Mr. ప్రవరాఖ్యుడు – 1
వైజాగ్ లో పేరు గాంచిన ### కాలేజీ….
లైబ్రరీ లో పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంది… కొంత మంది స్టూడెంట్స్ క్లాసెస్ నుండి తప్పించుకోవడం కోసం టైమ్ పాస్ కి వచ్చి సరదా గా స్టోరీ బుక్స్ చదువుతున్నారు…కొంత మంది నాలెడ్జ్ కోసం బుక్స్ లో తల పెట్టేశారు…ఒక వ్యక్తి లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఉన్నాడు… అతను ఏదో సబ్జెక్ట్ రీడ్ చేస్తున్నాడు…ఎలా అంటే అతను అక్కడికి వచ్చి సుమారుగా మూడు గంటలు అవుతుంది… ఒక్కొక్కరు ఆ ప్లేస్ కాలి చేసి వెళ్ళిపోతున్నారు లంచ్ టైమ్ అవ్వడం తో… ఆ అబ్బాయి మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు …ఇంతలో అక్కడికి ఇంకొక అబ్బాయి అతని దగ్గరికి వచ్చి రేయ్ లంచ్ టైమ్ అయింది రారా క్యాంటీన్ కి వెళ్దాం అని పిలిచాడు ..ఆ అబ్బాయి బుక్ లో నుండి తల బయటకి పెట్టకుండానే వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ మామ అన్నాడు… ఆ అబ్బాయి కూడా ఒకే చెప్పి పక్కన కూర్చున్నాడు … అలా ఇంకొక పావు గంట టైమ్ స్పెండ్ చేసి బుక్ క్లోజ్ చేసి బుక్ ను ఎక్కడి నుండి తీసిన రాక్ లో తిరిగి పెట్టి ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు… అలా వాళ్ళిద్దరూ కలిసి క్యాంటీన్ కి వెళ్ళి లంచ్ చేసి ఇంకా క్లాస్ కి టైమ్ వుండడం తో క్లాస్ రూమ్ బయట స్టెప్స్ దగ్గర నిల్చొని మాట్లాడుతున్నారు…అదే క్లాస్ లో ఒక అమ్మాయి విండో నుండి బయటకు చూస్తుంది … అది కూడా ఆ అబ్బాయి వైపు …ఆది గమనించిన వాళ్ళ ఫ్రెండ్ రేయ్ మామ ఆ తనూజా నిన్నే చూస్తుంది రా అన్నాడు….ఆ అబ్బాయి అసలు ఆ మాటే విననట్టు ఏదో మాట్లాడుతున్నాడు …వాళ్ళ ఫ్రెండ్ కి అర్థం అయింది పట్టించుకోవట్లేదని …ఇంకా ఆ టాపిక్ వదిలేసి సరదా గా మాట్లాడుకుంటూ ఉన్నారు ..ఈ లోపు క్లాస్ స్టార్ట్ అయింది ఇద్దరు లోపలికి వెళ్ళి క్లాస్ విన్నారు .. సాయంత్రం అయింది కాలేజీ నుండి అందరూ బయటికి వస్తున్నారు..ఆ అబ్బాయి తన కారు వైపుకు వెళ్తున్నాడు వాళ్ల ఫ్రెండ్ తో.. ఇద్దరు సేమ్ ఏరియా సో ఇద్దరూ ఒక కారు లోనే వస్తారు వెళ్తారు … రాకేష్ (ఫ్రెండ్) వాళ్ళు తమ ఇంటి ముందు ఇంట్లో ఉంటారు …. రాఖీ బాయ్ చెప్పి వాళ్ళింటికి వెళ్ళిపోయాడు..ఆ వ్యక్తి ఇంటి పోర్టికోలో కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు…కిచెన్ లో వాళ్ల అమ్మ సుజిత గారు స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు..ఆ అబ్బాయి డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకొని తాగి ఏం చేస్తునావ్ మామ్ అంటూ అడుగుతాడు..వాళ్లమ్మ నవ్వుతూ నీకోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న కన్నా . నువ్వెల్లి ఫ్రెష్ అయి రా అని అంటుంది .. మామ్ ఇంట్లో మెయిడ్ ఉంది కదా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు … దానికి వాళ్ళమ్మ నా భర్త కి నా కొడుకు కి నేను చేసుకుంటే కలిగే ఆనందం మెయిడ్ తో చేయిస్తే వస్తుందా కన్నా అంటుంది…ఆ మాటకి తల్లి వైపు చూసి నవ్వి పైకి తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయి కింద హాల్ లో కూర్చుని ఫోన్ చూస్తుంటాడు..ఇంతలో వాళ్ళ నాన్న మహీంద్రా వర్మ గారు ఆఫీస్ నుండి వచ్చి ఆ అబ్బాయి పక్కన కూర్చుంటూ సుజి వాటర్ తీసుకురా అంటారు … హౌ ఇస్ యువర్ డే డాడ్ అని అడుగుతాడు ఆ అబ్బాయి… గుడ్ రా అని వాటర్ తాగి సుజిత గారు తెచ్చిన టీ అండ్ స్నాక్స్ ను ఎంజాయ్ చేస్తూ తండ్రి కొడుకులు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు…సుజిత గారు వాళ్ళని అలా చూసి నిట్టూరుస్తూ వాళ్ళ మెయిడ్ సావిత్రమ్మ వైపు చూసి బిజినెస్ లు రాజకీయాలు చేసే వాళ్ళతో ఇంతే సావిత్రమ్మ…ఇంట్లో కూడా అవే ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ..ఏమిటో వీళ్ళు పద్ధతులు అంటూ పెదవి విరుస్తారు … సావిత్రమ్మ కూడా నిజమే అన్నట్టు తల ఊపి తన పని తను చేసుకుంటుంది..సుజిత గారు వెళ్ళి వాళ్ళ ముందున్న సోఫా లో కూర్చుని ఎదురుగా వున్న ఇద్దరిని సీరియస్ గా చూస్తారు…వాళ్ళు ఆ విషయం గ్రహించకుండా వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు …చూసి చూసి కోపం గా మహి ఇంకా nv రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవుతావా లేక మళ్ళీ ఆఫీసు కి వెళ్ళిపోతావా అని అడుగుతారు ..ఆ మాటకి వాళ్ళు ఇహలోకంలోకి వచ్చి మహీంద్రా గారు ఒక పిచి నవ్వు నవ్వుతూ అంటే సుజి … అది అంటూ సాగదీస్తూ ఉంటే …ఇంకా చాలు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని ఆర్డర్ వేస్తారు సుజిత గారు..వెంటనే ఆయన స్కూల్ పిల్లాడిలా లాప్టాప్ బ్యాగ్ పట్టుకుని కిందన ఉన్న వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు …ఆది చూసి ఆ అబ్బాయ్ నవ్వుతూ మామ్ నువ్వు ఇప్పటికీ కూడా డాడ్ నీ భయపెడుతున్నావా ఇట్స్ రియలీ మిరాకిల్ అంటూ నవ్వాడు ..చాలు లే ఊరికో కన్నా నువ్వు కూడా మీ డాడ్ వచ్చే సరికి నన్ను పక్కన పెట్టేసి ఆయన తో ముచ్చట్లు పెట్టావ్ అంటూ ముక్కు చీదేస్తారు 😄… ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ డ్రామా నీ కాసేపు ఎంజాయ్ చేసి డిన్నర్ టైమ్ అవ్వడం తో గుడ్ నైట్ చెప్పి సుజిత గారికి చీక్ కిస్ ఇచ్చి పైకి వెళ్ళి పడుకుంటాడు…
మీ
❤️ స్వీటీ ❤️
లాగ్ అనుకోవద్దు … ఇంట్రడక్షన్ కూడా ఇంపార్టెంట్ కదా….రేపు హీరో నేమ్ తెలుస్తుంది…గుడ్ నైట్ ఆల్
Swipe left/right or tap the sides to turn pages