పెళ్లి చూపులు -31 “నువ్వు చెప్పేది అంతా నిజమేనా” అని పక్కనే కూర్చుని వాళ్ళ మాటలు వింటున్న విజయేంద్ర గారు వైష్ణవ్ వైపు సూటిగా చూస్తూ మనసులో అనుకున్నారు.. విజయేంద్ర గారు మనసులో ఉన్న మాటలు వైష్ణవ్ కి అర్థమైనట్లుగా అని గారంగా “నాన్న” పిలుస్తూ తన తండ్రి పక్కన వెళ్లి కూర్చున్నాడు.. “నీ గారాలన్నీ నాకు తెలుసులేరా? ఏంటి విషయం గాలి ఇటువైపు మళ్ళింది” అని అడిగాడు విజయేంద్ర.. …