Mr. ప్రవరాఖ్యుడు – 4
చిట్టి కి ఎందుకో తెలియని అలజడి గా వుంటుంది మనసంతా… ఏంటి ఇలా అనిపిస్తుంది నాకు అని ఆలోచిస్తూ వెళ్తున్న కారు వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది …అటు వైపు కారు లో ఉన్న రిషి పరిస్థితి కూడా అంతే ….
చిట్టి తల్లి మేమింక వెళ్తాం అమ్మ ..నీకు క్లాస్ కి టైమ్ అవుతుంది వెళ్ళు అంటూ పాకెట్ నుండి 5000/- తీసి ఇస్తారు శేఖర్ గారు..అయ్యో వద్దు నాన్న నా దగ్గర పాకెట్ మనీ చాలానే ఉంది పైగా నైట్ అమ్మ కూడా ఇచ్చింది నాకు సరిపోతాయి అంటూ వెనక్కి ఇవ్వడానికి చూస్తుంది చిట్టి…లేదు తల్లి ఉంచు ఎప్పుడైనా ఇబ్బందైతే మళ్ళీ ఎలా నీకు ?? అంటూ చిట్టి బ్యాగ్ ఓపెన్ చేసి పెడతారు …నాన్న అంటూ మళ్ళీ రాగం అందుకునే లోపు ఆ ప్రయత్నాన్ని ఆపుతూ చిట్టి నీకంతగా వద్దంటే నాకు హాలిడేస్ కి వచ్చేటప్పుడు ఏమైనా కొని తీసుకురావే అంటూ హగ్ చేసుకుని సిట్యువేషన్ నీ కూల్ చేస్తాడు హర్ష… హర్ష నీ గట్టిగా హగ్ చేసుకుని జాగ్రత్త రా అస్తమాను బయట తిరగక నాన్న కి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండు… మార్కెట్ కి కూడా నువ్వే వెళ్ళు ..అమ్మ నాన్న జాగ్రత్త నువ్వు బాగా చదువుకో .. నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలి అంటూ అక్క పెత్తనం మొదలు పెడుతుంది ..దానికి హర్ష అందంగా నవ్వుతూ ఒకే బంగారం నువ్వు కూడా జాగ్రత్త ..రోజు ఈవెనింగ్ కాల్ చేస్తూ ఉండు అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్తాడు..ఆది చూసి శేఖర్ గారు , విధి గారు వాళ్ళ బాండింగ్ కి మురిసిపోతారు….🤗 సరే సరే ఇంకా మీ ముచ్చట్లు అయిపోతే దాన్ని వదులు అంటూ విధి గారు కూడా హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకొని జాగ్రత్త బంగారం ..ఇక్కడ ర్యాగింగ్ లాంటివి చేస్తారంట నువ్వు జాగ్రత గా ఉండు ..ఏం జరిగిన కాల్ చేసి మాతో చెప్పు ..ఇంకా వెళ్ళు క్లాస్ కి అని లోపలికి పంపించి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు..
చిట్టి ఒక్కతే బిక్కు బిక్కు మంటూ చూస్తూ స్లో గా నడుచుకుంటూ కాలేజ్ గ్రౌండ్ లోకి వస్తుంది …అక్కడే చెట్టు కింద ఒక బ్యాచ్ కూర్చుని సొల్లేసుకుంటూ వుంటారు …ఆ బ్యాచ్ కాలేజీ లోనే వరస్ట్ బ్యాచ్ …ఫైనల్ ఇయర్ బి. టెక్ స్టూడెంట్స్ వాళ్ళు …మొత్తం 7 మంది..అందులో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉంటారు … మన విలన్ బాబు కూడా ఆ బ్యాచ్ వాడే …పేరు ధీరజ్… మనిషి అందగాడే .. ఆరడుగుల ఎత్తుతో మంచి రంగు తో బాగానే వుంటాడు.. అందుకే ఆ అందం తో అమ్మాయిలని వలలో వేసుకుని వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుని వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ పైశాచిన ఆనందాన్ని పొందుతు వుంటాడు …ఇంత చేసిన వాడిని ఏం చేయరా అంటే చేయరు … ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా బిజినెస్ మాన్ నే.. ఆ కాలేజ్ కి ఫండ్స్ రూపం లో డబ్బు అందుతుంది ..అందుకే యాజమాన్యం చూసి చూడనట్టు వదిలేస్తుంది … వేడుకున్న మంచి లక్షణం ఏదన్నా ఉంది అంటే చదువు..ఎన్ని వేషాలు వేసినా మన హీరో బాబు నీ బీట్ చేసి చదవాలి అని తాపత్రయం..అందుకే కాలేజ్ టాప్ రిషి అయితే సెకండ్ వీడే …
రేయ్ ధీరూ …అటు చూడరా ..ఆ అమ్మాయి అని వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తాడు..ఏంటని అటు గా చూసిన ధీరజ్ కళ్ళు నోరు వదిలేసి మరీ చిట్టి నీ చూస్తాడు … 5.6 హైట్ తో తెల్లని మేని ఛాయ, పొడవాటి జుట్టు తో , పెద్ద పెద్ద కళ్ళకి కాటుక తో అమాయకమైన చూపులతో , భయం వల్ల అదురుతున్న చిట్టి లైట్ పింక్ పెదాలతో , క్యూట్ బుగ్గలతో చాలా అందంగా నడుచుకుంటూ వస్తుంది .. ఆమె నడుస్తున్నపుడు తన పొడవాటి జుట్టు బ్యాక్ మీద అటు ఇటు ఊగుతూ డాన్స్ చేస్తున్నట్టు ఉండి ఇంక ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది … ఏ అమ్మాయిని చూసినా కళ్ళల్లో లస్ట్ నింపేసుకుని చూసే ధీరజ్ చిట్టి నీ మాత్రం ఏదో తెలియని వింత అనుభూతి తో చూస్తాడు …
చిట్టి నడుచుకుంటూ ఆఫీసు రూమ్ వైపు వెళ్తుంది..రిషి అప్పుడే అటుగా వస్తాడు ..మనసంతా అలజడి గా అనిపించి క్లాస్ కి వెళ్ళ బుద్ధి కాక లైబ్రరీ కి వెళ్దాం అని వస్తూ ఉంటాడు … లైబ్రెరీ కి నాలుగు రూమ్ ల అవతల ఆఫీసు రూమ్ ..చిట్టి ఆ అబ్బాయిని క్రాస్ చేస్తూ ఆఫీసు రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది … ఆ టైమ్ లో ఇద్దరికీ మనసులో అలజడి గా ఉంటుంది కానీ చిట్టి పట్టించుకోనట్టే ముందుకు వెళ్ళిపోతుంది … ఎప్పుడూ గర్ల్స్ వైపు చూడని రిషి మొదటి సారి చిట్టి బ్యాక్ చూసి హార్ట్ ఎటాక్ తెచ్చుకుంటాడు … నాగు పాములా బ్యాక్ మీద జుట్టు డ్యాన్స్ చేస్తుంటే అదో రకమైన తీయటి నొప్పి కలుగుతుంది రిషి కి … మళ్ళీ నార్మల్ అయ్యి తల విదిల్చుకుని లైబ్రరీ లోకి వెళ్లిపోతాడు …
చిట్టి ఆఫీసు రూమ్ కి వెళ్ళి తన డీటెయిల్స్ చెప్పి స్కాలర్ షిప్ మీద సీటు వచ్చిన విషయం కూడా చెప్తుంది..దానికి అక్కడున్న సార్ అటెండర్ నీ పిలిచి క్లాస్రూమ్ చూపించమని చెప్పి ఆల్ ది బెస్ట్ మా ..బాగా చదువుకో అని చిన్న స్మైల్ ఇస్తారు ..దానికి చిట్టి కూడా నవ్వి థాంక్స్ చెప్పి బయటకి వచ్చి అటెండర్ నీ ఫాలో అవుతుంది …అలా వెళ్తూ లైబ్రరీ దాటుతుండగా రిషి చూపు బయటకి మల్లితే చిట్టి చూపు లోపలికి సారించింది …కానీ ఒకరినొకరు చూసుకునే టైమ్ లో అటెండర్ అడ్డు వచ్చి పాపా ..ఇటు వెళ్ళాలి క్లాస్ కి అని పిలుస్తాడు ..దానితో తన గుండె మీద చేతిని చూసుకుని అలజడి తగ్గించుకుని క్లాస్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది..క్లాస్ కి వెళ్ళాక అటెండర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు …అప్పుడే క్లాస్ స్టార్ట్ చేయడానికి లెక్చరర్ వచ్చి ఉంటారు … కాన్ ఐ గెట్ ఇన్ సార్ అంటూ పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చి కూర్చుంటుంది ..కానీ క్లాస్ మొత్తం తనని ఒక అద్భుతం లా చూస్తుంటే ఇబ్బంది గా కదిలి పక్కన ఉన్న అమ్మాయి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది..
ఆ అమ్మాయి కూడా నవ్వి ..నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తుంది ..దానికి చిన్నగా నవ్వి నువ్వు కూడా అంటుంది చిట్టి ..నా పేరు షాలిని నువ్వు నన్ను షాలు అని పిలవచ్చు అంటుంది ఆ అమ్మాయి ..దానికి అందంగా నవ్వి నా పేరు హీరా చంద్ర శేఖర్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది మన చిట్టి అలియాస్ హీరా ….
వావ్ హీరా నీలాగే నీ పేరు కూడా అందంగా ఉంది .. ఫ్రెండ్స్?? 🫱 అని చేయి చాపుతుంది షాలు … ఒకే అంటూ నవ్వుతూ చేయి కలుపుతుంది హీరా..
హలో స్టూడెంట్స్…మీకు అపుడే క్లాసెస్ ఏమి జరగవు ఈ రోజు నుండి ఫ్రెషర్స్ డే వరకు మీ క్లాస్ వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు ..సో వాళ్ళ కోసం మనం ఆఫ్టర్ ఫ్రెషర్స్ డే క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం అంటారు..దానితో అందరూ గట్టిగా అరుస్తూ గోల గోల చేస్తూ ఉంటారు…సైలెన్స్…క్లాసెస్ లేకపోయినా ఇప్పుడు మీ సీనియర్స్ వచ్చి మీరు కల్చరల్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ తీసుకుంటారు ..సైలెంట్ గా ఉండండి అని చెప్పి ఆ లెక్చరర్ వెళ్ళిపోతారు…అప్పుడే క్లాస్ లోకి ఎంటర్ అవుతారు మన మోస్ట్ వాంటెడ్ పనికిమాలిన ధీరజ్ బ్యాచ్……
మీ
❤️ స్వీటీ ❤️
నచ్చితే commnets చేయండి …లాగ్ అనుకోవద్దు స్టార్టింగ్ కదా పిన్ టు పిన్ తప్పదు ….సింపుల్ స్టోరీ ..మీకు kaschithanga నచ్చుతుంది …🤗❤️
Swipe left/right or tap the sides to turn pages