New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఇది ఇ భైరవుడి కథ – 1

ఇది ఇ భైరవుడి కథ – 1

హాయ్ అల్ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ మై స్వీట్ క్యూట్ డార్లింగ్ అందరు ఇలా వున్నారు నేను అయితే ఏదో అలా కాలంతో పాటు ముందుకీ వెళుతున్న మరి మీరు ఎలా వున్నారు….

 

పార్ట్ 1

 

ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఒక మనిషి సైకిల్ తొక్కుతూ ఫస్ట్ గా ఊరిలోకి వస్తున్నాడు ఉన్నట్టుంది తనకి కుక్కల అరుపులు నక్కల ఈలలు కీచురాళ్ళ శబ్దములు వినిపిస్తున్నాయి తనకి భయం వేస్తుంది ఇంకా ఫస్ట్ గా సైకిల్ తొక్కటం మొదలుపెట్టాడు. తను ఆ ఊరు లోకి రావాలి అంటే స్మశానం దాటి రావాలి కానీ….

 

తను స్మశానం వద్దకు వచ్చే సరికి ఆ సౌండ్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి తనలో భయం ఇంకా పెరుగుతూనే ఉంది ఆ సౌండ్స్ కి గుండె ఆగిపోతుంది ఏమో అనే అంత భయం గా ఉంది తనకి ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకొని ఆ సౌండ్స్ నీ పట్టించుకోకుండా మనసులో ఛీ నా జీవితం రోజు తొందరగానే ఇంటికి వస్తా ఈరోజు షాప్ లో పని ఎక్కువ ఉండే సరికి ఆ ఓనర్ గాడు పంపాలేదు అని అనుకుంటూ స్మశానం వద్దకు వచ్చాడు. సడన్ గా పెద్ద శబ్దం చూస్తే సైకిల్ టైర్ పంచర్ అయ్యింది.

 

కర్మ రా బాబు అని అనుకుంటూ అర్దరాత్రి అయ్యింది ఇంటికి వెళ్ళాలి ఒక పక్క ఈ సౌండ్స్ ఇంకో పక్క చల్లటి గాలి మరో పక్క భయం స్మశానం దాటాలి అంటే అసలే ఈరోజు అమావాస్య ఆది కాక ఆదివారం ఈ టైం లో నువ్వు ఇంటికి వెళ్ళటం అంత కరెక్ట్ కాదు షాప్ లోనే ఉండి రేపు వెళ్ళి అని ఓనర్ చెప్పిన వినకుండా వచ్చినా ఇప్పుడు ఇక్కడ నా పరిస్థితి ఏంటో పాపం నా చిన్న పాప నా కోసం ఎదురు చూస్తే ఉంటది.

 

ఏది ఏమైనా సరే నేను ఇంటికి వెళ్లాల్సిందే అని అనుకోని చుట్టూ వస్తున సౌండ్స్ నీ పట్టించుకోకుండా పంచారు అయ్యిన సైకిల్ నీ తీసుకొని నడుస్తూ స్మశానం మద్యలోకి వచ్చాడు. తనని ఎవరో పిలిచినట్లు అనిపించింది ఆది పట్టించుకోకుండా అలాగే ముందుకి నడవ సాగాడు. తనని పిలిచే గొంతులో మార్పు వచ్చింది.

 

ఏంటి రా పిలుస్తున పలకకుండా వెళుతున్నావు నువ్వు ఎలాగా పలకకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఈ ప్రదేశం దాటి నన్ను దాటి వెళదాం అనుకున్నావు అది నీ తరం కాదు రా అని అంటు ఉండగా ఎవరో తన లెగ్స్ పట్టుకునట్టు అనిపించింది పక్కన నుండి ఎవరో తన భుజం మీద చేయి వేసి ఏంటి రా పిలిస్తే పలకవా నన్ను దాటి వెళ్ళగలను అనుకున్నావా అని తన చెవులో వినిపిస్తున్నాయి కానీ తను ధైర్యం కూడా కట్టుకొని ముందుకి అడుగువేశాడు. ఇందాక ఎవరో లెగ్స్ పట్టుకున్న ఫీల్ వచ్చింది కదా ఆది పోయి అడుగు ముందుకి పడింది.

 

స్లో గా సైకిల్ తో పాటుగా తనలో ఉన్న ధైర్యం మొత్తం కూడా కట్టుకొని అడుగులో అడుగువేస్తూ ముందుకి నడవ సాగాడు. ఉన్నటు ఉండి తనకి ఇందాక నుండి వినిపిస్తాన శబ్దాలు అన్ని అగిపోయాయి గాలి కూడా శాంతించింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇంకో పది అడుగులు వేస్తే రాత్రి పూట ఈ స్మశానం దాటిన మొట్ట మొదటి మనిషి నేను అవుత అని మనసులో అనుకుంటూ అడుగులు ముందు వేస్తున్నాడు.

 

ఇంతలో తనకి నాన్న నను కూడా తీసుకొని వెళ్ళు నీతో తీసుకొని వెళ్ళు అని వినిపిస్తే పక్కి తిరిగి చూసాడు అంతే అక్కడ ఎవరు లేరు కానీ కొంత దూరం లో చితి మీద కాలుతూ ఉన్న శవం లేగిచి కూర్చుంది. ఆది చూసి చెమట్లు పట్టీనా కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకి వెళ్ళడానికి తను అటు వేపు చూసి మళ్ళీ ముందుకి చూసే సరికి…..

 

తన ఎదురుగా బాగా బలంగా కాళ్ళు రెండు బయటకి పెట్టీ తల గాల్లో ఎగురుతూ మొండెం లేకుండా ఉన్న ఆ దృశ్యాన్నీ చూసి తన ప్రాణం గాలిలో కలిసిపోయింది తనతో ఉన్న సైకిల్ కింద పడిపోయింది. అప్పుడు ఆ వికృత మనిషి ఏరా రాత్రి పూట ఆది కూడా ఆదివారం అమావాస్య రోజున ఈ స్మశానం అందులోను నన్ను దాటుకొని వెళ్ళడం అనుకున్నావు ఇప్పుడు చూడు నీ ప్రాణం నుండి వేరు అయ్యింది అని గెట్టి గెట్టిగా అరుస్తు ఉంటే.

 

ఆ శబ్దాలకు ఊరులో వారు అందరూ కూడా నిద్ర లేగిచి కూర్చొన్నారు. ఏంటి అందరు లెగిచారా హహహ మీలో ఈరోజు ఒకరు నాకు బలి అవుతారు అని అన్నాను అయ్యాడు పాపం పిచ్చి వాడు నన్ను దాటి వెళ్ళడం కోసం చాలా ప్రయత్నం చేశాడు చాలా ధైర్యం కూడకటుకున్నాడు. కానీ చివరి నిమిషంలో నా మాయకు బలి అయ్యి ప్రాణం పోగొట్టుకున్నాడు అని ఇంకా గట్టిగా వికృతం గా నవ్వుతున్నాడు భైరవుడు….

 

మీకు ఈ నోటిఫికేషన్ నచ్చితే మాకు 5 🌟🌟🌟🌟🌟 నక్షత్రాలతో పాటుగా మీ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.

 

ఇట్లు

మీ రైటర్,

★ Written By: Valivarthi Sai Pavan Hemanth (Sunny) ★

 © 2026 Valivarthi Sai Pavan Hemanth (Sunny) Publications.