ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 3
అక్కడ నుంచి కాన్స్టేబుల్స్ రంగ ఇంక అంజి ఇద్దరు కలిసి ప్రణతి జాబ్ చేసే ఆఫీస్ కి వెళ్తారు అక్కడికి వెళ్లి ఎంక్వయిరీ అని చెప్పి మేనేజర్ ని కలుస్తారు వెళ్లి ప్రణతి గురించి మొత్తం అడుగుతారు ఎన్నింటికి వచ్చింది ఎన్నింటికి వెళ్ళింది అనేది మొత్తం కనుక్కొని ఆ అమ్మాయి తో ఎవరికి అయినా గొడవలు ఉన్నాయా ఎవరికీ అయినా ఆ అమ్మాయి అంటే గిట్టదా అని ఇలాంటివి అన్ని అడుగుతూ ఉంటారు.
అందరు అలాంటిది ఏమి లేదు బానే ఉండిద్ది అందరి తో మంచిగ ఉండిద్ది అని చెప్తుంటారు అవన్నీ విని సరే అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చి ఇంకా అరవింద్ చెప్పిన ఆ ఏరియా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు చెక్ చేయడానికి అక్కడ ఒక మూలాన ఒక సీసీ టీవీ కనిపించిద్ది.
అది చూసి దాన్ని చెక్ చేస్తారు అందులో ముందు ఏమి కనిపించదు కానీ తర్వాత ప్రణతి ఫేస్ కనిపించకుండా తను పరిగెడుతున్నట్టు గా కనిపించిద్ది ఎవరో తనని వెంబడించడం అంత అది చుసిన వాళ్ళు ఆ అమ్మాయో కాదో అర్ధం కావడం లేదు కానీ అరవింద్ చెప్పిన టైం బట్టి సిమిలర్ గానే కనిపిస్తుంది అని అనుకుంటూ…..
Si అయినా అటువంటి శివకుమార్ కి ఫోన్ చేస్తాడు రంగ
అటువైపు శివ కుమార్ ఫోన్ ఎత్తి చెప్పు రంగ ఎనీ క్లూ అని అడుగుతాడు అవును సార్ ఫుటేజ్ చెక్ చేసాం ఫేస్ అయితే తెలియడం లేదు కానీ ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తడం మాత్రం ఉంది వెనకాల ఎవరో ముగ్గురు వెంట పడుతున్నారు అని చెప్తాడు..
హో తర్వాత ఇంకేమైనా తెలిసిందా అని అడిగితె ఇంక అంతే సార్ కొంచెం వరకే కనిపించింది ఇంకా ఆ తర్వాత తెలియలేదు అని చెప్తాడు సరే మరి ఆఫీస్ సంగతి ఏంటి అని అడిగితె ముందు అక్కడికి వెళ్లి కనుక్కున్నాం సార్ నిన్న నైట్ 10 కి అలా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అని చెప్తాడు.
ఓకే ఇంక ఆ అమ్మాయి వెళ్లిన వైపు ఇంకేమైనా క్లూస్ ఏమైనా దొరుకుతాయి ఏమో చూడు అని చెప్పి ఆ అమ్మాయి నెంబర్ ట్రేస్ చేసారా అని అడుగుతాడు యా సార్ చేసాం మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది కలవడం లేదు అని చెప్తాడు.
అందువల్ల కుదరలేదు ఆ అమ్మాయి నెంబర్ రాత్రి……… ఈ ఏరియా లో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యింది అంత వరకే తెలిసింది అని చెప్తాడు రంగ ఓకే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు ఏమో ఆ ఏరియా కి వెళ్లి ఒకసారి చుడండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ఇక్కడ శివ కుమార్ చెప్పిన విషయాలు అన్ని రంగ అంజి తో చెప్పి అక్కడికి వెళ్దాం రా అని ఇద్దరు కలిసి ఆ ఏరియా కి వెళ్తారు…..
ఇక్కడ హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన ప్రణతి భయం భయం గా చుట్టూ చూస్తూ అసలు నేను ఎక్కడ ఉన్నాను రాత్రి అక్కడ ఆ రౌడీలు కత్తి తో పొడవడానికి వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్న విషయం గుర్తు చేసుకొని ఆ తర్వాత ఏమి జరిగిందో అని గుర్తు చేసుకుంటూ…
ముగ్గురులో ఒక రౌడీ వచ్చి ప్రణతి జుట్టు పట్టుకొని కత్తితో పొడవాలని చూస్తున్నప్పుడు (ఇది ఫస్ట్ పార్ట్ లో ఇచ్చాను ఒకసారి అది చదివి ఇది చదవండి అర్ధం అయ్యిద్ది).
ఒక్కసారిగా ఎవరో అతని చేయి గట్టిగ పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఒక అతను కోపంగా పిడికిలి గట్టిగ బిగించి మొహం మీద ఒకటి కొడతాడు అంతే కత్తి వదిలేసి కింద పడిపోయి నొప్పి తట్టుకోలేక గట్టి గట్టిగ అరుస్తూ పక్కన ఉన్నా ఇద్దరికి చెప్తుంటాడు వాళ్ళు కోపంతొ అతని మీదకి వెళ్లి కొట్టాలని చూసిన ఎంతో చాక చక్యం గా పక్కకి తప్పుకొని కిందకి వంగి కడుపులో గుద్దుతాడు ఆ రెండో వాడు కూడా అలాగే కింద పడిపోయి నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు.
ఇంకొక రౌడీ వాళ్ళని అలా చూసి భయపడి పారిపోతాడు అది అంత చుసిన ప్రణతి అప్పటికే భయం తొ ఉండి ఇప్పుడు వాళ్ళని అలా కొట్టడం చూసేసరికి ఇంకాస్త ఎక్కువ భయపడి ఒక పక్కకి వెళ్లి నించునిద్ది.
అలా భయపడటం చూసినా ఆ అబ్బాయి తన దగ్గరికి వెళ్లి ఏమి కాలేదు భయపడకు కూల్ కూల్ అంటూ దైర్యం చెప్తూ ఉంటాడు అయినా సరే తన భయం తగ్గక అలానే చూస్తూ ఏమి మాట్లాడకుండా ఉండేసరికి ఆ అబ్బాయి కిందకి వంగి మోకాళ్ళ మీద కూర్చుని ప్రణతి చేయి పట్టుకొని నేను ఎప్పటికి ఇలాగే నీతోనే ఉంటా చివరి వరకు నన్ను పెళ్ళీ చేసుకుంటావా.
“విల్ యు మ్యారీ మీ” అని అడుగుతాడు అంతే ఇంక అది వినంగానే కళ్ళు తిరిగి అలాగే పడిపోతు ఉండగా వెంటనే అలెర్ట్ అయ్యి కింద పడకుండా పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి తన కార్ లో వెనక సీట్ లో పడుకోబెడతాడు.
అలా కార్ లో పడుకోబెట్టి ముందు సీట్ కి వచ్చి డ్రైవ్ చేస్తూ మిర్రర్ లో నుంచి తనని చూస్తూ అసలు తన గురించి ఎలా తెలిసి అక్కడికి వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
పేరు నిత్విక్ అతను ఒక పెద్ద వ్యాపారానికి సామ్రాజ్యధినేత అతని నాన్న కి ఎన్నో బిజినెస్ లు మరి ఎన్నో ఫ్యాక్టరీలు వాటి అన్నిటికి కూడా అతను ఒక్కడే వారసుడు అమ్మ చిన్నప్పుడే చనిపోతే ఇంట్లో అందరు బలవంతంగా ఒప్పించి బాబు కోసం అయినా చేసుకోవాలి అని గట్టిగ ఒప్పించి పెళ్ళీ చేస్తారు ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఒప్పించి వాళ్ళ దూరపు బంధువు అయినా ఇంకో ఆమెకి ఇచ్చి పెళ్ళీ చేస్తారు అలా వాళ్ళకి పెళ్ళీ అయిన రెండు ఏళ్ళకి ఒక అమ్మాయి పుట్టిద్ది ఆ తర్వాత ఇంకో రెండు ఏళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు.
నిత్విక్ తండ్రి:శేఖర్
నిత్విక్ తల్లి :శివాని
నిత్విక్ పిన్ని:రత్న ప్రభ
(అదే శేఖర్ గారి రెండో వైఫ్)
నిత్విక్ చెల్లి:గ్రీష్మ
నిత్విక్ తమ్ముడు:రీత్విక్
నిత్విక్ ఫ్రెండ్ అండ్ కజిన్:డాక్టర్:నిరంజన్
(కజిన్ ఎలా అవుతాడో అసలు ఎలాంటి కజినో ముందు ముందు తెలుస్తది).
ఇంకొకసారి బ్రీఫ్ గా ప్రణతి ఫ్యామిలీ పేర్లు ఏమి చేస్తారో కూడా చెప్తాను.
ప్రణతి తండ్రి:కేశవ
ప్రణతి తల్లి :పార్వతి
ప్రణతి తమ్ముడు:అరవింద్
ప్రణతి వాళ్ళ నాన్న ఒక జడ్జి ఎప్పుడు నీతి నిజాయితీకి మారు పేరు లాగా ఉంటారు.
ప్రణతి వాళ్ళ అమ్మ లాయర్
ప్రణతి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో పెద్దలని ఎదిరించి ప్రేమ పెళ్ళీ చేసుకుంటారు.
అప్పటి నుంచి ఎవరి ఆదరణ లేకుండా కేశవ పార్వతి గారే ఒకరికి ఒకరై ఉంటూ పిల్లలే వాళ్ళ ప్రపంచం లాగా బ్రతుకుతారు.
అరవింద్ ఐఏఎస్ అవ్వడానికి ప్రిపేర్ అవుతు ఉంటాడు అరవింద్ విషయంలో అది వాళ్ళ నాన్న చివరి కోరిక
కేశవ గారు మూడు ఏళ్ళ క్రితం ఒక ఆక్సిడెంట్లో చనిపోతారు.
కానీ అది ఆక్సిడెంట్ కాదు కావాలనే చేయించారు అనేది అందరికి తెలిసిన రహస్యమే కానీ దాని గురించి అందరికి తెలిసిన కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయించలేరు.
అలా ఎందుకో ముందు ముందు తెలుస్తది.
ఇంక అసలు కథ లోకి వద్దాం:
అలా నిత్విక్ ఎదో బిజినెస్ మీటింగ్ ఉంది అని వెళ్ళి అది పూర్తి చేసుకొని వచ్చేసరికి అర్ధ రాత్రి అయ్యిద్ది అలా వస్తున్నప్పుడు ఎందుకో తెలియదు నిత్విక్ హార్ట్ బీట్ చాలా వేగం గా కొట్టుకుంటూ ఉండిద్ది అలా ఎందుకు జరుగుతుందో అర్ధం కాక ఇబ్బంది పడుతూ గుండె మీద చేయి వేసుకొని ఏమైంది నాకు ఈ రోజు ఇలా ఉంది దీని అర్ధం ఏంటి ఇలా అనిపించి మూడు ఏళ్ళు అవుతుంది నాకు మళ్ళీ ఇలాంటి ఫీలింగే కలుగుతుంది ఎందుకు అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ప్రణతి దాక్కొని ఉన్నా ఏరియా లోనే నిత్విక్ వాళ్ళ ఇళ్ళు కూడా అక్కడే అలా వస్తూ ఉండగా ముగ్గురు రౌడీల్లో ఒకరు ప్రణతి చేయి పట్టి గుంజి లాగడం చూస్తాడు అంతే ఇంక ప్రళయ రుద్రుడి లా దిగి వచ్చేలోపు కత్తి తీసి పొడవాలని చూస్తాడు.
అది చూసి ఇంక పిడిగిలి బిగించి ఆ ఎత్తిన అతని చేయి పట్టి ఆపి వాళ్ళని కొట్టి పంపించేస్తాడు అలా తనని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఆ రాత్రి అంత అక్కడే ఉండి తెల్లవారక పని ఉంది బయటకు వెళ్తున్న నేను వచ్చేవరకు తను జాగ్రత్త అని నిరంజన్కి చెప్పి వెళ్తాడు.
అలా సిస్టర్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ప్రణతి భయంతొ రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ ఉండిద్ది అది గమనించిన నర్స్ తన దగ్గరికి వచ్చి మేడం ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అడిగిద్ది.
అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అతను అతను అంటూ ఆగిపోయి మళ్ళీ అతను ఎక్కడ నైట్ నేను రోడ్ మీద పడిపోయాను కదా ఇక్కడికి ఎలా వచ్చాను అని కంగారు గా అడుగుతూ ఉండిద్ది అది చుసిన నర్స్ మేడం ప్లీజ్ కూల్ మీకు ఏమి కాలేదు కొంచెం భయపడి షాక్ కి గురి అయ్యి స్పృహ తప్పారు ఇప్పుడు బానే ఉంది అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఉండిద్ది.
ఇంక వెంటనే వాళ్ళ అమ్మ తమ్ముడు గుర్తొచ్చి నా ఫోన్ నా ఫోన్ అని చుట్టూ చూస్తూ అడిగిద్ది మేడం ప్లీజ్ మీరు టెన్స్ అవ్వకండి మీ ఫోన్ బ్యాగ్ జాగ్రత్తగానే ఉంది ఇదిగోండి అని చెప్పి బ్యాగ్ తీసి చేతికి ఇచ్చిద్ది.
ఒకే అని చెప్పి ఈ హాస్పిటల్ పేరు ఏంటి ఏ ఏరియా అని అడిగి నేను మా ఇంటికి ఫోన్ చేసి మా తమ్ముడుని రమ్మని చెప్తాను అని అడిగిద్ది దానికి నర్స్ ఒకే మేడం అని చెప్పి హాస్పిటల్ పేరు ఏరియా చెప్పి స్పృహలోకి వచ్చినట్టు డాక్టర్ కి చెప్పేసి వస్తాను అని వెళ్ళబోతు ఉండగా తన ఫోన్ తీసి చూసి ఛార్జ్ లేదు అని అర్ధం అయ్యి నర్స్ ని ఆపి తన ఫోన్ ఇవ్వమని నా దానిలో ఛార్జ్ లేదు అని చెప్పిద్ది.
ఓకే మేడం అని చెప్పి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్లిద్ది ఈ లోపు అరవింద్ కి ఫోన్ చేసి హలో అరు (ప్రణతి అలానే పిలిచిద్ది అరవింద్ ని)
హలో అరు నేను రా అని చెప్పిద్ది ఇంక అంతే ప్రణతి గొంతు విని అప్పటి వరకు దిగులుగా కూర్చున్న అరవింద్ అలెర్ట్ అయ్యి హలో అక్క ఎక్కడ ఉన్నావు అసలు ఇంతసేపు ఏమైపోయావు అని కొంచం కంగారు కొంచెం ఆనందం కలిపి అడుగుతాడు నేను బానే ఉన్నా రా అదంతా తర్వాత చెప్తా ముందు ఈ అడ్రెస్స్ లో ఉన్నా……. ఈ హాస్పిటల్ కి రా అని చెప్పి వివరాలు చెప్పిద్ది.
సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపల దిగులుగా కూర్చున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రణతి ఫోన్ చేసిన విషయం ఎక్కడ ఉంది ఏ అడ్రెస్స్ లో ఉంది అనేది మొత్తం చెప్తాడు ఉత్సాహంగా అది విని హుషారు గా లేచి అవునా విందు అని మళ్ళీ ఇంతలోనే మళ్ళీ హాస్పిటల్ అంటావేంటిరా ఏమి కాలేదు కదా అని అడిగిద్ది.
లేదు అమ్మ అంత బానే ఉన్నట్టు ఉంది నార్మల్ గానే మాట్లాడింది అని చెప్పి సరే పద అని ఇద్దరు కలిసి హాస్పిటల్ కి బయలుదేరారు ఒక గంటలో హాస్పిటల్ దగ్గరికి చేరుకొని రిసెప్షన్ లో పేరు చెప్పి రూమ్ కనుక్కొని లోపలికి వెళ్లేసరికి అక్కడ డాక్టర్ ఉండి టెస్ట్ చేస్తూ ఉంటాడు.
ప్రణతి ని చుసిన పార్వతి గారు ఒక్కసారిగా దగ్గరికి వెళ్లి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అసలు రాత్రి అంత ఏమి ఐపోయావే అసలు ఏమి జరిగింది హాస్పిటల్ లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని వరసగా అడుగుతూనే ఉంటారు.
అది చుసిన డాక్టర్ అమ్మ మీరు ఇప్పుడు తనని ఏమి డిస్టర్బ్ చేయకండి తను బానే ఉంది డిశ్చార్జ్ కూడా చేస్తాం ఇంకాసేపటిలో తను చాలా వీక్ గా ఉంది ఏమైనా జ్యూసులు తాపించండి తర్వాత అని చెప్పి ఇంక మీరు ఇంటికి వెళ్లొచ్చు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.
ఇంక ప్రణతిని చూసి బాధ పడుతు ఉండగా అరవింద్ కల్పించుకొని అమ్మ డిశ్చార్జ్ చేస్తున్నారు కదా ముందు ఇంటికి వెళ్ళాక అక్క ఫ్రెష్ అయ్యాక ప్రశాంతం గా అప్పుడు మాట్లాడుకుందాంలే ముందు పదండీ అని చెప్పి బిల్ సెటిల్ చేసి ఆటో లో ఇంటికి తీసుకొని వస్తారు.
అలా ఇంటికి వెళ్ళాక ప్రణతిని బయటే ఉండమని చెప్పి పార్వతి గారు లోపలికి వెళ్లి ఎర్రనీళ్లు తెచ్చి దిష్టి తీసి కాళ్ళు కడుక్కొని లోపలికి వేళ్ళు అమ్మ అని చెప్పి అవి బయట పారేయడానికి వెళ్లి వచ్చి జగ్ ఇచ్చిద్ది నీళ్లు కడుక్కోవడానికి.
అలా వంగి ప్రణతి కాళ్లు కడుక్కుంటూ ఉండగా అనుకోకుండా మేడలో ఉన్నా మంగళసూత్రం బయట పడిద్ది.
అది చుసిన పార్వతి గారు అరవింద్ షాక్తొ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండి పోతారు…..
అసలు నిత్విక్ కేవలం ప్రొపోజ్ మాత్రమే కదా చేసింది?
మరి ప్రణతి మేడలో తాళిబొట్టు ఎలా వచ్చింది?
అసలు ఎవరు కట్టుంటారు..?
ఇవన్నీ తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి ఉండండి
అంతవరకు మీ విలువైన రేటింగ్స్ ని సమీక్షలని ఇచ్చి నన్ను ప్రోత్సాహరిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages