నిరీక్షణ పలిచింది – 2
మిషన్ స్టాండ్ మీద పెట్టింది అది చూసిన నందిని ఒసేయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కడుగుతాను కదా ఎందుకు అప్పుడే కడిగేసావ్ అని పూజని కసిరింది…….
నందిని మొత్తం 10 బ్లౌజులకి 4000 పూజ చేతిలో పెట్టి పూజ ఇవాళ మీ బావ గారు ఖాళీగానే ఉన్నారు నువ్వు బాబాయ్ పిన్ని రెడీ అయిన తర్వాత నన్ను పిలువు అయినా కారులో పిన్ని బాబాయ్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు సరేనా…….
పూజ అక్క ప్రతి వారం అదంతా
ఎందుకు నేనే ఏదో ఒక ఆటోలో వెళ్తాను లే……
నందిని ఆయన ఎలాగో ఇవాళ ఖాళీగానే ఉంటాడు కదా అందుకే వెళ్ళమంటున్నది. ఇంకేం ఆలోచించకుండా వెళ్లి మొహం కడుక్కొని పిన్ని బావని రెడీగామని చెప్పు, ఒకవేళ హాస్పిటల్కి తీసుకు వెళ్ళడానికి డబ్బులు సరిపోకపోతే అడుగు నేను ఇస్తా అని చిన్నగా పూజ చెవిలో అంది ….
పూజ అవసరమైతే అడుగుతాలే అక్క అని చిరునవ్వుతో అంది….
అప్పుడే గదిలో నుంచి బయటికి వచ్చిన రూపా ఎందుకు నందిని ప్రతిసారి తనకి అదే చెప్తా ఎలాగో ఆవిడకి అవసరం ఉన్న ఎవరిని డబ్బులు అడగదు అని ఆవలిస్తూ ఒళ్ళు విడుచుకుంటూ వెటకారంగా అంది ….
నందిని వచ్చిందండి వయ్యారి ఎప్పుడు చూడు ఒకటే పని పూజ ని అందరి ముందల చిన్నచూపు చూడడమే ఈవిడ పని అని మనసులో తిట్టుకుంది.
అవునే పూజ మర్చిపోయానే ఈ ఫోటోలు నేను నీలు కి పెడతాను తను ఇంకా మనకి ఆర్డర్స్ తీసుకొస్తుంది నేను మిగిలినవి సాయంత్రం తీసుకువెళ్తానులే అని ముందు పుట్టిన బ్లౌజ్లని తీసుకువెళ్లింది….
నందిని వెళ్ళగానే రూపు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి , మీ అమ్మ నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు ఆ సరుకులు తీసుకుని రా అని చిరాగ్గా అంది….
దానికి పూజ సరే వదినా లిస్ట్ రాసి పెట్టు తీసుకొస్తానని వాళ్ల అమ్మ పండుకున్న గదిలోకి వెళ్ళింది.
గదిలో పూజ వాళ్ళ అమ్మ జ్వరంతో ములుగుతూ దుప్పటి కప్పుకొని మంచం మీద పడుకుంది . ఆవిడ తల దగ్గర కూర్చొని దుప్పటి తీసి చిన్నగా చెంప మీద తడుతూ అమ్మా లే లేచి రెడీ అవ్వు హాస్పిటల్ కి వెళ్దాం అని లేపింది. ఆవిడ పైకి లేచి పూజ చేతులు పట్టుకొని క్షమించు తల్లి నేను మీ నాన్న చేసిన పనికి నువ్వు బాధ బాధపడాల్సి వస్తుందని ఆవిడే కన్నీళ్లు పెట్టుకున్నారు .
పూజ మాత్రం ముఖంలో ఏ భావం లేకుండా ఆవిడ కన్నీళ్లు దూర్చి అమ్మ నువ్వు ఏడ్చి చేసేదేముంది ముందు రెడీ అవ్వు అని ఆవిడని బలవంతంగా బాత్రూంలోకి పంపింది.
ఆ పక్క గదిలో మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము మహారాజులం అంటూ పూజ అన్నయ్య తన గాడిద గుంతుతో పాడుతూ అడ్డదిడ్డంగా దొర్లుతున్నాడు . రూప చిరాగ్గా లోపలికి వెళ్లి అతని పక్కన 10 సంవత్సరాల కూతురి భుజం మీద కొట్టి ఒసేయ్ ఎంతసేపు నిద్రపోతావే పొద్దు పొడిచిన దాకా పండుకుంటావ్ అని గట్టిగా అరిచింది అమ్ములు మీద.. అమ్ములు అమ్మ ఎందుకే అంత గట్టిగా కొట్టావ్ చిన్నగా లేపొచ్చు కదా అని ఒళ్ళు విచ్చుకుంటూ పైకి లేచింది …..
అమ్ములు బయటికి వెళ్లగానే రుద్ర రూప చేయి పట్టుకొని తన మీదికి లాక్కొని రూప బంగారం రాత్రి తాగడానికి డబ్బులు లేవు రా ఒక 300 ఇప్పుడు ఇచ్చావంటే వచ్చేవారం నీకు 600 ఇస్తానని రూప గదుమ పట్టుకొని బతిమిలాడాడు…
అప్పుడు రూప అతని చేతి మీద చిన్నగా కొట్టి అడగాల్సింది నన్ను కాదు వెళ్లి మీ చెల్లిని అడగండి బాగా ఇస్తుంది
దానికి రుద్ర దానివల్లే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది నన్ను ఇలా చేసింది….
అక్కడ నుంచి వెళ్లబోతూ ఇప్పుడు మన అందరం ఆవిడ సంపాదన మీద బతుకుతున్నట్టు మీ అమ్మానాన్న తెగ ఫీల్ అయిపోతున్నారు, కాబట్టి నీ తాగుడు కొద్దిగా తగ్గించి పని మీద దృష్టి పెట్టండి అప్పుడు ఎవరు ఏమన్నారు.
ఏంటి ఇంకోసారి అను నేను పని చేయాలా….
రూప మీరేనా ఆలోచించండి రేపు మాపో పిల్లకి వయసు వచ్చేలా ఉంది.
రుద్ర తూలుతూ పైకి లేచి ఒక పని చెయ్ నువ్వు కూడా దాని లాగానే మిషిన్ కుట్టి డబ్బులు సంపాదించు సరిపోతది అని బయటికి వెళ్లిపోయాడు.
రూప వామ్మో వామ్మో 10 లక్షల కట్నం తెచ్చిన నన్ను జాకెట్లు కట్నం తెచ్చిన నన్ను జాకెట్లు కుట్టమంటున్నరు రేపు ఇంకేమైనా పని చేయమంటాడు అంటూ గోల గోల చేస్తుంది .
ఆ ఇంట్లో రోజు మామూలే కాబట్టి ఎవరి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు….
పూజ వేడి నీళ్లు కాచి ఆ నీళ్లు బకెట్లో పోసి డెటాల్ వేసి తండ్రి పండుకున్న మంచం దగ్గరకు తీసుకొచ్చింది తర్వాత ఆయనని పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. తర్వాత ఆయనను శుభ్రంగా తుడిచి బట్టలు కూడా వేసింది….
అమ్ములు పాల ప్యాకెట్ తెచ్చి పూజ చేతికిచ్చి ఇదిగో అక్క కాఫీ పెట్టు అని ఆర్డర్ వేసింది , అలాగే అమ్ము వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా నేను కాఫీ పెడుతా . …
ఈలోపు పూజ అమ్మగారు కాటన్ చీర కట్టుకొని తన కొప్పు చుట్టుకొని వచ్చి ….
మీ నాన్నని నేను శుభ్రం చేసే దాన్ని కదే నీకెందుకు ఇలాంటి పనులు అంటూ నోచుకుంటూ అంది . ఏం పర్వాలేదు అమ్మ నువ్వు ఫస్ట్ కాఫీ తాగు అని కాఫీ ఇచ్చిందా ఆవిడకి …….
ఇంకోపక్క బియ్యం కడిగి ఒక స్టవ్ మీద బియ్యం పెట్టి ఇంకో పక్క కర్రీ చేసి ఉప్మా కూడా రెడీ చేసి వంట పూర్తి అవ్వడంతో తను కూడా రెడీ అయింది హాస్పిటల్ కి వెళ్లడం కోసం…
………………………………….
హైదరాబాదులో మిడిల్ క్లాస్ వాళ్ళు నివసించే అపార్ట్మెంట్
లో ప్లాట్ నెంబర్ 204 లో ఆఫీస్ వెళ్లడానికి నీలిమ లంచ్ ప్రిపేర్ చేస్తుంది…
దొంగ పిల్లిలా కిచెన్ లోకి వచ్చి వెనుక నుంచి నీలిమను కౌగిలించుకోబోయాడు. అది ముందే గ్రహించిన నీలిమ వెనక్కి తిరిగి సీరియస్ గా ముఖేష్ ను చూసింది….
. ఆ చూపుకి తరబడి ముఖేష్ నీలు అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నవా లేదా అని అడగడానికి వచ్చాను అని నీళ్లు నములుతూ అన్నాడు….
నీలిమ మిస్టర్ ముఖేష్ నీ వేషాలు బయట ఎక్కడైనా వేయండి సారీ వేస్తున్నారు కదా ఇంకెందుకు నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అని సీరియస్గా అడిగింది….
ముఖేష్ ఈ టాపిక్ మాత్రం వదలవా అని చిరాగ్గా అడిగాడు…
నీలిమ ఈ టాపిక్ అంటే అది ఏదైనా చిన్న విషయమా ఏంటి అని వెటకారంగా అడిగింది…..
ముఖేష్ నీలిమ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అలాంటి విషయాలు అన్నీ చిన్న విషయాలు నువ్వు దాన్ని అలా చూడకుండా బూతద్దంలో పెద్దగా చూస్తున్నావ్…. దాని ఫలితంగా పెళ్లయిన రెండు సంవత్సరాలైనా ఇద్దరo దగ్గర కాబోయే కాకపోవడం మా అమ్మ నాన్న ఫోన్ చేసి పిల్లల్ని ఎప్పుడు కంటారు అని అడుగుతున్నారు వాళ్లకి ఏ సమాధానం చెప్పను …..
. నీలు ఆ విషయం మా అమ్మ నాన్నలు అడగాలి కానీ ఇక్కడేంటో వ విచిత్రంగా మీ అమ్మానాన్నలు అడుగుతున్నారు…….
ఏంటి అన్నారు గవర్నమెంట్ ఆఫీసెస్ కి అలాంటి విషయాలు చాలా చిన్న విషయాల మీకు అది చిన్న విషయాల అయ్యుండొచ్చు కానీ మా వాళ్లకు అది అసలు చిన్న విషయాలు కాదు….
మా నాన్న సోమతకు మించి మీకు 15 లక్షల కట్నం ఇచ్చి మరి నాకు మీతో పెళ్లి చేశాడు……. కానీ పెళ్లయినమన్నాడే తమరి గురించి తెలిసిన ఇప్పుడు నేను మీతో ఉంటున్నాను అంటే నీ మీద ప్రేమతో కాదు మా నాన్న మీద ఉన్న గౌరవంతో….
అయినా సరే నీకు ఛాన్స్ ఇచ్చా నువ్వు అలాంటి పనికిమాలిన పనులు ఆపేస్తే ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి కొత్త లైఫ్ మొదలు పెడదామని…..
కానీ తమరు అలాంటివి అసలు వదట్లేదు కదా మీకు రోజు తిండి లేకపోయినా పక్కలోకి ఒక అమ్మాయి కావాలి కదా అని కోపంగా ముఖేష్ మీద అరిచి తన లంచ్ బాక్స్ తీసుకుని నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని చున్నీసరిగా వేసుకొని ఫ్లాట్ నుంచి బయటకు వచ్చింది……
……,………….. ఇంకా ఉంది……………………
థాంక్స్ ఫర్ రీడింగ్ బంగారు కొండలు🫂💞……..
Swipe left/right or tap the sides to turn pages