అప్పుడే ఆ అమ్మాయి చూపు లో తేడా కనిపించింది తన కళ్ళలో ఉండే నల్ల గుడ్డు ఒకటి ఒకవైపు చూస్తుంటే ఇంకొకటి ఇంకోవైపు చూస్తుంది అవి సాదారణ మనిషి కళ్ళు ఐతే కావు…… ********************* తన కుడి కన్ను గుడ్డు ప్రేమ్ వెళ్లిన వైపు చూస్తుంటే… ఎడమ కన్ను గుడ్డు మాత్రం నెమ్మదిగా హాల్‌లో మరో మూలవైపు తిరుగుతోంది… చూస్తే… రెండు కళ్ళు ఒకేసారి రెండు వేర్వేరు విషయాలను గమనిస్తున్నట్టుంది. తన మెడ కూడా అసహజంగా కొద్దిగా వంగింది…