నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 2
ఆకాష్ సంజు ని దూరం జరిపి ఎవరు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు.
సంజు ఎం లేదు అండి బాధ లో ఎవరో కూడా చూసుకోలేదు. నన్ను క్షమించనడి అని చెప్పి అక్కడ నుంచి ముందుకు వెళ్తుంది సంజు.
ఆకాష్ కి డౌట్ వచ్చి సంజు ని ఫాలో అవుతాడు. సంజు సముద్రం లోపలికి ఏడుస్తుంది వెళ్తుంది..
ఆకాష్ ఏమైంది ఈ అమ్మాయి సముద్రం లోకి వెళ్తుంది అని వెనుకే వెళ్తాడు.
ఆకాష్ సంజు దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకొని బయటకి తీసుకువచ్చి లాగి ఒక్కటీ పీకుతాడు.
సంజు చెంప మీద చెయ్యి వేసుకుని ఏడుస్తుంది ఉంటుంది.
ఆకాష్ ఏడ్చవ్ అనుకో ఇంకోటి పీకుతా ముయ్ అని గట్టిగ అరుస్తాడు.
సంజు మీరు ఎందుకు నన్ను కొట్టారు నేను చచ్చిపోతాను నాకు ఎవరు లేరు ఈ ప్రపంచం లో లేరు అని ఏడుస్తుంది.
ఆకాష్ ఎవరు లేకపోతే చచ్చిపోవాలా బుద్ది ఉందా నీకు ఎందుకు ఇలా బెహవె చేస్తున్నావ్ అని తిడతాడు.
సంజు అయినా నువ్వు ఎవరు నన్ను తిట్ట డానికి కొట్టడానికి అని ఆకాష్ మీద కి వెళ్తుంది.
ఆకాష్ నా మీద కోపం ఎదో బతకడానికి చూపించు చావడానికి కాదు అని చెప్తాడు.
సంజు ఆకాష్ వైపు చూస్తూ ఇక్కడ నాకు ఎవరు తెలీదు అని ఏడుస్తుంది.
ఆకాష్ కి సంజు ఏడుస్తుంది ఉంటే చాలా బాధ గా అనిపిస్తుంది.
సంజు ని చూస్తూ నీకు ఇష్టం అయితే నువ్వు మా ఇంట్లో ఉండు. నేను నాన్న తప్ప ఇంకా ఎవరు ఉండరు.
నీకు జాబ్ దొరికిన తర్వాత నువ్వు ఇష్టం అయితే మా ఇంట్లో ఉండే చేసుకి లేకపోతే హాస్టల్ కి వెళ్తా అన్న నీ ఇష్టం. నిన్ను ఈ పరిస్థుల్లో వదిలెయ్యలేక చెప్తున్నా అని చెప్తాడు ఆకాష్.
సంజు ఆలోచిస్తుంది. వెళ్లాలా వద్ద అని….కొంచెం సేపు తర్వాత సరే వస్తా అని చెప్పి ఆకాష్ తో వెళ్తుంది.
ఒక పెద్ద విల్లా ముందు కార్ ఆగగానే సంజు పెద్దకల్లు ఏసుకుని చూస్తుంది.
ఆకాష్ కార్ దిగి సంజు వైపు డోర్ ఓపెన్ చేస్తాడు.
అది చూసిన సంజు మీరు ఇలా చెయ్యాల్సిన అవసరం లేదు అని మొహమాటం గా అంటుంది.
ఆకాష్ సంజు ఇద్దరు డోర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే విశ్వనాధ్ గారు ఆకాష్ ఆగండి అనివల్ల దగ్గరికి వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావ్ హ అమ్మాయి చాలా బాగుంది. నీ పేరు ఏంటి బంగారం అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తె సంజు బిక్క మొకం వేసుకుని చూస్తుంది ఆకాష్ ని.
ఆకాష్ నవ్వుతూ చూస్తాడు విశ్వనాధ్ గారిని.కాసేపు తర్వాత డాడ్ తను సంజన సంజు న ఫ్రెండ్ అని పరిచయం చేసి లోపలికి పదండీ డాడ్ మాట్లాడుకుందాం అని ముగ్గురు హాల్లో కి వెళ్తారు.
ఆకాష్ మెయిడ్ ని పిలిచి సంజు బ్యాగ్ గెస్ట్ రూమ్ లో పెట్టు అని చెప్పి పంపిస్తాడు.
విశ్వనాధ్ గారు చెప్పు బంగారం ఏంటి మేటర్ అని సంజు ని అడుగుతాడు.
సంజు జరిగింది మొత్తం ఆకాష్ కి చెప్పిందే చెప్తుంది.
ఎలా బంగారు వాడ్ని నమ్మి హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చావా అది కాకుండా మీకు ఎవరు తెలీదా. పర్లేదు ఇక్కడే ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఉంటావ్.
ఆకాష్ డాడ్ తను ఫ్రెష్ అయ్యి వస్తుంది మనం డిన్నర్ చేద్దాం అని సంజు ని పంపించి తను తన రూమ్ కి వెళ్తాడు ఆకాష్.
ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. విశ్వనాధ్ గారు కుడా డైనింగ్ ఏరియా వెళ్లి కూర్చుంటారు మెయిడ్ వచ్చి అందరికి వడ్డీస్తుంది.
విశ్వనాధ్ గారు తింటూ ఎదో ఈ కూరలు తినలేక పోతున్నాం ఆకాష్ రుచి లేదు మెయిడ్ ని మార్చు అని ఆకాష్ కి చెప్తాడు.
ఇప్పటికే 20 మెంబెర్స్ పైన మార్చ డాడ్ ఇంకా ఇలా ఎంత మందిని మారచాలి అంటే.
విశ్వనాధ్ గారు టేస్ట్ లేదు రా మ్ చేద్దాం అంటే.
సంజు వాళ్ళ వైపు చూస్తీంది 20 మెంబెర్స్ హ పాపం వాళ్ళు అని ఇబ్బంది గా చూస్తూ అంకుల్ మీకు ఇష్టమైతే నేను వంట చేస్తాను అని చెప్తుంది.
ఆకాష్ వద్దు నీకు ఎందుకు ఇబ్బంది సంజు అంటాడు. ఇబ్బంది మ్ లేదు ఆకాష్ గారు నాకు వంట బాగా వచ్చు అంటే.
విశ్వనాధ్ గారు నీ ఇష్టం తల్లి అంటే అంకుల్ 30 మినిట్స్ వెయిట్ చెయ్యండి అని కిచెన్ కి వెళ్లి కుకింగ్ లో పడిపోతుంది.
30 మినిట్స్ తర్వాత కాజు పన్నీర్ కర్రీ చపాతీలు రసం పొటాటో ఫ్రై వైట్ రైస్ అన్ని మేడ్స్ ని డైనింగ్ టేబుల్ మీద ఏరెంజ్ చెయ్యిమని చెప్తుంది.
మేడ్స్ తెచ్చి టేబుల్ పై పెడితే సంజు లాస్ట్ లో వస్తుంది.
అప్పటికే స్మెల్ అదిరిపోతుంటే విశ్వనాధ్ గారు ఆకాష్ చూస్తూంటారు.
మెయిడ్ వచ్చి సార్ వడ్డించన అని అడిగితె సంజు నెను వడ్డీస్తా మీరు వెళ్ళండి ని చెప్పి తానే విశ్వనాథ్ గారికి ఆకాష్ వడ్డీస్తుంది.
ఇద్దరు తింటూ ఉంటే సంజు చూస్తుంది ఎలా ఉందొ ఏంటో అని ఒక 5 మినిట్స్ తర్వాత విశ్వనాధ్ గారు బాలేచేసావ్ బంగారం సూపర్ రా ఎన్ని రోజులు అయ్యిందో ఏంటి ఫుడ్ తిని అని పొగుడుతూ తింటూ ఉంటే ఆకాష్ సైలెంట్ తింటూ ఉంటాడు. విశ్వనాధ్ గారు ఫుల్ గా తిని నేను బాగా తిన్న కాసేపు వాక్ చేస్తా అని బయటికి వెళ్తాడు.
ఆకాష్ సంజు నువ్వు కుడా తిను అని కుర్చోబెడతాడు. సంజు కుడా తిని ఇద్దరు హ్యాండ్ వాష్ కి వెళ్తారు. ముందు ఆకాష్ హ్యాండ్ వాష్ చేసుకుని పక్కకి వస్తే తర్వాత సంజు హ్యాండ్ వాష్ చేసుకుంటుంది.
ఆకాష్ సంజు ని గట్టిగ హాగ్ చేసుకుంటాడు. సంజు షాక్ అవుతుంది కానీ ఆకాష్ లో ఎదో బాధ ఉండి అని ఆకాష్ వెన్ను నిమురుతూ ఏమైంది ఆకాష్ గారు అని అంటుంది. ఆకాష్ సంజు కి దూరం జరిగింది మ్ లేదు సంజు వంట చాలా బాగా చేసావ్ అని చెప్పి ద మనం కుడా కాసేపు వాక్ చేద్దాం అని గార్డెన్ లో విశ్వనాధ్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు.
విశ్వనాధ్ గారు పాటలు పడుతూ నడుస్తూ ఉంటారు.
సంజు అంకుల్ మీరు సాంగ్స్ కుడా పడతారా అని అడుగుతింది.
me అంకుల్ అన్నింట్లో అరితేరి పోయారు అని చెప్తాడు ఆకాష్.
విశ్వనాధ్ గారు ఎప్పుడైనా హ్యాపీ గా అనిపిస్తే పడతారా అని చెప్తాడు.
సంజు గార్డెన్ చుట్టు చూస్తూ అక్కడ్ పక్కన ఒక విల్లా సైడ్ చూస్తుంది.
అక్కడ ఒక ఆమె విశ్వనాధ్ నే చూడడం గమనించి ఎవరు అంకుల్ నే ఎందుకు చూస్తుంది అని ఆలోచిస్తూ ఉండి.
సంజు ఆమెను చూసింది అని గమనించి తను లేచి విల్లా లోకి వెళ్తుంది.
సంజు ఎవరో లే అనుకుని ముగ్గురు కాసేపు ఆలా ఉండి పడుకోడానికి వెళ్ళిపోతారు..
ఆలా అందరి నైట్ ముగుస్తుంది….
కంటిన్యూ…
next పార్ట్ లి సిద్దు స్వప్న వస్తారు 🫣🫣🫣🫣
Swipe left/right or tap the sides to turn pages