ఆయుష్‌ని గట్టిగా హత్తుకున్న తారక్… ఆ చిన్నారి ముఖం నిండా ముద్దులు పెట్టాడు. అతని చిన్న చిన్న చేతులను తన చేతుల్లోకి తీసుకుని, కళ్లలోకి వస్తున్న కన్నీళ్లను బయటకు రానివ్వకుండా ఆపుకుంటూ ఉన్నాడు.
“పప్… పప్…” అంటూ ఆయుష్ కూడా తారక్ చేసినట్టుగానే అతని ముఖం నిండా ముద్దులు పెడుతూ నవ్వాడు.