బ్యాడ్ లక్ నెత్తి మీద కూర్చున్నట్టుంది.. కింద పడినప్పుడు బెనికిన కాలు బ్యాలెన్స్ తప్పడంతో స్లిప్ అయ్యి ముందుకు పడింది. వెనక లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. అయిపోయింది నా అందమైన ముక్కు పచ్చడి అయిపోయిందని పైకె అంటూ లిఫ్ట్ గోడకి గట్టిగా చేతులు అదిమి పెట్టి కాలు బ్యాలెన్స్ చేసుకొని ఒక చేతితో ముక్కు తడిమి చూసుకుంది. కొద్దిగా నొప్పిగా ఉన్న ముక్కు షేప్ కరెక్ట్ గా ఉండడంతో అమ్మయ్య నా ముక్కు, ముక్కు పుడక రెండో సేఫ్ అనుకొని సపోర్…