New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Mr. ప్రవరాఖ్యుడు – 2

Mr. ప్రవరాఖ్యుడు – 2

నెక్స్ట్ డే ఎర్లీ గా లేచి వర్కౌట్ ఫినిష్ చేసి రెడీ అయి టీషర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్ వేసుకుని కాలేజ్ బ్యాగ్ తో కిందకి వస్తాడు ఆ అబ్బాయి…

వాళ్ళ అమ్మ దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది .. సావిత్రమ్మ వాళ్ళుండే ఇంట్లో నే గార్డెన్ సైడ్ చిన్న హౌస్ లో వుంటుంది … ఎర్లీ మార్నింగ్ పనులు చేయడానికి వచ్చేస్తుంది …ఆవిడ కిచెన్ లో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది …ఈ లోపు మహేంద్ర గారు కూడా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం తో ఫాస్ట్ గా బ్యాగ్ తీసుకుని హాల్ కి వచ్చి సోఫా లో బ్యాగ్ పెట్టి సుజిత గారిని పిలుస్తారు …ఆవిడ పూజ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఏంటి మహి అంత కంగారు పడుతున్నావ్ అంటే సుజి బ్రేక్ఫాస్ట్ అయిందా లేక ఆఫీసు లో తినేయన ..ఈ రోజు కక్లైంట్స్ తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అన్నారు …అయిపోయింది మహి ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చెయ్యి అంటూ కిచెన్ లోకి వెళ్లి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇద్దరికి వడ్డిస్తుంది …ఆ అబ్బాయి …డాడ్ నేను కూడా రానా ఈ రోజు నువ్వు ఎందుకో కంగారు గా కనిపిస్తున్నావ్ నేను హ్యాండిల్ చేస్తా ఆ ఫైల్స్ నాకివ్వు అని అంటాడు .. ఇట్స్ ఒకే మై బాయ్ నేను హ్యాండిల్ చేస్తాను లే కంగారేమి కాదు వాళ్ళు 10 కోర్స్ ప్రాజెక్ట్ డీలింగ్ కోసం వస్తున్నారు…అక్కడ ఆఫీసు లో టైమ్ కి ఉంటే బావుంటుంది అని తప్ప ఇంకేం కాదు అని చెప్తారు.. ఒకే డాడ్ ఇబ్బంది అయితే కాల్ చేయండి నేనొస్త అన్నాడు ఆ అబ్బాయి …దానికి ఆయన హుందాగా నవ్వుతూ రేయ్ మీ డాడ్ గురించి నీకు తెలియదా… మన ఇండియా లో టాప్ త్రీ కంపెనీ లో మన కంపెనీ ఒకటి …దాన్ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లాలి అనేది నా టార్గెట్..అంతే తప్ప ఇలాంటి చిన్న డీలింగ్స్ కి నేను వెళ్లక్కట్లేదు కూడా కాకపోతే ప్రతి మనిషి కి మనం వాల్యూ ఇవ్వాలి … చిన్నది పెద్దది కాదు నీతి నిజాయితీ నీ చూడాలి అదే నా పాలసీ అని చెప్పి టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోయారు…ఆ అబ్బాయి కూడా వాళ్ళ డాడ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ టిఫిన్ చేసి బయటకి వచ్చి కారు తీస్తూ ఉంటే రాఖీ వచ్చి పక్క సీట్ లో సెటిల్ అవుతాడు … ట్రాఫిక్ ను దాటుకుని కాలేజ్ లోకి ఎంటర్ అవుతుంది కార్… ఏయ్ తను…రిషి వచ్చాడు అని చెప్తుంది ఒక అమ్మాయి…కారు నుండి బాగ్ తో కిందికి దిగి ఫ్రెండ్ తో నడుస్తూ వస్తాడు రిషి …. ఆరడగుల పైనే ఎత్తు ..ఎత్తుకి తగ్గ బరువు .. వరౌట్స్ చేసే బాడీ వల్ల అతని కండలు తిరిగిన దేహం టీషర్ట్ నుండి బయటి పొంగి కనిపిస్తుంది … చిరుత లాంటి చూపుతో ఒత్తైన జుట్టు… ఫోర్హెడ్ మీద ఎగురుతూ ఉంటుంది …లైట్ పింక్ కలర్ లిప్స్, పెర్ఫెక్ట్ జ లైన్, తెల్లని మేని ఛాయ, ట్రిమ్  చేసిన బియర్డ్, సూది ముక్కు , సిరియస్ గా చిరుత ల నడుచుకుంటు వస్తూంటే కాంపస్ అంత అలా చూస్తూ ఉండిపోయింది…..తను..త్రీ ఇయర్స్ నుండి వాడి వెంట పడుతున్నావ్ వాడిప్పటికీ నిన్ను చూడను కూడా లేదు ఇంకా నీ ట్రయల్స్ ఆపేయవే..ఈ ఇయర్ తో మనం స్టడీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాం …ఆ రిషి వర్మ మాత్రం నీ వైపు చూడను కూడా చూడడు అంది…

తనూ ఆ అమ్మాయి వైపు కోపం గా చూస్తూ రిషి ఎప్పటికైనా నా వాడే ..వాడిని ఎలా నా వైపుకి తిప్పుకోవాలి నాకు తెలుసు అంటూ క్లాస్ రూమ్ వైపు కి స్టైల్ గా క్యాట్ వాక్ చేస్తూ నడిచింది …నేహా ( ఫ్రెండ్) కూడా పెదవి విరిచి చూద్దాం అంటూ తనూ వెంటే క్లాస్ కి వచ్చింది…ఇద్దరు ఇంటర్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్..ఇద్దరు రిచ్ కిడ్స్ నే …కాకపోతే తనూ కి డబ్బుందని పొగరెక్కువ … మిడిల్ క్లాస్ వాళ్లని చిన్న చూపు చూస్తుంది … దానికి లేని అలవాటంటూ లేదు …పబ్స్ పార్టీస్ అంటూ తిరుగుతూ చాలా మందితో ఫిజికల్ రిలేషన్ షిప్స్ కూడా మెయింటైన్ చేస్తుంది …ఇంటర్ నుండి ఇవన్నీ చూస్తూ వచ్చింది నేహా …అయిన ఫ్రెండ్ అవడం వల్ల ఏమి అనలేక సైలెంట్ గా ఉంటుంది తప్ప ఇంకెవరితోను ఉండదు..ఇది తనూ బ్యాక్గ్రౌండ్..ఇంకా డీప్ గా ముందు ముందు తెలుస్తోంది..క్లాస్ కి వెళ్ళాక … లెక్చరర్…ఈ వీక్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు … ఈ సారి స్కాలర్ షిప్ తో కూడా జాయిన్ అవుతున్న సస్టూడెంట్స్ ఉన్నారు …వాళ్ళని అల్లరి చేయడం లాంటివి చెయ్యొద్దని చైర్మన్ సార్ ఆర్డర్…అలా కాదని ఎవరైనా ర్యాగింగ్ లాంటివి చేస్తే 1 మంత్ సస్పెన్షన్ ఉంటుంది అని హెచ్చరించారు…తర్వాత ఫ్రెషర్స్ డే గురించి కూడా డిస్కస్ చేసి ఆ మంత్ లోనే అని చెప్పి వెళ్ళిపోతారు..ఇక ఆ రోజు నుండి క్లాసెస్ జరగవు… అడ్మిషన్స్ తో హడావిడి గా ఆ వారం అంతా సరిపోతుంది …మన రిషి గారు మాత్రం ఈ వీక్ అంతా లైబ్రరీ లోనే బుక్స్ తో గడుపుతూ ఉంటాడు …వాడితో రాఖీ నీ లాక్కెళ్ళిపోతాడు .. పాపం 😂… రేయ్ దుర్మార్గూడ…నువ్వు ఎంజాయ్ చేయవు నన్ను చేయనివ్వవు..ఎలా రా నీతో …అంటూ ఏడుపు మొహం పెడతాడు …అయిన మన వాడు కరిగితే కదా …ఒక టాపిక్ ఇచ్చి ఇది కంప్లీట్ చేయకపోతే కాలేజ్ లోనే వదిలేసి పోత అని బ్లాక్మెయిల్ చేస్తూ రాఖీ తో కూడా చదివిస్తాడు… ఎంత మంచోడు మన హీరొ🫠…

 

మీ 

❤️ స్వీటీ ❤️

 

కామెంట్ చెయ్యండి బుజ్జులు…. 

రేపు హీరోయిన్ పాప వస్తుంది ….