New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఆ రాత్రి మొదలయింది❤️‍🔥2

ఆ రాత్రి మొదలయింది❤️‍🔥2

ఆ రాత్రి మొదలైంది❤️‍🔥2
Like 💖 Subscribe 💖 Comment…
కలుసుకున్నాం…..
గట్టిగా నిర్ణయం తీసుకొని
గబగబా రైలింగ్ వైపుకి,
ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె.
ఆవేశంగా పైకెక్కింది.
కిందకి దూకడానికి బలం ఇవ్వమని,
దేవుడికి దండం పెట్టుకుంటుంది.
ఆమె తిరిగి పైకి ఎక్కగానే,
అతను వెంటనే లేచి నిలబడి,
ఆమెని ఆసక్తిగా గమనిస్తున్నాడు.
పైకి చూస్తుంది కిందికి చూస్తుంది.
ముందులాగా వచ్చిన భయంతో,
ఎటు తేల్చుకోలేక..
ఆ రైలింగ్ మీద నిలబడి మళ్లీ ఊగుతుంది.
గాలిలో రెండు చేతులు చాపి నిలబడి..
ముందుకు పడకూడదని,
బ్యాలెన్స్ చేసుకుంటుంది.
దూకాలంటే వస్తున్న భయంతో…
అలాగే వెనక్కి దిగకూడదని 
మనసుని అదుపు చేసుకుంటుంది.
బ్రతికి సాధించేది ఏంటి అన్న విరక్తితో….
ఆమె పైకి ఎక్కడం కోసమే ఎదురుచూస్తున్న 
ఆ వ్యక్తి కళ్ళల్లో సంతోషం వచ్చింది.
“వావ్ సూపర్ బ్యాక్.
నా హార్ట్ ని టచ్ చేసింది.
సో స్ట్రెచబుల్ బాడీ.
కానీ దూకి చస్తుంది.”
వెనకనుంచి మాత్రమే కనిపిస్తున్న
ఆమె బాడీని చూస్తూ కాంప్లిమెంట్స్
ఇస్తున్నాడు.
ఆమె చేసే డాన్స్ కి,
వెనుక కదులుతున్న
ఆమె బారు జడని గమనిస్తూ
ఆ జడ కదలికలతో పాటు
అతని కళ్ళను కూడా,
అటు ఇటు కదుపుతున్నాడు.
ఒక అందమైన బాపు బొమ్మని
ఇష్టంగా చూసేటప్పుడు..
ఎటువంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో,
ఇప్పుడు అతనిలో అటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి.
ఎగ్జాక్ట్ గా అంతా ఇంప్రెస్సివ్ గా
ఆ అమ్మాయిని చూస్తున్నాడు.
కానీ ఆ ఫీల్ మొత్తం ఆమె 
బ్యాక్ మీద మాత్రమే ఉంది. 
రెండు చిన్న డ్రమ్స్ ని ఒక మందపాటి
తాడుతో కొడుతున్నట్టు అనిపిస్తుంది అతనికి. 
ఆ జఘనం మీద ఆ వాలు జడ కదులుతుంటే…
ఆమె దూకడం లేదు.
భయంతో ముందుకి వెనక్కి తేల్చుకోలేక
మధ్యలో ఊగుతూనే ఉంది.
ఇడియట్.. నా టైం వేస్ట్ చేస్తున్నావు.
అని ఆమెని అంటూ,
తినడం పూర్తయిన పల్లి పప్పుల పేపర్ ని
ఉండాలా చుట్టి, పైకి ఎగరేసాడు.
మళ్లీ కిందికి పడుతున్న ఆ పేపర్ బాల్ ని,
కాలితో కింద పడకుండానే హిట్ చేస్తాడు.
ఆ బాల్ ఆ చీకటిలో
ఎగిరెల్లి ఎక్కడో పడుతుంది.
కంటికి కూడా కనిపించినంత దూరాన.
“ఒసేయ్ చారు..
కొంచెం ధైర్యం తెచ్చుకొని దూకేయ్యవే,
బతికి పోతావు.
లేదంటే, బతికి ప్రతిరోజు చస్తూ ఉండాలి.
నువ్వు బతికి నీ వాళ్ళని కూడా 
అవమానాలతో చంపుకోవాలి.”
వస్తున్న దుఃఖంతో రానంటున్న 
ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.
తన వాళ్ళని తలుచుకుంటే 
ఇక జీవితం మీద పూర్తిగా 
ఆశ సన్నగిల్లుతుంటే..
బతకాలి అని ఏ ములనో మిగిలి 
ఉన్న ఆశ కూడా ఆవిరైపోతు..
మరణమే శరణ్యమని తన 
నుదుటి రాత వెక్కిరిస్తుంది.
కానీ ఆమె కన్నా ముందు
ఆమె భయం ఆమెను ఆపేస్తుంది.
ఇప్పటివరకు గతించిన కాలంలోని
జ్ఞాపకాలన్నీ ముసురుతుంటే..
భరించలేనంత కష్టంతో,
గట్టిగా కళ్ళు మూసేసుకుంది.
తనంతట తానుగా దూక లేక పోయినా 
మరికొన్ని క్షణాలలో బ్యాలెన్స్ తప్పి 
కచ్చితంగా నీళ్లలో పడిపోతాను అన్న దృఢమైన 
నమ్మకంతో అక్కడే మొండిగా నిలబడిపోయింది.
అక్కడ విసుగ్గా లేచిన అతను 
తాపీగా ఇక్కడకు వచ్చి ఆమెను చూస్తున్నాడు. 
టైటానిక్ షిప్ ఎడ్జ్ మీద నిలబడిన్నట్టు 
నిలబడి గాలిలో దీపంలా రెపరెపలాడుతున్న 
ఆమె నాజూకైన శరీరాన్ని పైనుంచి 
కిందకి స్కాన్ చేస్తాడు.
అతని చూపంత ఆమె బ్యాక్ మీద, 
ఆ జడ మీదే ఉంది. 
విచిత్రంగా అనిపిస్తుంది అతనికి.
ఇంతవరకు ఎప్పుడు ఇంత బారు 
జడ చూడలేదు అతను.
సైడ్ నుంచి కనిపిస్తున్న ఆమెను 
కొన్ని క్షణాలు పైనుంచి కిందకి స్కాన్ చేసి 
ఆ తర్వాత పలకరిస్తాడు..
హయ్,  కెన్ ఐ హెల్ప్ యు… అంటూ.
వినిపిస్తున్న గొంతుకి
ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచి
తల పక్కకు తిప్పి చూస్తుంది.
చాలా స్టైల్ గా బ్రిడ్జ్ రైలింగ్ కి
వీపు ఆనించి నిలబడి
తల పక్కకు తిప్పి ఆమెనే చూస్తున్నాడు.
ఎప్పుడు ఎక్కడ అతన్ని 
చూసిన దాఖలాలు లేవు.
అతన్ని చూడగానే..
సహజంగా ఆ సమయంలో 
వచ్చే భయంతో,
అసలే పెద్ద కళ్ళేమో,
వాటిని మరింతగా పెద్దవి చేస్తూ..
భయం భయంగా కంగారుపడుతూ
అతన్నే చూస్తుంది.
కాదు.. కాదు.. తనని తీసుకెళ్లి 
పోలీసులకు ఏమైనా అప్పగిస్తాడేమోనని 
కంగారుగా భయపడుతుంది.
ఆ కంగారు లో, బ్యాలెన్స్ తప్పి
చీర కుచ్చిళ్ళు అడ్డు పడుతుండగా..
మరింతగా ఉగిపోతుంది.
ఊగుతున్నా, ఆమె వైపుకు
పూర్తిగా టర్న్ అయ్యి..
వావ్ యువ్ ఆర్ రియల్లీ నైస్ డాన్సర్.
డాన్స్ ఆగిపోయిందని దగ్గరకు వచ్చా.
మళ్లీ స్టార్ట్ చేసావ్.
సో నైస్, దూరంగా వెళ్లి చూస్తా.
యువ్ క్యారీ ఆన్.
అని చెప్పి వెళ్ళడానికని,
అక్కడి నుంచి కదులుతాడు.
అతను అలా వెనక్కి తిరగగానే..
హోయ్..
అంటూ గట్టిగా అరిచి పిలుస్తుంది.
అతను వెంటనే ఆగి,
వెనక్కి తిరిగి చూస్తాడు.
ఏం మనిషివయ్య నువ్వు..??
అని పెద్ద గొంతేసుకొని ప్రశ్నిస్తుంది.
అతను కూల్ గా, స్టైల్ గా,
కదిలిన నాలుగు అడుగుల దూరాన్ని కవర్ చేస్తూ,
నెమ్మదిగా తిరిగి ఆమె దగ్గరకు వస్తాడు.
కింద నుంచున్న అతను,
పైన నుంచున్న ఆమెను,
తల పైకెత్తి, ఒక ఆటిట్యూడ్ 
లుక్కుతో చూస్తున్నాడు.
“ఏంటయ్యా ఆ చూపు..??
చావాలనుకున్న నన్ను,
చావనివ్వకుండా చెడగొట్టి..
డాన్స్ చేస్తున్నానని
చెండాలంగా మాట్లాడుతావా..??
అసలు బుర్ర ఉందయ్యా నీకు..??
ఎవరైనా డాన్స్ చేయాలంటే
ఇంత అర్ధరాత్రి పూట 
ఇలా కాలువ కట్టల మీద చేస్తారా..??
పొగరుగా చూస్తున్న అతని చూపులకు
నోరేసుకుని పడిపోతు,
అంతకుముందు అతను ఇచ్చిన
కాంప్లిమెంట్ కి, కయ్యమంటుంది.
ఆమె అన్న మాటలకి అతను స్టైల్ గా 
కన్నింగ్ స్మైల్ ఇస్తూ..
బ్రతకడం చేతకాని వాళ్లు,
కచ్చితంగా చావాలి.
చావలేక కష్టపడుతున్నావని,
హెల్ప్ చేయడానికి వచ్చాను.
మళ్లీ డాన్స్ చేస్తున్నావని
వెనక్కి వెళ్ళబోయాను.
డాన్స్ చేయవన్నమాట.
అయితే హెల్ప్ చేస్తాను.
అంటూనే ఆమెను తొయ్యడానికి
రెండు చేతులు పైకి ఎత్తాడు.
అతను చేస్తానన్న పనికి 
ఒక్క దెబ్బకి అదిరిపడింది.
అంతకన్నా ఎక్కువగా భయపడింది 
నిజంగా తోసేస్తాడేమోనని..
ఓయ్.. ఓయ్.. పిచ్చా నీకు?
ఏం చేస్తున్నావయ్యా..??
అని అరుస్తూ..
పైకెత్తిన అతని రెండు చేతులు
గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా
రైలింగ్ మీద నుంచి బ్రిడ్జ్ మీదికి దూకేస్తుంది.
బ్రిడ్జి మీదకి దూకుతూనే
కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ
గట్టిగా శరీరాన్ని బిగదీస్తూ
కళ్ళు మూసుకుంటుంది.
అది ఆమెకు మాత్రమే తెలిసిన ఇబ్బంది. 
ఎవరికి చెప్పుకోలేని ఇబ్బంది. 
చెప్పుకోవలసిన వాళ్ళకి చెప్పుకున్న, 
తీర్చకుండా వదిలేసిన ఇబ్బంది.
అవుచ్…
అని చిన్నగా అరుస్తూ,
రెండు చేతులు విదిలించుకుంటున్నాడు అతను.
ఆమె కిందికి దూకడానికి అతని చేతుల్ని
గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల
అతని చిటికెన వేలు మడతపడి,
రెండో చేతి మణికట్టు దగ్గర
ఒత్తిడి పడి కొంచెం నొప్పిగా
ఉన్నాయి రెండు చేతులు.
“నొప్పిగా ఉన్నాయా ఫ్రెండ్?
ఆంటీ, గట్టిగా పట్టుకుందా..??”
వెంటనే క్యురియస్ గా
ప్రశ్నిస్తున్న పాప గొంతు
నువ్వు సవ్వడితో, పక్క నుంచి వినిపిస్తుంది.
అతను ఠక్కున తల తిప్పి చూసేసరికి,
ముసిముసిగా నవ్వుతూ కనిపిస్తుంది పాప.
ఏయ్ లిటిల్ గోస్ట్,
పెద్దవాళ్ల దగ్గర నీకేంటి పని.
గెట్ అవుట్.
వెళ్ళు.. అని చురుగ్గా కసురుకుంటాడు.
సీరియస్ గా వినిపిస్తున్న,
అతని గొంతు వింటూ వెంటనే కళ్ళు తెరిచి
భయం నిండిన కళ్ళతో అతన్నే చూస్తుంది ఆమె.
అతను చెప్పడమైతే, చెప్పాడు.
కానీ అది ఎవరికి చెప్పాడో,
ఆమెకు అర్థం కాక అయోమయంగా
చూస్తుంది.
నేను అన్నిసార్లు ప్లీజ్ అని అడిగితే,
హెల్ప్ చేయను అన్నావు.
మరి ఇప్పుడు ఎందుకు చేశావు ఫ్రెండ్..??
అని అనుమానంతో అడుగుతుంది పాప.
అతను వేళ్లను నొక్కుకోవడంతో 
అతని ఇబ్బందిని చూసి అందంగా 
నవ్వుతుంది కూడా.
పాప అడిగిన దానికన్నా 
నవ్వే దానికే ఎక్కువ మండిపోతుంటే 
“పల్లి పప్పులు అయిపోయి,
పనేమీ లేక వచ్చి తగిలించుకున్నాను.
చెప్పాను కదా పో.”
ముఖమంతా కందగడ్డ లాగా మార్చి
పాపని గదమయిస్తాడు వెళ్ళమంటూ.
ఈసారి అతను మాట్లాడింది
ఆమెతో కాదని అర్థమయ్యింది.
దానితో ఆమె  ఇంకాస్త భయపడుతూ
అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియక,
వెనక ముందు ఆ పక్క ఈ పక్క
అంతా వెతికేస్తుంది.
అతనికి కోపం పెరిగే సరికి,
అతని కోపం చూస్తూ..
ఇలా బాగున్నావు ఫ్రెండ్.
అని టీస్ చేస్తూ
నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పాప.
పిల్ల దెయ్యం, దొరుకుతావు నాకు.
అని అనుకుంటూ, పాప వెళ్లిపోవడంతో 
ముందున్న ఆమె వైపు తిరుగుతాడు.
విచిత్రంగా అయోమయంగా
బెదురుగోడ్డు కళ్ళేసుకుని
అతన్నే చూస్తుంది.
అతను ఎవరితో మాట్లాడుతున్నాడో
ఆమెకి ఎంత వెతికినా..
ఎవరూ కనిపించక పోయేసరికి,
అతనికి పిచ్చేమో.. అందుకే
‘తనలో తాను మాట్లాడుకుంటున్నాడు.’
అని అనుమానంతో చూస్తుంది.
నొప్పి పుడుతున్న
చిటికెన వేలు ని నొక్కుకుంటూ..
పొగరు కలిసిన చూపులతో
ఎదురుగా ఉన్నా ఆమెని పైనుంచి
కిందకి స్కాన్ చేస్తున్నాడు.
“నీ బ్యాక్ సూపర్.
ఫ్రంట్ నుంచి యావరేజ్.
ఐస్ మాత్రం అదిరిపోయాయి.
బ్యాక్ మీద ఆ తోక సూపర్ గా ఉంది.
డ్రమ్స్ మీద కొడుతున్న స్నేక్ లాగా.
పర్లేదు.. బ్యాక్ తో సరిపెట్టుకుంటాలే.”
ఆమె కోసం ఏదో త్యాగం (sacrifice)
చేస్తున్న వాడిలా మొఖం పెట్టి,
ఆమె బాడీ గురించి
ఆమెతోనే పంచాయతీ పెట్టాడు.
చీర చెంగుని చుట్టూత కప్పుకుంటూ
అతనిని భయం గా చూస్తూ..
బ్యాక్, తోక, స్నేక్.. మాటలు 
మాత్రం ఏంటో అర్థం చేసుకోలేక
వెనక్కి వెనక్కి వెళుతుంది ఆమె.
అతను చూడడానికి చాలా స్టైల్ గా,
డబ్బున్న మనిషి లాగే కనిపిస్తున్నాడు.
అతని ప్రవర్తన మాత్రం వింతగా ఉంది.
ఇంతకు ముందు పిచ్చి అన్న
అనుమానం మాత్రమే ఉంది.
ఇప్పుడు మాత్రం ‘కచ్చితం’ అది పిచ్చే 
అని కన్ఫామ్ చేసుకుంటూ,
అతనికి దూరంగా ఉండడానికి
నెమ్మదిగా జారుకుంటుంది.
ఆమె భయాన్ని గ్రహించి
అతను నవ్వుకుంటాడు.
హేయ్ బాగున్నావ్ అంటే,
దూరంగా పోతున్నావేంటి..??
నువ్వు సెక్సీగా ఉన్నావు అని చెప్పినందుకు,
థాంక్స్ అంటూ ఒక కాంప్లిమెంట్ ఇవ్వు.
అంటూ ఒక్క అడుగులో ఆమె
ముందుకు వెళ్లి నిలబడతాడు.
నే.. నే.. నేను వెళ్తాను.
తత్తరపాటుతో, తడబడుతూ చెప్తుంది.
సరే వెళ్లాలనుకుంటే వెళ్ళు,
కానీ ముందు ఒకటి చెప్పి వెళ్ళు.
నీ బ్యాక్ కావాలి.
ఇస్తావా..??
పే చేస్తాను.
అని అడుగుతాడు
ఆమెను షార్ప్ గా చూస్తూ.
అతను అడిగినది ఏంటో అర్థం కాక,
క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తుంది.
ఆమె ముఖం చూస్తున్న
అతనికి ఆమెకు అర్థం కాలేదని
అనిపిస్తుంది.
నీ పేరేంటి..??
అని అడుగుతాడు రెండో చేతి
మణికట్టు దగ్గర నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ.
ఆమె సేవ్ అవ్వడం ఏమో కానీ,
ఆ ప్రాసెస్ లో అతని రెండు చేతుల 
మీద ప్రెషర్ బానే పెట్టింది.
నీ… నీ.. నీకెందుకు..??
నేను చెప్పను.
అంది కంగారుపడుతూ.
కాంట్రాక్టులో రాయాలంటే,
పేరు తెలియాలి కదా..??
అందుకే అడిగాను.
డైలీ 50,000 పే చేస్తాను.
నీ బ్యాక్ నాకు కావాలి.
ఇచ్చేసేయ్.
అంటాడు మళ్ళీ ఆటిట్యూడ్ గా.
ఆమె శరీరం వీడి బాబు జాగీర్ 
అన్నంత డిమాండ్ గా ఇవ్వమంటున్నడు.
ఆమెకు మళ్ళీ అర్థం కాలేదు.
దానితో ఇక ఉండబట్టలేక..
హొయ్.. ఇందాక నుంచి చూస్తున్నాను.
ఇచ్చేయ్ ఇచ్చేయ్ అంటావు.
అసలు ఏం అడుగుతున్నావ్ నువ్వు?
నా దగ్గర ఏముంది ఇవ్వడానికి?
అంటుంది కొంచెం బెట్టుగానే.
ఆమె గడుసుతనానికి, ఆ మాట తీరుకి
చిన్నగా నవ్వుకుంటూ ఆమెనే
విస్మయంగా చూస్తు..
ఇందాక నువ్వు పైన డాన్స్ చేస్తున్నప్పుడు,
ఆ తోక నీ డ్రమ్స్ మీద బలే ప్లే చేసింది.
అదే నీ బ్యాక్, ‘Hip.’
ఇప్పుడు అర్థమైందా..??
చెప్తాడు చాలా కూల్ గా.
అతను అడిగింది ఏమిటో,
అర్థం అయ్యేసరికి,
భయంతో బిగిసుకుపోయి,
ఊహించని విధంగా ఎదురైన ప్రశ్నకి
నీలుక్కుపోయింది.
ఒక పది నిమిషాల తర్వాత…
అదే సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరూ.
కావలసిన దానికోసం, వెయిట్ చేస్తూ
ఒక చివర అతను.
కళ్ళ ముందు జరిగేది నమ్మలేని 
నిస్తేజంలో రెండో చివరన ఆమె.
ఈ రాత్రి ‘కాలం’ వాళ్ళిద్దరినీ
అక్కడ అలా ఎందుకు కలిపిందో కానీ..
ఇద్దరూ కూడా ఈ రాత్రి
వారి జీవితాలను మలుపు తిప్పబోతుందని,
ఏమాత్రం ఊహించి ఉండరు.
కాలం చేతిలోని కనికట్టు,
ఏ ఒక్కరి ఊహకి అందని,
మంత్రజాలం.
***************************************
మళ్లీ కలుద్దాం…
చదివిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ ఇస్తే డైలీ అప్డేట్ ఇస్తాను.
సపోర్ట్ మీ విత్ యువర్ రేటింగ్స్, అండ్ స్టిక్కర్స్.
ఫాలో మీ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.
థాంక్యూ.
మీ వర్ణ.