శాడిస్ట్ లవ్ 💕 – 1
అన్ని పెళ్లి సీన్స్ తో స్టార్ట్ అయ్యే స్టోరీస్ లో హీరో వచ్చి పెళ్లి ఆపి హీరోయిన్ నీ పెళ్లి చేసుకుంటాడు కానీ మన స్టోరీస్ లో పెళ్లి సీన్ అంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా మరి….
ఈ స్టోరీ లో కూడా అంతే కచ్చితంగా ఒక ట్విస్ట్ ఉండనే ఉంది… ఆ ట్విస్ట్ ఏంటో ఎపిసోడ్ ఎండ్ లో తెలుసుకోండి…
స్టోరీ లోకి వెళ్ళిపొదాం…
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పిన్ని … ప్లీస్ ..! ” అని ఏడుస్తూ వాళ్ళ పిన్ని నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఒక అమ్మాయి.
అబ్బబ్బ..! పొద్దున నుంచి ఇదే గోల…నోరు మూసుకొని పెళ్లి చేసుకో…లేదు అంటే నిన్ను ఇక్కడికి ఇక్కడే చంపేస్తా..! ” ఆ అమ్మాయి చెంప మిద కొట్టి మరి బెదిరించి వెళ్ళిపోయింది వాళ్ళ పిన్ని.
ఆ అమ్మాయి ఏడుస్తూ అలాగే అక్కడ కూర్చుంది.
సరిగ్గా అరగంట తర్వాత…
పెళ్లి కొడుకు సీరియస్ గా కూర్చొని పూజ చేస్తూ ఉంటే….పెళ్లి కూతురు ఏడుస్తూ పీటల మిద కూర్చొని ఉంటుంది.
పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరు పెళ్లి కూతురి మిద జాలి పడుతూ ఉంటారు.
సరిగ్గా పంతులు గారు తాళి బొట్టు పెళ్లి కొడుకు చేతికి ఇచ్చి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టు బాబు అని అతని వాచ్ లో ముహూర్తం టైం చూసుకుంటూ చెప్పాడు.
పెళ్లి కొడుకు పంతులు ఇచ్చిన తాళి బొట్టు తీసుకొని పెళ్లి కూతురు మెడలో కట్టబోతు ఉండగా…
అప్పుడే సునామీలా దూసుకుంటు స్టేజ్ మీదకు వెళ్లి పెళ్లి కొడుకు చేతిలో ఉన్న తాళి బిట్టు లాక్కొని … పెళ్లి కొడుకు నీ లాగి చెంప మిద కొట్టింది ఒక అమ్మాయి.
ఆ అమ్మాయి అలా పెళ్లి కొడుకును కొట్టడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరు షాక్ అయ్యి కుర్చీల్లో నుంచి లేచి , నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని భయంగా ఆ పెళ్లి కొడుకు నీ చూస్తూ ఉంటారు.
కింద ఉన్న పెళ్లి కొడుకు బాడీ గార్డ్ లు కూడా షాకింగ్ గా ఆ అమ్మాయి నీ చూస్తూ ఉంటారు.
అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు అయితే వాళ్ళకి సూపర్ న్యూస్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ అమ్మాయి నీ , పెళ్లి కొడుకు నీ మార్చి మార్చి ఫోటోలు తీస్తూ ఉంటారు.
పెళ్లి కొడుకు నీ కొట్టిన అమ్మాయి కూర్చొని ఉన్న పెళ్లి కూతురు నీ పైకి లేపి ” నా ఫ్రెండ్ కి ఇష్టం లేకుండా బెదిరించి పెళ్లి చేసుకోడానికి సిగ్గు లేదా..? ” అని పెళ్లి కొడుకు నీ సూటిగా చూస్తూ ప్రశ్నించింది.
అప్పటికే ఆ అమ్మాయి కొట్టే సరికి కోపంతో ఊగిపోతూ ఉన్న పెళ్లి కొడుకు ఒక్క అడుగులో ఆ అమ్మాయి నీ చేరి…
” నన్ను కొట్టి చాలా బ్లండర్ మిస్టేక్ చేశావ్…! దీనికి ఇదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్ ” అని ఆ పెళ్లి ఆపిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు పెళ్లి కొడుకు.
అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరు కరెంట్ షాక్ కొట్టిన కాకుళ్లా బిగుసుకొని పోయారు.
ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి లాగి చెంప మిద ఒకే ఒక్క షాట్ ఇచ్చాడు అంతే…
ఆ పెళ్లి కొడుకు కొట్టిన దెబ్బకు అప్పటి వరకు షాక్ లో ఉన్న ఆ అమ్మాయి పెదవి చిట్లి రక్తం వస్తూ … అలాగే స్పృహ తప్పి కింద పడిపోయింది.
ఆ అమ్మాయి కింద పడుతుంటే తన పక్కన ఉన్న పెళ్లి కూతురు ” రూప … ” అంటూ ఆ అమ్మాయి నీ పట్టుకోవాలి అని ట్రై చేసింది కానీ …
ఆ పెళ్లి కొడుకు అరిచిన అరుపుకు భయపడి రెండు అడుగులు వెనక్కి వేసింది.
” దాన్ని పట్టుకుంటే చంపేస్తా … స్టే బ్యాక్ …! ” అని ఆ పెళ్లి మండపం అంతా అదిరిపోయేలా అరిచాడు పెళ్లి కొడుకు.
అప్పటివరకు షాక్ లో ఉన్న పెళ్లికి వచ్చిన అందరు భయపడి…. కోపంతో రుద్రుడిల కనిపిస్తున్న పెళ్లి కొడుకు ఆర్య హర్ష వర్ధన్ రాయ్ నీ ఊపిరి బిగపట్టి చూస్తూ ఉంటారు.
ఆర్య కింద పడిన రూప నీ భుజం మిద వేసుకొని సీరియస్ ఫేస్ తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక చూపు చూసి అతని కార్ దగ్గరికి వెళ్లి ….అలాగే రూప భుజం మిద నుంచి అతని ఒడిలోకి చేర్చుకొని కార్ ఎక్కి కూర్చున్నాడు.
ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టీ … ఎంత ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు …
అప్పటికే ఆర్య పెళ్లి ఆగిపోయింది అని … ఎవరో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆర్య చెంప మిద కొట్టి అతని పెళ్లి నీ ఆపింది అని న్యూస్ నెట్ లో వైరల్ అవుతు ఉంది.
ఇప్పుడు ఆర్య కోపంతో రూప నీ ఏం చేస్తాడు…?
అసలే ఆర్య బాబు కి శాడిస్ట్ , సైకో , రూత్ లెస్ మాన్స్టర్ అనే మంచి మంచి బిరుదులు కూడా ఉన్నాయి…
పాపం ఇప్పుడు మన రూప పాప పరిస్థితి ఎంటో ముందు ముందు చూద్దాం.
ముందు స్టోరీస్ లాగానే ఈ స్టోరీ నీ కూడా ఆదరిస్తారు అని అనుకుంటున్నాను..
స్టోరీ చదివి మీ అమూల్యం అయిన కామెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తున్నా.
To be continued…..
Swipe left/right or tap the sides to turn pages