పీజీ లో టిఫిన్ తింటున్న స్వర్ణ కి పొలమారుతూ ఉంటే వాటర్ తాగి అమ్మ తలుచుకుంటుందేమో… ట్రిప్ కి వెళ్ళాను అనుకుంటుంది పాపం… వారం తరువాత కూడా నేను రాకపోతే ఆ ఇంట్లో అప్పుడు తెలుస్తుందేమో ఇంట్లో నుండి వచ్చేసాను అని కానీ అమ్మ ఎంత బాధ పడుతుందో ఆలోచించకుండా వచ్చేసానా… లేక నేను లేను అని అమ్మ ని బాధ పెడుతుందేమో ఆ ముసల్ది.. కనీసం అప్పుడైనా అమ్మకి అర్థం అవుతుందేమో నా బాధ… ఎందుకు ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అన్నాను అని కన్నీళ్లు తుడుచుకొని ఇలాగే రూమ్ లో ఉంటే అమ్మే గుర్తుకు వస్తుంది బయటికి వెళ్లి ఈవెనింగ్ టైంలో జాబ్ ఓకే మరి మార్నింగ్ టైం లో కూడా ఏదోటి చూసుకోవాలి గా కాఫీ షాప్ లో వచ్చే 4k తో ఎలా గడుస్తుంది నాకు అనుకొని ఈ దగ్గర్లో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయో వెళ్లి చూసి వస్తాను అని బయటికి వచ్చింది…