New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘 – 1

ప్రియమైన శత్రువు💘 – 1

ప్రియమైన శత్రువు💘1
ఓం…
మిస్టర్ అలోక్ నందన్.. ఆ సక్సెస్ పార్టీలో ఏ కార్నర్ చూసిన వినిపిస్తున్న పేరు.
వింటున్న వాళ్లకి మాట్లాడుకుంటున్న వాళ్లకి ఆ పేరు కొత్త కాదు.. కానీ ఇప్పుడు రాదు అనుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అలోక్ సాధించడమే ఈ పార్టీలో మోస్ట్ స్పెషల్ సెలబ్రేషన్. 
అలోక్ కంపెనీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, అతని లైఫ్ లో అత్యంత వాల్యుబుల్ స్టెప్, తన చిరకాల శత్రువుని జయించిన గొప్ప విజయం.
అది తెలిసేలా పార్టీ లో గ్రాండ్ నెస్ ఆడ్ చేసిన అలోక్ ఆ పార్టీ వరకు మాత్రమే కాదు బిజినెస్ సర్కిల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్.
అప్రిషియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరితో జెంటిల్ గా బిహేవ్ చేస్తున్న అలోక్ ముఖంలో ఆ విజయం దాని తాలూకు ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. 
కొంచెం లైట్ తక్కువగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉంది ప్రియా చౌదరి. అలోక్ ప్రతి మూమెంట్ ని ఇష్టంగా అబ్సర్వ్ చేస్తున్న తనలో చెప్పలేని ఆనందం రెట్టించిన ఉత్సాహం. 
ఎంత మందిలో ఉన్నా అలోక్ కూడా నిమిషానికి ఒకసారి ప్రియా మీదికి చూపు తిప్పుతూ కళ్ళతోనే ఏదేదో చెప్తున్నాడు. 
అందుకుగాను తను ముసిముసిగా సిగ్గుపడి నవ్వుకుంటూ ఆలోక్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న తన పేరెంట్స్ ని చూపించింది కళ్ళతోనే.
వాళ్ళని చూడగానే ఆలోక్ లో మరింత హుందాతనం వచ్చి చేరింది.  
ఆరు అడుగుల తన క్లాసిక్ అప్పీయరెన్స్ కి ఇప్పుడు మరింత అట్రాక్టివ్ గా మారిపోయాడు.
ఆరడుగుల ఎత్తు, తెల్లటి రూపం, కండ తిరిగిన దేహం, ఒత్తైన జుట్టు, పూర్తిగా అట్రాక్ట్ చేసే పిల్లి కళ్ళు.. అవి తన తల్లి నుంచి వచ్చిన సంపద వారసత్వం ఇంకా అందరినీ ఆకర్షించే అందం.
చిన్నపాటి కంగారు ప్రియా లో. కళ్ళతోనే తను చెప్తున్నది అర్థం చేసుకున్నాడు అలోక్. 
కాలేజ్ టైమ్ నుంచి అలవాటు పడిన ఆ మూగ బాసాలు వాళ్ళిద్దరికీ మాత్రమే సొంతం.
నేను ఉన్నాను అన్నట్టు ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూనే వేళ్ళతో భరోసా ఇచ్చాడు అలోక్.
తన నుంచి రిప్లై రావడమే.. చిన్నగా కళ్ళు ఆర్పి ఫోన్ తీసుకొని తల్లికి రింగ్ చేసింది ప్రియా. 
బిజినెస్ సర్కిల్ లో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్న రేణుక గారు ఫోన్ అటెండ్ చేసి ప్రియా తో మాట్లాడి భర్త దగ్గరికి వచ్చి ఏదో చెప్పారు. 
అక్కడి నుంచే కూతుర్ని చూసిన రవికాంత్ చిన్న నవ్వు బదులు ఇచ్చి స్వయంగా ఆయనే అలోక్ దగ్గరికి వెళ్లి విష్ చేశారు.
ఆ పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియ ఎగిరి గంతు వేసినట్టే గబగబ పేరెంట్స్ దగ్గరికి వచ్చింది. 
బట్ తన ఆలోచన తన చూపు అంతా అలోక్ మీదనే ఉంది. 
పెద్దవాళ్ళు ఎదురుగా ఉండడంతో కంట్రోల్ చేసుకుంటున్నాడు అలోక్. 
రెండు రోజుల క్రితం తన విక్టరీ అనౌన్స్ అవ్వగానే ప్రియా దగ్గరికి ఎగురుకుంటా వెళ్లి తనని సుడిగాలిలా చుట్టేసి గాలిలో గింగిరాలు తిప్పుతూ ఊపిరికి ఉక్కిరి బిక్కిరి చేసిన అలోక్ సంతోషం చిన్నది కాదు.
ఇప్పుడు కూడా అందరి ముందు ప్రియా చేతిని పట్టుకొని తన విక్టరీ తన ఫ్యూచర్ ప్రియా అని చెప్పాలని ఉంది అతనికి.
అడ్మర్ ఫీల్ తో రవికాంత్ మాట్లాడుతుంటే ప్రియా ను దగ్గరికి తీసుకోవాలనే కోరిక అతికష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నిలుచున్నాడు.
నువ్వు చెప్పింది చేసి చూపించావు. ఇప్పుడు మా ప్రియా గురించి నాకు ఎటువంటి టెన్షన్ లేదు అండ్ ఇక నా బాధ్యత మాత్రమే మిగిలి ఉంది.. రేపే ముహూర్తాలు పెట్టిస్తాను అని అలోక్ భుజం ప్రెస్ చేసి చాలా ప్రౌడ్ గా చెప్పారు రవికాంత్. 
ఆయన్ని హగ్ చేసుకుని థాంక్స్ చెప్పిన అలోక్ ఆ పక్కనే ఉన్న ప్రియ చేతిని నెమ్మదిగా ప్రెస్ చేసి వదిలాడు.
పేరెంట్స్ ఉండడంతో సిగ్గు పడుతూనే చిరు కోపం చూపించిన ప్రియా తల్లి పక్కకి వెళ్ళింది. 
అలోక్ ఇంకా ప్రియా హ్యాపీ మూమెంట్స్ చూస్తున్న రెండు కళ్ళు వాటి ఎదురు చూపులకు తెర దించాయి. 
నిన్ను ఈ విధంగా చూడాలని ఇప్పటివరకు వెయిట్ చేశాను.. అని కనుపాప దాటి బయటికి జారుతున్న కన్నీటి చుక్కను మొదట్లోనే అదిమిపెట్టి తుడిచి లేచిన ఆ వ్యక్తి వడివడిగా చీకటిలోకి చేరిపోయింది.
అసహనం తో చూస్తున్న మరో రెండు కళ్ళల్లో నిరుత్సాహం. 
మీ ముఖంలో సంతోషం కన్నా ఎక్కువగా భయం కనిపిస్తుంది అని అతని పక్కనే ఉన్న వ్యక్తి చెప్తుంటే 
ఈ విజయం వాడిని ఎక్కడ వరకు తీసుకువెళ్తుందో తెలియడం లేదు.
నా ఎదురు చూపులకు అందకుండా పోతున్నాడు, జాగ్రత్తగా చూసుకో.. అనేసి పార్టీలోకి రాకుండానే వెనక్కి తిరిగాయి ఆ రెండు పాదాలు. 
విజయాన్ని ఇవ్వాలని ఒకరు ఆరాట పడితే ఆ విజయం చూసి భయపడుతూ మరొకరు.. చిత్రంగా ఇద్దరు దగ్గరకు రాలేని దూరంలోనే మిగిలిపోయారు. 
ఇవేమీ తెలియని అలోక్ తన లైఫ్ లో ఈ మెమొరబుల్ విక్టరీ తో పాటు తన ఫ్యూచర్ లైఫ్ కి అతి ముఖ్యమైన మరో బిగ్గెస్ట్ సెలబ్రేషన్ కి ప్రిపేర్ అయిపోయాడు. 
11 ఫ్లోర్ బాల్కనీ నుంచి స్ట్రీట్ లైట్స్ తో చిత్రంగా మెరుస్తున్న మహానగరాన్ని చూస్తూ ఇంపోర్టెడ్ Cuban Cigar  ని గుప్పుమనిపిస్తున్నాడు ఆరు అడుగుల సాలిడ్ విగ్రహం.
హాఫ్ డ్రెస్ తో ఉన్న అతని అప్పర్ బాడీ నిండా సన్నటి చెమట.. కష్టపడి క్యాలరీస్ కరిగించడం లేదా ఆ రేంజ్ లో ఎవరినో కుమ్మడం గాని చేసి ఉండాలి.
కొంచెం ముందుకు వెళ్లి చూస్తే.. వదులుతున్న పొగ, రైస్ అవుతున్న హార్ట్ బీట్, అతని ముఖంలోని ఎరుపుదనం.. ఆగ్రహంతో రగిలిపోతున్నాడని చెప్పకనే చెప్తున్నాయి. 
అతనికి కాస్త దూరంలో నిలబడ్డ ఇద్దరు చేతులు బిగించిన భయం లో దేనికోసమొ ఎదురు చూస్తున్నట్టే ఉన్నారు. 
¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢
టైటిల్ చూశారుగా అక్కడే సగం అర్థమైపోయి ఉండాలి.
టైటిల్ కి తగ్గట్టే స్టోరీ మొత్తం ఫ్రీయంగా ప్రియమైన శత్రువుల మధ్య నడుస్తుంది. 
మిగతా స్టోరీస్ లాగా దీనిని కూడా ఆదరించి అభిమానించి మీ అమూల్యమైన కామెంట్స్ తో సక్సెస్ ఫుల్ గా ఆరంభం పలకాలని కోరుకుంటూ మీ వర్ణ.
కామెంట్స్ మస్ట్ బేబీస్..
మళ్లీ కలుద్దాం
_వర్ణ.