నా ఇంటి కథ – 1
నేను సాధారణ 19 ఏళ్ల యువకుడిని కానీ నా ఈ చిన్న జీవితంలో ఎన్నో అనుభూతులు, ఎన్నో సంఘటనలు నన్ను ఇలా మార్చాయి…..
అందరిలా నాకు ఓ ఫోన్ లేదు, అందరిలా ప్రైవేట్ కాలేజిలో చదువుకునే స్తోమత లేదు, అలా అని నేను అనాథాన్ని కాదు.. ఒక్క బాధ్యత గల ఒక్క ఇంటి పెద్ద కొడుకుని.. నా కథ వింటారా..
ఇది కేవలం ప్రేరణ కోసం కాదు… నా జీవితంలో కష్టాలని చూసి మీ జీవితం ఎంత అందంగా ఉందో మీకే తెలుస్తుంది….
నేన ఇంకా మంచం ముందే ఉన్నాను. ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి చివరి రోజు. నాన్న రాత్రి లేటుగా రావడంతో పొద్దున అడుగుదాం అని అనుకున్న.. నాన్న ఎగ్జామ్ ఫీస్ ఇస్తావా అని అడిగేలోపు మా అమ్మ గొంతు వినిపించింది.. ఎవండీ పెద్దొడికి ఈరోజు పరీక్షా ఫీజుకి ఆఖరి తేదీ గుర్తుందా అప్పుడు నాన్న ఇలా అన్నాడు గుర్తుంది లక్ష్మీ ( మా అమ్మ )… నా హాస్పటిల్ కోసం దాచిన డబ్బుని ఇచేస్తా అన్నాడు … తనకి అమ్మ సరేనంది. మీ ఇష్టం రేవు ఏం మీకు ఏం జరిగినా ఈ కుటుంబని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో తేలేదు. అన్ని మంచం పైనుండి వింటున్న నాకు ఒక్కసారిగా నా కుటుంబ పరిస్థితి అర్థమయ్యింది. కానీ నాకు ఏ మాత్రం చదువులేదు. సిగ్గూ విడిచి డబ్బు తీసుకున్న, ఎగ్జామ్ రాసా… పాస్ అయ్యా కానీ నాకు ఏ తృప్తి లేదు, మా నాన్న మాటలు ఇంకా గుర్తున్నాయి.. ఈ విషయం మా నాన్నకి చెప్పాను నాన్న మొహం లో సంతోషం అంత ఇంత లేదు..
నేను కానీ బాగా చదివి ఉంటే ఈపాటికి మా నాన్న కి ఏ మాత్రం భారం లేకుండా ఉండేవాడిని కానీ అప్పుడు నా సమయం మొత్తం అమ్మాయిల కోసం, క్లాసుల మాని బయట తిరగటం.. ఇవే నేను చేసిన గొప్ప పనులు అవికూడా మా నాన్న కష్ట జీతంతో.. నాకు ఒక్కసారిగా నా మీద నాకు విరక్తి కలిగింది..
ఒక్కరోజు నేను కాలేజీలో ఉన్న మా కాలేజీ ప్యున్ వచ్చి నా పేరు గట్టిగా పిలిచి నీకు ఫోన్ వచ్చింది అన్నాడు.. నాకు ఒక్కసారిగా చెమటలు..
నేను కానీ బాగా చదివి ఉంటే ఈపాటికి మా నాన్న కి ఏ మాత్రం భారం లేకుండా ఉండేవాడిని కానీ అప్పుడు నా సమయం మొత్తం అమ్మాయిల కోసం, క్లాసుల మాని బయట తిరగటం.. ఇవే నేను చేసిన గొప్ప పనులు అవికూడా మా నాన్న కష్ట జీతంతో.. నాకు ఒక్కసారిగా నా మీద నాకు విరక్తి కలిగింది..
ఒక్కరోజు నేను కాలేజీలో ఉన్న మా కాలేజీ ప్యున్ వచ్చి నా పేరు గట్టిగా పిలిచి నీకు ఫోన్ వచ్చింది అన్నాడు.. నాకు ఒక్కసారిగా చెమటలు.. నాకు ఎవరు ఫోన్ చేస్తారు ఆది కూడా కాలేజీ కి… వెల్ల ఫోన్ ఎత్త.. విషయం తెలిసిన తరువాత మా తమ్ముడి నీ తీసుకుని వెళ్తున్న… నడవడానికి కాలు వణుకుతున్నాయి. మా తమ్ముడికి ఏం చెప్పాలో తెలీదు.. మొత్తానికి ఇంటికి వెళ్ళాం.. అప్పుడే వచ్చేశారు ఇద్దరు ఏంటి అని అమ్మ అడుగుతుంది.. ఏం కాదు అని చెప్పలేం అలా అని నిజం నా నోటంట చెప్పలేను.. ఓ పక్క గుండె బాగా బరువెక్కింది. అమ్మమేమో అన్నం పెట్టనా అంటుంది నేనేమో ముందు తమ్ముడికి పెట్టు అని అన్న.. మా అమ్మ మీ నాన్న ఇంకా రాలేదు రా ఫోన్ చేయకపోయావా అని అంది. వస్తాడు అమ్మ కంగారేందుకు అని అనలేక, విషయం చెప్పలేక బతికి ఉన్న శవంల మారింది నా స్తితి. మా అమ్మ నాలో ఏదో అసహనాన్ని గుర్తించింది ఏమైంది రా అని అడిగింది, నేను కంగారుగా ఏంలేదు అమ్మ అని సర్దు చెప్పా. మీ నాన్న కోసం వంకాయ కూర చేసాను రా ఎప్పుడూ వస్తాడు ఎప్పుడు తింటాడు ఏంటో ఈ మనిషి.. అని అనే లోగా మా ఈ ఇంటి ముందు ఒక్క కారు ఆగింది…. ఎప్పుడు చక్కగా నిటారుగా నిలబడే మా నాన్న ఈరోజు తీగకు ఆరేసిన చొక్కాల వేలాడుతూ మోస్తు తీసుకువస్తుంటే .. నా లో ప్రాణం ఒక్కసారిగా పోయింది.. అమ్మ లోపల ఉంది ఒక్కసారిగా తమ్ముడు అమ్మ… నాన్న వచ్చాడు, అని అంటుంటే నా గుండెకు ఒక్కసారిగా నొప్పి కలిగింది. ఈలోగా అమ్మ కాలు కడుకుని లోపలకి రమ్మను అని బయటకి వచ్చి చూసే లాగా… మా నాన్న నీ పడుకోపెట్టారు.. తెల్లని మల్లెపువ్వు రంగులాంటి చొక్కా, నల్లటి ప్యాంటు వేసుకుని అచ్చం హీరోల ఉన్నాడు మా నాన్న… నా కథ ఇంకా వినాలని ఉంటే ఫాలో చేయండి.. తరువాయి భాగం లో నాలో మార్పు మీరే చూస్తారు.. ఇట్లు మీ యువ రచయిత శ్రీమంతుల తేజ కిరణ్ చైతన్య .
Swipe left/right or tap the sides to turn pages