1.ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 2
అయినా సరే వాళ్ళు వదలక చుట్టూ చేరి తిరుగుతూ చూస్తూ ఉంటారు ఇలా అంటాడు ఒకడు ఒరేయ్ ఈ రోజు మనం దీనితో ఎంజాయ్ చేసాక వదిలేస్తే ఇది ఎవరి దగ్గర అయినా చెప్పద అంటాడు ఆ మాటకి ఇంకొకడు ఒరేయ్ పిచ్చోడా ఎవడైనా ఇల చేసాక వదిలేస్తారా చంపేయడమే అని అంటాడు.
అది విన్న ఆ అమ్మాయి ఏడుస్తూ లోపల బాధ పడుతూ ఇలా అనుకుంటూ ఉండిద్ధి ఇంకా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మా తమ్ముడు గుర్తొస్తు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఇదే నాకు చివరి రోజు అని అనుకుంటూ బాధ పడుతూ ఉంటది.
ఈ లోపు ఆ ముగ్గురు లో ఒకడు వచ్చి ఇప్పటికే చాల లేట్ చేసాం ఇంకా నా వాళ్ళ కాదు రావే అని చెప్పి ఇద్దరు కాళ్ళు ఇంకా మిగిలిన అతను చేతులు రెండు కలిపి పట్టుకొని మోసకెళ్తూ ఉంటారు ఆ అమ్మాయి అరుస్తూ వదలమని ఎంత గింజకున్న వదలకుండా గట్టిగ పట్టుకొని తీసుకెళ్తున్న టైంకి ఆ అమ్మాయి ఊపిరి బలం గా తీసుకొని వదిలి గట్టిగ బలాన్ని అంత కూడ తీసుకొని కాళ్ళని గట్టిగ విదిలించి వాళ్ళలో ఒకడిని గట్టిగ ఒక చోట బలం గా తన్నీద్ది అంతే ఇంకా అతను ఆ అమ్మాయి ని వదిలేసి తన్నిన చోట పట్టుకొని కింద పడి నొప్పికి అరుస్తూ ఉంటాడు.
మిగిలిన ఇద్దరు ఆ అమ్మాయి ని వదిలేసి ఆ పడిన అతని దగ్గరికి వేళ్ళి లేపుతు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి అదే అదును అనుకోని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అనుకొని నెమ్మదిగా పైకి లేచి పడిపోయిన బ్యాగ్ తీసుకొని మళ్ళీ పరిగెత్తిద్ది.
అది గమనించిన ఒకడు రేయ్ అది పారిపోతుంది రా అని అరుస్తూ చూపిస్తాడు ఇంకా మిగిలిన ఇద్దరు కూడా ఆ వైపు చూసి రేయ్ అది తప్పించుకోవడానికి వీళ్ళేదు అని కష్టం గా పైకి లేచి వాళ్ళ వైపు చూస్తూ చెప్తాడు మిగిలిన ఇద్దరు సరే రా ఈ రోజు అది మన చేతిలో చావాల్సిందే అని చెప్పి ఆవేశం గా ముగ్గురు పరిగెడతారు.
వాళ్ళు రావడం చూసినా ఆ అమ్మాయి ఇంకా వేగం గా తన పరుగుని అందుకునిద్ది కానీ ఆ అమ్మాయి కి అప్పటికే ఓపిక ఐపోయి అడుగులు తడబడుతూ పరిగెత్తిద్ధి అయినా సరే వాళ్ళు వస్తున్నా వేగం చూసి ఎలాగ అయినా తప్పించుకోవాలి అని చెప్పి మనసులో దేవుడికి ప్రార్ధించిద్ది.
దేవుడా ఎలాగ అయినా నన్ను రక్షించు స్వామి ప్లీజ్ అమ్మ తమ్ముడు నాకోసం ఎంత ఎదురు చూస్తున్నారో ఎంత కంగారు పడుతున్నారో ఎలాగ అయినా నేను క్షేమంగా ఇంటికి వెళ్లి వాళ్ళని కలుసుకునేలా చూడు స్వామి అని మనసులో వేడుకుంటూనే పరిగెడుతూనే ఉంది.
వెనకాల వాళ్ళు మాత్రం లేడి పిల్ల కోసం వెంటాడే క్రూర మృగల్లాగ వెంట వస్తున్నారు ఇంతలో తను ఒకచోట ఎదో చూసి ఆగిపోయిద్ది వెంటనే కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఇంకా నా పని ఐపోయినట్టేనా స్వామి ఎందుకు అయ్యా నన్ను ఇలాంటి పరిస్థితికి తీస్కోచ్చావు నేను తెలిసి కానీ కనీసం తెలియక కూడా ఎవరికి ఏ అపాయం తల పెట్టలేదు కదా స్వామి నన్ను ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉంచావు అని కన్నీరు కారుస్తూ ఒక చోట నక్కి కూర్చుని ఉండిద్ది.
అప్పుడే సడన్ గా వాళ్ళు కూడా అక్కడికే వచ్చి వెతుకుతూ రేయ్ అది కచ్చితంగా ఇక్కడే ఉండిద్ది రా ఎటు వెళ్లే దారి అయితే లేదు అని చెప్పి కోపం గా వెతుకుతూ ఉంటారు వాళ్ళ మాటలు అన్ని ఆ అమ్మాయికి వినపడుతూనే ఉంది.
ఎటువంటి సౌండ్ రాకూడదు అని నోటి మీద చేయి వేసుకొని భయ పడుతూ చూస్తూ ఉండిద్ది ఇంతలో ఆ అమ్మాయి ఫోన్ మొగిద్ది ఇంకా అంతే దాన్ని ఆపాలని టెన్షన్ లో ఏదేదో నొక్కుతుంది కానీ అది ఆగడం లేదు ఇంతలో కరెక్ట్ గా నొక్కి ఆపింది అప్పుడే పక్కన నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు దొరికావే ఎక్కడికి వెళ్తావు అని చెప్పి చేయి పట్టి లాగి పక్కకి తీసుకోస్తారు.
అక్కడ వాళ్ళని చుసిన ఆ అమ్మాయి భయపడుతూ ప్లీజ్ నన్ను వదిలేయండి నేను ఎవరికి చెప్పాను ప్లీజ్ అని బతిమిలాడుతూ ఉండగా ఇంకా దానితో మాటలు ఏందీ రా ముందు చంపేయి ఆ తర్వాత అయినా ఎంజాయ్ చేయొచ్చు అని అంటాడు.
అది విన్న రౌడీ అవును రా నిజమే అని చెప్పి కత్తి తీసుకొని పొడవడానికి దగ్గరకు వస్తూ ఉండగా అప్పుడే కత్తి పొట్ట దాకా వచ్చింది అది చుసిన ఆ అమ్మాయి భయం తో గట్టిగ కళ్ళు మూసుకునిద్ది…
మీ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్
మీ విలువైన రేటింగ్స్ ని కామెంట్స్ ని ఇచ్చి నన్ను ప్రోత్సాహరిస్తారు అని ఆశిస్తూ
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages