రిసార్ట్ అంతా చిరుజల్లులతో తడిసిపోయింది. చల్లని గాలి వీచుతుండగా… వాన చినుకులు చుట్టూ ముత్యాల్లా జారిపడుతున్నాయి.
ఫోన్‌లో మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన సాక్షి… ముఖంపై పడిన వాన చినుకులతో ఒక్కసారిగా ఆగిపోయింది. వెంటనే కాల్ కట్ చేసి… చిన్న పిల్లలా ఆ చినుకులతో ఆడుకోవడం మొదలుపెట్టింది.