New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వలయం – 2
వలయం 6 min read

వలయం – 2

వలయం -2

 

“మన పెళ్లి అయి ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు నేను ప్రెగ్నెంట్ కాలేకపోయాను ఫీచర్లో ప్రెగ్నెంట్ అవుతానో లేదో అన్న భయం పెరిగిపోయింది” అని బెంగగా బాధతో అన్నది నిధి..

 

“నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించొద్దు, మన పెళ్లి అయి జస్ట్ 3 ఇయర్స్ అయ్యింది. మనం హాస్పిటల్ కి వెళ్లి ఒకసారి చెక్ చేయించుకుంటే సరిపోతుంది. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నా మనసుకి కష్టంగా అనిపిస్తుంది. మన పెళ్లి తర్వాత నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా పెదవుల మీద ఎప్పుడు నవ్వు ఉండే విధంగా చూసుకోవాలి అనుకున్నాను..

 కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే నేనేమీ చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఏదో ఒక రోజు కచ్చితంగా మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి మన దగ్గరకు వస్తారు ఆరోజు త్వరలోనే ఉందని నాకు అనిపిస్తుంది” అన్నాడు ఉదయ్. 

 

“నువ్వు అన్నట్లు త్వరగా అందరం కలిస్తే బాగుంటుంది కదా” అని అన్నది నిధి..

 

“నాక్కూడా అందరూ కలిసిపోవాలి మా అమ్మ నిన్ను కోడలిగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మా ఇంటి కోడలు అని అందరికీ పరిచయం చేస్తుంటే చూడాలి అని అనిపిస్తుంది.

 కానీ వాళ్లకి లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు అంతకుమించి వాళ్ళ మాట కాదు అని మనం పెళ్లి చేసుకున్నాం అన్నా కోపం కూడా ఉంది, వీటన్నింటికీ మించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. వీటన్నింటినీ దాటుకొని వాళ్ళు మన దగ్గరకు రావాలి అన్నా మనం వాళ్ళ దగ్గరకు వెళ్లి కన్విన్స్ చేయాలి అన్న మనకి పాప బాబు పుట్టాలి దేనికైనా టైం రావాలి తొందర పడితే ఏదీ జరగదు కదా” అని అన్నాడు ఉదయ్..

 

నిధి మూతి ముడుస్తూ “పెళ్ళికి ముందు ఎన్నో కలలు కన్నాను కానీ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆఫీస్ కి వెళ్తే వర్క్ ఇంటికి వస్తే ఇంట్లో వర్క్ నువ్వు కొత్త బిజినెస్ పెట్టాలి అని ఆ ఆలోచనతో ఆ పనులతో బిజీగా గడిపేస్తున్నావ్, పక్కన మాట్లాడే మనిషి లేరే అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది” అని అన్నది నిధి..

 

“అవునా అయితే నన్ను రెండో పెళ్లి చేసుకోమంటావా..? అప్పుడు నీకు మాట్లాడడానికి పక్కన తోడు దొరుకుతుంది, నీకు తెలుసో లేదో నాకు మరదలు ఉంది తనతోనే నాకు పెళ్లి చేయాలి అని అమ్మ వాళ్ళు ఆశపడ్డారు మరి ఆ పెళ్లి చేసుకుంటే అమ్మ వాళ్ళు కూడా మనతో కలిసి పోతారు, చేసుకోమంటావా..?” అని అల్లరిగా అన్నాడు ఉదయ్. 

 

అప్పటివరకు అతనికి దగ్గరగా ఉన్న నిధి దూరం జరిగే కోపంగా చూసి “నీ మనసులో నేను మాత్రమే ఉండాలి ఇది స్వార్థమే అనుకుంటావో ఇంకేదైనా అనుకుంటావో నాకు తెలియదు.

కానీ ఇంకొక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తునా సరే నేను ఒప్పుకోను, నీ గుడ్లు పీకి గోలిలాడుకుంటాను. ఆ తర్వాత నిన్ను నేనే జీవితాంతం పోషించుకుంటాను అంతే తప్ప మరో ఆడదాని కన్ను నీ మీద పడనివ్వను, నీ చూపుని నామీద కాకుండా ఎక్కడికి పోనివ్వను” అని అప్పటివరకు దూరం జరిగి ఉన్నది కాస్త అప్పుడు అతనికి దగ్గర జరిగి గట్టిగా పట్టుకొని అన్నది. 

 

“అమ్మో ఇప్పటివరకు నీలో ఈ యాంగిల్ నేను చూడనే లేదే, కొత్తగా కనిపిస్తున్నావ్.. కానీ బాగుంది. నా కోసం నువ్వు ఇలా చేస్తాను అంటుంటే” అని నవ్వుతూ అన్నాడు ఉదయ్.

 

చాల్లే అని ఆమె మూతి ముడుస్తూ అన్నది.

 

ఉదయ్ తన కొత్త బిజినెస్ కోసం ప్లాన్స్ అలానే వర్క్ నేర్చుకోవడం దానిలో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.

 

 నిధి కూడా తనకి మేనేజర్ గా ప్రమోషన్ రావడంతో ఆ వర్క్ లో తను చాలా బిజీగా ఉంది. తన కింద పని చేసే టీం లీడర్స్ అందరిని కూడా తను ఇనిషియేట్ చేస్తూ వాళ్ళ వర్క్ కూడా అప్పుడప్పుడు తనే చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏ మాత్రం విసుక్కోకుండా వాళ్ళ మీద కోపం చూపించకుండా తనే బర్డెన్ అంతా మోస్తూ వర్క్ చేస్తుంది.

 

“నీ బిజినెస్ పెట్టడానికి మనీ సర్దుకున్నావా ఉదయ్” అని ఉదయ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా నీరజ్ అడిగాడు. 

 

“ఇంకా లేదురా ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇంతకుముందు రెండుసార్లు బిజినెస్ చేసి ఆ బిజినెస్లలో లోతు ఎంతో పూర్తిగా తెలుసుకోకుండా బిజినెస్ లోకి దిగి నష్టపోయాను. కానీ ఈసారి అలా చేయకూడదు అనుకుంటున్నాను, అందుకే బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని నేను కూడా తిరుగుతున్నాను. కాకపోతే మనీ చాలా అవసరం అవుతుంది, అంత మనీ లోన్ పెట్టాలి అంటే కష్టం నా మీద నమ్మకంతో బ్యాంకు లోన్ ఇస్తాయి అన్న కూడా డౌటే” అని అన్నాడు ఉదయ్.. 

 

“అయినా నీకు లోన్ పెట్టాల్సిన అవసరం ఏంట్రా, నిధి ఉంది కదా, తానే నీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. పేరులో ఉన్న నిధి ని నీక్కూడా కల్పిస్తుంది కదా, నువ్వు రెండుసార్లు బిజినెస్ చేసి నష్టపోయిన తన ఒక్క మాట కూడా అనకుండా ఓకే, జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి నేర్చుకోవాలి ముందడుగు వేయాలి అంటూ నీ భుజం తట్టి నీ వెన్నంటే నిలబడింది. నిజంగా అలాంటి భార్య దొరకటం నీ అదృష్టం.

 ఇప్పుడు కూడా బిజినెస్ కి మనీ కావాలి అని అడిగితే వెంటనే నీకు మనీ ఇస్తుంది కదా నీకు సపోర్ట్ గా నిలబడుతుంది కదా, ఇంకా ఎందుకు నువ్వు ఇలా ఆలోచించడం” అని అన్నాడు నీరజ్. 

 

“లేదురా ప్రతిసారి నా బరువు బాధ్యతలు అన్ని తన మీద వేయడం కరెక్ట్ కాదు, పెళ్లికి ముందు ఇద్దరం కలిసి ఒకే కంపెనీలో వర్క్ చేసాం. ఇప్పుడు తను ఆ కంపెనీకి మేనేజర్ అయింది.

 

 నేను  9 టు 5 ఆఫీస్ కి వెళ్ళటం అలిసిపోయి ఇంటికి రావడం ఇవన్నీ ఇష్టం లేక అంతకు మించి నాకు బిజినెస్ మీద ఉన్న ఫ్యాషన్ తో ఏదో ఒక బిజినెస్ చేయాలి అని బిజినెస్ స్టార్ట్ చేసి నష్టపోయాను. అలానే తనని కూడా బాధపెట్టాను.

 ఎవరైనా నీ భర్త ఏం చేస్తున్నాడు అని అడిగితే గొప్పగా చెప్పుకునే పొజిషన్లో నేను ఉండాలి అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది.

 తన దగ్గర ప్రతిసారి నేను మనీ తీసుకుని అందరి ముందు నీ భర్త ఇలాంటి వాడు అని తనకి నామోషీగా అనిపించే విధంగా చేయాలి అనుకోవటం లేదు” అని అన్నాడు ఉదయ్.

 

“మీ భార్య భర్తల మధ్య నామోష ఏంట్రా” అని నీరజ్ అన్నాడు.

“నామోషి అని కాదు కానీ ఏమోరా ఈసారి నా కాళ్ళ మీద నేనే నిలబడాలి అనుకుంటున్నాను, నా సక్సెస్ ని నీది కాళ్ల దగ్గర పెట్టాలి అనుకుంటున్నాను అంతే” అని అన్నాడు ఉదయ్.

 

“సర్లే ఏదైతే ఏంటి? నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయితే సంతోషించేవాడిలో మొదట నేనే ఉంటాను” అని అన్నాడు నీరజ్..

 

“ఏంటే మేనేజర్ అయిన దగ్గర్నుంచి మాతో మాట్లాడడమే తగ్గించావ్, మమ్మల్ని మర్చిపోయావా..? అని నిధిని ఆటపట్టిస్తూ అడిగింది నిధి బెస్ట్ ఫ్రెండ్ అయినా కల్పన. 

 

“అబ్బా నిన్ను ఎలా మర్చిపోతానే, కాలేజీ డేస్ నుంచి మనందరం బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం వర్క్ ప్రెషర్ అంతే, నీకు తెలియనిది ఏముంది మన ఆఫీస్ లో ఉన్న టీం లీడర్స్ గురించి, వాళ్లు వర్క్ అప్పుడప్పుడు డిలే చేస్తున్నారు, సమ్ టైమ్స్ వర్క్ డిలే అవుతుంది అవన్నీ నేనే చూసుకోవాలి కదా మేనేజర్ పోస్ట్ అంటే సాలరీ మాత్రమే కాదు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా” అని అన్నది నిధి..

 

“నువ్వు ఇలా ఉండబట్టే టీం లీడర్స్ అందరూ వర్క్ చేయకుండా రిలాక్స్డ్ గా కూర్చుంటున్నారు. అదే నువ్వు స్ట్రిక్ట్ గా ఉంటే ప్రతి ఒక్కరు ఇన్ టైం లో వర్క్ చేస్తారు. నీకు చెప్పినా అర్థం కాదు ఏంటో,

 సరే కాఫీ తాగి వద్దాం, ఇద్దరు కలిసి మాట్లాడుకుని రిలాక్స్డ్ గా కాఫీ తాగి 2 వారాలు దాటిపోయింది” అని అన్నది కల్పన.

 

సరే పద అంటూ అప్పటివరకు చైర్ లో కూర్చొని ఉన్న నిధి పైకి లేచి కల్పనాతో కలిసి ఆఫీసులో ఉన్న క్యాంటీన్ కి వచ్చింది..

 

ఇద్దరూ కాఫీ తాగుతూ చైర్స్ లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే నిధి ఫోన్ కి నోటిఫికేషన్ రావటంతో ఓపెన్ చేసి చూసింది.

 

అయ్యో మర్చిపోయాను అంటూ కాఫీ క పక్కన పెట్టేసి ఫోన్లో ఏదో హడావుడిగా టైప్ చేస్తున్నట్లుగా కనిపించింది నిధి..

 

“ఏమైందే ఏదో మర్చిపోయాను అంటున్నావ్ ఇంతకీ ఏం చేస్తున్నావ్ ఏంటి..?” అని నిధి ఫోన్లోనికి తొంగి చూస్తూ అడిగింది కల్పన. 

 

“ఈ మంత్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఇవన్నీ కట్టడం మర్చిపోయాను, అదే నోటిఫికేషన్ వచ్చింది” అని అన్నది నిధి..

 

“అవునా నువ్వు ఇవన్నీ కడుతున్నావా..? నిజంగా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నావ్, అయినా నీకు నెలకి మూడు లక్షలు దాకా సాలరీ వస్తుంది ఇవన్నీ కట్టుకోవాల్సిన అవసరం ఏంటి..?” అని అన్నది కల్పన.. 

 

“అవసరం అని కాదు ఫ్యూచర్ మనం ప్రిడిట్ చేయలేం కదా, ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కానీ మనిషికి మనీ చాలా అవసరం అని కొన్ని సిచువేషన్ లో మనకి కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. అలాంటివి చూసిన తర్వాత అయినా మనం మారాలి కదా, ఒకవేళ ఫ్యూచర్లో నాకు ఏదైనా అయ్యి నేను చనిపోయిన నా హెల్త్ బాగో లేకపోయినా ఉదయ్ మనీ కోసం ఇబ్బంది పడకూడదు కదా, అందుకే ఇవన్నీ, ముందు జాగ్రత్త కోసం” అని అన్నది నిధి..

 

“నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదో ఒక ప్లాన్ తీసుకోవాలి అనిపిస్తుంది నేను కూడా తీసుకుంటాను” అని అన్నది కల్పన.

 

గుడ్ డెసిషన్ అని అన్నది నిధి..

 

“నా సంగతి సరే ఇంతకీ ఉదయ్ కొత్త బిజినెస్ ఏదో పెట్టాలి అంటున్నాడు అన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది మీ ఫ్యామిలీ ప్రాబ్లంస్ ఇప్పటికైనా తీరాయా..?” అని అడిగింది కల్పన..

 

 

 

 

కొనసాగుతుంది.

 

ప్లీజ్ కామెంట్స్ పెట్టండి..