పులి పంజా 🐯 – 3
భాగం – 3
వెళ్లిన వారెవరికి ఎటువంటి ఆపద కలుగకుండా చూసుకో తల్లి అంటూ ఊరి ప్రజలు అంతా బోరున ఏడుస్తూనే పూజలు చేసేసారు కాళికా మాతకి.
తమ భర్తలు ఆపదలో ఉన్నారు అని తెలుసుకున్న సుబ్బుడు, రంగయ్య, సోమయ్య భార్యల గుండెల్లో గుబులు వద్దనుకున్నా వచ్చేస్తుంది.
వాళ్ల భయాన్ని మిగతా వాళ్లంతా ఓదార్చే పనిలో ఉంటే, ఆ ఊరి రచ్చ బండ పై కూర్చుని అడవి లోపలికి వెళ్తున్న ఆ కుర్రాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయాడు ఆ ఊరి పెద్దయ్య.
లోపల ఉన్న సితాలు చలికి ముద్దుగా ముడుచుకొని తన మీదున్న ఆ చిట్టి దుప్పటిని తన బుజ్జి చేతులతో పిడికిట నిండా బంధించి బుజ్జిగా ముడుచుకొని పడుకున్న ఆ చిన్ని పాప పక్కన పడుకొని,
తన గుండెల మీదకి తనని తీసుకొని చిన్నగా జో కొడుతూనే లో లోపల తన మామకి ఎలాంటి ఆపద కలుగకుండా చూసుకో తల్లి అంటూ తెగ ప్రార్థనలు చేసేసింది వాళ్ళ దేవతకి.
అడవికి దగ్గరైన కుర్రాళ్ళు అప్పటి వరకు వాళ్ళ ఊరి వెలుగు వల్ల ఎటు ఏది ఉందో తెలుసుకోగలిగిన వాళ్ళు సరిగ్గా ఆ అడవి దగ్గర పడగానే చిమ్మ చీకటి ఆహ్వానించి,
చేతిలో పట్టుకున్న టార్చి లైట్లని ఒక్క సారిగా అందరూ వెలిగించి ఒక దిక్కు కి ఇద్దరు చొప్పున బయలుదేరారు లోపలికి.
ఎవరి చేతుల్లో వారి వారి తుపాకులతో పాటు ఆ కొండ జాతి వాళ్లకు బాగా అలవాటు ఉన్న విషాన్ని పూసిన కత్తులు కూడా జతగా పెట్టుకొని మరీ నెమ్మదిగా ముందుకు నడిచారు.
ముందుకు వెళుతూనే, “ఎవరు అజాగ్రత్తగా ఉండకండి రా. నాలుగు దిక్కులా మీ కళ్ళు ఎప్పటికీ ఉంటూనే ఉండాలి. ఏ ఒక్క దిక్కు దగ్గర మీరు అప్రమత్తంగా ఉన్న ఆ తర్వాత జరిగేది మనం ఊహించుకోలేము. అందుకే జాగ్రత్తగా ఇద్దరూ జతగా కలిసే నడవండి ఎక్కడ విడిపోకండి.”
అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే తన వెంట వస్తున్న తన ప్రాణ మిత్రుడు అయినా సోముని ముందుకు నడిపించాడు రాము.
జంటలు చొప్పున నాలుగు దిక్కుల వైపుగా వెళ్లిన నాలుగు జంటలు ప్రతి ఒక్క ప్రదేశాన్ని ఇంచ్ బై ఇంచ్ పరీక్షిస్తూనే పులి జాడలు కానీ దాని రాక కానీ ఎక్కడ కొద్దిగా కనిపించిన వెంటనే అప్రమత్తం అయిపోయి ఆ పక్కనే ఉండే పెద్ద పెద్ద చెట్ల వెనుక దాగుండిపోతున్నారు.
“రేయ్ రాము మామ ఇటు వైపే వచ్చి ఉంటాడంటావా” ఆ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాన్నంతా వెతుకుతూనే అడిగాడు సోము.
“ముందు చూద్దాం రా రా. ఇంతకీ మామ ఇంట్లోనే ఉన్నాడా..?”
అడిగిన రాము మాటలకి అప్పటి వరకు తన నాన్న గురించి గుర్తుకు రాక ఒక్క క్షణం గుండె బెదురు మొదలవడం ఆలస్యం,
“తెలియదు రా అల్లారం వినగానే నేను భయంతో బయటికి వచ్చేసా. నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో చూసుకోలేదు. కొంపదీసి నాన్న కూడా మామతో పాటు వచ్చాడు అంటావా.”
తన భయాన్ని చూసి ఇంకా తన భయం రెట్టింపు చేయలేక, “ముందు చూద్దాం రా చూస్తే తెలుస్తుంది కదా.”
తనలోని భయాన్ని బయట పెట్టక మెల్లిగా అంటున్న రాము మాటలకి, “భయం వేస్తుంది రాము నిజంగా నాన్నకి ఏం కాలేదు కదా.”
“నీ మాటలతో నన్ను భయపెట్టకు రా ఇప్పటికే నాన్న అల్లారం మోగించాడు అంటే కచ్చితంగా ఏదో ఆపద ఉంది అనే అర్థం అదేంటో తెలియక భయంతో చచ్చేలా ఉన్నాను నేను.
ఇప్పుడు మామ కూడా అక్కడే ఉన్నాడు అంటే నా ఆలోచనలు సరిగ్గా పని చేయవు అందుకే మనం ఆలస్యం చేసే కొద్ది మన భయాలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్పితే తరగవు.
అందుకే గమ్మున ముందుకు నడువు” ఇంకొక సెకండ్ అలానే మాట్లాడితే ఎక్కడ లేని పోని ఆలోచనలు వచ్చేస్తాయో ఏమో అన్న భయంతోనే గట్టిగా అరిచి మరి ముందుకు నడిపించాడు సోముని…
అదేంటో ప్రకృతి అమ్మ ఎవరు చెప్పినా చెప్పకపోయినా తన పని తాను ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది కదా.
అలానే సోము గుండెలో మొదలైన గుబులు ముందుకి ఒక్కొక్క అడుగు వేసే కొద్ది ఇంకా ఇంకా రెట్టింపు అవుతూనే ఉందే తప్పే తగ్గటం లేదు.
ఎంత దాన్ని తగ్గించుదామన్న తన వల్ల కావడం లేదు.
లోపల జపిస్తున్న జపాన్ని మాత్రం మరవలేదు, విడువలేదు.
తన నాన్నకి ఏం కాకూడదు ఏం కాకూడదు అని జెపిస్తూనే ముందుకు నడిచాడు.
ఇంకా ఉంది…
సోమయ్య చనిపోయిన విషయం అతని భార్య కొడుకులకి తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇప్పుడేం జరుగుతుంది?
నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి.. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..
నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…
ఇట్లు
మీ కీర్తి💕
Swipe left/right or tap the sides to turn pages