New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 2

పులి పంజా 🐯 – 2

భాగం – 2 

 

ఆ వెనుకగా ఉన్న ఒక చిన్న లోయలోకి దూకేశాడు సోమయ్య. 

 

అతను దూకటం చూసి అతని వెను వెంటనే మీదకి దూకేసింది పులి.

 

గాలిలో కింద సోమయ్య అయితే అతని పైనే పులి తన పంజాలని తన వైపే చూపిస్తూ రౌద్రంగా గర్జిస్తూ మీదకి వచ్చేస్తుంది. 

 

ఆ పులి గర్జనకి దాని రౌద్రపు రూపానికే వెన్ను వరకు పాకిన ఆ వణుకు వీక్ గా ఉన్న అతని గుండెకి తగిన బలాన్ని చేకూర్చలేక గాలిలో ఉండగానే అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. 

 

దానితో పాటే అతని ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. 

 

ప్రాణం పైకి లేచిన మరు క్షణం లోయ లోకి దూకిన అతని శరీరం దబ్బున కింద పడిపోతే, 

 

దాని వెనకే దూకిన పులి అమాంతం అతని శరీరం పై దాడి చేసి తనకి ఉన్న ఆకలినంత అతని పై తీర్చేసుకుంది.

 

మరో రెండు దిక్కుల వైపుగా పారిపోయిన సుబ్బడు, రంగయ్య వారి వెనుక ఎటు వంటి పులి రాక కనిపించక ఎవరికి కానరానంత దూరానికి పరిగెత్తుతూనే బెదురు నిండిన గుండెల నిండా ఊపిరి పీల్చేసుకున్నారు. 

 

గుహలో దాగున్న వీరయ్య, సేఫ్టీ గా అతని వెంట తెచ్చుకున్న ఒక చిన్న మొబైల్ అల్లారంతో భారమవుతున్న ఊపిరితోనే అతి కష్టం మీద సిగ్నల్ పంపించేశాడు ఎవరికో. 

 

ఆ సిగ్నల్ అందిన సుబ్బడు, రంగయ్య అది ఎవరు పంపించారో తెలుసుకొని తిరిగి వీరయ్య దగ్గరికి వెంటనే వెళ్లాలని ఉన్నా, అక్కడ పులి ఉంటదేమో అన్న భయంతో తిరిగి వెళ్లలేక పోయారు. 

 

కానీ ఈ దట్టమైన అడవిలో మోగించిన వీరయ్య అల్లారం నేరుగా వాళ్ళ ప్రాంతం వాళ్లకి చేరుకొని ప్రశాంతంగా బజ్జొని ఉన్న ఆ ఊరి జనాన్ని అంతటినీ నిద్ర లేపేసింది. 

 

మనసిచ్చిన ప్రియురాలిని కనులారా చూసుకుంటూనే నిద్రలోకి జారుకున్న రాము ఉలిక్కి పడి లేచాడు తండ్రి పిలుపుకి… 

 

అప్పటికే వీరయ్య అల్లారం వల్ల ఆ ఇంటిలోని వాళ్లంతా లేచేసి ఉండటంతో మంచం పై పనుకున్న సీతాలు, “బావా మామ.”

 

గాబరాగా అప్పుడే లేచిన రాముని చూస్తూ అంటున్న తన మాటలకి విషయం బుర్ర కెక్కిన రాము వెంటనే ఆ చిన్ని గుడిసెలో ఉన్న ఒక తుపాకిని చేతుల్లోకి తీసుకొని సీతాలు పక్కనే ఉన్న ఒక చిట్టి పాప చెంపని చిన్నగా తట్టి, 

 

“జాగ్రత్త రా నేను వచ్చేంత వరకు మీరు ఎవరు బయటికి రాకండి బాగా గుర్తు పెట్టుకో నేను వచ్చేంత వరకు ఎవరు బయటికి రాకండి మర్చిపోవద్దు. సరేనా.”

 

సీతాలు కళ్ళల్లోకే చూసి చెబుతూ పడుకున్న ఆ బుజ్జి పాపకి మేలుకొని ఉన్న తన బుజ్జికి నుదిటిన ముద్దులు పెట్టేసి తన యువత గ్యాంగ్ ను తీసుకొని అడవి వైపుగా తరలాడు రాము.

 

వెళుతున్న తన బావ వైపే కంగారు నిండిన కళ్ళతో చూస్తూ వాళ్ళ కుల దైవం అయిన కాళికా మాతకి, “ఎవరికి ఎటువంటి ఆపదలు కలుగకుండా చూసుకో తల్లి” అంటూ మనసారా వేడుకుంది సీతాలు. 

 

“రేయ్ రాము ఏమైంది రా అయినా మామ వాళ్ళు ఇంత రాత్రి వేళ ఎందుకు వెళ్లారు అది మనకు చెప్పకుండా” అడవి వైపుగా పయనిస్తూనే కంగారుగా అడిగాడు సోము. 

 

“నాకేం తెలుసు రా. ఇవాళ వెళ్ళను అని చెప్పాడు నాతోటి. కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు అలా వెళ్లిపోయాడో తెలియడం లేదు. ఎవరికి ఏం కాకుండా ఉంటే అదే చాలు ముందు మాటలు ఆపి మీరు పదండి.”

 

మాట్లాడుతూనే అందరినీ గద్దించి అప్పటికే బయటికి వచ్చిన వాళ్ల గూడెం పెద్దయ్యకి విషయాన్ని చెప్పి పరుగున అడవిలోకి వెళ్లిపోయారు పిల్ల మూక. 

 

విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు అంతా ఒక్క చోట గుమ్మి కూడి ఎవరి ఇంట్లో ఎవరెవరు లేరో పరీక్షించి మరి తేల్చుకున్నారు ఎవరెవరు అడవిలోకి వెళ్లారు అనేది. 

 

వీరయ్య, సోమయ్య, రంగయ్య, సుబ్బుడు నలుగురు కనీసం ఆ ఊరి పెద్దకి కూడా ఒక్క మాట చెప్పకుండా వాళ్ల ఇష్టానుసారం గా అడవి లోపలికి వెళ్లిపోయారు అన్న కోపం వస్తున్నా, 

 

వెళ్లిన వారెవరికి ఎటువంటి ఆపద కలుగకుండా చూసుకో తల్లి అంటూ ఊరి ప్రజలు అంతా బోరున ఏడుస్తూనే పూజలు చేసేసారు కాళికా మాతకి.

 

ఇంకా ఉంది…

 

ఇప్పుడు ఏం జరగబోతుంది?

రామయ్య వాళ్ళ కోసం వెళ్లిన రాము సోములు వాళ్ళని సురక్షితంగా కాపాడతారా?

లేదా వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారా?

అసలు ఆ అడవిలో ఏం జరుగుతుంది?

 

నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి.. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…

 

ఇట్లు

మీ కీర్తి💕