ఆ రాత్రి మొదలయింది❤️🔥3
కలుసుకున్నం…..
ఈ రాత్రి ‘కాలం’ వాళ్ళిద్దరినీ
అక్కడ అలా ఎందుకు కలిపిందో కానీ..
ఇద్దరూ కూడా ఈ రాత్రి
వారి జీవితాలను మలుపు తిప్పబోతుందని,
ఏమాత్రం ఊహించి ఉండరు.
కాలం చేతిలోని కనికట్టు,
ఏ ఒక్కరి ఊహకి అందని,
మంత్రజాలం.
అదే జీవితం.
ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా
ఆమెని అసహనంగా చూస్తూన్నాడు.
అలా చూస్తున్న అతని చూపులు
ఆమెని స్కాన్ చేస్తున్నాయి.
పైన ముఖం దగ్గర నుంచి
కింద వరకు పరీక్షగా చూస్తున్న
అతని చూపులు కింద కనిపిస్తున్న
కాలి వేళ్ళ మీద నిలిచిపోయాయి.
నీకు పెళ్లి అయ్యిందా..??
అన్నాడు అతని చూపులు
ఆమె కాలి వేళ్ళ మీద నిలిపి.
అతని ప్రశ్నకి అప్పటివరకు
సైలెంట్ గా ఉన్న ఆమె
అతని వైపు చూస్తుంది.
అతని చూపు ఎక్కడుందో గమనిస్తూ..
తనను తాను చెక్ చేసుకుంటుంది.
ఎదపైన చెదిరిన చీర అంచులను
ఠక్కున సరి చేసుకుంటు, బయటికి
కనిపిస్తున్న కాళ్లను చీర అంచుల
కిందకి దాచేస్తుంది.
కాళ్లు లోపలికి దాచేయడంతో..
ఆర్ యు మ్యారీడ్ అని మళ్ళీ అడుగుతూ,
ఇప్పుడు ఆమెను చూస్తున్నాడు.
అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
కనీసం తల తిప్పి కూడా చూడలేదు.
భారంగా అనిపిస్తున్న గుండెల మీద
చేయి వేసి నిమురుకుంటుంది.
అక్కడ ఉండవలసిన మంగళసూత్రాలు
ఇంట్లో భద్రంగా దాచిపెట్టిన విషయం గుర్తుకొచ్చి,
ఆ కారణానికి కష్టంగా కళ్ళు మూసుకుంటుంది.
ఆమెనే గమనిస్తున్న అతనికి
విసుగ్గా అనిపిస్తుంది.
అలా వెయిట్ చేయడం
దొరగారికి అసలు నచ్చదు.
ఆమె ఏమో మాట్లాడకుండా
మూగదానిల కూర్చుంది.
ఇక అతని వల్ల కాక..
హేయ్ కమాన్..
ఎంత టైమ్ తీసుకుంటావు..??
ఐ రియల్లీ హేట్ వెయిటింగ్.
సే ఇట్ అవుట్. ఎస్ ఆర్ నో.
అంటూ కదుపుతాడు.
దిగ్భ్రాంతిలో కూరుకుపోయిన ఆమె
అతన్ని విచిత్రంగా చూస్తుంది.
పొగరు, బలుపు కలిసిన
పందెంకోడిలా స్టైల్ గా కూర్చుని
ఆమెనే చూస్తున్నాడు.
హుష్.. రామా
ఏం చెప్పాలి రా సామి..??
ప్రపంచంలో ఈ విధంగా
అడిగేవాడిని నిన్నే చూశాను.
అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో
నాకు అర్థం అయితే కదా..
నీకు చెప్పడానికి..??
చాక్లెట్ కావాలని, అడినట్టు అడిగావ్.
అవ్వ.. అవ్వ..
ఒంటరిగా అమ్మాయి దొరికితే,
ఇలా మాట్లాడతావా..??
కొంచమైనా మ్యానర్స్ ఉందా నీకు..??
అంటూ కసురుకుంటుంది.
ఇప్పటివరకు మూగదానిలా కూర్చున్న పిల్ల
ఒక్కసారిగా వసపిట్టల వాగుతుండేసరికి,
ముందు అతను కొంచెం షాక్ అయ్యాడు.
వెంటనే ఆమె క్యారెక్టర్ని
అనలైజ్ చేయడం మొదలుపెట్టాడు.
హో.. గాడ్!!
నీకేమీ అర్థం కాకుండానే,
ఇంతసేపు, నా టైం వేస్ట్ చేసావ్.
కమాన్ అర్థం కాలేదంటే,
ఈపాటికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కదా.
మానర్స్ లేకుండా,
వెయిట్ చేయించింది నువ్వు.
మెంటల్ స్టేట్ లూజ్ అయింది నువ్వు.
అని కమాండ్ చేస్తూ, మిస్టేక్ ఆమెదె అంటు
పడిపోతాడు తిరిగి.
ఆమెకు తగ్గట్టుగానే మాట్లాడుతూ.
“ఓయ్ ఏంటయ్యా నువ్వు..??
అలా అడిగితే భయపడరా?
ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు,
నీలాంటి వాళ్ళందరికీ ఇదే బుద్ధి.
ఏడిపించుకు తింటారు.
నా మానాన నేను చావాలనుకుంటే,
చెడగొట్టి ఇలా పంచాయతీ పెట్టి,
పిచ్చోడిలా మాట్లాడుతుంది నువ్వు.
బ్యాక్ కావాలి అంటే..
ఏంటయ్యా అసలు?
ఎవరైనా అలా అంటారా?
అదేమన్నా చాక్లెట్ ఆ..??
తీసుకో అని తీసి చేతిలో పెట్టడానికి..
బుద్ధి లేకుండా మాట్లాడి,
మళ్లీ నన్నే అంటావా..??”
అసలు మ్యాటర్ తెలియని పాప,
మొదటి మాటకే,
అతని మీద కయ్యమంటుంది.
లోడ లోడ కళ్ళు పెద్దవి చేసి
వాగుతున్న ఆమెను అలాగే చూస్తున్నాడు.
సన్నటి కోల ముఖం.
ముఖం మొత్తంలో ఆకర్షణగా
ఆకట్టుకుంటున్న ఆ పెద్ద పెద్ద కళ్ళు.
వాటి మీద చెక్కినట్టే, తీరుగా ఉండి,
కళ్ళతో పాటు కదులుతున్న కనుబొమ్మలు.
ఆ కళ్ళ మీదే నిలిచిపోయింది అతని చూపు.
సో డేంజరస్.
అనుకోకుండా ఉండలేకపోయాడు ఆ క్షణం.
ఆమె మాటలతో పాటు,
ఆమెలోని ప్రతి భావాన్ని పలుకుతున్న,
ఆ కళ్ళు అతన్ని అంతలా కట్టిపడేస్తుంటే.
నేను దీన్ని మేనేజ్ చేయాలంటే,
ఇదే నన్ను డామినేట్ చేస్తుంది.
అంటుంది అంతరాత్మ లోపల నుంచి.
వాట్ ఏంటి.. దాని డామినేషనా..??
అంటూ లోపల అంతరాత్మని ప్రశ్నిస్తాడు
ఒప్పుకొని ఈగో తో.
నో ఛాన్స్..!!
నెవర్ అండ్ ఎవర్..
మనల్ని ఎవరు డామినేట్ చేయలేరు.
దాన్ని నేనే కంట్రోల్ చేస్తాను.
అని లోపల ఉన్న అంతుః ని కమెండ్ చేస్తూ,
ఎదురుగా ఉన్న వాగుడికాయని
కంట్రోల్ చేయడానికి ప్రిపేర్ అయ్యాడు.
హే స్టాప్ ఇట్..!!
అంటూ ఆమె మాటలకు,
ఫస్ట్ బ్రేక్ వేస్తాడు.
అతని ఆర్డర్ కి,
కలువ కళ్ళ సుందరి
వసపిట్టలా వాగడం ఆపేసి
పెద్ద కళ్ళతో పొడిచేసేలా,
చూస్తుంది అతన్ని.
దూకి స్విమ్ చేయడానికి
సరిపోయే అంతలా పెద్దవి చేసినా
ఆమె కళ్ళను చూస్తూ..
అతని ప్రస్టేషన్ ఎగిరిపోగా,
అతనికి తెలియకుండానే నవ్వుతాడు.
నీ కళ్ళు బాగున్నాయి.
చెప్తాడు, అలాగే మత్తుగా నవ్వుతూ.
అందుకే, అగైన్ క్లారిటీ ఇస్తున్నాను.
సరిగ్గా విను.
ఆర్డర్ వేసినట్టే, వేలు చూపిస్తూ చెప్తున్నాడు.
చూడు నాకు నీ బ్యాక్ నచ్చింది.
నీ బ్యాక్ స్ట్రక్చర్ బాగా నచ్చింది.
ఐ వాంట్ ఇట్!!
ఐ వాంట్ ఇట్, ఆన్ మై బెడ్!!
బెడ్ పార్టనర్ గా కావాలి.
దానికి నేను పే చేస్తాను.
డైలీ 50,000/- పే చేస్తాను.
నీకు ఇష్టమైతే అగ్రిమెంట్ అవుదాం.
నాకు బోర్ కొట్టేవరకు,
నాకు పార్ట్నర్ గా ట్రావెల్ చెయ్యి.
అంటూ సుత్తి లేకుండా స్ట్రైట్ గా,
కావలసింది ఏంటో చెప్పేస్తాడు.
బక్క బంగారానికి,
బ్యాక్ మ్యాటర్ అర్ధమైంది.
50,000 దగ్గర బ్రెయిన్ ఆగిపోయింది.
బెడ్ పార్టనర్ గా ఏం చేయాలన్న,
క్లారిటీ మిస్ అయ్యి కాకరకాయ
ఫేస్ పెట్టుకొని కల్లప్పగించి చూస్తుంది.
ఆ చూపులకు తట్టుకోలేక..
దీని కళ్ళతో నన్ను చంపేస్తుంది.
ఈ కళ్ళ పాప,
ట్యూబ్ లైట్ బ్రెయిన్ అనుకుంటా.
అని విసుగ్గా ఫీల్ అవుతూ..
నిలువు గుడ్లేసుకుని అతన్ని టెంప్ట్ చేస్తున్న ఆమె
చెంపల మీద చిన్నగా ఒక్కటి ఇస్తాడు.
***************************************
మళ్లీ కలుద్దాం…
ట్యాగ్ యువర్ కామెంట్స్.
సపోర్ట్ మీ విత్ యువర్ రేటింగ్స్, అండ్ స్టిక్కర్స్.
ఫాలో మీ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.
థాంక్యూ.
మీ వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages