💞 ఓయ్ హిట్లర్ గారు 💞 – 1
హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా నన్ను నేను పరిచయం చేసుకొని నా కథ ని మీ అందరి దగ్గరికి తీసుకొచ్చేస్తాను విషయమేంటి అంటే నా పేరు నిహారిక మనకి బాగా దగ్గరైన వాళ్ళు అంటే అమ్మానాన్న ఇంట్లో వాళ్ళు ఇంకా అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ముద్దుగా నిహా అని పిలుస్తూ ఉంటారు మిగతా వాళ్లు నిహారిక అని పిలుస్తారు
మేము ఉండేది జూబ్లీహిల్స్ అలా అని మీ మీద బాగా ఉన్నోళ్ళం అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి పర్లేదు నాన్న బ్రతకడానికి బాగానే సంపాదించారు కానీ నాకు ఆయన సంపాదించిన దానిమీద ఇంట్రెస్ట్ లేదు సో నా అంతటిని ఒక జాబ్లో జాయిన్ అయ్యి ఇండిపెండెంట్ గా ఉండాలి అని పెద్ద ఫిలాసఫీ ఒకటి బిటెక్ అవ్వగానే నన్ను ఎత్తి మీద తగిలించుకొని పెళ్లి నుంచి ఎస్కేప్ అవ్వడానికి జాబ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాను
వెతుకుతూ ఉన్న క్రమంలో ఒక మంచి చాకిరి చేసే ప్లేస్ ఒకటి దొరికింది ప్రెసెంట్ అక్కడ నేను రెండు సంవత్సరాల కూలీ చేయడానికి అగ్రిమెంట్ కూడా చేసుకుని రోజు ఆపసోపాలు పడుతూ వెళ్తూ వస్తూ ఉన్నాను
నేను పని చేసే కంపెనీ పేరు Gk ఇండస్ట్రీస్ అందులో నేను ఒక వెబ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను
పర్లేదు జీతం అయితే బాగానే ఇస్తున్నారు కానీ దానికి తగ్గ వర్క్స్ ప్రెషర్ కూడా అంతే ఉంటుంది దానికి ముఖ్యమైన కారణం మా మేనేజర్ గాడు వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా ఇలాంటి ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే వాడి గురించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం భయపెట్టడం నాకు ఇష్టం లేదు సో ముందు ముందు వాడి గురించి తెలుసుకుందాం కానీ నేను పని చేసే దగ్గర నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు
బేసిగ్గా మనం ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతాం లెండి అది వేరే విషయం
రోజులానే ఆ రోజు కూడా ఆఫీస్ కి వెళ్ళాను అప్పటికి ఇంకా నా ఫ్రెండ్ నా కొలీగ్ మేఘన రాకపోవడంతో నా ప్లేస్ లో కూర్చుని సిస్టం ఆన్ చేస్తూ నోటికి ఏదో వచ్చిన పాటని కూనీ చేస్తూ ఉండగా సడన్గా ప్యూన్ నా దగ్గరికి వచ్చాడు
నిహారిక మేడం మిమ్మల్ని మేనేజర్ సార్ పిలుస్తున్నారు అన్నాడు వాడు చావు కబురు చల్లగా
అంతే ఇంకేముంది ఒక్కసారిగా నోట్లో పాట నోట్లోనే ఆగిపోయింది దేవుడా చచ్చింది గొర్రె అయినా ఈ హిట్లర్ గాడు ఎందుకు పిలుస్తున్నాడు ఇప్పుడు అనుకుంటూనే తప్పక గోర్లు కొరుక్కుంటూ అక్కడి నుంచి మెల్లగా మేనేజర్ క్యాబిన్ దగ్గరికి వెళ్లాను
డోర్ ఓపెన్ చేసిన నాకు మా హిట్లర్ గారి కంటే ముందే అతని నేమ్ బోర్డ్ కనిపించింది విక్రమ్ రెడ్డి ఆహా ఎంత మాన్యుగా ఉందో పేరు కానీ మీరు పేరు చూసి టెంప్ట్ అయితే అక్కడే పప్పులో కాలు వేసినట్టు అవుతుంది
కొంచెం భయపడుతూనే మీ గెట్టింగ్స్ అని అడిగాను సాధ్యమైనంత మెల్లగా
ఎస్ మిస్ నిహారిక అంటూ చెప్పడంతో మెల్లగా డోర్ పూర్తిగా తెరిచి లోపలికి వెళ్లి అతని ఎదురుగా చేతులు కట్టుకొని ఎల్కేజీ పిల్లాడిలా నిలబడ్డాను
నీకు వేలకు వేలు జీతాలు ఇస్తుంది దేనికి మిస్ నిహారిక వర్క్ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు నువ్వు డెవలప్ చేయడానికి రాసిన కోడ్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో తెలుసా అంటే ఇప్పుడు ప్రతిసారి ఆ ఎర్రర్స్ అని నేను క్లియర్ చేయాలా నీకోసం అంటూ కారం తిన్న కాకి లాగా నామీద అరవడం మొదలుపెట్టాడు
సారీ సార్ నేను మీకు చెక్ చేసిన వర్షన్ కాకుండా రా వర్షన్ పంపించేసినట్టున్నాను సార్ ఇప్పుడే మీకు దాని ఎర్రర్స్ అవి కరెక్షన్ చేసిన వర్షన్ పంపిస్తాను అన్నాను తలదించుకుని
అంత సింపుల్గా ఎలా చెప్తున్నారు మీ నిహారిక ఇది అసలు టాలరెట్ చేయలేను మీరు ఈరోజు నైట్ 8 వరకు ఇక్కడే ఉండి వర్క్ చేయండి అన్నాడు మేనేజర్
ఓకే సార్ అని భయంగా చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసాను
వామ్మో వీడికి ఏదో అయింది ఈరోజు దేవుడా ఎందుకు తండ్రి నీకు నేనంటే ఇంత పగ పొద్దుపొద్దున్నే ఆ గాడ్జిల్లా గాడి నోటికి నన్ను ఆహారం చేసేసావా అయినా వాడికి ఫైల్ పంపించే ముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి కదా ఆ మాత్రం కామెంట్ సెన్స్ కూడా లేకపోతే ఎలా? అని నన్ను నేనే తిట్టుకుంటూ తిరిగి నా ప్లేస్ కి వచ్చి డిలా పడిపోయాను
ఏమైంది మేడం పొద్దు పొద్దున్నే కోటింగ్ పడిందా అడిగింది మేఘన నవ్వుతూ
ఛీ నిన్న నీతో మాట్లాడుతునే వాడికి ఒక ఫైల్ పంపించబోయి ఇంకొక ఫైల్ పంపించాను అంత నీవల్లే ఇప్పుడు నేను వీడి కోసం ఇంకొక ఎక్స్ట్రా రెండు గంటలు పని చేయాల్సి వస్తుంది అన్నాను అలుగుతూ
ఏం కాదులే రెండు గంటలే కదా ఇట్టా అయిపోతాయి అంటూ తిరిగి తన పనిలో పడిపోయింది మేఘన
నేను మాత్రం ఆ హిట్లర్ గాడిని బాగా తిట్టుకుంటూ తిరిగి నా పనిలో పడిపోయాను.
ఏంటో రోజంతా చాకిరీ చేసిన మా హిట్లర్ గారికి అసలు సరిపోదు ఎంత వర్క్ చేయించుకున్న ఇంకా వర్క్ చేయలేదు అనే ఏడుస్తాడు తప్ప ఒక్కరోజు కూడా చేసిన వర్క్ ని మెచ్చుకున్నది లేదు ఇంకా రేప్పొద్దున పెళ్ళాంతో కూడా వీడు సీరియస్ గానే కాపురం చేస్తాడేమో వీడు వీడి వేస్ట్ ఫేస్ అని తిట్టుకుంటూ నా వర్క్ లో పడిపోయాను
మధ్యాహ్నం వర్క్ చేసుకుంటూ ఉండగా అమ్మ నుంచి పదేపదే కాల్స్ వస్తూ ఉంటే ఇక తప్పక పక్కకి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాను
హలో చిన్ను రేపు లీవ్ కోసం అప్లై చేయమన్నా నువ్వు చేసావా అడిగారు అమ్మ ఆత్రుతగా
ఏంటి అప్లై చేసేది నా బొంద అక్కడ ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి అంటేనే నాకు కాళ్లు చేతులు పైనుంచి కింద వరకు వణుకుతూ ఉన్నాయి ఇక అలాంటిది నేను వాడి దగ్గరికి వెళ్లి ఏం లీవ్ అడుగుతాను అనుకుంటూ ఒక ని తూర్పు విడిచి ఆ సాయంత్రం అడుగుతానులే మమ్మీ అన్నాను కొంచెం చిరాకుగా
ఏంటి ఇంకా అడగలేదా సాయంత్రం అడిగితే రేపు ఇవ్వనంటే ఏం చేస్తావ్ రేపు అసలే పెళ్లి చూపులు నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నాకు ఆల్రెడీ తెలుసు అందుకే అబ్బాయి వాళ్లకి నీ గురించి మొత్తం అంతా ముందే చెప్పాను అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ కూడా హ్యాపీగా ఓకే చెప్పారు పెళ్లి తర్వాత కూడా నువ్వు జాబ్ చేసుకోవచ్చు కాబట్టి పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా లీవ్ అప్లై చేసి తొందరగా ఇంటికి రా అంటూ తన వేలో తను తిట్టడం మొదలుపెట్టింది మమ్మీ
పాపం మీ ఇక్కడ అందరూ నన్ను తిడుతున్నారు మీరు గమనించారో లేదో ఈ హిట్లర్ గాడు నన్ను తిడుతున్నాడు మా మమ్మీ కూడా నన్ను తిడుతుంది 🤧🤧🤧
——–continues…………..
ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కొంచెం చెప్పండి కామెంట్స్ లో నా కథ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ముందు ముందు ఇంతకీ నాకు ఈ విషయం చెప్పండి ఇప్పుడు మా హిట్లర్ గాడిని నేను లీవ్ అడిగితే నాకు ఇస్తాడు అంటారా 🙈🙈🫣🫣
Swipe left/right or tap the sides to turn pages