“సమీక్షా… నీకు నిద్ర వస్తే ఆ గదిలో పడుకో. నాకు కొంచెం పని ఉంది. అది పూర్తి చేసుకుని వస్తాను.” అని చెప్పి సాక్షి ల్యాప్‌టాప్ తీసుకుని హాల్‌లో కూర్చుంది.
“సరే అక్క.” అని చెప్పి సమీక్షా ఆమె గదిలోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికే సాక్షి ఫోన్ మోగింది.
హలో… జీవా! ఇందాక కాల్ చేశావుగా. ఏమైనా పని ఉందా?” అని అడిగింది సాక్షి.
“అవును సాక్షి. ఇప్పుడే చేశాను. కానీ నువ్వు ఎత్తలేదు.” అంది జీవ
“అక్క పెళ్లి కదా… అందుకే కొంచెం బిజీగా ఉన్నాను.” అని నవ్వుతూ చెప్పింది సాక్షి.
“అది… మన ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని తారక్ సర్ అడుగుతున్నారు.” అంది జీవ.
“ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. నువ్వు నాకు మెయిల్ చేయి. అన్నీ రెడీ చేసి నేనే సర్‌కి మెయిల్ చేస్తాను.” అంది సాక్షి.
“ఓకే.” అని చెప్పి జీవ కాల్ కట్ చేసింది.
జీవ పంపిన ఫైల్స్ అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తూ… ప్రాజెక్ట్‌కు చివరి మెరుగులు దిద్దింది సాక్షి. పని పూర్తయ్యేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటిపోయాయి.
ఒక్కసారి ఆవలించి… సమీక్షా ఉన్న గదిలోకి వెళ్లి ఆమె పక్కనే పడుకుంది.
ఇక మరోవైపు…