అనుకోకుండా – 1
తెల్లవారుజామున ఐదు గంటలు కావస్తూ ఉంది. ఎవరో తెలియని ముసుగు వేసుకున్న వ్యక్తి అడవిలో పరిగెడుతూ ఉన్నాడు. అతని అడుగులే కనిపిస్తూ ఉన్నాయి. దూరంగా పోలీస్ జీప్ అతనిని వెంటాడుతూ ఉంది. అలా ముసుగు వేసుకున్న వ్యక్తి అడవిలోకి వెళ్లిపోయాడు. పోలీస్ జీప్ కూడా వెళ్లిపోయింది.
సంజీవ్ రైల్వే ట్రాక్ పై లోన్లీగా ఏదో ఆలోచిస్తూ బాధతో నడుస్తూ ఉన్నాడు. అక్కడికి సంజీవ్ స్నేహితుడు మారుతి బైక్ లో వచ్చి ఆపాడు. వెంటనే బండి దిగి వచ్చి సంజీవ్‌తో ” అప్పుల వాళ్లంతా ఒకేసారి మీ ఇంటి మీద పడడంతో నాన్నగారికి బీపీ ఎక్కువై పడిపోయాడు. నువ్వు వెంటనే వెళ్లి నాన్నగారిని హాస్పిటల్ లో చేర్పించు”
అన్నాడు. వెంటనే సంజీవ్ తన తండ్రిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ చేశాడు. అక్కడ తల్లి చెల్లి తనతో బాధపడ్డారు.
కొద్దిరోజుల తర్వాత సంజీవ్ ఏదో బాధ ఆలోచిస్తూ ఒక ఫారెస్ట్ లో కూర్చున్నాడు. అక్కడికి సంజీవ్ వచ్చి, ” బాధపడకు సంజీవ్ నీకు మంచి రోజులు వస్తాయి అప్పులన్నీ తీరి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తావు నీకు ఒక దారి దొరుకుతుంది.” అన్నాడు. మంచి రోజులు మాట దేవుడెరుగు జీవితం మీద నమ్మకం పోతుఉంది. ” అందుకు సంజీవ్ “అలా అనకు, తప్పకుండా మంచి రోజులు వస్తాయి ఇలా ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చోకు. ఇంటికి వెళదాం రా” అన్నాడు.” నేను కాసేపు ఉండి వస్తా వెళ్ళు నువ్వు” అంటూ మారుతిని పంపించాడు. మారుతి తన బైక్ లో వెళ్లిపోయాడు.
అలా కాసేపటికి సంజీవ్ ఇంటికి బయలుదేరాడు. అలా నడుచుకుంటూ వస్తున్న అడవిలో అనుకోకుండా తన ఫోన్ జారి కింద పడింది. వెంటనే తన సెల్ ఫోన్ తీసుకోవడానికి చేయి కింద పెట్టాడు. అనుకోకుండా అక్కడ ఒక వజ్రాల హారం దొరికింది. వెంటనే ఆ వజ్రాల ఆహారాన్ని తీసుకుని జేబులో పెట్టుకుని అటు ఇటు టెన్షన్‌తో చూశాడు. ఎవరూ లేకపోయేసరికి త్వర త్వరగా అక్కడి నుండి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు మారుతి సంజయ్ టు వీలర్ లో ఒక సముద్రపు ఒడ్డుకు కు వెళ్లారు. అక్కడ మారుతి సంజీవ్ ను అడిగాడు. ” ఎందుకు ఇంత అర్జెంటుగా ఇక్కడికి పిలుచుకోవచ్చావు ఏదొ చెప్పాలన్నావుగా మరి చెప్పు” అన్నాడు. మారుతి తనకు వజ్రాలహరం దొరికిన విషయం చెబుతూ వజ్రాల ఆహారాన్ని మారుతికి చూపించాడు.
“ఇది కచ్చితంగా మంచి ధనవంతులు పోగొట్టుకొని ఉంటారు. దీని విలువ కోటి పైనే ఉండవచ్చు” అన్నాడు.
“ఇది ఎక్కడ అమ్మినా మనము దొరికిపోతాము. ఒకవేళ మనకి దొరికిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇచ్చిన మనల్ని అనుమానిస్తారు. ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు.” అందుకు మారుతి” మంచో చెడో మనకు దొరికింది. దీని అమ్మడానికి నాదగ్గరా ఒక ప్లాన్ ఉంది. ఇలాంటివి కొనేవాడు ఒక్కడున్నాడు. వాడే మస్తాన్.
మరుసటి రోజు మారుతి సంజీవ్ వజ్రాల హారం తీసుకొని మస్తాన్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక పాత బంగాళా, అక్కడ మస్తాన్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. చుట్టూ తన రౌడీ అనుచరులు నిలబడి ఉన్నారు. మారుతి సంజీవ్ మస్తాన్ కు సలాం అంటూ వెళ్లి మస్తాన్ కూర్చున్న టేబుల్ ముందు కూర్చున్నారు.
మారుతి వజ్రాలహరాన్ని మస్తాన్ బై కు ఇచ్చాడు. మస్తాన్ భాయ్ దాన్ని చూస్తూ తన అనుచరుడికి ఇచ్చి చెక్ చేయమని చెప్పాడు. కాసేపటికి మస్తాన్ అనుచరుడు వచ్చి మస్తాన్ భాయ్ చెవిలో ఏదో చెప్పి వెళ్ళాడు. మస్తాన్ భాయ్ వజ్రాలహరాన్ని చూస్తూ, ” ఇది పక్క ఒరిజినల్ మాల్, దీని విలువ కోటి 50 లక్షలు ఉండవచ్చు. ఎంతాకి ఇస్తారో చెప్పండి” అంటూ మారుతి సంజీవ్ ల వైపు చూశాడు.
మారుతి అందుకు “మస్తాన్ భాయ్ మాకు కోటి రూపాయలు ఇచ్చి మీరు 50 లక్షలు తీసుకోండి “అని అన్నాడు. అందుకు మస్తాన్ భాయ్ ఒకటే డీల్ ఒకటే మాట 60 లక్షలు” ఇస్తానన్నాడు. “మీకు ఇష్టం లేకపోతే మీరు మీ సరుకుతో వెళ్లి పోవచ్చు “అన్నాడు. సంజీవ్ మారుతి ఒకరినొకరు చూసుకుంటూ ఆలోచనలో పడ్డారు.
అందుకు మస్తాన్ భాయ్” మీరు ఆలోచిస్తున్నది నాకు అర్థం అయింది. కానీ నేను దీన్ని బాంబేలో అమ్మాలి సేటుకు పర్సంటేజ్ ఇవ్వాలి మరియు రిస్క్ తీసుకోవాలి ” అన్నాడు.
“మీరు భయపడకండి ఏ రిస్కు వచ్చినా నేను చూసుకుంటా” అన్నాడు. అందుకు సంజీవ్ “సరే మస్తాన్ బాయ్ మాకు డీల్ ఓకే” అన్నాడు. మస్తాన్ భాయ్ అనుచరుడు. ఒక బ్లాక్ బ్యాగ్ లో ఇండియన్ కరెన్సీ 60 లక్షల తెచ్చి ఇచ్చాడు. దాన్ని తీసుకుని మారుతి సంజయ్ మస్తాన్ భాయ్ కి సలాం చేస్తూ వెళ్లిపోయారు.
మారుతి సంజీవ్ హ్యాపీగా బీచ్ దగ్గర నడుస్తూ సంజీవ్ ” నా జీవితం ఇలా హ్యాపీగా టర్న్ అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ” అన్నాడు. అందుకు మారుతి “జీవితమంటే అంతే ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మనము చెప్పలేము. ” అంటూ మాట్లాడుకున్నారు.
కొద్దిరోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎస్పీ యుగంధర్ సిగరెట్ తాగుతూ నిలబడి ఉన్నాడు. అనుకోకుండా ఒక కానిస్టేబుల్ వచ్చి “సార్ ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు” అంటూ సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. యుగంధర్ సెల్ ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకున్న ఎమ్మెల్యే సీరియస్ గా, “చూడు యుగంధర్ ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, నా ఇంటి ముందు మా అత్తగారి తోసి మెడలో డైమండ్ నెక్లెస్ లాక్కుని వెళ్లారు. ఆమె పక్కన ఉన్న లైట్ ఫోల్‌కు తల తగిలి చనిపోయింది. నాకు నక్లేస్ వద్దు, కావాలంటే నీకు 10 కోట్లు ఇస్తా వాడిని పట్టుకొని ఇమ్మీడియట్ గా ఎన్కౌంటర్ చేసి నాకు ఫోన్ చెయ్”. అదే పని మీద ఉన్నాను సార్ మీరూ కొద్ది రోజులలో ఎన్కౌంటర్ డెత్ న్యూస్ వింటారు” అంటూ ఫోన్ పెట్టేశాడు.
కొద్దిరోజుల తర్వాత కానిస్టేబుల్ తో కలిసి యుగంధర్ మస్తాన్ ఉన్న బంగ్లాకు వెళ్ళాడు. వెళ్లి మస్తాన్ ముందు కూర్చున్నాడు. కూర్చుని తన గన్ను ముందు టేబుల్ పై ఉంచాడు. మస్తాన్ రౌడీ అనుచరులు టెన్షన్‌తో నిలబడి ఉన్నారు. యుగంధర్ మస్తాన్ తో ఇలా అన్నాడు ” చూడు మస్తాన్, నా ఎంక్వయిరీ లో డైమండ్ నెక్లెస్ నువ్వు డీల్ చేసినట్టు తెలిసింది. నక్లెస్ రాష్ట్రాలు తాటి వెళ్లిపోయిందని నాకు తెలుసు. నాకు ఆ నక్లెస్ తెచ్చిన వారెవరో చెప్పు. నిన్ను ఈ కేసులో లేకుండా చేస్తా నెక్లెస్ ను వదిలేస్తా. ” అన్నాడు. అందుకు మస్తాన్ “ఈ కేసును వదిలేయండి సార్ మీకు 20 లక్షలు ఇస్తానన్నాడు”. అందుకు యుగంధర్ ” నేనే నీకు 40 లక్షలు ఇస్తా, వారెవరో చెప్పు. లేదంటే ఇక నా గన్ను మాట్లాడుతుందని” బెదిరించాడు. ఇక భయంతో మస్తాన్ మారుతి సంజీవ్లా అడ్రస్ ఫోన్ నెంబర్లు తెల్ల కాగిన పై రాసి ఇచ్చాడు. అందుకు యుగంధర్ ఒక గంటలో నేను ఇస్తానన్న 40 లక్షలు నీ దగ్గరకు వచ్చి చేరుతాయి ” అంటూ తన కానిస్టేబుల్ తో వెళ్లిపోయాడు.
తన కానిస్టేబుల్ తో యుగంధర్ “ఒక గంటలో మారుతి సంజీవ్ నా దగ్గర ఉండాలి” అని చెప్పాడు. కానిస్టేబుల్ ఒక గంటలో మారుతి సంజీవ్‌లను పోలీస్ స్టేషన్లో యుగంధర్ సార్ ముందు నిలబెట్టాడు. యుగంధర్ మాట్లాడుతూ” మీరు చేసిన పనికి ఒక ప్రాణం పోయింది.
మిమ్మల్ని ఏమి చేసినా పాపం రాదు. మిమ్మల్ని పంపాల్సిన చోటికి పంపిస్తాను ” అన్నాడు
వెంటనే సంజీవ్” సార్ కాస్త ఓపికతో మేము చెప్పేది వినండి. విన్న తర్వాత, మమ్మల్ని మీరు ఏమి చేసినా ఓకే, దయచేసి ఒక్క సారి వినండి” అన్నాడు. “సరే చెప్పు” అంటూ యుగంధర అన్నాడు. సంజీవ్ జరిగిన విషయాన్ని మొత్తం వివరించే చెప్పాడు. అది విన్న యుగంధర్, ” ఎవిడెన్స్ లు పక్కాగా ఉన్నాయి. దొరికిందని చెబితే ఎలా నమ్మేది. ” అనగానే సంజీవ్” సార్, మాకు ఒక పది రోజులు గడువు ఇవ్వండి ఆ పది రోజులలోపు ఆ అంతకుడు ఎవరు నేను పట్టి ఇస్తాను. అలా పట్టి ఇవ్వకపోతే మీరు అనుకున్నట్టే మమ్మల్ని ఎన్కౌంటర్ చేయండి. దయచేసి మమ్మల్ని నమ్మి గడువు ఇప్పించండి” అన్నాడు. అందుకు యుగంధర్ “మీ ఇద్దరినీ గూర్చి ఎంక్వయిరీ చేశాను ఎక్కడ బ్యాడ్ కాండక్ట్ లేదు కాబట్టి మీకు ఒక అవకాశాన్ని ఇస్తాను. మీరు అమ్మిన నెక్లెస్ డబ్బులు కూడా వదిలేస్తాను.
పది రోజులలోపు వాడిని పట్టి ఇవ్వక పోతే 11వ రోజు మీరు ఎన్కౌంటర్లో పోతారు ” అంటూ వెళ్లిపోండి అన్నాడు. తన కానిస్టేబుల్ తో “వారిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండు” అంటూ చెప్పాడు.
అలా సముద్రపు ఒడ్డున మారుతి సంజీవ్ కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. సంజీవ్” ఆ మస్తాన్ గాడు, రిస్కొస్తే నేను చూసుకుంటాను అంటూ రిస్క్ లో వేశాడు”.
అందుకు మారుతి, ” అది సరే వాడిని ఎలా పట్టుకుంటావో, ఎలా అప్పగిస్తావు, నాకేమీ అర్థం కావడం లేదు. వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు”. అన్నాడు. అందుకు సంజీవ్” నా గెస్సింగ్ నిజమైతే ఆ నెక్లెస్ పోగొట్టుకున్న వాడు కచ్చితంగా నెక్లెస్ వెతుక్కుంటూ వస్తాడు వాడిని పట్టుకుని, ఎస్పీకి అప్పగిస్తే మనం ప్రాణాలతో బయటపడతాం ” అన్నాడు. అందుకు మారుతి ” ఇదే దారి మనకు ఇక గత్యంతరం లేదు. లేట్ చేయకుండా వెళదాం పద ” అంటూ వెళ్ళిపోయారు.
అలా రోజు సంజీవ్ మారుతి నెక్లెస్ దొరికిన చోట ఫారెస్ట్ లో ఆ మాస్క్ మనిషి కోసం నిరీక్షించ సాగారు. ఆలా మూడు రోజులు నాలుగు రోజులు గడిచాయి. ఐదవ రోజు మాస్క్ మనిషి నెక్లెస్‌ను వెతుక్కుంటూ వచ్చాడు. వెంటనే సంజీవ్ ఎస్పీకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పి మాస్క్ మనిషిని పట్టించారు. ఎస్పి మారుతిని సంజీవులు ఇక మీరు వెళ్లి రండి అంటూ సైగ చేశాడు.
ఆ మాస్క్ మనిషిని పరిగెత్తించి తన గన్ తో కాలుస్తూ ఎన్కౌంటర్ చేశాడు. పోలీస్ జీప్ లో వెళ్తూ ఉండగా, కానిస్టేబుల్ యుగంధర్ తో ఇలా అన్నాడు. ” సార్ వాళ్ళిద్దరూ ఈ క్రైమ్ చేయలేదని మీరు ఎలా కనిపెట్టారు “అని అడిగాడు. అందుకు ఎస్పీ యుగంధర్ ” ఎమ్మెల్యే గారి ఇంటి ముందు సీసీ కెమెరా ఆధారం ప్రకారం చైన్ స్నాచింగ్ చేసినది ఒక్కడే, సీసీ కెమెరాలు ఉన్నటువంటి చైనా స్నాచర్ యొక్క హైటు వెయిట్ బాడీ కొలతలు. మారుతి సంజీవ్ లో ఎక్కడ నాకు కనబడలేదు. వారు వాడిని పట్టిస్తాను అన్నప్పుడు, వీరు కూడా నా కేసుకు ఏమైనా హెల్ప్ అవుతారని అవకాశం ఇచ్చాను. తెలివిగా ఆలోచించి వాడిని పట్టించారు. ” అన్నాడు. పోలీస్ వెహికల్ అలా వెళ్లిపోయింది.
Swipe left/right or tap the sides to turn pages