New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘 – 2

ప్రియమైన శత్రువు💘 – 2

ప్రియమైన శత్రువు💘 2 
కొంచెం ముందుకు వెళ్లి చూస్తే.. వదులుతున్న పొగ, రైస్ అవుతున్న హార్ట్ బీట్, అతని ముఖంలోని ఎరుపుదనం.. ఆగ్రహంతో రగిలిపోతున్నాడని చెప్పకనే చెప్తున్నాయి. 
అతనికి కాస్త దూరంలో నిలబడ్డ ఇద్దరు చేతులు బిగించిన భయం లో దేనికోసమొ ఎదురు చూస్తున్నట్టే ఉన్నారు. 
ఆ క్షణం వచ్చినట్టే ధడల్నా డోర్ తీసుకొని లోపలికి వచ్చిన అతని సెక్రటరీ అప్పటివరకు వచ్చిన వేగాన్ని సడన్ బ్రేక్ తో కంట్రోల్ చేస్తూ నెమ్మదిగా చిన్న అడుగులతో అతని దగ్గరకు వెళ్లి.. సార్ అని చిన్న గొంతుకతో పిలుస్తూనే వెడ్డింగ్ కార్డ్ అతనికి కనిపించేలా గ్లాస్ వాల్ కి పెట్టింది. 
క్షణం కేవలం క్షణం అంటే క్షణం మాత్రమే.. వెడ్డింగ్ కార్డు గమనించిన అతని కళ్ళు మరింత ఎర్రగా మారితే చేతిలో తగలడుతున్న సిగర్ ని కార్డు మీద క్రష్ చేసిన అతని పెదవులు మీద ఒక క్రూయల్ స్మైల్ చేరింది. 
భయపడిపోయి సెక్రటరీ వదిలేసిన కార్డ్ ని షూ కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్లి మూలన పడవేసి ఉన్న తన షర్ట్ తీసుకున్న అతను ఫ్లోర్ మీద సోయ లేకుండా పడి ఉన్న వాడిని కళ్ళతోనే సెక్రటరీకి చూపించి షర్ట్ షోల్డర్ మీద వేసుకొని తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళాడు.
త్రీ ఇన్ వన్ గ్రాండ్ కన్వెన్షన్.. సాయంత్రం పెళ్లి ముహూర్తంతో సిటీలోని అతిరథ మహారధులతో నిండిపోయి ఉంది. 
రాయల్ డిజైనర్ వెడ్డింగ్ శార్వాణి లో రాజకుమారుడిలా మెరిసిపోతున్న అలోక్ మండపంలో పంతులుగారు చెప్పినట్టు గణేష్ పూజ చేస్తున్నాడు.
ఏ క్షణమైనా తనకోసం తరలివచ్చే రాకుమారిని పెళ్లి బట్టల్లో చూడాలని ఆరాటపడుతున్న అతని కళ్ళు ప్రియా కోసం వెయిట్ చేస్తున్నాయి.
ప్రియా చౌదరి వెడ్స్ అలోక్ నందన్.. కార్డు మీద పక్కపక్కనే ఉన్న ఇద్దరి పేర్లు వేళ్ళతో తడుముతుంది ప్రియా. 
మెహందీ ఎరుపుతో ముచ్చటగా మెరుస్తున్న ఆమె ముని వేళ్ళ కింద అలోక్ ఫోటో మరింత అందంగా ఉంటే చూస్తూ ఉండిపోయింది. 
ఓయ్ పీటల మీద నీకోసం నీ వాడు వెయిట్ చేస్తున్నాడు, నువ్వు ఫోటో చూస్తూ కూర్చుంటే అక్కడ ఎవరో ఒకరు నీ బాయ్ ఫ్రెండ్ ని తన్నుకు పోతారు.. అని ఫ్రెండ్స్ టీస్ చేస్తుంటే చురుగ్గా చూసింది ప్రియా. 
ఈ కోపాలు భయపెట్టడాలు ఈరోజుకే, రేపటి నుంచి ఈ పప్పులు ఏమీ ఉడకవు. ఎంత ప్రేమించిన వాడైనా మొగుడి దగ్గర సిగ్గుపడడం మొదటి స్టెప్.. అని అల్లరి చేస్తున్నారు ఇంకా. 
వాళ్ళు మాట్లాడుతున్నది దేని గురించో అర్థం అయినా ప్రియ ముఖం లో రంగులు మారాయి.. 
జస్ట్ షట్ అప్.. నా వాడి దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు. గెలుచుకున్న ప్రేమ అందుకుంటున్న క్షణం.. ఇట్స్ సో మచ్ ప్రిషియస్ మూమెంట్స్ ఫర్ మీ.
మీరు తిక్క తిక్కగా ఏదో ఒకటి మాట్లాడి నా చేత్తో దెబ్బలు తినొద్దు.. అని చూపుడువేలు చూపిస్తూ ఫ్రెండ్స్ ని హెచ్చరిస్తుంది ప్రియా.
వాళ్ల అల్లరి కవ్వింపులు అలా సాగుతూ ఉండగానే.. పెళ్లి కూతుర్ని తీసుకురండి అని బయట నుంచి వినిపిస్తున్న హడావిడి కి.. నువ్వు ఎన్ని చెప్పినా ఈ మూడు ముడులు పడగానే ఈ ప్రియా చౌదరి మిస్సెస్ అలోక్ నందన్ గా మారిపోతుంది.
ఇక ఈ శివంగి మిస్టర్ అలోక్ నందన్ ప్రాపర్టీ అని ఫ్రెండ్స్ నవ్వుతుంటే 
ఒకపక్క సిగ్గు పడుతూనే మరొక పక్క తెలియని బెదురుతో మండపం లోకి అడుగు పెట్టింది ప్రియ.
నిండుగా కళ్ళతో తనకోసం ఎదురు చూస్తున్న అలోక్ ని చూడడమే ఆమె మనసులో ఉన్న ఆలోచనలు భయాలు అన్ని పటా పంచలు అయితే లాంగ్ బ్రీత్ తో ఇక తన ఫ్యూచర్ ని అలోక్ లో చూస్తూ పీటల మీద కూర్చున్న ప్రియ పూజారి గారు చెప్పినట్టు అక్షింతలు తీసుకొని పూజ మొదలుపెట్టింది. 
మండపంలో కొలువై ఉన్న అగ్నిసాక్షిగా వేదమంత్రాల పఠనంతో నిండు మనసుతో దీవించే పెద్దల సమక్షంలో పుట్టింటి వారిని అత్తింటి వారిని ఒక్కటిగా చేసే సూత్రాలను 16 పోగుల పసుపు దారంతో బంధించి మూడు ముడులు వేయమని అలోక్ చేతికి అందించారు పంతులుగారు. 
ఆ క్షణం పెళ్లి మండపం మొత్తం గట్టి మేళంతో పవిత్రంగా మారిపోయింది. 
మంగళ సూత్రాలు చేతితో పట్టుకొని లేచి నిలబడ్డాడు అలోక్.
శరీరాన్ని మనసును తన బుద్ధిని అగ్నిసాక్షిగా మనస్సాక్షిగా దైవ సాక్షిగా మంగళ సూత్రాలకు, అవి తన మెడలో అలంకరించే వ్యక్తి కి అర్పించడానికి సిద్ధమైన ప్రియ చేతులు జోడించి ఓసారి అలోక్ ని చూసి తల కిందకు దించింది.
ఆ క్షణం ఆమె గుండె వేగం పెరిగింది, శరీరం అంత సన్నటి కలవరం, మనసులో మెదడులో మరో జీవితానికి శ్రీకారం చుడుతున్న ఎన్నో ఎన్నెన్నో అనుభూతులు, ఆలోచనల మధ్య ఇది అని చెప్పలేని వింతైన ఫీలింగ్. 
ఆమె ప్రమేయం లేకుండానే బరువైన శ్వాసతో కనురెప్పలు మూతలు పడిపోయాయి. 
మరుక్షణం ఆకాశం విరిగిపడ్డట్టు పెద్ద శబ్దం ప్రియా చెవుల్లో దద్దరిల్లుతుంటే కళ్ళు తెరిచిన తన ఎదురుగా మండపం నుంచి దూరంగా ఎగిరివెళ్లి పడుతూ కనిపించాడు ఆలోక్.
పెద్దవి అవుతున్న కళ్ళతో అతని స్థితిని అంచన వేస్తున్న ప్రియా మెడలో రఫ్ గా తెలుస్తున్న స్పర్శకి తల ఎత్తి చూస్తే పట్టు బట్టల్లో ఉన్న వ్యక్తి తన మెడలో మూడు ముడులు వేశాడు. 
తల దించి తన గుండెల మీదకు చేరిన మొదటి సూత్రాన్ని చూస్తూనే ఉంది మండుతున్న అగ్నిసాక్షిగా పూజారి గారి చేతిలో ఉన్న రెండవ సూత్రాన్ని కూడా ఫోర్సుగా తీసుకున్న అతను లేవటానికి ట్రై చేస్తున్న ప్రియా భుజాన్ని నొక్కి కిందికి తోసి మళ్లీ మూడు ముడులు వేసి ఆమె పక్కనే పీటల మీద కూర్చొన్నాడు.
¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢
మా పక్క రెండు సూత్రాలు విడివిడిగా ఉంటాయబ్బా..
అత్తింటి సూత్రం ముందు కట్టించి తర్వాత పుట్టింటి సూత్రాన్ని కట్టిస్తారు.. తేడాలు ఉంటే తిట్టొద్దు నాకైతే అలానే జరిగింది.
ఇంకా అత్తింటి సూత్రం కన్నా పుట్టింటి సూత్రం ఒక్క ఔన్స్ అన్న బరువు తక్కువగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పారు. 😏
ఎవరి పద్ధతులు వాళ్లకు ఉంటాయి ఇక్కడ అయితే నేను నాకు తెలిసిన పద్ధతి ఫాలో అయ్యాను..🤗🤗
కామెంట్స్ మస్ట్ బేబీస్..
మళ్లీ కలుద్దాం
_వర్ణ.