రాక్షసుడి నీడలో – 2
అటు చంద్రిక రూమ్ నుంచి సుజాత గారు , ఇటు తన రూమ్ నుంచి శివాని ఒకేసారి బయటకు వస్తారు.
శివాని ని చూడగానే సుజాత గారు ఆశ్చర్యపోయి మళ్ళీ అంత లోనే ఉరిమి చూస్తుంటే తండ్రి రావటం చూసి ” డాడీ ” అంటూ పోయి తండ్రి ని హగ్ చేసుకొని కామాక్షి గారికి ఒక లుక్ ఇవ్వగానే ఆవిడా వచ్చిన ముత్తయిదువులకు కాఫీ ఇవ్వడానికి కిచెన్ కి వెళ్ళిపోతుంది.
” చందు రెడీ అయ్యిందా బంగారం… ” అంటూ శివాని ని దగ్గర తీసుకోని “మహాలక్ష్మి లా ఉన్నావు రా…..” అంటూ నుదిటి పై ముద్దు పెట్టి మురిపెంగ చూస్తుంటారు.
” థాంక్ యూ డాడ్… , నేను వెళ్లి అక్క ని తీసుకురానా….? ” అంటూ వెళ్ళబోయిన తనని పిలిచి ” నేను పిలిచినప్పుడు తీసుకు రా ” అని చెప్పేసి పంపిస్తారు సుబ్రహ్మణ్యం గారు.
కాఫీలు అందిస్తూ అందరిని నవ్వుతు పరామరసిస్తున్న సుజాత గారిని పిలుస్తారు సుబ్రహ్మణ్యం గారు.
” పెళ్లి వాళ్ళు మరో పది నిముషాలలో వచ్చేస్తారు , అన్ని సిద్ధం చేసి ఉంచావా…, అమ్మాయిని రెడీ చేసావా… ” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.
దానికి సుజాత గారు సుబ్రహ్మణ్యం గారి చేతిలో కాఫీ పెట్టి ” మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి…. , అన్ని మర్యాదలు సక్రమంగా జరుగతాయి మీ చిన్న కూతురి చెయ్యి పడకుండా ఉన్నంత సేపు…..” అని సుజాత గారు ఉక్రోషం గా అంటారు.
కాఫీ తాగుతున్న సుబ్రహ్మణ్యం గారు ఉలిక్కిపడి “ఏమైంది సుజి… ” అంటూ స్మూత్ గా అడుగుతారు.
( శివాని చేసే అల్లరి పనులకి సుజాత గారిని కూల్ చెయ్యడానికి లేదా ప్రేమ గా వారిద్దరూ మాత్రమే పిలుచుకొనే పేరు ‘సుజి’, ‘ సుబ్బు ‘ అనిపిలుచుకంటారు.)
“ఉదయం శివాని చంద్రిక రూమ్ వెళ్లి…” అంటూ మొత్తం పూర్తిగా వివరించి ” అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు….” అని ఉడుక్కుంటూ చెప్తారు.
భార్య మొహం లోని ఉడుకుబోతుతనం చూసి చిన్నగా నవ్వుతారు సుబ్రహ్మణ్యం గారు.
అయన నవ్వు చూసి చిరుకోపం గా చూస్తూ ” మీకు కూడా నేనంటే నవ్వులాట అయ్యింది…. అయినా సరే…, శివాని మాత్రం పెళ్లి చూపులు అయ్యేవరకు చందు దగ్గరకి వెళ్ళకూడదు…. గుర్తుపెట్టుకోండి…..! ” అని చెప్తూ ఉండగా ఇంటి ముందు పెళ్ళికొడుకు వాళ్ళ కార్ ఆగుతుంది.
కార్ సౌండ్ కి ఇప్పుడు సుజాత గారు హడావిడి చేస్తూ ” మీరు వెళ్లి వాళ్ళను తీసుకురండి…..నేను అమ్మాయి చేత కాఫీ పంపిస్తాను….” అంటూ సుబ్రహ్మణ్యం గారు చెప్పేది వినకుండా ఆవిడా వంటగదిలోకి వెళ్లి చక చక కాఫీ ప్రిపేర్ చేస్తుంది.
రూమ్ లోకి వెళ్లిన శివాని బుద్ధిగా సుబ్బు గారు చెప్పినట్టు చంద్రిక ని ఒకసారి మొత్తం రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసి, టెన్షన్ పడుతున్న చంద్రిక తో కోతి విన్యాసాలు చేసి తనని రెచ్చగొడుతుంది.
శివాని చేసే పనులకు ఉడికిపోతు చీర కూచిళ్లను చేతిలో పట్టుకొని మరో చేతిలో పిల్లో తీసుకోని శివాని వెంటపడుతుంది.
బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం గారు కాబోయే వియ్యంకులను సాధరంగా ఆహ్వానించి లోపలి కి తీసుకువస్తారు.
వాళ్ళకి సోఫా చూపించి, మాట రాకుండా సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళతో మర్యాదలు చేయిస్తూ సుజాత గారిని పిలుస్తారు.
చందు చేత కాఫీ ఇప్పించాలి అని చుసిన సుజాత గారికి వాళ్ళు హాల్ ఉండడం వల్ల కుదరక, చంద్రిక పిలిచినప్పుడే బయటకు తీసుకురావాలి కాబట్టి తప్పక “శివాని” అంటూ పిలుస్తారు.
అక్క తో చిందులు తొక్కిస్తున్న శివాని బయట వాతావరణం నిశబ్దం అవ్వడం తో ముందే తన అక్కని బెదిరించి, భయపెట్టి తనని సైలెంట్ చేస్తుంది.
సుజాత గారి పిలుపుతో ” వస్తున్నాను అమ్మ….. ” అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చి తల దించి హాల్ లో ఉన్నవాళ్ళని తల ఎత్తి చూడకుండా పరిసరాలను బట్టి గమనించి లోపలికి వెళ్ళిపోతుంది.
కానీ తను గమనించని విషయం అక్కడ గుమ్మం లో నుండి రెండు కళ్ళు తన ని వింత ఆకర్షణ తో చూస్తూ బయటకు వేసే అడుగు లోపలికి వెళ్తుంది.
అక్కడికి వచ్చిన అతన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యం గా చూస్తుంటే సుబ్రహ్మణ్యం గారు లేచి నిలబడి ” గుడ్ మార్నింగ్ సార్…. ” అని విష్ చేస్తుండగా ఆయన ని చురుకుగా ఒక్క చూపు చూస్తాడు. దాంతో ఆయన బెదిరిపోయి కూర్చుంటే ఆయన ఎదురుగ ఉన్న సింగిల్ సీట్ సోఫా లో కూర్చుని శివాని కోసం వెయిట్ చూపు మాత్రం సుబ్రహ్మణ్యం గారి మీద ఉంచుతాడు.
శివాని కిచెన్ లోకి వెళ్లి “అమ్మ ” అంటూ సుజాత గారి దగ్గర నిలబడగా శివాని చేతిలో కాఫీ కప్స్ ఉన్న ట్రే పెట్టి ” వెళ్లి ఇచ్చేసి రా….. ” అంటూ పంపిస్తుంది.
ఇంట్లో వాళ్ళతో ఎంత అల్లరి చేసిన శివాని పరాయి వాళ్ళతో ఎప్పుడు పద్ధతి గా ప్రవర్తిస్తుంటుంది.
శివాని కాఫీ ట్రే తీసుకోని హాల్ లోకి వచ్చేసి అందరికి ఇస్తుంది. పెళ్లికొడుకు వాళ్ళ అమ్మ, నాన్న , గ్రానీ, సుబ్రహ్మణ్యం గారికి కూడా తీసుకుంటారు. అతనికి కూడా ఇవ్వబోయిన శివానికి ” నేను ఈ కాఫీ తాగాను… ” అని అంటాడు.
దానితో అతని వైపు కొంచం ఆశ్చర్యం గా చూస్తూ ” మరి మీరు ఏం తీసుకుంటారు….” అని మెల్లగా అడుగుతుంది.
” బ్లాక్ కాఫీ ” అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు.
అతను చెప్పిన విధానానికి అతన్ని చురుగ్గా చూపులు విసిరి ఏమి అనలేక సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది.
కిచెన్ లోకి వచ్చిన తనని చూసిన సుజాత గారు ” ఏంటి కాఫీ వెనక్కి తెచ్చావు…….” అని అడగగా “పెళ్లి కొడుకు గారికి బ్లాక్ కాఫీ కావాలి అంట….” అంటూ అతను చెప్పిన విధానానికి ఉక్రోషం చెప్తుంది.
” అది ఏంటో నాకు రాదు కదా శివాని….. ” అని అయోమయంగా చెప్తారు సుజాత గారు.
” అమ్మ….. , కాఫీ నేను చేస్తాను కానీ…..నువ్వు వెళ్లి అక్క ని తీసుకురమ్మంటారు ఏమో…..అక్కడ ఉండు….. ” అని ఆవిడని పంపించేసి కాఫీ పెట్టడం స్టార్ట్ చేస్తుంది.
సుజాత గారు వెళ్లేసరికి అందరూ మాటల్లో పడి కాఫీ తాగుతుంటే , అతను మాత్రం మొబైల్ చూస్తూ ఉంటాడు.
సుజాత గారు కూడా పరామర్శలతో మొదలు పెట్టి కలివిడిగా మాట్లాడుతుంటారు.
ఐదు నిమిషాల్లో అందరూ కాఫీ ముగించేసి కప్స్ పక్కన పెడితే శివాని బ్లాక్ కాఫీ తీసుకోని అతనికి ఇస్తూ అతని వైపు చూస్తుంది.
అతను కూడా శివాని ని చూస్తూ కాఫీ తీసుకుంటుండగా కాఫీ కప్ స్లిప్ అయ్యి అతని మీద పూర్తిగా గా ఓలికి పోతుంది.
అది చూసి శివాని తో సహా అందరూ షాక్ అవుతారు………
కంటిన్యూస్……..!
ఈ పెళ్లి చూపుల సీన్ హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం. కాబట్టి కొంచం సాగదిస్తున్నట్టు ఉన్న తప్పదు. కొంచం అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్నా.
నచ్చితే ఫాలో చేసి కామెంట్ పెట్టండి. ☺️☺️
Swipe left/right or tap the sides to turn pages