New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అనుకోని అతిధి 👻❤️ – 2

అనుకోని అతిధి 👻❤️ – 2

“అయ్యో… నా బంగారు కొండకి కోపం వచ్చేసిందా…?” అంటూ 
“ఏం చేయను రా కన్నయ్యా… ఇంటి పనులు ఒకవైపు, నీ నాన్నగారి పనులు మరోవైపు… ఇవన్నీ పూర్తయ్యే సరికి ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది… ఇదిగో, పది నిమిషాల క్రితమే మీ నాన్న కూడా ‘చాలా అలసటగా ఉంది…’ అంటూ పడుకున్నారు…
***************************
అయినా నీకు రోజులో  ఒక్కసారి కాల్ చేయకపోయినా నాకు వందసార్లు గుర్తొస్తావు రా… 
నువ్వు తిన్నావా…? టైమ్ కి పడుకుంటున్నావా…? లేక మళ్లీ ఫోన్ పట్టుకుని, ఆ టిక్కు టిక్కు అంటావే అది…. అది….. హా ఆ లప్పుతప్పు (laptop😂)పక్కుకొని రాత్రంతా మేల్కొని ఉన్నావా చెప్పు ముందు…” అంటూ ప్రేమగా అడిగింది ఆమె.
హహ అమ్మ అది లప్పుతప్పు కాదే బాబు లాప్టాప్ అంటారు దాన్ని ఇదుగొ ఇప్పుడే చికెన్ 
బిరియాని విత్ చికెన్  జాయింట్స్ తింటున్నా నువ్వు కాల్ చేసావ్ అంటూ ప్రేమ్ తన చేతిలో ఉన్న పాల 
వైపు ఆ బిస్కట్స్ వైపు చూస్తూ వాళ్ళ అమ్మ బాధపడకూడదని అబద్దం  చెప్తున్నాడు….
అది విని….
ఐనా ఇప్పటివరకు తినకపోవడం 
ఏంటి రా…. ఇలా ఐతే నీ ఆరోగ్యం ఎం కావాలి కన్నయ్య…. అసలే ఆ హైదరాబాద్ లో వర్షాలు అంట కదా ఇక్కడ న్యూస్ చెనెల్స్ లో తెగ చెప్పేస్తున్నారు నీకు జలుబు, గిలుబు ఎం చెయ్యలేదు గా బంగారం… సమయానికి నేను కూడా అక్కడ లేను కదా… లేకపోతే నీకు అన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని… అయినా నువ్వు ఆ వర్షాలు మొదలయ్యే ముందే ఇక్కడికి వచ్చేసి ఉంటే బాగుండేది కదా నాన్నా…” అంటూ కాసేపు నిశ్శబ్దంగా బాధపడుతూ,
“ఇప్పుడు చూడు… మేము ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఒంటరిగా ఉండిపోయావ్…” అని దిగులుగా చెప్పింది ఆమె… ❤️
అబ్బా అమ్మా… నేను ఏమైనా కలగన్నానా ఏంటి?  ఇంత పెద్దగా వర్షాలు పడతాయని ఎవరు ఊహించారు చెప్పు…
వర్షం మొదలైన మొదటి రోజే మీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను కదా… కానీ ఏమైంది? ట్రైన్స్ కూడా ఆపేశారు ఆ వర్షాల వల్ల…
నువ్వేమీ టెన్షన్ పడకు అమ్మా… ఇంకో రెండు రోజుల్లో వర్షాలు తగ్గుతాయని చెప్తున్నారు కదా…
  ఇలా వర్షం తగ్గగానే అలా నా బంగారం వళ్ళో వచ్చి వాళిపోతా ఓకే నా మై డియర్ క్యూట్ 
హోమ్ మినిస్టర్ గారు 😘….అని చాలా హ్యాపీ గా చెప్పాడు ప్రేమ్ 
హా ఈ ఐస్ చెయ్యడం మాత్రం మానవు కంగారు 
పడద్దు అంట ఐనా నేను కంగారు పడేది వర్షం గురించి కాదు కన్నయ్య…
మరి దేని గురించి అంత కంగారు పడుతున్నావు హోమ్ మినిస్టర్ గారు…?
ఇంక దేనిగురించి రా…. ఆ స్మశానాo గురించే… వద్దు వద్దు అన్న మీ నాన్న నువ్వు నా మాట విన్నారేంటి ఆ అపార్ట్మెంట్స్ నువ్వు పనిచేసే ఆఫీస్ కి దగ్గరగా ఉంది అని నువ్వు…. ఆ రూమ్ మంచి వాస్తూ ఉంది అని మీ నాన్న తీసుకున్నారు గా ఆ రూమ్ ని ఏరికోరి మరి…
ఐనా మిమ్మల్ని అని ఎం ప్రయోజనం 
  ఆ అపార్ట్మెంట్ యజమానికి బుద్దు లేదు ఎవడన్నా స్మశానల పక్కన బిల్డింగ్ లు కట్టుకుంటారా….అంటూ  విసుగ్గా చెప్పగానే… 
అవతల నుంచి ప్రేమ్ కొంచెం విసుగ్గా……
అబ్బా అమ్మ …! మళ్లీ ఆ దెయ్యాలు, స్మశానం అంటూ మొదలెట్టావా…?
రాత్రిళ్లు హారర్ మూవీస్  చూడకమ్మ 
ముందు నువ్వు … ఐనా ఈ కాలంలో కూడా ఏంటి అమ్మ నువ్వు మరీ ను …. నేను ఈ ఫ్లాట్ లో ఆల్మోస్టు వన్ ఇయర్ గా ఉంటున్నాను నాకు ఎప్పుడైనా ఏమైనా అయ్యిందా చెప్పు…. ఇంకా చెప్పాలి అంతే ఈ ఫ్లాట్ కి రాగానే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా సో అలాంటివి ఎం ఉండవే బాబు….. అన్నాడు…
నీకు ఈ అమ్మ మనసు అర్థంకాదులేరా….. సర్లే అవన్నీ వదిలేయ్… తలుపులు బాగా లాక్ చేసుకున్నావా…?
లైట్ వేసుకుని పడుకో… ఇంకా భయమేస్తే హనుమాన్ చాలీసా పెట్టుకుని నిద్రపో… ❤️” అంటూ ప్రేమగా చెప్పింది ఆమె.
హ్మ్…. సరే హోమ్ మినిస్టర్ గారు…. మీరు కూడా టాబ్లెట్స్ వేసుకొని నిద్రొపోండి… నాన్నగారి ని అడిగాను అని చెప్పు జాగ్రత్త అని బాయ్ చెప్పి కాల్ కట్ చేసాడు ప్రేమ్…..
ఇంక ఆ పాలు తాగుతూ… బిస్క్యూట్స్ తింటూ ఒక హాఫ్ biscuit ప్యాకెట్ కంప్లీట్ చేసి మూవీ కూడా మొత్తం అయ్యేవరకు చూసి  నిద్రపోదామని రూమ్ కి వెళ్లే సరికి రాత్రి 10:30 ఐపొయ్యింది…
అతను అలా బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన క్షణంలోనే… ఒక్కసారిగా ఇంటి కాలింగ్ బెల్ గట్టిగా మొగడం మొదలుపెట్టింది….
ఈ టైం లో ప్రేమ్ దగ్గరకు 
ఎవరు వచ్చి ఉంటారు…… 🤔
మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ ఫాలో, రేట్, కామెంట్
ఫ్రెండ్స్ ❤️
                            కంటిన్యూస్….