ప్రేమలో పడితే – 1
ప్రేమలో పడితే
“ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావ్. అసలు నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి,
వద్దు వద్దు అంటుంటే నువ్వు చదువుకోవాలి అని ముంబాయి వెళ్లి నువ్వు చేసిన ఘనకార్యం చాలమ్మా చాలు… ఇంతకు మించి తట్టుకునే శక్తి మాకు లేదు. ఇంకొక్కసారి నీ మొఖం కూడా నాకు చూపించదు. నువ్వు చచ్చిపోయావు అనుకుని మేము నీళ్లు వదిలేస్తాం” అని చాలా గంభీరంగా అన్నారు ఇంటి పెద్ద అయినా విశ్వనాధ్ గారు..
“నాన్న” అని అప్పటికే తనకు జరిగిన దానికి తట్టుకోలేని అమ్మాయి, ఇంకా తన తండ్రి తనని నమ్మకుండా అతనికి సపోర్ట్ గా నిలవకుండా, వద్దు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనటం, నువ్వు చనిపోయాను అని మాట్లాడటంతో తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ పిలిచింది శ్రీ మహాలక్ష్మి..
“నీ నోటి నుంచి నాన్న అనే పిలుపు నేను వినాలి అనుకోవడం లేదు. మన ఊరిలో స్కూల్లో నువ్వు చదువుకుంటుంటే నేను అబ్జక్షన్ చెప్పలేదు. కానీ అలా అంత దూరం వెళ్లి చదువుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా మీ మామయ్య నీకు సపోర్ట్ చేస్తున్నాడు అని వెళ్లి చదువుకొని మా నెత్తి మీద పెద్ద గుదిబండ పెట్టావు కదా, చాలు ఇంతకు మించి ఆ భారాన్ని మూసే శక్తి నాకు లేదు నేను చనిపోక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో” అని అరిచారు విశ్వనాధ్.
“నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న నన్ను నమ్మండి” అని మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్ళతో వేడుకుంది శ్రీమహాలక్ష్మి.
మరోవైపు తన భర్తకి సపోర్ట్ చేయలేక కూతుర్ని దూరం చేసుకోలేక మధ్యలో నలిగిపోతున్న సగటు ఇల్లాలు అయినా మాధవి డ్యూటీకి చీర కొంగు అడ్డం పెట్టుకొని ఏడుస్తూ తన కూతురు వైపు చూస్తూ ఉంది.
“బావ ఒకసారి తను చెప్పేది విను” అని శ్రీ మహాలక్ష్మి మామయ్య అయినా శ్రీహరి రిక్వెస్ట్ చేశారు.
“చాలు బాబు చాలు ఇప్పటివరకు నీ మాట విని నేను చేసింది చాలు. ఇంతకుముందు నువ్వు ప్రేమించాను అంటూ నా గడప తొక్కితే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసి నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నీ మాట విని నా కూతుర్ని కూడా నేను దూరం చేసుకున్నాను. ఇక చాలు నువ్వు నా కుటుంబానికి చేసింది చాలు” అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మరీ కోపంగా అన్నారు విశ్వనాధ్.
“అది కాదు బావ” అని శ్రీహరి అంటున్నా కూడా,
“చాలు ఇక మీ మాట కూడా నేను వినాలి అనుకోవడం లేదు, ఎంతో పరువుగా బ్రతుకుతున్న ఈ ఊరిలో నేను తల ఎత్తుకో లేకుండా చేశారు. ఇంకా మీరు ఇక్కడే ఉంటే నా శవాన్ని కళ్ళ చూస్తారు” అని సీరియస్‌గా అరిచారు విశ్వనాధ్.
అప్పటికే శ్రీ మహాలక్ష్మికి జరిగినది అంతా ఊర్లో అందరికీ తెలిసి అందరూ కూడా ఆ ఇంటి ముందే నిలబడి ఉన్నారు.
కరెక్ట్ గా అప్పుడే వర్షం పడింది. ఊర్లో ఉన్న జనం ఆ ఇంటి ముందు నిలబడి వేడుకలు చూస్తున్న వాళ్ళందరూ కూడా వర్షం పడటంతో పరుగున ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
“నేను ఏ తప్పు చేయలేదు నాన్న, నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు” అని గుండెలు బాధంటూ కన్నీళ్ళతో గట్టిగ అరుస్తూ ఉంది మహాలక్ష్మి.
కానీ అప్పటికే విశ్వనాధ్ గారు ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఇంకా బయటే నిలబడి ఉన్న తన భార్య, తమ్ముడు, తమ్ముడి భార్య అందరిని కూడా లోపలికి రమ్మని పిలిచాడు.
చేసేది ఏమీ లేక మాధవి, విశ్వనాథ్ గారి తమ్ముడు మరదలు పిల్లలు అందరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోయారు.
“అన్నయ్య ఒకసారి మహాలక్ష్మి చెప్పేది కూడా వింటే బాగుండేదేమో, తను ఏ తప్పు చేయలేదు అంటుంది కదా’ అని విశ్వనాథ్ తమ్ముడు అయినా మహీధర్ అన్నారు.
“ఎవరు చెప్పింది వినాల్సిన అవసరం లేదు, నేను కాదు బయట ఉన్నా తనే కావాలి అనుకుంటే మీరు కూడా నన్ను వదిలిపెట్టి తన దగ్గరికే వెళ్లిపోవచ్చు” అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు విశ్వనాధ్.
తన తండ్రి కోపం ఎప్పుడూ చూడని నైన్త్ క్లాస్ చదువుకునే అభినవ్ తన తల్లిని గట్టిగా పట్టుకున్నాడు.
ఇక మహిధర్ మమత వాళ్ళ పిల్లలు అందరూ కూడా మౌనంగా తల దించుకున్నారు, విశ్వనాథ్ గారికి ఎదురు చెప్పలేక అలాగా అని మహాలక్ష్మిని అలా వదిలిపెట్టలేక, మనసులోనే మనోవేదన అనుభవిస్తూ
తన తండ్రి తనని నమ్మి డోర్ ఓపెన్ చేస్తాడు ఏమో అని ఆశగా డోర్ వైపు చూస్తూ మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న మహాలక్ష్మి భుజం మీద చేతిని వేసి శ్రీ అని పిలిచారు శ్రీహరి.
“మావయ్య నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మమని నాన్నకు చెప్పు మామయ్య. నిజంగా అసలు అలా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు మామయ్య” అని కన్నీరు మున్నీరవుతూ చెప్పింది మహాలక్ష్మి.
అలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అక్కడే పడిపోయింది అప్పుడు శ్రీహరి ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని పక్క లైన్ లో ఉన్న తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
వర్షంలో బాగా తడవడం వల్ల మహాలక్ష్మి పొడవైన జడ పూర్తిగా తడిచిపోవడంతో ఆమె పడుకున్న కూడా శ్రీహరి ఆమె జడ అంత విప్పి టవల్‌తో తుడిచాడు, తడిచిన బట్టలు తను తీయలేక ఫుల్లుగా దుప్పటి కప్పి మరో రూంలోనికి వెళ్లి కూర్చున్నారు.
అక్కడ టేబుల్ మీద తన భార్య అయినా శ్రీలక్ష్మి ఫోటోని చేతుల్లోనికి తీసుకొని అలా చూస్తూ ఉండిపోయారు.
రెండు గంటల తర్వాత మహాలక్ష్మి కోసం భోజనం తీసుకుని వెళ్లి రూమ్ లో చూస్తే అక్కడ మహాలక్ష్మి కనిపించడం లేదు. వాష్ రూమ్ కి వెళ్ళింది ఏమో అని ఐదు నిమిషాలు వెయిట్ చేశారు. కానీ అప్పటికి కూడా మహాలక్ష్మి జాడ తెలియక పోవడంతో వాష్ రూమ్ లోనికి వెళ్లి చూశారు. డోర్ ఓపెన్ లోనే ఉంది. ఇల్లంతా చూశారు ఎక్కడ కనిపించలేదు మహాలక్ష్మి మహాలక్ష్మి అంటూ అరుస్తూ మొత్తం తిరిగారు కానీ ఎక్కడ కనిపించలేదు..
ఒకవేళ వాళ్ల ఇంటికి వెళ్ళింది ఏమో అని విశ్వనాథ్ గారి ఇంటికి వచ్చి” బావ మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిందా..?” అని అడిగాడు.
“అది ఎప్పుడో చచ్చిపోయింది, ఇంకొకసారి తన కోసం నువ్వు ఈ ఇంటి గడప తొక్కటానికి వీల్లేదు, ఒక్కసారి చెప్తే అర్థం కాదు సిగ్గులేని జన్మలు” అని తిడుతూ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ముఖం మీద డోర్ క్లోజ్ చేశారు విశ్వనాధ్..
“మహాలక్ష్మి కనిపించడం లేదు బావ ఎక్కడికి వెళ్లిందో ఏంటో తెలియడం లేదు నాకెందుకు భయంగా ఉంది. తనని వెతుకుదాం రా బావ” అని శ్రీహరి డోర్ కొడుతున్న కూడా ఎవరు డోర్ ఓపెన్ చేయలేదు.
ఆ ఇంటిలో ఉన్న వాళ్లు మహాలక్ష్మి ని తలచుకుని కన్నీళ్లు వస్తున్నా విశ్వనాధ్ గారిని దాటుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసే శక్తి ధైర్యం లేక అలానే డోర్ వైపు చూస్తూ ఉన్నారు.
అలా పది నిమిషాలకు పైన డోర్ కొట్టిన కూడా ఎవరూ ఓపెన్ చెయ్యకపోవటంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ఊరంతా మహాలక్ష్మి కోసం వెతుకుతూ ఉన్నాడు శ్రీహరి.
అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మహాలక్ష్మి రైల్వే స్టేషన్ వైపు వెళుతుంటే చూసాము అని చెప్పటంతో ఎక్కడ ప్రాణాలు తీసుకుంటుందో అనే భయంతో తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రైల్వే స్టేషన్ కి పరిగెత్తాడు శ్రీహరి..
తను వెళ్లేసరికి కరెక్టుగా అదే టైంలో ఒక ట్రైన్ స్పీడుగా వెళ్తూ ఉండటం చూసి తన గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లుగా అనిపించింది. తను వల్ల తన మేనకోడలు చనిపోయింది ఏమో అని భయంతో కళ్ళ వెంట కన్నీరు కారుతున్నాయి. ఆ కన్నీరు వర్షంలో కలిసిపోతున్నాయి అడుగులు తడబడుతుంటే స్టేషన్లోకి వచ్చి చూశాడు.
కొనసాగుతుంది.
నా నుంచి వస్తున్న మరో కొత్త స్టోరీ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలానే ఇందులో కామెడీ ఎలిమెంట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి సస్పెన్స్ అలానే అమ్మాయి బాధ అబ్బాయి ప్రేమ అన్నీ కూడా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
వెరైటీగా ఉంటుంది అని చెప్పను కానీ బాగుంటుంది అని చెప్తాను.
చూద్దాం ఈ స్టోరీ కైనా నేను అనుకున్నంత రీచ్ వస్తుందో లేదో
కొత్త స్టోరీ స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ స్టార్ట్ చేస్తున్నాను చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుందో..
Swipe left/right or tap the sides to turn pages