నా చందమామ – 1
ఆమె కళ్ళు బరువుగా తెరుచుకున్నాయి!! నిశ్శబ్దమైన ఆ గదిలో ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంటే మెల్లిగా లేవడానికి ప్రయత్నించింది…
బెడ్ షీట్ ఆమె భుజాల మీద నెమ్మదిగా జారిపోతుండగా ఆమె దానిని గట్టిగా పట్టుకొని కూర్చుంది!!తన శరీరం మీద అతని పరిమళం ఇంకా మిగిలే ఉంది!! అతని శరీర పరిమళం ముక్కుకు తాకగానే ఆమె మనసు భారంగా అయిపోయింది…
నిన్నటి రాత్రి జరిగింది ఒక్కసారిగా మెదడులో తిరిగగానే ఏదో కోల్పోయిన భావన ఆమెలో!!
చూపు తిప్పి చూస్తే అతను ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు కానీ ఆమె మనసంతా అలజడి!!తనను తాను ముట్టుకునేందుకు కూడా ధైర్యం చాలడం లేదు…
ఎక్కడో లోపల నుంచి కరిగిపోతున్న నిస్సహాయతకు కన్నీళ్లు రానీయకుండా కళ్ళు గట్టిగా మూసుకుంటూ మళ్ళీ అలాగే బెడ్ మీద కి ఓరుగుతుంది!!ఒక్క పుాటలో మారి పోయినా తన పరిస్థితి కి తన మీద తనకే విరక్తి కలుగుతుంటే….
తన ఈ పరిస్థితికి కారణం అయిన వ్యక్తి నీ తన శక్తి కొద్దీ కొట్టాలి అనిపిస్తుంటే!!అలా కొట్టడానికి కూడా చేతులు సహకరించక పోవడం తో…..
బెడ్ మీద మరో వైపు ప్రశాంతంగా అటు తిరిగి నిద్ర పోతున్నా అతన్ని చూస్తూ….
ఎవరు నువ్వు ఒక్క నైట్ లో నా లైఫ్ నీ తల క్రిందులు చేసావ్..నిన్ను నేను చూసింది కూడా ఫస్ట్ టైమ్ నైటే కదా..
ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసావ్..వారం రోజులలో నా పెళ్లి..ఇప్పుడు నేను ఎలా నా వాళ్ళ ముందు నిలబడాలి…
అసలే మా నాన్న పరువు అంటే ప్రాణాలు ఇస్తారు.. కూతురా,ఇంటి పరువా అంటే కచ్చితంగా పరువు కావాలి అనే ఆయన…
నేను నీ చేతిలో నలిగి పోయాను అని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా..నా వరకు ఎందుకు ముందు ఆయన బ్రతుకుతారా?? అని తలుచుకొని కుళ్లి కుళ్లి ఏడుస్తూ నైట్ జరిగింది గుర్తు తెచ్చుకుంటది ఆ అమ్మాయి….
నిన్న నైట్ టైమ్ సెవెన్:
నాన్న ప్లీజ్..టూ డేస్ లో ఇంట్లో ఉంటాను వెళ్ళనివండి అని ఒక అమ్మాయి బ్రతిమిలాడుతుంది…
చూడు వేద నిన్ను పంపించడానికి నాకు అభ్యంతరం లేదు తల్లీ..కానీ వారం లో పెళ్లి పెట్టుకొని ఇలా రాత్రి వేళ బయటి కి వెళ్ళకూడదు తల్లీ అంటారు రామనాథం గారు …
ప్లీజ్ నాన్న అక్కడ జరిగేది నా బెస్ట్ ఫ్రెండ్ నిత్య పెళ్లి.. నేను వెళ్ళక పోతే ఫీల్ అవుతుంది….
అయినా నేను ఒక్కదాన్నే వెళ్ళడం లేదు కదా!! నా ఫ్రెండ్స్ కూడా ఫార్మ్ హౌస్ కి వస్తున్నారు….
అమ్మాయి అంతగా అడుగుతుంది కదండీ..వెళ్ళడానికి ఒప్పుకొండి అంటారు వేద తల్లిగారైన తులసి గారు….
అయినా అది ఏమి ఊరు దాటి వెళ్ళడం లేదు కదా..ఆ ఫార్మ్ హౌస్ కొంచం ఊరి చివర అనే కదా వద్దంటున్నారు..
అమ్మాయి ఒక్కత్తే వెళ్ళడం లేదు కదా!! ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంటుంది..అది నోరు తెరిచి ఎప్పుడు ఏది అడగలేదు….
మీరు చెప్పినట్టే వింటుంది కదా!!ఈ ఒక్కసారికి ఒప్పుకొండి అని భర్తని బ్రతిమిలాడుతుంది తులసి కూతురు తరుపున.
సరే తులసి.. వెళ్ళమ్మ వేద…
లవ్ యు నాన్న అని తండ్రిని హగ్ చేసుకొని చెప్తది వేద…
వేద తల నిమిరి జాగ్రత్త అని చెప్పి తన రూమ్ కి వెళ్తారు రామనాథం గారు….
తండ్రి లోపలికి వెళ్ళగానే వేద తల్లి దగ్గరికి వచ్చి కౌగలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టీ లవ్ యు డార్లింగ్ నువ్వు చెప్పకపోతే నాన్న ఒప్పుకునే వారు కాదు…
చాల్లే వేషాలు అంటూ బుగ్గ తుడుచుకొని వేద నుదుటిన ముద్దు పెట్టీ వెళ్ళాక కాల్ చెయ్యి బాయ్ అని చెప్తారు తులసి గారు….
తండ్రి నీ ఒప్పించి వెళ్ళాలి అని ఉన్న వేద బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చి మరి అడుగుతది నిత్య వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్ళడానికి…
వేద ట్వంటీ సిక్స్ ఇయర్స్ వయసు గల అమ్మాయి..ఐదు అడుగుల నాలుగు అంగుళాలు హైట్ ఉండి, హైట్ కి తగ్గ వెయిట్ తో ,మంచి శరీర పౌస్టం తో,పాల మీగడ లాంటి స్కిన్ టోన్ తో చూడగానే చందమామలా ముద్దుగా ఉంది అనిపిస్తుంది…
ఆమె ఒక సాప్ట్ వేర్ ఎంప్లాయ్.. ఇళ్లు ఆఫీస్ ఇదే ఆమె ప్రపంచం.. తండ్రీ మాట కాదు అని ఏ పని చెయ్యదు…
ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న ను ఒప్పించి తన చైల్డ్ వుడ్ ఫ్రెండ్ అయిన నిత్య పెళ్లి రెండు రోజులలో….
నిత్య పెళ్లి తన కోరికమేరకు డెస్టినేషన్ వెడ్డింగ్ లా ప్లాన్ చేస్తారు నిత్య ఫాదర్ నరేష్ గారూ….
దాని కోసమే వైజాగ్ సీటీ కి బయట ఉన్న వాళ్ళ ఫార్మ్ హౌస్ లో హాల్ది, మెహేంది, సంగీత్ అన్నీ అక్కడ ఏర్పాటు చేశారు….
మ్యారేజ్ మాత్రం వైజాగ్ లోని ఫేమస్ ఫంక్షన్ హాల్ లో జరిపిస్తున్నారు…
నిత్య వాళ్ళు ఫార్మ్ హౌస్ కి త్రీ డేస్ బ్యాక్ నే వెళ్ళారు.. వేదను కూడా అప్పుడే రమ్మని ఇంటికి వచ్చి చెప్పగా….
తన పెళ్లి కూడా దగ్గర్లో ఉంది అని, హెల్దీ టైమ్ కి వస్తాను అని మాట ఇస్తది వేద….
తల్లి తండ్రి ఒప్పుకోగానే హ్యాపీ గా తన స్కూటీ లో ఫార్మ్ హౌస్ కి స్టార్ట్ అవుతుంటది వేద…
వేద స్కూటీ వద్దు కార్ లో వెళ్ళు….
అమ్మ నాకు ఈ స్కూటీ లో వెళ్ళడమే ఇష్టం.. కాదు అనకు మా ప్లీజ్ అని క్యూట్ గా ఫేస్ పెట్టీ అడుగుతది….
తులసి గారు వేద వేషాలు చూసి నవ్వుకొని..సరే జాగ్రత్త గా వెళ్ళు అంటారు…..
బాయ్ మా అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తది వేద….
పిచ్చి పిల్ల వేశాల్లని నా దగ్గరే.. వాళ్ళ నాన్న దగ్గర ఏమో నోరు తెరిచి మాట్లాడదు అనుకుంటారు తులసి గారు వెళ్తున్న వేద ను చూసి….
ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యిన వేద కొంచెం దూరం వచ్చాక నిత్య కు కాల్ చేసి ఫార్మ్ హౌస్ కి టూ అవర్స్ లో వస్తున్నట్లు చెప్పి కాల్ కట్ చేసి మొబైల్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని…
పక్కన కనిపిస్తున్న షాప్ లో కొన్ని చాక్లెట్స్ కొనుక్కొని స్టార్ట్ అవుతుంది….
ఫార్మ్ హౌస్ కి ఇంకొక ట్వంటీ మినిట్స్ లో రీచ్ అవుతది అనగా సడన్ గా వేద స్కూటీ పంచర్ అవుతుంది…
ఓ షిట్..అనుకుంటూ స్కూటీ దిగి కొంచం పక్కకి పార్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవాలి అని మొబైల్ చేతిలోకి తీసుకోనీ
టైమ్ చూసీ…
టైమ్ టెన్ అవుతుందా ఈ టైమ్ లో ఇక్కడికి క్యాబ్స్ ఉంటాయా?? అనుకుంటూ చూస్తూ ఉండగా….
చాలా స్పీడ్ గా బ్లాక్ బెంజ్ కారు వచ్చి వేద ముందు ఆగుతుంది….
వేద ఎవరిది కార్ అని మనసులో అనుకుంటూ ఉండగానే.
ఆ కార్ లోపలి నుండి సిక్స్ అండ్ హాఫ్ హైట్ ఉన్న వ్యక్తి స్పీడ్ గా దిగి వేద వైపు తూలుతూ వచ్చి….
వేద ను ఒక్క ఉదిటిన భుజాన వేసుకొని కార్ బ్యాక్ సీట్ లో వేసి డోర్ క్లోజ్ చేస్తాడు…
క్షణ కాలం లో జరిగిన ఆ చర్యకు వేద షాక్ అవ్వగా.. ఆమె షాక్ నుండి తేరుకొనే లోపే అతడు డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు….
కార్ స్టార్ట్ అయిన సౌండ్ కి తేరుకున్న వేద.. ఏ ఎవరు నువ్వు?? నన్ను ఎక్కడికి తీసుకెళతున్నావ్ అని అతడి భూజాల మీద కొడుతూ అడుగుతది….
వేద ఎంత గొంతు చించుకొని అరుస్తున్నా పట్టించుకోకుండా పది నిమిషాల తరువాత ఒక డూప్లెక్స్ ఇంటి ముందు కార్ ఆపి వేగంగా కిందకి దిగి వేద ఉన్న వైపు డోర్ ఓపెన్ చేస్తాడు…
ఆ వ్యక్తి కార్ డోర్ తియ్యగానే వేద ఫాస్ట్ గా దిగి పారిపోవాలని చూడగా..అతడు స్పీడ్ గా రియాక్ట్ అయ్యి వేద చెయ్యి పట్టుకొని తన మీద కు లాగుకొని ఆమె ను ఎత్తుకొని పైన అతని గదికి తీసుకెళ్ళి బెడ్ మీద వేస్తాడు….
Continued…….
హయ్ ఫ్రెండ్స్ ఇది నా కొత్త స్టోరీ చదివి ఎలా అనిపించిందో మీ రేటింగ్ అండ్ సమీక్షలద్వారా తెలియజేయండి…
Swipe left/right or tap the sides to turn pages