New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 5

అన్వాంటెడ్ లవ్ – 5

అరుపు వినిపించిన వైపు చూసిన ఇంద్ర.. స్వర్ణ లు మాత్రమే కాదు ఇంట్లో మెయిడ్స్ కూడా హాల్లోకి పరుగేత్తుకొచ్చి చూస్తే ఎప్పుడు పట్టు చీరలో హుందాగా నెమ్మదిగా నడుస్తూ మోము పై చిరునవ్వు చెదరకుండా నిదానంగా మాట్లాడే దేవయాని గారు ఇప్పుడు పెద్ద అరుపుతో… పెద్ద పెద్ద అడుగులతో ఇంద్ర ని చేరి ముడుచుకున్న కను బొమ్మలతో కళ్ళలో ఆగ్రహం చూపిస్తూ పని వాళ్ళ అందరిని ఒకసారి చూడగా పనివాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతే…!!!

 

 

విషయం తెలియని ఇంద్ర.. ఎప్పుడు చూడని తల్లిని అలా చూసిన ఇంద్ర ఏమైంది మా అన్నాడు కంగారుగా…

 

 

సరదాకి కూడా ఎప్పుడు ఓ చిన్న దెబ్బ వేయని దేవయాని గారు ఇప్పుడు తన బలం మొత్తం ప్రయోగించి చాచి పెట్టి ఇంద్ర చెంప మీద కొట్టింది…

 

 

ఊహించని ఆ దెబ్బకి మమ్మీ !!! అని ఇంద్ర చెంప తడుముకుంటే… అత్తయ్య అని స్వర్ణ… వదినా అని రాజేశ్వరి గారు… దేవయాని అని రఘునాథ్ గారు ఒకేసారి అందరూ స్పందిస్తారు…

 

 

ఎవరి వైపు చూడకుండా ఆపండి అన్నట్టు గా ఎడమ చేతిని లేపి అరచేతిని చూపించింది అందరికీ…

 

 

ఆగ్రహం అంటే అర్థం కూడా తెలియని దేవయాని గారి ప్రస్తుత అగ్రహానికి అర్థం ఏంటో తెలియని స్వర్ణ పిచ్చి చూపులు చూస్తే తెలిసినా రాజేశ్వరి.. రఘునాథ్ గారు సైలెంట్ గా ఉంటారు… తల్లికి కోపం వచ్చేంత ఏమ్ జరిగిందా అనే ఆలోచన ఇంద్ర ది 

 

 

ఇంత వరకు మీ ఇద్దరి మధ్య ఏ రోజు నాకు స్నేహ భావం కూడా కనిపించలేదు .. కానీ ఇదేంటి అని టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ చూపిస్తూ చిన్న చిన్న గా గొడవ పడుతుంటే బావ మరదల్ల మధ్య సరదా గిల్లి కజ్జాలు అనుకున్నా కానీ మీ మధ్య ఏమ్ జరుగుతుంది అని ఆవేశంగా ప్రశ్నించారు దేవయాని గారు…

 

 

ఆవిడ చూపించిన న్యూస్ పేపర్ వైపు చూసిన ఇద్దరికి కళ్ళు పెద్దవి షాక్ అవుతారు..

 

 

ప్రపంచాన్ని మరిచిపోయిన ప్రేమికులు అనే టైటిల్ తో ఇంద్ర స్వర్ణ ని ముద్దు పెట్టుకున్న ఫోటో అది…

 

 

దేవయాని గారి కోపానికి కారణం ఆవిడకి తెలిసినంత వరకు వాళ్ళు ఇద్దరు ప్రేమించుకోవట్లేదు ఎప్పుడు ఒకరిని ఒకరు దూషించుకున్నట్టే చూసుకుంటారు… కానీ ఆ ఫోటో చూస్తున్న ఆవిడకి తల తిరిగిన ఫీలింగ్…

 

 

దేవయాని గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ ఇంద్రజీత్ రెడ్డి గారు తన PA స్వర్ణాక్షి తో ప్రేమలో ఉన్నారు అనడానికి  ఇదే సాక్ష్యం.. అంటూ ఓ చిన్న వీడియో క్లిప్… ప్లే అవుతుంది…  కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఎన్నాళ్ళుగా సాగుతుంది.. ఓ బిలియనిర్ తన ఓ మాములు మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన PA తో ప్రేమలో పడటం చాలా మందికి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది…

 

 

ఒక్కో న్యూస్ ఛానెల్ లో ఒక్కో విధంగా వైరల్ అవుతున్నాయి వాళ్ళ పిక్స్.. రాత్రికే రాత్రే వైరల్ అయిన ఈ న్యూస్… అందంతో సీఈఓ ని పడగొట్టిన గోల్డ్ డ్రిగ్గర్ అంటూ మిమ్స్ కూడా వస్తున్నాయ్.. కొందరు స్వర్ణ అదృష్టానికి కుళ్ళు కుంటే మరి కొందరు ఈ దెబ్బతో స్వర్ణ మీద పగ పెంచుకుంటారు…

 

 

రఘునాథ్ గారు తన ఫోన్ లో చూపిస్తున్న వీడియోస్ చూసిన ఇంద్ర కళ్ళల్లో అగ్ని జ్వాలాలు కనిపిస్తుంటే ఇంద్ర ఏంటి ఇదంతా సమాధానం చెప్పు అన్నారు రఘు గారు..

 

 

డాడ్ ఇదంతా ఓ ట్రాష్ అన్నాడు ఇంద్ర…

 

 

ఏది ట్రాష్.. నువ్వు స్వర్ణ ని ముద్దు పెట్టడం ట్రాష్ హా అని కోపంగా ప్రశ్నించారు దేవయాని గారు…

 

 

తల్లి ముందు తప్పు చేసిన వాడిలా తల దించుకోవడం ఇష్టం లేని ఇంద్ర సారీ మమ్మీ నాకు ఇదంటే ప్రాణం అని పక్కన ఉన్న స్వర్ణ ని లాగి తన భుజం చుట్టూ చెయ్యేసి ఆ విషయం మీకు టైం చేసుకొని చెప్దాం అనుకున్నాను కానీ ఈ లోపే ఇలా జరిగిపోయింది అని చెప్పాడు

 

 

నాటకాలు ఆడకు ఇంద్ర మీ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు ఆ విషయం అందరికి తెలుసు అన్నారు రఘునాథ్ గారు…

 

 

అదంతా నాటకం డాడ్.. మేము 3 ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నాం కావాలనే మీ ముందు అలా ఉంటున్నాం అన్నాడు…

 

 

ఇంద్ర మాటలకి నోరేళ్ళ బెట్టిన స్వర్ణ షాక్ లో ఉంటే అందరికీ తెలిసి పోయాక ఇంకా దాచడం ఎందుకు బేబీ అని స్వర్ణ భుజం మీద ఉన్న చేతిని గట్టిగా నొక్కుతాడు..

 

 

నిజామా స్వర్ణ అని ఆశ్చర్యంగా అడుగుతున్న దేవయాని గారి వైపు గాజు కళ్ళతో చూస్తుంది…

 

 

అది అత్తయ్య అంటున్న స్వర్ణ భుజం ఇంద్ర చేతిలో కంది పోతుంటే నొప్పికి తట్టుకోలేని స్వర్ణ నిజమే అత్తయ్య అని తల దించుకుంటుంది

 

 

@ ఇంకా ఉంది 

 

 

@ హాయ్! మై డియర్ క్రేజీ సోల్స్ 💙 స్టోరీ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్… 🫶