New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ మనసు నాకు తెలుసు – 2

నీ మనసు నాకు తెలుసు – 2

నీ మనసు నాకు తెలుసు-2

 

 

నేను నిన్ను వెంటనే కలవాలి… నువ్వు అర్జెంట్ గా మనం మీట్ అయ్యే ప్లేస్ కి రా అని చెప్పి…. ఫోన్ కట్ చేస్తుంది స్నేహ…..

 

 

అర్థగంట తర్వాత…. 

 

స్నేహ: హాయ్ దేవా!!….ఎలా ఉన్నావ్???

 

దేవాన్ష్: ఫస్ట్, స్టాప్ కాలింగ్ మీ దేవా… మై నేమ్ ఇస్ దేవాన్ష్….. నన్ను, దేవా అని నాకు కావలసిన వాళ్ళే పిలవాలి…ఇంకా ఎవరు అయిన అలా పీలిస్తే నాకు నచ్చదు చెప్తున్న… 

 

 

స్నేహ: నేను, నీకు ఏమి అవ్వను ఆ దేవా?? నేను నీకు కావలసిన దాన్ని కదా???

 

 

నువ్వు నాకు ఏమి కావు….నీకు, ఇప్పటికీ చాలా సార్లు చెప్పా… అండ్ అలా పిలవకు నన్ను… ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్… ఇంకోసారి అలా పిలిస్తే ఏం చేస్తానో నాకు తెలియదు… మైండ్ ఇట్ స్నేహ…… అని గెట్టిగా అరుస్తాడు దేవాన్ష్…

 

 

స్నేహ: నీకు, ఎన్ని సార్లు చెప్పాలి దేవా!! నువ్వు అంటే నాకు ఇష్టం అని… నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాట పూర్తి అయ్యే లోపు… స్నేహ చెంప మీద గెట్టిగా కొడతాడు దేవా!!! 

 

 

దేవా: నీలాంటి, వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడితే అసహ్యం వేస్తుంది…. వెళ్ళిపో ఇక్కడ నుండి… ఇంకోసారి, నా కంటికి కనిపించవు అనుకో చంపేస్తా చెప్తున….

 

 

స్నేహ: నా మీద ప్రేమ లేకపోతే… ఎందుకు నేను పిలవగానే  వచ్చావు…..

 

 

ఇంకోసారి, నువ్వు పిలిస్తే రాను అని చెప్పడానికి… నా జీవితం లోకి మళ్ళీ రాకు అని వన్ లాస్ట్ టైమ్ చెప్పడానికి…. మళ్ళీ వచ్చావు అనుకో రిజల్ట్ వేరేలా ఉంటుంది… ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నువ్వు ఊహించలేవు…అని చెప్పి అక్కడ నుండి తన కారు లో వెళ్ళిపోతాడు దేవాన్ష్…..

 

 

స్నేహ: నిన్ను వదలను దేవాన్ష్… ఎలాగ అయినా నిన్ను నా సొంతం చేసుకుంటా…. ఎవరు అయిన అడ్డు వస్తె… చంపడానికి కూడా వెనక ఆడను….. అని కోపం గా కారు మీద కొట్టి… అక్కడ నుండి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది…

 

 

…………………………………..

 

VD Technologies కంపెనీ lo….

 

 

దివ్య కంపెనీ HR వంశీ తో….

 

సార్, ఇంటర్వ్యూస్ కోసం వచ్చారూ…… ఇంటర్వ్యూ తీసుకోవాలి…..

 

 

వంశీ: ఓకే, ఫస్ట్ వాళ్ళ రేసుమేస్ అని కలెక్ట్ చేస్కో…. ఇంకా టైమ్ ఉంది కదా… ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది… ఆ లోపు రేసుమేస్ తీసుకొని వెయిట్ చేయమని చెప్పు వాళ్ళని…..

 

 

అలాగే, సార్… అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది దివ్య….

 

 

దివ్య బయటకి వెళ్తూ… మనసులో… ఈ సీత ఏంటి?? ఇంకా రాలేదు…. ఫాస్ట్ గా రమ్మని చెప్ప కదా…. మాక్సిమం ఇంకో అర్థ గంట లేదా… ఒక నలభై నిమిషాలు చూస్తారు… ఎక్కడ ఉందో ఏమో ఇది!!???

 

 

 

……………………………….

 

 

సీత: అన్న, ఇంకా ఎంతసేపు పడుతుంది?? ఫస్ట్ గా పోనీ అన్న…

 

 

ఆ అయిపోయింది అమ్మ…. ఇంకో ఐదు నిమిషాలు అంతే….

 

 

సీత: అసలు, ఏ ఆ బాస్ కి కోపం ఎక్కవ అంట…. లేట్ అయితే ఇంటర్వ్యూ తీసుకుంటాడో, లేదో అని అనుకొనే లోపు…. ఆఫీస్ వస్తుంది….

 

 

హమ్మయ్య, అని అనుకుంట లిఫ్ట్ దెగ్గరకు నడుస్తూ వెళ్తూ ఉంటే….. దారిలో ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు…. సీత అతని దెగ్గరకు వెళ్లి….

 

 

సీత: హాయ్, నా పేరు సీత….సీత మహాలక్ష్మి…..మీరు???

 

 

ఆ వ్యక్తి దానికి ఏం సమాధానం ఇవ్వడు….

 

 

వీడు, ఏంటి?? ఇంట్రవర్ట్ ఆ?? లేక సిగ్గు ఆ??పోనీ లే… అని సీతనే మళ్ళీ మాట్లాడుతూ… ఏంటి అండి ఏం మాట్లాడం లేదు??… మీకు మాటలు రావు ఆ ఏంటి?? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చా… మరి మీరు???

 

 

దానికి ఆ వ్యక్తి మళ్ళీ సమాధానం ఇవ్వడు…. మళ్ళీ సీత… హలో, వినిపిస్తుందా నీకు??? లేక చెవుడ ఆ??

 

 

దానికి ఆ వ్యక్తి… వస పిట్ట లాగా వాగుతూనే ఉంటావా ఆ నువ్వు?? నోరు మూత పడదు ఆ నీకు?? మెంటల్….

 

 

సీత కోపం గా… నన్ను వస పిట్ట, మెంటల్ అంటావా…నా గురించి నీకు తెలియదు… కొట్టాను అనుకో… నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను గుర్తు పట్టలేరు… అలా ఉంటుంది నా దెబ్బ… 

 

 

ఆ ఏంటి?? కొడతావు ఆ నన్ను?? ఏది కొట్టు చూద్దాం అంటాడు… ఆ వ్యక్తి…

 

 

సీత: ఈరోజు, సోమవారం నేను ఎవరి పైన చెయ్యి చేసుకొను… కాబట్టి, బతికి పోయావు.. లేదు, అంటే నా.!!అయిన ఇంటర్వ్యూ కి వచ్చావు అని తెలుస్తుంది లే…. నీకు, ఇంటర్వ్యూ గురించి చిన్న ఇన్ఫర్మేషన్…

 

 

ఏంటి అది??… అని ఆ వ్యక్తి అడుగుతాడు….

 

 

సీత: అది, చూసావా… నీతో, ఎలా మాట్లాడించానో… 

 

 

ముందు ఇన్ఫర్మేషన్ చెప్పు…. అని అడుగుతాడు….

 

 

సీత: ఆ బాస్…అదే, ceo గారికి…. కోపం ఎక్కవ అంట… ఎక్కవ మాట్లాడితే నచ్చదు అంట వాడికి…!!! వాడు కానీ, నాకు కనిపించాడు అనుకో… నన్ను ఏం అయినా అన్నాడో అనుకో…. వాడికి ఇస్తా ఒక మంచి ట్రీట్మెంట్….. నేను, నిన్ను ఏం అనను లే బయపడకు… అయిన వాడితో తో పోల్చుకుంటే నువ్వు మంచివాడివి అని నాకు అనిపిస్తుంది…అందుకు ఏ వదిలేస్తున్న… బాయ్ అండ్ ఇంటర్వ్యూ జాగ్రత్త…. వాడు ఏం అయిన అంటే నాకు చెప్పు… నిన్ను చూస్తూ ఉంటే వాడిని నువ్వు డీల్ చేయలేవు అనిపిస్తుంది…అని ఆ వ్యక్తి భుజం పైన చిన్నగా తట్టి వెళ్ళిపోతుంది…

 

 

సీత వెనక్కి తిరిగి ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావు నువ్వు?? ధైర్యం గా ఉండి అని అరిచి వెళ్ళిపోతుంది సీత…. 

 

To be continued……..