అనుకోని అతిధి 👻❤️ – 1
హైదరాబాద్ ఒక మహా నగరం…
కానీ గత ఒక వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం సిటీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది…
రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లు, నిలిచిపోయిన వాహనాలు, హారన్‌ల శబ్దాలు… నగరం తన సహజ వేగాన్ని పూర్తిగా కోల్పోయినట్టు అనిపిస్తోంది. చిన్న వర్షం కాదు ఇది….ఆకాశం తెరిచినంతగా కురుస్తున్న వాన, జనజీవనాన్ని ఒక్కసారిగా ఆపేసినట్టుగా ఉంది.
ఇప్పుడు సమయం సరిగ్గా రాత్రి 8:30 అవుతుంది…
భారీ వర్షాలు వాళ్ళ ఐటీ కంపెనీలు తమ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చాయి. నగరంలో ట్రాఫిక్, వర్షం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే ల్యాప్‌టాప్‌లతో తమ పనిని కొనసాగిస్తున్నారు.
ఒక ఏడు అంతస్తుల అపార్ట్‌మెంట్ అది… అన్ని ఫ్లాట్స్ లైట్ల వెలుగులో నిశ్శబ్దంగా ఉన్నాయి. సరిగ్గా రెండో అంతస్తులో ఉన్న రూమ్ నెంబర్ 21లో ప్రేమ్
తన ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేసి ఆఫీస్ వర్క్ మొత్తం పూర్తయ్యేసరికి అతని ముఖంలో చిన్న రిలీఫ్ కనిపించింది.
ఫ్రెష్ అయ్యి, తల తుడుచుకుంటూ రాత్రి భోజనానికి ఏం వండుకోవాలి అని ఆలోచిస్తూ నెమ్మదిగా కిచెన్ వైపు అడుగులు వేసాడు.
కిచెన్‌లోకి వెళ్లగానే ఫ్రిడ్జ్ తలుపు ఓపెన్ చేసి లోపల చూసిన వెంటనే అతని ముఖంలో చిన్న నిరాశ కనిపించింది… కూరగాయలు ఏవీ కనిపించలేదు.
అప్పుడు గుర్తొచ్చింది వారం రోజులకు సరిపడా తెచ్చుకున్న స్టాక్ అంతా నిన్నటితోనే అయిపోయింది అని.
చా. అనుకుంటూ … వెంటనే మొబైల్ లో జొమాటో అప్ ఓపెన్ చేసాడు… కానీ భారీ వర్షాలు కారమంగా ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ అన్ని క్లోజ్ ఐపోయాయి అని అప్పుడు గుర్తొచ్చింది ప్రేమ్ కి
అబ్బా…… ఇప్పుడే అన్నీ హ్యాండ్ ఇవ్వాలా …..
నాకు ఆకలి దంచేస్తోంది… అనుకుంటూ ఉండగా
పక్కనే స్టవ్ మీద ఉన్న పాల, ఆ పక్కనే ఉన్న biscult ప్యాకెట్ మీద ప్రేమ్ ద్రుష్టి పడింది…. థాంక్ గోడ్ ఫోని లే పాలైన ఉన్నాయి అని స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టి అలా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ స్టవ్ ఎదురుగానే ఒక చైర్ వేసుకొని కూర్చున్నాడు….రీల్స్ స్క్రోల్ చేస్తూ, మధ్యమధ్యలో స్టవ్ వైపు చూసుకుంటూ ఉన్నాడు
ప్రేమ్ ఫోన్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండగా, ఒక్క రీల్
మీద అతని దృష్టిని పడింది…..
“మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా? అవి తెల్లగా ఉంటాయా? నల్లగా ఉంటాయా? వాటికి కాళ్లు ఉంటాయా…..లేదా? నాలుక ఉంటుందా? అవి మనలాగే అన్నం తింటాయా… లేక రక్తం తాగుతాయా… ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజే నా ఇన్‌స్టా ఐడీని ఫాలో అవ్వండి. నేను చూసిన నిజమైన దెయ్యాలను మీకూ చూపిస్తాను!”
అని ఒక వ్యక్తి గంభీరంగా మాట్లాడుతున్నాడు.
వీడియోలో అతను తన ముఖాన్ని కూడా చూపించకుండా, AI ద్వారా క్రియేట్ చేసిన భయంకరమైన దెయ్యాల చిత్రాలను స్క్రీన్ మీద వేగంగా చూపిస్తున్నాడు. ఒక్కో ఇమేజ్ కూడా చాలా డార్క్‌గా, వింత ఆకారాల్లో, చూసే వాళ్లకు గుండె వేగం పెరిగేలా ఉంది.
ప్రేమ్ ఒక్క క్షణం ఆ రీల్ మీదే ఆగిపోయాడు.
అది చూసిన ప్రేమ్ కి తెలియకుండానే భయం మొదలయింది….. దానికి తోడు బయట వర్షం, రాత్రి సమయం….. 😂
చా పనికి మాలిన రీల్స్ అన్ని నాకే కనిపిస్తాయి ముందు ఈ అకౌంట్ ని బ్లాక్ చేసి దొబ్బాలి అనుకుంటూ ఇంస్టా క్లోజ్ చేస్సి అప్పుడే
పొంగడానికి రెడీ గా ఉన్న పాలను ఆఫ్ చేసి ఒక గ్లాస్ లో వేసుకొని అలా టీవీ ఆన్ చేసి చెనెల్స్ మారుస్తూ పాలు సిప్ చేస్తూ ఉంటే అప్పటికే టైం ఆల్మోస్టు ఒక 9 అయింది…..అదే క్షణంలో అతని ఫోన్ ఒక్కసారిగా మోగింది…
ఎవరా అని ఫోన్ స్క్రీన్ వైపు చూసిన వెంటనే…
అందులో “Home Minister ❤️” అనే పేరు మెరిసిపోతూ కనిపించింది…
ఆ పేరుకి పక్కన ఉన్న చిన్న హార్ట్ సింబల్ చూస్తేనే, కాల్ చేసిన వ్యక్తి తనకి ఎంత స్పెషల్ అనేది అర్థమైపోతుంది….
స్క్రీన్‌పై మెరిసిపోతున్న “Home Minister ❤️” అనే పేరు కనిపించగానే ప్రేమ్ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది…
హో అమ్మ నా అని కాల్ లిఫ్ట్ చేసి హలో హోమ్ మినిస్టర్ గారు చెప్పండి ఏంటి ఈరోజు కొంచెం లేట్ గా కాల్ చేశారు…. ఇప్పటికి కానీ గుర్తురాలేదా మీ ముద్దుల కొడుకు మీకు అని కొంచెం లేని కోపాన్ని చూబిస్తూ అడిగాడు ప్రేమ్…
దానికి వాళ్ళ అమ్మ నవ్వుతూ…
“అయ్యో… నా బంగారు కొండకి కోపం వచ్చేసిందా…?” అంటూ ,
“ఏం చేయను రా కన్నయ్యా… ఇంటి పనులు ఒకవైపు, నీ నాన్నగారి పనులు మరోవైపు… ఇవన్నీ పూర్తయ్యే సరికి ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది… ఇదిగో, పది నిమిషాల క్రితమే మీ నాన్న కూడా ‘చాలా అలసటగా ఉంది…’ అంటూ పడుకున్నారు…
మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ ఫాలో, రేట్, కామెంట్
ఫ్రెండ్స్ ❤️
కంటిన్యూస్….
Swipe left/right or tap the sides to turn pages