నా రాక్షసుడు 😈🔥 – 2
ఎపిసోడ్ 2 – నేను నీ సొంతం కాదు, రాక్షసుడా!
ఎపిసోడ్ 1 లో అనన్యని రుద్ర తన బంగ్లాలో లాక్ చేసాడు, “నువ్వు నా సొంతం” అన్నాడు, అనన్య “నేను నీ సొంతం కాదు” అని ఏడుస్తూ ఉంది.
ఇప్పుడు రాత్రి 1 గంట, బంజారా హిల్స్ బంగ్లా, పెద్ద బెడ్ రూమ్,కింగ్ సైజ్ బెడ్, బ్లాక్ ఇంటీరియర్ అండ్ కాస్టలీ ఫర్నిచర్, అనన్య ఒంటరిగా, తలుపు లాక్ చేసి ఉంది , రూమ్ బైట సెక్యూరిటీ గార్డ్స్.
అనన్య తలుపు కొడుతూ “తలుపు తియ్, రాక్షసుడా, నన్ను వదిలేయ్, నేను నీ సొంతం కాదు” అని అరుస్తోంది, ఏడుస్తూ.
కింద హాల్ లో రుద్ర కూర్చుని ఉన్నాడు, మందు తాగుతూ, అనన్య అరుపులు వింటూ, నవ్వుతూ.
మేనేజర్ రాజు వచ్చి “అన్నా, ఆ అమ్మాయి అరుస్తోంది, భయపడుతోంది, వదిలేయండి అన్నా” అన్నాడు.
రుద్ర కోపంగా చూసి “రాజు, నా వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకు, అది నాది, అరవనివ్వు, అరిచి అరిచి అలసిపోతుంది, తర్వాత నా దగ్గరికే వస్తుంది” అన్నాడు, రాక్షసుడు లాగా..
కానీ మనసులో అనన్య గురించి “ఎందుకు ఇంత భయపడుతోంది? నేను ఏం చేయలేదు కదా” అని.
రాత్రి 2 గంటలు, అనన్య అరిచి అరిచి అలసిపోయి, నేల మీద కూర్చుని ఏడుస్తోంది, ఎరుపు చీర చిరిగిపోయింది కొంచెం.
రుద్ర పైకి వచ్చాడు, తలుపు తీసి, అనన్యని చూసి, చిన్నగా కోపం తగ్గి.
రుద్ర “ఏంటి? ఇంకా అరవలేదా? గొంతు నొప్పి రాలేదా?” అన్నాడు, యాటిట్యూడ్ గా, లైట్‌గా రూడ్ కలసిన గొంతు తో..
అనన్య లేచి “నువ్వు రాక్షసుడివి, నన్ను కిడ్నాప్ చేసావు, నిన్ను నేను అసహ్యించుకుంటున్నాను, I hate you” అంది, కళ్ళలో నిప్పులతో.
రుద్ర దగ్గరికి వచ్చి, “హేట్ చేసుకో, పర్లేదు, హేట్ కూడా ఒక ప్రేమే, నన్ను గుర్తు పెట్టుకుంటావు కదా, అది చాలు” అన్నాడు, నవ్వుతూ, సైడ్ స్మైల్ తో.
అనన్య “నిన్ను ప్రేమించను, ఎప్పటికీ ప్రేమించను, నీలాంటి రాక్షసుడిని ఎవరూ ప్రేమించరు” అంది.
రుద్ర కోపం వచ్చింది కొంచెం, అనన్య చేయి పట్టుకుని, దగ్గరికి లాగి, “అవును, నేను రాక్షసుడినే, బయట వాళ్ళకి రాక్షసుడినే, కానీ నీకు? నీకు రాక్షసుడిని కాను, నీకు కోపంగా ఉన్న మొగుడిని, అర్థమైందా?” అన్నాడు గట్టిగా.
అనన్య చేయి లాగేసుకుని “మొగుడా? ఎవరు నీకు మొగుడు అన్నారు? నేను నీ పెళ్ళాన్ని కాదు” అంది.
రుద్ర “ఇప్పుడు కాదు, రేపు అవుతావు, నా పెళ్ళాం, నా బార్య, నా సొంతం” అన్నాడు.
అనన్య “కలలు కనకు” అంది.
రుద్ర ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాడు, “ఇదిగో, నీకు బట్టలు, నా మనిషి తెచ్చాడు, ఈ చిరిగిన చీర తీసేయ్, వేరేవి వేసుకో” అన్నాడు, ఆర్డర్ వేస్తూ.
అనన్య “నాకు వద్దు, నీ బట్టలు నాకు వద్దు, నన్ను వదిలేస్తే నా బ్యాగ్ లో ఉన్నాయి” అంది.
రుద్ర “నీ బ్యాగ్ నా దగ్గర ఉంది, ఇవ్వను, నేను ఇచ్చినవే వేసుకోవాలి, నా ఇంట్లో నా రూల్స్, ఫస్ట్ రూల్ – నేను ఇచ్చింది వేసుకోవాలి చెప్పింది చేయాలి” అన్నాడు, డామినేట్ చేస్తూ.
అనన్య “నువ్వు నా బాస్ వి కాదు” అంది.
రుద్ర “బాస్ కాదు, ఓనర్ ని, నీ ఓనర్ ని, Monster who owns you” అన్నాడు.
అనన్య ఏడుస్తూ బ్యాగ్ తీసుకుని బాత్ రూమ్ లోకి వెళ్ళింది, తలుపు లాక్ చేసుకుంది.
బాత్ రూమ్ లో అద్దంలో చూసుకుంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి జుట్టు చెరిగిపోయి, చీర చిరిగి, “ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఎక్కడ నుంచి వచ్చాను, జాబ్ కోసం, ఇప్పుడు ఈ రాక్షసుడి దగ్గర” అని ఏడుస్తోంది.
బయట రుద్ర తలుపు దగ్గర నిలబడి, “అనన్య, తొందరగా రా, నీకు తినడానికి తెచ్చాను, తినకపోతే నీరసం వస్తుంది” అన్నాడు
అనన్య “నాకు ఆకలి లేదు, నాకు ఏం వద్దు” అని అరిచింది.
రుద్ర “తినకపోతే నేనే తినిపిస్తా, నా చేతులతో, వచ్చి” అన్నాడు, బెరిస్తూ..
అనన్య భయంతో బయటకు వచ్చింది, వేరే డ్రెస్ వేసుకుంది, బ్లాక్ నైటీ, రుద్ర ఇచ్చింది, చాలా బాగుంది, కానీ అనన్యకి నచ్చలేదు, “నాకు నచ్చలేదు” అంది.
రుద్ర చూసి, “నీకు నచ్చకపోయినా నాకు నచ్చింది, నువ్వు నా కళ్ళకి బాగుండాలి, నా కోసం” అన్నాడు.
టేబుల్ మీద ఫుడ్ ఉంది, బిర్యానీ తనకి ఇష్టం, రుద్ర ఎలా తెచ్చాడు? అనన్య షాక్.
రుద్ర “తిను, నీకు బిర్యానీ అంటే ఇష్టం అని తెలుసు” అన్నాడు.
అనన్య “నీకు ఎలా తెలుసు? నన్ను ఫాలో అయ్యావా?” అంది.
రుద్ర “ఫాలో కాదు, నాకు నచ్చిన దాని గురించి అన్నీ తెలుసుకుంటా, అది నా అలవాటు” అన్నాడు.
అనన్య తినలేదు, “నేను తినను, నువ్వు పెట్టినది తినను” అంది హేట్ తో.
రుద్ర కోపం వచ్చి, ప్లేట్ తీసుకుని, అనన్య నోటి దగ్గర పెట్టి, “తిను, అనన్య, నా మాట విను, నీకు నీరసం వస్తే నాకు నచ్చదు” అన్నాడు బేస్ వాయిస్ తో గట్టిగా..
అనన్య “వద్దు” అని తల తిప్పింది, పులిహోర కింద పడిపోయింది.
రుద్ర కోపంతో ప్లేట్ విసిరేసాడు, గోడకి కొట్టి పగిలిపోయింది, అనన్య భయపడిపోయింది.
రుద్ర అనన్య భయం చూసి, వెంటనే కోపం తగ్గించుకుని, “సారీ, నీ మీద కోపం కాదు, నా మీదే, నిన్ను భయపెట్టాను కదా, సారీ, బుజ్జి” అన్నాడు, మొదటిసారి సాఫ్ట్ గా, “బుజ్జి” అని పిలిచాడు.
అనన్య “నన్ను బుజ్జి అనకు, నా పేరు అనన్య, నిన్ను నేను హేట్ చేస్తున్నాను,e” అంది ఏడుస్తూ.
రుద్ర “సరే, హేట్ చెయ్, కానీ తిను, ప్లీజ్” అన్నాడు, “ప్లీజ్” అనే మాట ఫస్ట్ టైం రుద్ర నోటి నుంచి.
అనన్య షాక్, రాక్షసుడు ప్లీజ్ అన్నాడా?
రుద్ర మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసాడు, “తిను, తినకపోతే నేను కూడా తినను, రాత్రంతా ఇక్కడే ఉంటా” అన్నాడు, సోఫాలో కూర్చుని.
అనన్యకి ఆకలి వేస్తోంది, తినక తప్పలేదు, కొంచెం తినింది, రుద్ర చూస్తూ..
రాత్రి అనన్య బెడ్ మీద, రుద్ర సోఫాలో, ఒకే రూమ్ లో, కానీ దూరంగా.
అనన్య “నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళిపో” అంది.
రుద్ర “నా ఇల్లు, నా రూమ్, నా సొంతం పక్కన నేను ఉంటా, నువ్వు పారిపోకుండా చూడాలి కదా” అన్నాడు..
అనన్య “నేను పారిపోతా, చూడు” అంది.
రుద్ర “పారిపో, చూద్దాము, గేట్ దాటగలవా? నా మనుషులు ఉన్నారు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, ఎప్పటికీ, నువ్వు నా బందీవి, నా ప్రేమ బందీవి” అన్నాడు.
అనన్య ఏడుస్తూ పడుకుంది, రుద్ర చూస్తూ, “గుడ్ నైట్, నా రాక్షసి, నా బుజ్జి రాక్షసి” అన్నాడు.
అనన్య “నేను రాక్షసిని కాదు, నువ్వే రాక్షసుడివి” అని ఏడుస్తూ పడుకుంది.
రేపు ఉదయం ఏం జరుగుతుంది? రుద్ర అనన్యని వదులుతాడా? అనన్య హేట్తో నే ఉంటుందా? లేక కొంచెం మారుతుందా?
😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈
Swipe left/right or tap the sides to turn pages