నా రాక్షసుడు 😈🔥 – 3
ఎపిసోడ్ 3 – పారిపోలేవు, నువ్వు నాదానివి!
ఉదయం 6 గంటలు, అనన్య లేచింది, రుద్ర ఇంకా నిద్రపోతున్నాడు సోఫాలో, బ్లాక్‌టీ టీ షర్ట్, కళ్ళు మూసుకుని, నిద్రలో కూడా రాక్షసుడు లాగే ఉన్నాడు, కానీ కొంచెం అమాయకంగా.
రూమ్ అంత ఒకసారి చూసింది.. అంత బ్లాక్ థీమ్ తో ఉంది రూమ్ అంతా.
అనన్య మనసులో, “.ఈ బ్లాక్ పిచ్చి ఏంటి ఇతగాడికి..మనకి ఎందుకు లే, ఇదే టైం, పారిపోవాలి, రాక్షసుడు నిద్రలో ఉన్నాడు, గేట్ దాటి పారిపోవాలి” అనుకుంది.
నెమ్మదిగా లేచి, తలుపు దగ్గరికి వెళ్ళింది, తలుపు తెరిచింది, సౌండ్ రాలేదు, బయటకి వచ్చింది, మెట్లు దిగింది, హాల్ లో ఎవరూ లేరు, గేట్ వైపు పరిగెత్తింది.
గేట్ దగ్గర గార్డ్ ఉన్నాడు, అనన్య “అన్నా, ప్లీజ్, నన్ను వదిలేయ్, నేను ఇక్కడ ఉండలేను, ఆ రాక్షసుడు నన్ను కిడ్నాప్ చేసాడు” అంది ఏడుస్తూ.
గార్డ్ భయంతో “అమ్మా, నేను ఏం చేయలేను, రుద్ర అన్న చెప్తే నా ఉద్యోగం పోతుంది, పైగా అన్న మిమ్మల్ని వదలడు, మీరు అన్న సొంతం” అన్నాడు.
అనన్య “సొంతం కాదు, నేను ఎవరి సొంతం కాదు” అని గేట్ దూకబోయింది, చిన్న గేట్.
అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు, “ఎక్కడికి వెళ్తున్నావు, బుజ్జి?”. చిన్నగా అన్న ఆ వాయిస్ లో బేస్ ఉంది..
అనన్య వెనక్కి తిరిగి చూసింది, రుద్ర నిలబడి ఉన్నాడు, నిద్ర లేచి, జుట్టు చెదిరిపోయి, కళ్ళు ఎర్రగా, కోపంగా, చేతిలో కాఫీ కప్.
అనన్య భయంతో “నేను… నేను…” అని.
రుద్ర దగ్గరికి వచ్చి, కాఫీ కప్ పక్కన పెట్టి, అనన్య చేయి పట్టుకుని, గట్టిగా “నేను చెప్పాను కదా, నువ్వు పారిపోలేవు, నా నుంచి, ఎందుకు వినవు?” అన్నాడు సీరియస్ గా..
అనన్య చేయి లాగేసుకుని ” నన్ను వదిలేయ్, నేను నీ బందీని కాదు, నేను వెళ్ళిపోవాలి” అంది ఏడుస్తూ.
రుద్ర “నో, ఇక్కడే, నా దగ్గరే, నీ ఇల్లు ఇప్పుడు ఇదే” అన్నాడు, అనన్యని లాగి ఇంట్లోకి తీసుకెళ్ళాడు, గార్డ్ భయంతో తల దించుకున్నాడు.
హాల్ లో – రుద్ర కోపంగా , అనన్య ఏడుస్తూ.
రుద్ర “నీకు చెప్పాను కదా, బయటికి వెళ్ళకూడదు, మాట వినాలి, నువ్వు రెండూ వినలేదు, ఇప్పుడు పనిష్మెంట్” అన్నాడు .
అనన్య “పనిష్మెంట్ ఆ? నేను చిన్న పిల్లనా? నన్ను ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, నేను భయపడను” అంది కోపం తో ధైర్యంగా.
రుద్ర సైడ్ స్మైల్ తో “కొట్టనా? నేను ఆడవాళ్ళని కొట్టను, అది నా రూల్, కానీ పనిష్మెంట్ వేరే ఉంటుంది” అన్నాడు.
అనన్య “ఏంటి పనిష్మెంట్?” అంది.
రుద్ర “ఇవాళ అంతా నువ్వు నా పక్కనే ఉండాలి, నా కళ్ళ ముందే, నేను ఆఫీస్ వర్క్ ఉంది, నువ్వు నా పక్కన, నా చేర్ పక్కన, కూర్చోవాలి” అన్నాడు.
అనన్య “నేను చేయను” అంది.
రుద్ర దగ్గరికి వచ్చి, అనన్య ముఖం పట్టుకుని, చాలా దగ్గరగా, “వస్తావు, నేను చెప్తే వస్తావు, నువ్వు నా మాట వినకపోతే నేను నీ ఊరులో లో ఉన్న అమ్మ, నాన్న దగ్గరికి మనుషుల్ని పంపుతా, వాళ్ళని ఇక్కడికి తెస్తా, అప్పుడు నువ్వు వింటావా?” అన్నాడు, సీరియస్ గా, బెదిరించడం కోసం.
అనన్య షాక్, “నా అమ్మ, నాన్నని ఏం చేయకు, వాళ్ళని వదిలేయ్” అంది ఏడుస్తూ.
రుద్ర “ఏం చేయను, నువ్వు నా మాట వింటే, వాళ్ళు సేఫ్, నువ్వు నా పక్కన ఉంటే, అర్థమైందా, బుజ్జి?” అన్నాడు.
అనన్య “నన్ను బుజ్జి అనకు అన్నాను కదా” అంది కోపంగా.
రుద్ర “అంటా, నాకు నచ్చింది అంటా, బుజ్జి అనే పిలుస్తా, నువ్వు హేట్ చేసినా, ఇది నా ఇష్టం” అన్నాడు యాటిట్యూడ్‌తో .
ఉదయం 9 గంటలు – రుద్ర ఆఫీస్ రూమ్, ఇంట్లోనే ఆఫీస్, పెద్ద టేబుల్, లాప్టాప్, అనన్య పక్కన చిన్న చేర్ లో కూర్చుంది, కోపంగా, ముఖం తిప్పుకుని.
రుద్ర మీటింగ్ లో ఉన్నాడు .. మీటింగ్ లో, “ఆ డీల్ క్యాన్సిల్ చెయ్, నాకు నచ్చలేదు, నా మాట వినకపోతే కంపెనీ మూసేయ్” అని అరుస్తున్నాడు.
అనన్య చూస్తూ, “బయట వాళ్ళతో ఇంత రాక్షసుడిలా ఉంటాడు, నాతో కూడా అంతే, కానీ కొంచెం తక్కువ” అనుకుంది.
మీటింగ్ అయ్యాక రుద్ర అనన్య వైపు చూసి, “ఏంటి? భయపడ్డావా? నేను బయట వాళ్ళతో అలాగే ఉంటా, రాక్షసుడిలా, కానీ నీతో? నీతో కోపంగా ఉంటా, కానీ కొట్టను, అరవను ఎక్కువ, ఎందుకంటే నువ్వు నా బుజ్జివి” అన్నాడు, సోఫాలో కూర్చుని.
అనన్య “నేను నీ బుజ్జి కాదు, నేను నీకు ఏం కాదు” అంది.
రుద్ర లేచి, అనన్య దగ్గరికి వచ్చి, అనన్య చేర్ వెనుక నిలబడి, అనన్య భుజాల మీద చేతులు వేసాడు, నెమ్మదిగా.
అనన్య “ఏం చేస్తున్నావు? తియ్ చేతులు” అంది లేవబోయి.
రుద్ర “కూర్చో, కదలకు, ఇది పనిష్మెంట్ లో భాగం, నా పక్కన ఉండాలి, నా చేతుల కింద” అన్నాడు,బేస్ వాయిస్ తో నెమ్మదిగా.
అనన్య కదలలేదు, భయంతో, కోపంతో, “నిన్ను అసహ్యించుకుంటున్నాను” అంది.
రుద్ర అనన్య చెవి దగ్గరికి వచ్చి, “అసహ్యించుకో, కానీ నా దగ్గరే ఉండి అసహ్యించుకో, దూరంగా వెళ్ళి కాదు” అన్నాడు హస్కీ గొంతు తో చాలా దగ్గరగా, అనన్య వణికిపోయింది.
అనన్య లేచి “నాకు వద్దు, నీ దగ్గర ఉండటం నాకు వద్దు” అని తోసేసింది రుద్రని.
రుద్ర వెనక్కి వెళ్ళి, నవ్వుతూ “తోసేసావా? ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను తోసేసింది, నచ్చింది, నా రాక్షసికి పొగరు కూడా ఉంది” అన్నాడు.
అనన్య “నేను రాక్షసిని కాదు, నువ్వే రాక్షసుడివి, నా రాక్షసుడు కాదు, అందరి రాక్షసుడివి” అంది.
రుద్ర దగ్గరికి వచ్చి, అనన్యని నడుము మీద చేయి వేసి, దగ్గరికి లాగాడు, ఫస్ట్ టైం అంత దగ్గరగా, “నేను అందరి రాక్షసుడినే, కానీ నీకు మాత్రం నీ రాక్షసుడిని, నీకు మాత్రమే కోపంగా ఉంటా, బయట వాళ్ళని చంపేస్తా, నిన్ను మాత్రం… నిన్ను మాత్రం వదలను” అన్నాడు, కళ్ళలోకి చూస్తూ.
అనన్య కళ్ళలో నీళ్ళు, “వదిలేయ్, ప్లీజ్, వదిలేయ్” అంది, ఫస్ట్ టైం ప్లీజ్ అంది.
రుద్ర వదిలేసాడు, “సరే, వదిలేసాను, కానీ గుర్తు పెట్టుకో, నువ్వు నా ఇంట్లో ఉన్నావు, నా కళ్ళ ముందు, నువ్వు నా సొంతం, Owned by the Monster, అర్థమైందా?” అన్నాడు.
అనన్య ఏడుస్తూ పక్కకి వెళ్ళి కూర్చుంది.
రుద్ర మనసులో, “ఎందుకు ఇంత హేట్ చేస్తోంది? నేను ఏం చేసాను? కాపాడాను కదా, కానీ పర్లేదు, హేట్ తోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత లవ్ అవుతుంది” అనుకున్నాడు.
మధ్యాహ్నం రుద్ర అనన్యకి ఫుడ్ తెచ్చాడు, “తిను, పారిపోయి అలసిపోయావు కదా” అన్నాడు నవ్వుతూ..
అనన్య “నాకు వద్దు” అంది.చిత్తుకొచ్చింది అతను అలా నవ్వుతుంటే..
రుద్ర “తినకపోతే మళ్ళీ నా పక్కన కూర్చోవాలి, రాత్రంతా” అన్నాడు.
అనన్య భయంతో తినేసింది.వీడు చేసిన చేస్తాడు అని
రాత్రి ఒకే రూమ్ లో ఉండు రుద్ర అండ్ అనన్య,
అనన్య “నేను రేపు కూడా పారిపోతా” అంది.
రుద్ర “పారిపో, నేను పట్టుకుంటా, ప్రతి సారి పట్టుకుంటా, ఎందుకంటే నువ్వు నాదానివి” అన్నాడు.
అనన్య కోపంతో పడుకుంది, రుద్ర చూస్తూ, “నా పొగరు పిల్ల” అని నవ్వుతూ.
రేపు అనన్య మళ్ళీ పారిపోతుందా? రుద్ర నిజంగా అనన్య అమ్మ, నాన్నని తీసుకొస్తాడా? అనన్య హేట్ ఎప్పుడు తగ్గుతుంది?
Swipe left/right or tap the sides to turn pages