నా ఇంటి కథ – 2
నాన్నని చూసినా వెంటనే మా అమ్మకి నోటంట మాట రాలేదు చేతిలో నాన్న కోసం అన్నం కంచంతో.. మా తమ్ముడేం వాటర్ బాటిల్ తో.. ఇరుగు పొరుగు వారు చేరారు…
అన్నా…! నాన్నకి ఏమైంది ఇంకా లెగడ.. టెంట్ ఎందుకు వేస్తునారు ఏమైంది అమ్మ ఎందుకు ఏడుస్తుంది అని 6 ఏళ్ల మా తమ్ముడు అడుగుతుంటే 19 ఏళ్ల నా దగ్గర నుండి సమాధానం లేదు…
ఎవరు పనిలో వాలు ఉన్నారు.. మా అమ్మవంక చూస నా లో ఇంకా ప్రాణం ఇంకా ఎందుకు ఉందా అని అనిపిస్తుంది .. మా తమ్ముడు మా నాన్న కాళ్ళ దగ్గర కూర్చొని లెగు నాన్న అని అంటున్నాడు…
నాకు మాత్రం చిన్నపట్నుండి నాన్న నీ ముద్దు పెట్టుకోవాలని కోరిక ఆది ఇప్పుడైనా అవుతుందా అని చూస్తున్న.. అవ్వింది.. ఒక్కసారిగా నాన్న నీ పట్టుకుని ఎడిచా.. కానీ నాన్నకు మాత్రం నేను ఎప్పుడూ ఏది చెయ్యలేదు…
నాన్న చనిపోయాడు అని నాకు ముందే తెలుసు కానీ నేను మా అమ్మకి చెప్పకుండా తప్పు చేశా అక్కడ కొడుకుగా ఓడిపోయా.. తమ్ముడికి అన్నం పెట్టించ వాడు ఆకలికి ఆగలెడు అని… కార్యక్రమం అంతా ముగిసింది నాన్న గోడపై ఎక్కాడు.. ఖర్చులకు మా అమ్మ బంగారు మంగళసూత్రం అమ్మేసింది.. మా దగ్గర చిన్న గవ్వలేదు.. ఏదైనా డబ్బులు దొరుకుతాయా అని నాన్న బట్టల దగ్గర చూస్తుంటే అసలు డబ్బులు కాదు కదా మంచి బట్టలే లేవు మా నాన్నకి… ఇంటి అవసరాల కోసం నా ఫోన్ అమ్మేసా…… నేను ఎంతో ఆశగా కొనుకున్న సైకిల్ అమ్మి మా తమ్ముడికి స్కూల్ ఫీ కట్టాను.. పెన్ను, సెల్ ఫోన్ తప్పా ఏమి పట్టడం తెలియని నాకు ఈరోజు అదే చేత్తో.. నా కుటుంబం కోసం కేటరింగ్ కి వెళ్ళ, ఎండలోకి వస్తె మాయిశ్చరైజర్ రాసే నేను ఈరోజు కొబ్బెర నూనె రాసి పనికి వెళ్ళ…
కాలేజ్ నుండి టీసీ తెచ్చుకుని గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యా.. ఇంటికి పెద్దగా నిలిచ.. మాకంటూ ఒక్కరు రాలేదు.. అయిన భయంలేదు..
మా నాన్న డ్యూటీ నుండి ఇంటికి వచ్చినపుడు తిన్నావా అని అడిగేవాడని కాదు, కేవలం నా అవసరాల కోసం, పరీక్షా ఫీజుల కోసం, మాత్రమే మా ఇద్దరి మధ్య సంభాషణ ఉండేది.. ….నాన్న ఉంటే ఎంత బాగున్ను అని అనిపిస్తుంది….
అందరికి నాన్న ఉన్నాడు నాకు ఒకప్పుడూ ఉండేవాడని చెప్పుకునే రోజు వస్తుందని ముందే తెలిసుంటే బాగున్ను.. అప్పుడైనా ప్రేమ గా రోజుకి కనీసం 10 నిమిషాలు అయినా మాట్లాడవాడినేమో.. ఇప్పుడు నాన్న లెడు.. వాడెవడో పుట్టినరోజుకి రక్తదానం చేసాను.. బ్యానర్లు కట్టాను కానీ నా నాన్న కోసం ఎప్పుడు ఏది కొనలేదు.. మా కోసం మా నాన్న మాకు కొత్త బట్టలు కొంటుంటే నాన్నకి కొత్త బట్టలు ఇష్టంలేదు అనుకున్న మా కోసం అది ఒక్క త్యాగం అని అర్థమయ్యింది..
ఇది నా జీవితం.. సమయాని వృధా చేయకండి. ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది చెప్పటం ఎవరి వల్ల కాదు.. మనం సాధారణ మధ్య తరగతి పిల్లలం మన కుటుంబేమె మనకి అన్ని.. అమ్మాయిలు అంటూ, ఫ్రెండ్స్ అంటూ, మత్తు పానీయాలకు అలవాటు పడవద్దు.. జీవితం లో ఏదైనా తిరిగి రానిది ఏదైనా ఉంది అని అంటే ఆది ఒక్క సమయం మాత్రమే మిత్రమా… ఈ కథలో నా కష్టం మీకు కనిపించకపోవచ్చు కానీ మీకు నా పరిస్థితి రాకూడదు… జీవితంలో సమయం చాలా విలువైనది. ఉన్నప్పుడు బంధాలను ప్రేమించు, మనవాళ్లతో సమయం గడుపు. మనం ఉన్నప్పుడు విలువ ఇవ్వని మనుషులు, మనం దూరమయ్యాక మన జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తారు. సమయం తిరిగి రాదు, కోల్పోయిన మనుషులు మళ్లీ రాకపోవచ్చు. అందుకే అహంకారాన్ని పక్కనపెట్టి బంధాలను కాపాడుకో. ఇది కల్పిత కథ కాదు, ఒక మనిషి జీవితంలో జరిగిన నిజమైన కథ. ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగించే ఈ కథలో ప్రేమ, బాధ్యత, కుటుంబం, జీవిత సత్యం దాగి ఉన్నాయి. చివరి వరకు చదివితే బంధాల విలువ తెలుస్తుంది. ఈ రోజు మనతో నవ్వుతూ మాట్లాడినవారు రేపు మన పక్కన ఉంటారని గ్యారంటీ లేదు. డబ్బు, హోదా, అహంకారం కోసం మనవాళ్లను దూరం చేసుకోకు. ఎందుకంటే కోల్పోయిన సమయం తిరిగి రాదు, దూరమైన మనుషులు ఎప్పుడూ తిరిగి రాకపోవచ్చు. మనం బతికున్నప్పుడు చూపించే ప్రేమ, పలికే ఆప్యాయత, ఇచ్చే గౌరవమే మన బంధాలకు నిజమైన బలం. తప్పులు జరిగితే క్షమాపణ చెప్పు, మనస్పర్థలు వస్తే మాట్లాడి పరిష్కరించుకో, మనవాళ్లను ప్రేమగా చూసుకో. ఒక మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి. కొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి, మరికొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ కథ కూడా అలాంటిదే. ఇది కేవలం వినోదం కోసం రాసిన కల్పిత కథ కాదు. ఒక కుటుంబం, బంధాలు, బాధ్యతలు, జీవితంలో ఎదురైన పరిస్థితుల ఆధారంగా చెప్పే నిజమైన కథ. ఈ కథను చదివే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో బంధాల విలువను గుర్తించాలని, తమవారిని ఉన్నప్పుడే ప్రేమించాలని కోరుకుంటున్నాను.
Swipe left/right or tap the sides to turn pages