అన్వాంటెడ్ లవ్ – 4
ఒంటి మీద నుండి డ్రెస్ వేరవగానే మిర్రర్ లో తన నడుముకి ఇరు వైపులా ఇంద్ర చేతి వేళ్ళ ముద్రలతో పాలమీగడలో చందనం కలిపినట్టు ఉన్న రంగులో ఉండే తన నడుము ఇంద్ర చేతి స్పర్శ తో ఎర్రటి టమాట రంగు లో నుండి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది కందిన స్వర్ణ నడుము…
నడుము నుండి తన చూపులని అద్దంలో కనిపిస్తున్న తన మెడ మీదకి కళ్లేత్తి చూస్తే ఇంద్ర పళ్ళు దింపిన ఆకారం కనిపిస్తుంటే పెదవులు అయితే ఉబ్బిపోయి కొరికిన గాట్లతో రక్తం పేరుకు పోయి కనిపిస్తుంటే తన కళ్ళు మాత్రం ఎర్రటి కుంకుమ ని తలపిస్తున్నాయ్
నన్నేం చేసిన అడిగే వాళ్ళు లేరనే కదా ప్రతి సారి ఏడిపిస్తున్నావ్… నీ అల్లరి ఈ రోజు శృతి మించి నా ఒంటి మీద చెయ్యేసే వరకు వచ్చింది.. నిన్ను ఊరికే వదలను ఇంద్ర అని కసిగా పిడికిలి బిగించి వెళ్లి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది…
@@@
స్వర్ణ దగ్గర నుండి వెళ్లిన ఇంద్ర నేరుగా ఓ రూమ్ కి వెళ్ళాడు… ఆ రూమ్ లో ఓ అమ్మాయ్ బాడీ కెన్ లాంటి సింగిల్ పీస్ డ్రెస్ లో కాలు మీద కాలు వేసుకొని తనకి కావాల్సిన డ్రింక్ ఆర్డర్ చేసుకొని సిప్ చేస్తూ ఎదురు చూస్తుంది ఆ అమ్మాయ్ ఎవరో కాదు పార్టీ లో ఇంద్ర హాగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న అమ్మాయ్….
డార్లింగ్ ఏంటి ఇంత లేట్ అంటూ ఆ అమ్మాయే వచ్చి హాగ్ చేసుకుంటే తనతో సహా బెడ్ మీద పడిపోయాడు ఇంద్ర…
డ్రింక్ చేసి మత్తులో ఉన్న ఆ అమ్మాయ్ ఇంద్ర ని రెచ్చ గొడుతూ తనకి అనుకూలంగా మారిపోతుంది…
పార్టీ లో కొడుకు కనిపించక రఘు గారు చుట్టూ చూసి కాల్ చేస్తారు..
స్వర్గపు అంచులు తాకుతున్న ఇంద్ర తండ్రి కాల్ కి డిస్టర్బ్ అయ్యి… లిఫ్ట్ చేసి వాట్ డాడ్ అన్నాడు
వేర్ ఆర్ యూ ఇంద్ర పార్టీ లో కనిపించట్లేదు అని అడుగుతారు…
ఐ ఫీల్ స్లీపి డాడ్ అని సింగిల్ వర్డ్ చెప్పి కాల్ కట్ చేసి తన పనిలో తను నిమగ్నమవుతాడు ఇంద్ర..
పార్టీ లో తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళ అందరిని పలకరిస్తూ లేని పోనీ పెద్దరికాన్ని నెత్తిన వేసుకుంటారు రాజేశ్వరి గారు…
చాలా సేపటి నుండి కూతురు కనిపించక ఇది రూమ్ కి వెళ్లిపోయిందా ఏంటి??? ఏంటో ఇక్కడ ఇంత మంది ఉన్నారు.. వాళ్ళ లాగే అది కూడా ఉండొచ్చు కదా ఏమైనా అంటే నా మీద గయ్యిమంటుంది అని కూతురిని తిట్టుకుంటారు రాజేశ్వరి గారు..
అలా పార్టీ ముగిసే సరికి రాత్రి 12 దాటిపోతే.. ఆ హోటల్ లోనే బుక్ చేసినా ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళిపోతారు…
@@@@@
తెల్లారి 7 అవుతుండగా లేచిన స్వర్ణ ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్తుంది… అప్పటికి ఇంటికి ఎవరు వచ్చి ఉండరు.. స్వర్ణ తన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ ఇవ్వమని మెయిడ్ కి చెప్పి సోఫాలో కూర్చుంది…
మెయిడ్ వచ్చి కాఫీ ట్రే స్వర్ణ ముందు పెట్టగానే ఆ కాఫీ ని ఇంద్ర తీసుకుని తాగుతూ తన రూమ్ కి వెళ్ళపోతాడు అప్పుడే వచ్చిన ఇంద్ర
ఇడియట్ అది నా కాఫీ రా అంది…
మరు క్షణం వచ్చి కాఫీ కప్ ఎగురుకుంటూ వచ్చి స్వర్ణ ముందు ముక్కలు అవుతుంది…
పగిలిన కప్ నే చూస్తూన్న స్వర్ణ ముందు కి వచ్చిన ఇంద్ర తన బుగ్గలు నొక్కి పెట్టి ఏంటే నోరు లేస్తుంది… నీకు ఎన్ని సార్లు చెప్పా పెట్టింది తింటూ అన్ని మూసుకొని పడి ఉండమని.. ఎక్స్ట్రా లు చేశావో… లైఫ్ లాంగ్ ఇదే ఇంట్లో మెయిడ్ ని చేస్తా జాగ్రత్త అని బుగ్గల నొప్పికి స్వర్ణ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ కనిపించడంతో సాటిస్ఫాక్షన్ గా అనిపించి విసురుగా వదిలేసాడు సోఫా లోకి
ఇంద్ర పట్టిన చోట తన చేతి వేళ్ళ అచ్చులు స్పష్టంగా కనిపిస్తుంటే.. కన్నింగ్ గా నవ్వుతూ ఏంటే ముట్టుకుంటేనే కందిపోతున్నావ్ మరి నైట్ నీ న అంటున్న ఇంద్ర ని…
ఇంద్ర అని హాల్ మొత్తం దద్దరిల్లేలా అరుపు వినిపిస్తుంది
అరుపు వినిపించిన వైపు చూసిన ఇంద్ర.. స్వర్ణ లు మాత్రమే కాదు ఇంట్లో మెయిడ్స్ కూడా హాల్లోకి పరుగేత్తుకొచ్చి చూస్తే ఎప్పుడు పట్టు చీరలో హుందాగా నెమ్మదిగా నడుస్తూ మోము పై చిరునవ్వు చెదరకుండా నిదానంగా మాట్లాడే దేవయాని గారు ఇప్పుడు పెద్ద అరుపుతో… పెద్ద పెద్ద అడుగులతో ఇంద్ర ని చేరి ముడుచుకున్న కను బొమ్మలతో కళ్ళలో ఆగ్రహం చూపిస్తూ పని వాళ్ళ అందరిని ఒకసారి చూడగా పనివాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతే…!!!
@ ఇంకా ఉంది
@ హాయ్! మై డియర్ క్రేజీ సోల్స్ 💙 స్టోరీ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్… 🫶
Swipe left/right or tap the sides to turn pages