రాక్షసుడి నీడలో – 1
అది ఒక మధ్య తరగతి కుటుంబాలు నివాసం ఉండే కాలనీ.
ఆ కాలనీ లోని ఒక ఇంట్లో పెళ్లి చూపులు కోసం ఆ ఫ్యామిలీ వాళ్ళు , వాళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వారికి సహాయం గా ఉండి పనులు చేస్తున్నారు.
ఆ ఊరుకులు పరుగులు తీస్తున్న వాళ్ళని సందడి గా చూస్తూ పెళ్లి కూతురు అయినా తన అక్క దగ్గరికి వస్తుంది శివాని.
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక , జరిగే పెళ్లి చూపులు ఆపలేక తన లో తానే ఆలోచిస్తున్న చంద్రిక కు రూమ్ డోర్ దగ్గర కనపడిన శివాని ని చూడగానే టెన్షన్ పడుతూ మరొక వైపుకు తిరుగుతుంది.
కానీ తన అదృష్టం అంతగా బాగోలేదు అనుకుంట మరో వైపు డ్రెస్సింగ్ టేబుల్ ఉండడం తో అందులోని మిర్రర్ రిఫ్లక్షన్ లో తాను టెన్షన్ పడటం , నోట్లో నోట్లో గోనుక్కుంటూ మాట్లాడొకడం చూడగానే శివాని కి ఎక్కడో అనుమానం మొదలయ్యి
‘హ్మ్మ్…….,, ఏదో ఉంది….. ఇది నా దగ్గర నాటకాలు వేస్తుంది అంటే…..ఎక్కడో ఏదో చెత్త పని చెయ్యడానికి చూస్తుంది…. లేదా…. చేయబోతుంది…. నేను ఉండగా అలా ఎందుకు జరగనిస్తాను. జరగనివ్వను గా…’ అని మనసులో అనుకుని హుషారుగా ఎగురుకుంటూ వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురు బెడ్ మధ్యలో కూర్చున్న చంద్రిక మీద పడి , మెడ చుట్టూ చేతులు వేసి ” చందు ” అని చెవిలో పెద్దగా అరుస్తుంది.
ఇక అంతే..! చంద్రిక బెదిరిపోయి అమాంతం బెడ్ మీద నుంచి దిగబోయి ఎగిరి కింద పడుతుంది.
అది చూసి శివాని నవ్వు అప్పుకోవడానికి ట్రై చేస్తూ ” ఏంటి అక్క బెడ్ మీద నుంచి అలా దిగాలా……? ” అని అమాయకంగా అడుగుతుంది.
“నిన్నూ…….,, అసలు నిన్నూ ఎవరు నా రూమ్ కి రమ్మన్నారు…. వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలి అని తెలియదా…” అంటూ శివాని మీదకి కాయ్యిమంటుంది.
ఇక అంతే..! శివాని కూడా ఏమాత్రం తగ్గకుండా వెటకారంగా ” ఆహా….. మరి తమరేమో ఇక్కడ పెళ్లికూతురు కదా….. అక్కడ అమ్మ పిలవడం మానేసి అరవడం మొదలుపెట్టాక కూడా పెళ్లికూతురు గారి దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి……నిన్నూ రెడీ చేసి….. వస్తే తీసుకురమ్మన్నారు…… రాను అంటే…..?? ” అంటూ చంద్రిక వైపు ఒకలా చూస్తూ చెప్పకుండా ఆగిపోతుంది.
చంద్రిక అనుమానంగా చూస్తూ ” రాను అంటే…….ఏం చేస్తావ్…. ” అంటూ తెలియకుండానే వెనక్కి అడుగులువేస్తుంది.
తన భయానికి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం ఒకలా చూస్తూ ముందుకు వస్తు తన దగ్గరకి చేరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ” రాను అంటే జుట్టు పట్టుకొని ఇడ్చుకుంటూ తీసుకురమ్మని చెప్పింది”. అంటూ తనకి జుట్టు పట్టుకుంటుంది.
ఇక చంద్రిక పెట్టిన ” అమ్మ ” అన్న వెర్రి కేక కి కాసేపటి తరువాత అద్దం ముందు కూర్చున్న చంద్రిక చిన్న పిల్ల లా ఏడుస్తు ముక్కు చీదుతుంటే , వెనక నిలబడి మళ్ళీ జడ వేస్తున్న సుజాత గారు ఎలా ఇద్దరికీ తిట్లతో తలంటూతుంటారు.
ఏమి తెలియని అమాయకపు పిల్లి లా బుద్దిగా బెడ్ కూర్చొని అమ్మ నోటి నుంచి వచ్చే కమ్మటి పాటలను చెవులకి వినసొంపుగా ఉన్నట్టు కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంటుంది శివాని.
” ఆడపిల్ల లక్షణాలు ఒక్కటి లేవు…., మొగరాయుడు లాగా తయారయ్యింది …. కాలేజీ లో అన్న సక్రమంగా ఉంటుందా అంటే….అది లేదు…. వాళ్ళు కూడా భరించలేక….. చదువు అయిపోయింది… పొమ్మని పంపించేశారు…” అంటూ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ శివాని ని తిడుతుంది.
“అమ్మ….., (బి. బి. ఏ) డిగ్రీ అన్నాక మూడు సంత్సరాలు మాత్రమే చదువుతారు….. నాలుగు, ఐదు సంవత్సరాలు చదవరు….నీ ముద్దుల పెద్ద కూతురుని అడుగు….అసలు తాను ఎందుకు నాలుగు సంవత్సరాలు చదివింది అని….” అంటూ చురక అంటించి వదులుతుంది.
“అవునా….” అంటూ సుజాత గారు చంద్రిక ని చూడగా నీళ్లు నాములుతు పిచ్చి చూపులు చూస్తున్న చంద్రిక కు శివాని బెడ్ మీద కూర్చుని కన్ను కొట్టడం కనిపించగానే ఒళ్ళు మండిపోయి ఏదో తట్టిన దానిలా ” అమ్మ…. అది నిన్నూ మాటల్లో పెట్టి లేట్ చేస్తుంది… అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు…. ” అంటూ పని గుర్తుకు చెయ్యగానే అసలు విషయం మర్చిపోయింది అని సుజాత గారు కూడా ఇంకా సైలెంట్ గా జడ వేసి పూలు పెడుతుంటారు.
సుజాత గారిని అంత కూల్ గా ఉంచడం ఇష్టం లేక తుంటరి ఆలోచనలు వచ్చినట్టు ” అమ్మ,.. అక్క… మీ ఇద్దరికీ ఒక సర్ప్రైస్… ” అంటూ వాళ్ళ నుంచి దూరం వెళ్లి డోర్ దగ్గర నిలబడి తాను అప్పటి వరకు పింక్ నైట్ డ్రెస్ కి చుట్టుకున్న శారీ తీసేసి భుజాన వేసుకొని స్టైల్ గా విజిల్ వేస్కుంటూ బయటకు వెళ్లి డోర్ గెట్టిగా వేస్తుంది.
డోర్ సౌండ్ కి ఉలిక్కిపడిన ఇద్దరు షాక్లో నుంచి బయటకు వచ్చి డోర్ సైడ్ చూసేసరికి శివాని వెళ్ళిపోయి కనిపిస్తుంది.
ఇంకా సుజాత గారు మొదటి నుంచి మళ్ళీ అక్కడ లేని శివాని కి మాటలతోనే సన్మానం చేస్తుంటే, చంద్రిక మళ్ళీ పెళ్లి చూపులు నుంచి ఎలా తప్పించుకోవాలా అని తెగ కంగారు పడుతుంటుంది.
బయటకు వచ్చిన శివాని ని అమ్మలక్కలు అందరూ లోపలికి వెళ్ళినప్పుడు ఒకలా బయటకు వచ్చినప్పుడు ఒకలా చూసి బితారాపోయి చూస్తుంటే వాళ్లందరికీ ఒక వెర్రి నవ్వు ఒకటి ఇచ్చి అక్కడ మాయం అయ్యి తనకి రూమ్ లో ప్రత్యేక్షం అవుతుంది.
రూమ్ కి రావడం ఆలస్యం వెంటనే ఒక పింక్ కలర్ హాఫ్ శారీ తీసుకుని వాష్రూమ్ లోకి దురుతుంది.ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అయ్యి అద్దం ముందు నుంచొని హెయిర్ డ్రై చేసి ఒక చిన్న క్లిప్ తో హెయిర్ లీవ్ చేసి కళ్ళకు కాటుక పెట్టుకొని మొహం పై ఏమాత్రం మేకప్ వెయ్యకుండా ఒక సరి తనని తాను చూసుకొని ” ఇలా నన్ను చూస్తే….. పెళ్ళికొడుకు మా అక్క ని వదిలేసి నన్ను చేసుకుంటాను అని గోల చేస్తాడో ఏమో… “అంటూ తెగ సిగ్గుపడిపోయి మళ్ళీ తనని తాను తల పొడుచుకొని ” దానికి పెళ్లి చూపులు అయితే నేను ఎందుకు సిగ్గుపడుతున్నాను ” అంటూ ఇంకొకసారి చూసుకొని మురిసి పోయి బయట కి వస్తుంది.
( రైటర్ : పాపా….. కొంచం ఓవర్ అయినట్టు అనిపించడం లేదు…)
( పాపా : అసలు లేదు…. నా అందాన్ని చూసి కొల్లూకో… హ్మ్మ్…🙂↔️🙂↔️🙂↔️)
( రైటర్ : 😩😣😞)
Swipe left/right or tap the sides to turn pages