💞 ఓయ్ హిట్లర్ గారు 💞 – 2
పాపం మీ ఇక్కడ అందరూ నన్ను తిడుతున్నారు మీరు గమనించారో లేదో ఈ హిట్లర్ గాడు నన్ను తిడుతున్నాడు మా మమ్మీ కూడా నన్ను తిడుతుంది 🤧🤧🤧
ఇక చేసేదేం లేక ఒక ఐదు నిమిషాలు అమ్మ తిట్లన్నీ ఓపికగా భరించి ఇంకా మళ్లీ మా హిట్లర్ గాడు చూస్తే ఎక్కడ వాడు కూడా తిడతాడు అన్న భయంతో కాల్ కట్ చేసేసి అక్కడి నుంచి భయంగా మళ్లీ ఆఫీస్ లోపలికి వచ్చాను
మా హిట్లర్ గాడు తన క్యాబిన్లోనే కూర్చుని చాలా డీప్ గా ఏదో టైపింగ్ చేస్తూ ఉన్నాడు
నీ టైపింగ్ తగలెట్టా ఎవర్రా నువ్వు అవి మనిషివేనా లేదంటే గుర్రం కాళ్ళ అంత స్పీడ్ గా వెళ్తున్నా ఏంటి అనుకుంటూ ఒక రెండు నిమిషాలు అన్ని మరిచిపోయి వాడి చేతి వేళ్ళనే చూస్తూ కూర్చున్నాను
రామ రామ ఏం చేస్తున్నావే నువ్వు ముందు విషయం చెప్పి వాడి తిట్లని భరించి ఏదో ఒకటి చేసి వాడినుంచి లీవ్ తీసుకో లేదంటే అమ్మ ఇంటికి వెళ్లేసరికి భద్రకాళి అయిపోతుంది అంటూ నా అంతరాత్మ బయటికి వచ్చి నన్ను హెచ్చరించడంతో ఇంక చేసేదేం లేక కుయోమురో అనుకుంటూ వాడి దగ్గరికి వెళ్లాను
కెన్ ఐ గెట్ ఇన్ సర్ అడిగాను చాలా అంటే చాలా వినయ విధేయతలను ప్రదర్శిస్తూ
వాడు చేస్తున్న పని ఆపకుండానే ఎస్ అన్నాడు గాంభీర్యంగా
ఒరేయ్ ఎదవ నేనేమైనా నీ ఆస్తిలో వాటాడిగాని ఏంట్రా అంత గాంబీర్యం గారు ఇస్తున్నావ్ ఎస్ అని స్మూత్ గా కూడా చెప్పొచ్చు రా కానీ నువ్వు స్మూత్ గా చెప్పావు పెద్ద గాడ్జిల్లావి కదా అందుకే ఎస్ అని బేస్ వాయిస్ లో మాట్లాడుతున్నావ్ ఇంట్లో మీ మమ్మీ ని కూడా ఆమె నాకు కాఫీ కావాలి అని ఇలాగే గాంబిర్యంగా అడుగుతావా సచ్చినోడా అని మనసులోనే తిట్టుకుంటూ లోపలికి వెళ్లి హిట్లర్ ముందు ఎదురుగా నిలుచున్నాను
వాడు ఒక రెండు నిమిషాలకి నా వైపు చూస్తూ ఏంటి ఎందుకు వచ్చావు అడిగాడు చాలా అంటే చాలా సీరియస్గా
నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను ఇప్పుడు నేను వీడితే ఏమైనా గొడవపడడానికి వచ్చాను అనుకుంటున్నాడా వీడు ఎందుకు ఇంత గట్టిగా అరిచి పాపం చిన్నపిల్లని నన్ను భయపెడుతున్నాడు అసలు మనసే లేదబ్బా ఈ మనిషికి బట్ అవసరం నాది కదా మాట్లాడాలి తప్పదు
అంటే సర్ అది అంటూ మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాను
సి మిస్ నిహారిక ముందు విషయం ఏంటో చెప్పండి అంటూ ఇంకా సీరియస్గా అడగడంతో అంటే సర్ అది మరి నాకు రేపు లీవ్ కావాలి సార్ అన్నాను చిన్నగా
ఎందుకు అడిగాడు తిరిగి పని చేసుకుంటూ
రేపు నాకు పెళ్లి చూపులు సర్ అందుకే అంది నిహారిక
పెళ్లిచూపులు ఆఫీస్ తర్వాత పెట్టుకోవచ్చు గా ఏం ఆఫీస్ టైమ్ లోనే పెట్టుకోవాలి అని రూల్ ఉందా అడిగాడు నా వైపు సీరియస్ గా చూస్తూ
ఓరి సచ్చినోడా ఎవడైనా పెళ్లి చూపులు అంటే పొద్దున్నే పెట్టుకుంటాడు రా అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వేళలో కాదు అని నాకు నేనే తిట్టుకుంటూ అంటే ముహూర్తం అప్పుడు ఫిక్స్ చేశారంట సార్ అన్నాను మెల్లగా
సరే అయితే పొద్దున్న పెళ్లి చూపులు అయిపోతాయి కాబట్టి ఆఫ్ డే లీవ్ ఇస్తాను మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి రా అన్నాడు నా వైపు చూడకుండానే
పెళ్లిచూపులు 2:30 కి సర్ అని నోటికి వచ్చిన టైమింగ్ చెప్పేశాను
ఓకే దెన్ మార్నింగ్ నుంచి చేస్తున్నాను వరకు వచ్చి ఆఫ్టర్నూన్ 1:00 కి లీవ్ తీసుకుని వెళ్ళిపో సరిపోతుంది అన్నాడు వెంటనే
దేవుడా ఎవర్రా వీడు నాకు ఒక గన్ ఇస్తారా అన్న మేము గుర్తొచ్చింది నాకు ఆ క్షణంలో
ఛీ దీనమ్మ జీవితం ఒక లీవ్ కోసం ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడే ఏదో నువ్వు ఈ దేశం వదిలి పారిపోతావేమో అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతున్నాడు వెధవ గాడు అని నా అంతరాత్మ బయటికి వచ్చి వారిని ఏగాదిగా చూస్తూ తిడుతుంటే బాబు నాకు వీడికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్నాను మెల్లగా
ఎక్స్క్యూజ్మీ ఇంకా ఏమైనా మాట్లాడాల్సిన్ ఉందా అడిగాడు. నా వైపు చూస్తూ
ఆహా లేదు సర్ కానీ లీవ్ కావాలి ఈ మంత్ లో నేను ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు సార్ నా లీవ్ మాత్రమే నేను తీసుకుంటున్నాను మంత్ కి టు లీవ్స్ ఉంటాయి కదా సార్ అన్నాను నా చిట్టి బుర్రని కాస్త పదును చేసి ఆలోచించి
ఆ మాటకి హిట్లర్ గాడు నా వైపు ఒక రెండు నిమిషాలు చూసి సరే అయితే నాకు మెయిల్ పెట్టు నేను అప్రూవ్ చేస్తాను అని చెప్పడంతో
థాంక్యూ సర్ అని బ్రైట్ గా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాను
హమ్మయ్య మొత్తానికి ఒక పెద్ద గండం గట్టెక్కింది ఇక రేపు వచ్చి ఆ పెళ్లి కొడుకుని కూడా ఇలాగే సైడ్ కి తప్పించేస్తే అంతే చాలు నిహా ఈరోజు నీ తెలివి చాలా బాగా పనిచేస్తుంది నువ్వు కూడా రోజురోజుకీ బాగా తెలివైన దానివి అయిపోతున్నావు అని నాకు నేనే పొగిడితోని తిరిగి వర్క్ లో పడిపోయాను మళ్ళీ టైం వేస్ట్ చేస్తున్నట్టు హిట్లర్ గాడికి కనిపిస్తే ఇక్కడ తిడతాడో అన్న భయంతో
——–continues…………
Swipe left/right or tap the sides to turn pages