవ్ చేస్తూ .. తాతు మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఈ మోసగత్తే
ఫోటో మన ఇంట్లోనే ఉండకూడదు అని చెప్పిన ఏకంగా దానికి నా తల్లితండ్రులతో కలిపి పిండం పెడతరా ..? అని కోపంగా నవ్వుతూ ఉన్న ఆ అమ్మాయి ఫోటో చూస్తే ఇంకా కోపం ఎక్కువై … నవ్వవే ..! ఆ నవ్వుతోనే నన్ను నీ చుట్టూ తిప్పుకున్నవూ చచ్చి కూడా నన్ను సాధించాలనే నీ ఆశ నెరవేరింది కదే ..? నీ కళ్ళు చూస్తుంటే నాకు నువ్వు బ్రతికి ఉండి ఉంటే నేనే చంపేసే వాడిని
అంటూ ఫోటోని నేలకేసి కొట్టినా కోపం చల్లారక గట్టిగా అరుస్తూ ఉండడంతో కోపంగా వీరభద్రుడి లా ఊగిపోతున్న అతన్ని  అక్కడ ఉన్న వారు భయంతో వెన్నక్కి అడుగులు వేస్తున్నారు ..

చిన్న తాత గారు చిన్నాని ఆపిన ఆగే స్థితిలో లేడు ఇంకా అని అర్థం అయి ..
తప్పక చిన్నాని లాగి కొట్టడంతో అప్పటికి కానీ శాంతించని చిన్న బాధగా ఆయన హగ్ చేసుకుని తాతు దాని ఫోటో చూస్తుంటే నాకు ప్రేమలో ఓడిపోయాను అనే బాధ కన్నా ఒకరి చేతిలో మోసపోయి ప్రేమ మైకంలో పడి కన్న తల్లితండ్రులను పోగుట్ట్టుకున్న అనే బాధ నన్ను పిచ్చివాడిని చేస్తుంది అని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న తనని చూస్తుంటే అప్పటికి వరుకు ఉగ్ర నరసింహ ముడిలా ఉన్న
ఇతనేనా అనిపించేలా ఉండి అందరి కళ్ళలో తడి చేరింది ….

అలా బాధ పడుతూనే స్ట్రెస్ కి సృహ తప్పి తాతూ భుజంపై వాలి పోయాడు అతను ..

 
    ❤️   ❤️   ❤️   ❤️  ❤️   ❤️   ❤️   ❤️

ఒసేయ్ .. బుజ్జి లేగవే … ఇవ్వాళ నీ పెళ్ళిచూపులు అయిన కానీ ఇంకా ఆ కుంభకర్ణుడి చెల్లి సుర్ఫణఖలా ఆ మొద్దు నిద్ర ఏంటే .. లే త్వరగా లేచి రెడీ అవ్వు అని నిద్ర పోతున్న కూతురి నెత్తి మీద అక్షింతలు వేస్తూ ఉన్నారు బుజ్జి తల్లి అలియాస్ అలివేణి మంగ తాయారు గారు …

ప్రకాష్ గారు వస్తున్నే  ఏంటి .. వేణి పొద్దు పొద్దున్నే నా బంగారు తల్లి మీద పడ్డావు .. అని కూతురి నుదిటి మీద ముద్దు పెట్టుకుంటే ..

చాల్లే సంభడం .. ఇంకొన్ని గంటల్లో పెళ్ళిచూపులు పెట్టుకుని అది గాడిదల నిద్ర పోవడం మీరేమో దానికి వత్తాసు పలకడం బాగుంది తండ్రి కుతుర్ల వ్యవారం ..

వేణి ఆపు ఇంకా నీ నస .. పెళ్లి వాళ్ళు ఏమైనా పరాయి వాళ్ల నా సొంత చెల్లి కుటుంబమే కదా ..! వేరే వాళ్ళ ఎవరి దగ్గరో అయితే నా బంగారు తల్లి ఎలా ఉంటుంది అనే భయంతోనే కదా ఎప్పుడో విడిపోయిన నా చెల్లి కుటుంభం మన బుజ్జి నీ నా మేనల్లుడికి అడగడినికి  వస్తే ఒప్పుకుంది ఎందుకు నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది అనే స్వార్థం …

ఎంత మీ చెల్లి కుటుంబమే అయితే మాత్రం మళ్ళీ ఇలా ఉంటే దీన్ని అన్నరు మనల్ని అంటారు ఇలా పెంచినందుకు ..

ప్రకాష్ గారు కూతురి చేతి మీద చిన్నగా తట్టిన లేగకపోయేసరికి.. అయ్యో..? బుజ్జి తల్లి పడుకున్నట్టు ఉంది తన కోసం నైట్ చాక్లెట్స్ తెచ్చినవి ఆ పింకికి ఇచ్చేస్తాను లే అంటే ..

అప్పటివరకు నిద్ర నటించిన బుజ్జి ప్రకాష్ ..ఇది టూ మచ్ నా కోసం అని తెచ్చిన చాక్లెట్స్ ఆ చీపాంజి మొహాన్ని కి ఇస్తావా ..?
పో నేను హర్టు అలిగ్నై బుంగా మూతి పెట్టుకున్న అని క్యూట్ ఎక్స్ప్రెసన్ ఇస్తే ..

వేణి గారు గట్టిగా నవ్వుతూ ..

అది బుంగ మూతి లా లేదే చిన్న సైజ్ పంది పిల్ల మూతి ముడిచిన్నట్టు ఉంది అని వెక్కిరిస్తూ అంటారు ..

బుజ్జి గట్టిగా రాగం అందుకుంటే ..

ఆ రాగానికి చెవులు చిల్లులు పడేలా ఉన్నాయని భయం వేసి వేణి దండం పెడుతూ
అపవే తల్లి .. నీకు నీ రాగానికి ఓ నమస్కారం అని ..ఇంకా తండ్రి కూతుర్లు ఆటలు కట్టిబెట్టి ..
నువ్వు ఒక హాఫ్ అవెర్లో రెడీ అవ్వి రాకపోయావో మీ గ్రానీని పంపిస్తాను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి చక్కా వెళ్ళి పోయారు ..

బుజ్జి ఏడ్పు మొహంతో తండ్రి వంకే చూస్తే ..

ఇంకా తప్పదు అన్నట్టు చేతులు ఊప్పడంతో తండ్రి కూడా చేతులు ఎత్తేశారు అని అర్థం అయి తప్పక  రెడీ అవుతుంది ..

 

   ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️

 

ముగ్గురు జీవితాలతో విధి ఆడే వింత నాటకం..?

ఎవరు ఎవరికి దరి చేరుతారు ..?

నిజమైన ప్రేమని దరి చేరే ప్రయాణం …

ఇది కథ వర్ణిక లో నా మొదటి స్టోరీ…